29, జులై 2012, ఆదివారం

రవీంద్రుని గీతాంజలి - 88

DEITY of the ruined temple ! The
broken strings of Vina sing no more
your praise. The bells in the evening
proclaim not your time of worship.
The air is still and silent about you.

In your desolate dwelling comes the
vagrant spring breeze. It brings the
tidings of flowers the flowers that for
your worship are offered no more.

Your worshipper of old wanders ever
longing for favour still refused. In the
eventide, when fires and shadows mingle
with the gloom of dust, he wearily
comes back to the ruined temple with
hunger in his heart.

Many a festival day comes to you
in silence, deity of the ruined temple.
Many a night of worship goes away
with lamp unlit.

Many new images are built by
masters of cunning art and carried to 
the holy stream of oblivion when their
time is come.

Only the deity of the ruined temple
remains unworshipped in deathless
neglect.

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

భగ్నమందిరదేవతా! పాడ దిపుడు
తెగిన తీగల వీణ నీ పొగడికలను,
పూజకై సాంధ్యఘంటలు మ్రోగ విపుడు,
నీ కెలని గాలియే శాంతనీరవమ్ము ||

తిరుగుఁబోతు వసంతఁపుఁ జిరుతగాలి
వచ్చె నీ పాడుబడిన నివాసమునకు,
తెచ్చెఁ దానేవొ పూవుల ముచ్చటలను,
పువ్వు లయ్యవి యింక నీ పూజకోస
మప్పనము సేయఁబడుటకె యొప్పవంట ||

అక్కటకట! తిరస్కృతుఁ డయ్యు పాత్ర
యర్చకుం డెవ్వరి యనుగ్రహంపు భిక్ష
కొఱకొ పవలెల్ల తాను క్రుమ్మరుచునుండు ||
వెలుఁగు నీడలు గోధూళిఁ గలిసికొనెడి
సందెచీఁకటి నలసట జెంది యతఁడు
పుట్టె డాకలితో నొసల్ గొట్టుకొనుచుఁ
దిరిగి వచ్చు నీ భగ్నమందిరము జేర ||

భగ్నమందిర దేవతా! వచ్చుచుండె
మూగవడి యెన్నొ యుత్సవమ్ముల దినాలు,
తొలగె నిశలెన్నొ దీపమే వెలుఁగకుండ ||

వేనవేల్ క్రొత్తబొమ్మలు విజయదశమి
సంతరింతురు వరకళాచతురమతులు,
సమయ మైనప్పుడో పవిత్రముగ మరపు
వరదలో జారవిడతురు వానినెల్ల ||

పాడుగుడిలోని దేవతాప్రతిమ యొకటె
ముగిసిపోని యుపేక్షలో మునిగిపోవు ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి