21, మార్చి 2013, గురువారం

సమస్యాపూరణం – 1001 (సూనుని దీవనలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సూనుని దీవనలు మనకు శుభకరము లగున్.

24 కామెంట్‌లు:

  1. గానము సేయుదు నిత్యము
    నా నామమునే విడువక నాలుకపైనన్
    నేనిల్పుదు నా గౌరీ
    సూనుని దీవనలు మనకు శుభకరము లగున్.

    రిప్లయితొలగించండి
  2. నానును నామంబంజన
    సూనుని మదిలోన దివ్య శక్తినెబొందున్
    నేనున్ బలికెద దశరథ
    సూనుని దీవనలు మనకు శుభకరము లగున్.

    రిప్లయితొలగించండి
  3. ఆనందనిధానుడు ప్ర
    జ్ఞాన ఘనుడు విఘ్న హర్త గణపతి కవియున్
    మౌనినుతుండగు నగజా
    సూనుని దీవెనలు మనకు శుభకరములగున్

    రిప్లయితొలగించండి
  4. పూనికతో సేవింపుము
    మానక మాధవుని మదిని మహిమల రాశిన్
    దీనావను వసుదేవుని
    సూనుని దీవెనలు మనకు శుభకరములగున్

    రిప్లయితొలగించండి
  5. లక్ష్మీదేవి గారూ,
    గౌరీసునుని ఆశ్రయించి మీరు చెప్పిన పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు..
    ‘శక్తినె బొందున్’ అన్నది ‘శక్తి నొసంగున్’ అంటే బాగుంటుందని నా సూచన.
    *
    పండిత నేమాని వారూ,
    మీ తత్త్వాన్ని బట్టి మీరు ‘దశరథ సూనుని’ ఆశ్రయిస్తారనుకున్నాను. కాని అగజానూనునిపై ప్రశస్తమైన పూరణ చెప్పి అలరించారు. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    వాసుదేవుడిని విషయంగా చేసికొని చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. పూనికతో గణ నాధుని
    మానక మఱి పూజ సేయ మంత్రము తోడన్
    మానస రూపుడు పశుపతి
    సూనుని దీ వనలు మనకు శుభ కరము లగున్ .


    రిప్లయితొలగించండి
  7. సుబ్బారావు గారూ,
    శివకుమారునిపై మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు
    కాంగ్రెస్ కురు వృద్దులు తమ సుతులకు ఈ రీతిన దెలుపు చుండెను
    ========*=======
    వానకు కరుగగ హీనుల
    మానసము వినయము తోడ మౌనుల వలెనే
    గానము జేయుచు సోనియ
    సూనుని దీవనలు మనకు శుభకరములగున్

    రిప్లయితొలగించండి
  9. వరప్రసాద్ గారూ,
    సమస్య ఏదైనా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పూరణలు చెప్పడం మీ ప్రత్యేకత. మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మంగళ (శుభ) శబ్దము కుమార స్వామికి వర్తించును అనే భావముతో:

    సేనాని దివిజకోటికి
    నానా మంగళ ప్రదాత నాగార్చితుడున్
    ధీనిధియగు గిరి తనయా
    సూనుని దీవెనలు మనకు శుభకరము లగున్

    రిప్లయితొలగించండి
  11. దీనుల గాచెడు వానిని,
    ప్రాణభయముఁదొలగఁజేయు ప్రభువును రయమే
    మానముఁగాచు యశోధా
    సూనుని దీవెనలు మనకు శుభకరములగున్!

    రిప్లయితొలగించండి
  12. పూనికతోతనమనమున
    జానకిరాములనిలిపిన చరితార్థుని యా
    వానరయోధుని అంజన
    సూనుని దీవనలు మనకు శుభకరము లగున్.

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని వారూ,
    కుమారస్వామిని గురించిన మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘చరితార్థుని నా/ వానర యోధుని...’ అనండి.

    రిప్లయితొలగించండి
  14. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    మానసమున తలిదండ్రుల
    యానతి గొని వారలకు ప్రహరిచరియింపన్
    వానిని జేతయన నుమా
    సూనుని దీవనలు మనకు శుభకరము లగున్

    రిప్లయితొలగించండి
  15. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. భానుని తేజము మీఱుచు
    దీనుల యెడ కృపను జూపు దివ్యాత్ముం డా
    ఏనుగుమొగ సామియె హర
    సూనుని దీవెనలు మనకు శుభకరము లగున్

    రిప్లయితొలగించండి
  17. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా ! ధన్యవాదములు.
    మీ సూచనతో సవరణ ....

    నానును నామంబంజన
    సూనుని మదిలోన దివ్య శక్తినొసంగున్
    నేనున్ బలికెద దశరథ
    సూనుని దీవనలు మనకు శుభకరము లగున్.

    రిప్లయితొలగించండి
  19. గానము జేయుచు స్కందుని
    మానస మున దలచి నంత మహిమా న్విత మౌ !
    మానక కొలిచిన గిరిజా
    సూనుని దీవెనలు మనకు శుభ కరము లగున్ !

    రిప్లయితొలగించండి
  20. రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. కానగ వనములు వెన్నెల
    వానలలోనింద్రధనువు భానుని కృపయే
    దీనుల ధనికుల మిత్రుడు...
    సూనుని దీవనలు మనకు శుభకరము లగున్


    సూనుడు = సూర్యుడు

    రిప్లయితొలగించండి
  22. కోనలు కోనలు వెదకుచు
    వానిని వీనినివదేల వారిజ నయనా!
    దీన జనావన సోనియ
    సూనుని దీవనలు మనకు శుభకరము లగున్

    రిప్లయితొలగించండి