4, మార్చి 2013, సోమవారం

పద్య రచన – 270 (వేమన పద్యములు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"వేమన పద్యములు"

31 కామెంట్‌లు:

  1. వేమన వెలదిని వదలెను
    వేమన తానాట వెలది వినుమని వ్రాసెన్
    వేమన పద్యము లనగ ని
    వేమన పద్యములనట్లు వేడుక గలుగున్

    రిప్లయితొలగించండి

  2. రాసి పోయినాడు మనవాడు పద్యాలు
    అవి రాసి పోసి ఉన్నవి మనకి ఈనాడూ
    చెదిరి పోనివి అవి ఏనాడూ, అవే మన
    వేమన పద్యాలు వినవె బ్లాగు బాల !

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  3. జిలేబి గారి భావానికి పద్య రూపముకై ప్రయత్నించాను.

    వ్రాసెను వేమన ముందట
    పోసెను ఘన పద్య రాశి పుణ్యము మనదే
    వాసిగ తెనుగున, చదువగ
    జేసిన పిల్లలకు శుభము చేకురు గదరా !

    రిప్లయితొలగించండి
  4. వేమన పద్యముల్ మిగుల వేడుకనభ్యసనమ్ము జేయనం
    దే మన యుప్పుకప్పురమదే విధముండుట జెప్పె యుక్తిగా
    నీ మనుజుండె చిత్తము మరింతయు శుద్ధిగ జేయు రీతి దా
    నేమరకుండ బల్కె; ధర నీతని సూక్తులు నిత్యసత్యముల్.

    రిప్లయితొలగించండి
  5. ఒప్పుల కుప్పయె శతకము
    నుప్పున జవులెన్నొ గూడి, యుక్తుల బర్వన్
    గప్పుర పరిమళ సాంద్రము
    సెప్పెను వేమన్న నీతి జెవులకు నింపున్ !

    రిప్లయితొలగించండి
  6. విశ్వ దాభి రామ ! వినుర వేమ!యనుచు
    దనకు దాను జెప్పు కొను విధముగ
    నీతు లుడివె జాల నీ తి శతకముగ
    మఱువ దగని వవియ మనుగడకిల

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని వారికి పాదాభివందనము జేయుచు
    శ్రీ శ్రీ వేమన కవి గారికి పాదాభివందనములు.
    వారి పద్యములను చదివి,నేను నిత్యానందపై పద్యములను వ్రాయుట జరిగినది.ఆ మొదటి పద్యమును శ్రీ శంకరయ్య గురువుగారు జూచి మెచ్చుకొని "శంకరాభరణం " బ్లాగు చూడమని జెప్పియుంటిరి.
    ========*===========
    ఆటవెలధి నీటెను వాడె వాటముగను
    క్రూర కట్టు బాట్లను ద్రుంచ,కుమ్మరిగను
    తేటగీతి,కందము లందు తేట తెనుగు
    బూసి వ్రాసె శతకములు పుణ్యముర్తి ।

    రిప్లయితొలగించండి
  8. ఆట వెలది తోడ నాట లాడుచు నుండి
    ఆట వెలది యొక్క ఆట నెరిగి
    ఆట వెలది తోడ నాటాడె పద్యముల్
    పేట పేట నందు వేన వేలు.

    రిప్లయితొలగించండి
  9. అనుభవాల నింపి యల్లిన పద్యాలు
    వేమన పలుకంగ వేదమయ్యె
    తెలుగు వారి నోట దినమొక సారైన
    నుచ్ఛరించ బడెడు యోనమాలు

    రిప్లయితొలగించండి
  10. ఆటవెలదు లందు నలవోకగా వేమ
    మంచి చెడుల నెన్నొ మనకు జెప్పె
    లోకమందున గల లౌకిక విషయాలు
    వినుతి కెక్కు రీతి విన్నవించె

    రిప్లయితొలగించండి
  11. ఆట వెలదిఁ మీటు వాటమెరుఁగ వారు
    తేట తెనుగు వీణ మీటినట్లు
    మనుజ జాతి యెపుడు మరువజాలనటుల
    తీర్చి దిద్ది నాడు తెగువఁ జూపి

    రిప్లయితొలగించండి
  12. కాకి పికము రూపు లేక రీతిగ నుండు
    వినగ వినగ స్వరము విధము దెలియు
    కుకవు లందు మెలగు సుకవులు వేరయా
    విశ్వదాభిరామ వినుర వేమ

    రిప్లయితొలగించండి
  13. భోగి వేమన వికటించి యోగి యయ్యె
    కామ క్రోధము లనువీడి కాళి గొలిచి
    నీతి పద్యము లల్లెను ప్రీతి గాను
    యశము నొందెను నేటికి శతక కర్త

    రిప్లయితొలగించండి
  14. గణ దోషములను సవరించుచూ

    తేనె పల్కులొలుకు తేటతేటపదాల
    ………. తెనుగుద నమునకు తియ్యదనము
    దేశదేశంబుల తెల్గువారలయందు
    ………. నొక్క పద్యము రాని యొంటి గలడె?
    శ్రమజీవ స్వేదనాశ్రయమైన శ్రావ్యంపు
    ………. శస్త్రాస్త్ర సంధాన సంచయమ్ము
    సంప్రదాయపు దుష్ట సంభావ్య భావాల
    ………. సవ్యరీతిని జెప్పె నవ్య గతుల

    భవ్య దివ్య నవ్య భావాల నొప్పెడు
    పద్య రాజ్య మేలె ప్రతిభ తోడ
    వేమన మనకిచ్చె వే మన సుమములు
    “విశ్వదాభిరామ!” పిలువ వేమ.

    రిప్లయితొలగించండి
  15. @రాజేశ్వరి నేదునూరి గారూ -- వేమన జీవితాన్ని గురించి ఒక పాదంలో చెప్పారు. వావ్.

    భోగి వేమన వికటించి యోగి యయ్యె

    రిప్లయితొలగించండి
  16. @గోలి హనుమచ్ఛాస్త్రి గారూ --
    జిలేబి గారి భావానికి పద్య రూపము బాగుంది.

    వ్రాసెను వేమన ముందట
    పోసెను ఘన పద్య రాశి పుణ్యము మనదే

    రిప్లయితొలగించండి




  17. తేటతెనుగునందు తెల్లముగ రచియించె
    సూక్తులెన్నొ సత్యశోధనమున
    వెలది విడచి ' యాటవెలదిని 'జేపట్టి
    వెలుగుదారి జూపె వేమరెడ్డి.

    రిప్లయితొలగించండి
  18. సాధనమ్మున పనుల్ సమకూరు ధరలోన
    .........తినగ తినగ వేము తీపి కాదె
    లోభివాని నడుగ లాభమ్ము లేదయా
    .........గొడ్డుటావు బిదుక గూడ దిలను
    పురుషు లందున పుణ్య పురుషులు వేరగు
    .........నుప్పు కప్పురముల యునికి రీతి
    స్థాన బలిమి మిన్న తన బలమ్మున కంటె
    .........బయట బడిన మొసలి భంగ పడదె

    విశ్వ మానవాళి వేవేల సుఖములు
    బడయ వలయు నీతి పథము నెరిగి
    విశ్వదాభిరామ! వినుర! వేమా! యని
    యెలుగు నెత్తి చాటి నిలచె నతడు.

    రిప్లయితొలగించండి
  19. =======*===========
    భోగియై విరాగియైన పుణ్య మూర్తి పుడమిపై
    రోగములకు వేసె రాతి రోటి మందు యోగియై
    జాగు సేయక గురు సేవ జరుపు మనుచు గురువుగా
    రాగ యుక్తముగను బల్కె రాజశేఖరుండుగా

    రిప్లయితొలగించండి
  20. వేమా యను మకుటముతో
    వేమన పద్యాల ఆటవెలదులు అన్నీ
    సామాన్యుల నాల్కలపై
    వేమరు నర్తించుచుండు వేయేండ్లయినన్


    రిప్లయితొలగించండి
  21. ఆటవెలది చేత నాడించి పాడించి
    నోట నుడువ బనిచె మేటి నీతి
    తేట తెనుగు వీణ మీటించి వేమన్న
    బాట జూపె జనగ భావికవుల

    రిప్లయితొలగించండి
  22. వేమన్న వేదమ్ము
    మిస్సన్న పద్యమ్ము
    నేమన్న హృద్యమ్మునందు
    కోమన్న గీతాభినందనల్

    రిప్లయితొలగించండి
  23. ఆటగత్తెనొదలి ఆటవెలది బట్టె
    చేలమొదలి కట్టె చిన్న గోచి
    ముక్కుపుడక తెచ్చె ముక్తిని వేమకు
    కామి అయ్యి, మోక్షగామి అయ్యె.

    రిప్లయితొలగించండి
  24. ఏర్చి కూర్చి పేర్చి ఎన్నియో నీతుల
    మూడుపదములందు మృదువుగాను
    వేదసార మంత వేమనయేజెప్పి
    విశ్వమెల్ల తెలుగు వెలుగు నింపె !!!

    రిప్లయితొలగించండి
  25. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న గ్రామాంతరం వెళ్ళడం వల్ల పూరణలను, పద్యాలను చూసి వ్యాఖ్యానించే అవకాశం లభించలేదు. మన్నించండి.
    వేమనపై చక్కని పద్యాలను పంపిన మితులు....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారకి,
    లక్ష్మీదేవి గారికి,
    గన్నవరపు నరసింహమూర్తి గారికి,
    సుబ్బారావు గారికి,
    వరప్రసాద్ గారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    సహదేవుడు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    కమనీయం గారికి,
    మిస్సన్న గారికి,
    పంతుల గోపాలకృష్ణారావు గారికి,
    డా. ప్రభల రామలక్ష్మి గారికి,
    సాహిత్యాభిమాని గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. తోపెల్ల వారూ ధన్యవాదములు.
    మిమ్మల్ని గురించి సాహిత్యాభిమాని గారు వెలిబుచ్చిన అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను.

    రిప్లయితొలగించండి