9, మార్చి 2013, శనివారం

ఆహ్వానము



ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు 
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవనంలో 
శ్రీ గరికపాటి నరసింహారావుగారి 
అష్టావధానం
 జరగబోతున్నది.
 ఔత్సాహికులు, ఢిల్లీలో ఉన్నవారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆనందించవచ్చు.
వామన్ కుమార్

5 కామెంట్‌లు:


  1. అవధానము లన్నిట నీ
    యవధానమె గొప్ప దందు రార్యా రాధ్యా !
    అవధానం బొన రింపుము
    నవ పోకడ లుద్భ వించ నర సిం హా జీ !

    రిప్లయితొలగించండి
  2. అవధానము చేయుటలో

    అవరోధము లెన్ని యున్న నతి సులభముగా

    హవనించెడి నరసింహా,

    కవులందరి లోన నీవు ఘనుడవు సుమ్మీ!

    ( హవనించు = అధిగమించు )

    రిప్లయితొలగించండి
  3. “భారతాచార్య” బ్రహ్మశ్రీ డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు రచించిన “కచ్చపి” నుండి సేకరణ.

    “మహాసహస్రావధాని, అస్మచ్చిష్యుడు డాక్టర్ గరికిపాటి నరసింహారావు.”
    ఆ.వె. గరికపాటి వంశకలశాబ్ది సోముండు
    గరికపాటి కాడు గరికపాటి
    ప్రష్టృతతిని గరికపాటిగానెంచుట
    ‘గరికపాటి’ సార్థకత భజించు.
    ఆ.వె. గరికపాటి కులుడు నరసింహసమభిఖ్యు
    డయ్యె నేడు భళి శతావధాని
    కేవలావధాని నా వీలులే దవ
    ధాని సింహమనదగును వీని.
    మ. అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా చెళ్లపిళ్ళయ్యకి
    య్యిల నా భోగము లేదు; భళిరా! మృత్యుంజయాభిఖ్య జొ
    న్నలగడ్డాన్వయ వార్ధి చంద్రమునకున్ మా నరసిహుండు ధీ
    బల సంపన్నుడు, సాహితీ ధనుడు, విద్వద్వర్యుడున్, నమ్రతా
    విలసచ్చీలుడు శిష్యుడయ్యె నను నిర్వేలాఖ్య యున్నట్లుగన్.
    శా. సుశ్రీకమ్ము భవద్వధానమునే జూడంగ జూడంగ మో
    దాశ్రుస్రావ మలీమసమ్ము లగు నాయక్షుల్; సహస్రావధా
    నీ!శ్రీమన్నరసింహరాయ! భవదంతేవాసితా భూరి భో
    గ శ్రీమత్త్వ నితాంత గర్వితుడనై గావింతు నాశీస్సులన్.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ గరిక పాటి వారికి గరిక పాటి కానుక. అవధాన వేళ అభినందన పూర్వక నమస్కారములతో..

    గరిమ గల ప్రశ్న లన్నియు గరికపాటి
    కడకు జేరగ నవిమారు గరిక పాటి
    కడకు కవులెల్ల మారుగా కపుల వోలె
    కుప్పి గంతుల ? హనుమ వాకొనుచు నుండ.

    రిప్లయితొలగించండి