కవిమిత్రులకు నమస్కృతులు. ఈనాటి సమస్యకు ఛందం "ఉత్సాహము". ఏడు సూర్య గణాలు (హ-UI, న-III) చివర ఒక గురువు. ఐదవగణం మొదటి అక్షరం యతిస్థానం. ప్రాసనియమం ఉంది. ఏడు హగణాలు వేస్తే అది ’సుగంధి’. ఏడు నగణాలు వేస్తే అది ’విచికలితం’
(మిత్రులారా! ఈ వృత్తములో 4 పాదములకు ఒకే విధమైన గణములను వేసి ఒక క్రొత్త వృత్తముగా వ్రాసితిని. ఇదే లక్షణములతో వ్రాసిన వృత్తమునకు నేను సురసుగంధి అను పేరుపెట్టి నా అధ్యాత్మ రామాయణములో నుంచితిని). స్వస్తి
శంకరయ్య గారు! నమః ! ఈ పాదంలో సమస్య ఏమీ లేదు కదా! అయితే, ఉత్సాహ వృత్త నిర్మాణాభ్యాసానికి దీని పూరణ ఉపకరిస్తుంది. నా పూరణ : ధరణి పైన మనుజ జన్మ ధన్యమౌట కెప్పుడున్ విరివిగాను సేయవలయు వేనవేల సేవలన్ - పరమునందు గూడ ధరణి పైన సలిపినట్టి యా పరుల సేవలే యొసంగు భవ్య యోగముల్ సుధీ!
అయ్యా! శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులుమీరు ప్రాసను మరొక్క మారు చూడండి. "ర" ప్రాసాక్షరము. "వ" కాదు. అన్ని పాదములూ లఘువుతోనే ప్రారంబించ బడవలెను కదా. స్వస్తి.
పరుల సేవలే యొసంగు భవ్య యోగముల్ సు ధీ యరయ నిజము పరుల సేవ యవస రంబ యాద్య ! యే యరమరికలు లేని సేవ హత్తు కొనెను గుండె లో మరువ కుండ నాకు పరమ పదము నిపుడ యీ యవా ?
సిరుల పైన నాశ పెర్గి చిత్త మందు శ్రిహరిన్ మరచి పోకు స్వామి భక్తి మాన వాళి సేవయున్ పరుల సేవలే యొసంగు భవ్యయోగముల్ ,సుధీ. పరమ ధర్మ మార్గ మౌను పంచు సేవ లంతటన్
కవిమిత్రులకు నమస్కృతులు. డా. ఆచార్య ఫణీంద్ర గారన్నట్టు ఈనాటిది సమస్యాభాసమే. దీనికి మంచి మంచి పూరణలు చెప్పిన.... పండిత నేమాని వారికి, డా. ఆచార్య ఫణీంద్ర గారికి, కమనీయం గారికి, తోపెల్ల సుబ్రహ్మణ్య శర్మ గారికి, వరప్రసాద్ గారికి, సుబ్బారావు గారికి, జిగురు సత్యనారాయణ గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, గండూరి లక్ష్మినారాయణ గారికి, అభినందలు, ధన్యవాదాలు. * పండిత నేమాని వారూ, ’శంకరాభరణం’ చేసుకున్న పుణ్యం ఏపాటిదో గాని క్రొత్త క్రొత్త ఛందస్సులకు వేదిక అవుతున్నది. ధన్యవాదాలు. * కమనీయం గారూ, మూడవ పాదంలో ’వాని’ శబ్దం అన్వయానికి కుదరడం లేదు. అక్కడ ’శౌరి’ అన్న శబ్దాన్ని చేర్చుదాం. * జిగురు వారూ, ’సిక్సరుల్’ టైపాట్లు వల్ల ’సిక్సరల్’ అయిందనుకుంటున్నాను. * గండూరి వారూ, ’ఆశ పెర్గి’ అన్నదానిని ’ఆశ హెచ్చి’ అంటే బాగుంటుదేమో!
శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారికి శుభాశీస్సులు. మీ పద్యము బాగుగనున్నది. దాని గురించి నేను ఏ సూచనయును చేయలేదు. శ్రీ శంకరయ్య గారు సూచించేరు - 1వ పాదములో ఆశ పెర్గికి బదులుగా ఆశహెచ్చి అనాలి అని. స్వస్తి.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిఈనాటి సమస్యకు ఛందం "ఉత్సాహము". ఏడు సూర్య గణాలు (హ-UI, న-III) చివర ఒక గురువు. ఐదవగణం మొదటి అక్షరం యతిస్థానం. ప్రాసనియమం ఉంది.
ఏడు హగణాలు వేస్తే అది ’సుగంధి’. ఏడు నగణాలు వేస్తే అది ’విచికలితం’
సురసుగంధి:
రిప్లయితొలగించండిపరముడైన దేవదేవు భవ్యతత్త్వమున్ సదా
సురుచి నెల్ల జీవులందు శోభతోడ గాంచుచున్
పరహితం బొనర్చుచుండు వారికెల్ల భక్తి త
త్పరుల సేవలే యొసంగు భవ్యయోగముల్ సుధీ!
(మిత్రులారా! ఈ వృత్తములో 4 పాదములకు ఒకే విధమైన గణములను వేసి ఒక క్రొత్త వృత్తముగా వ్రాసితిని. ఇదే లక్షణములతో వ్రాసిన వృత్తమునకు నేను సురసుగంధి అను పేరుపెట్టి నా అధ్యాత్మ రామాయణములో నుంచితిని). స్వస్తి
శంకరయ్య గారు!
రిప్లయితొలగించండినమః !
ఈ పాదంలో సమస్య ఏమీ లేదు కదా!
అయితే, ఉత్సాహ వృత్త నిర్మాణాభ్యాసానికి దీని పూరణ ఉపకరిస్తుంది.
నా పూరణ :
ధరణి పైన మనుజ జన్మ ధన్యమౌట కెప్పుడున్
విరివిగాను సేయవలయు వేనవేల సేవలన్ -
పరమునందు గూడ ధరణి పైన సలిపినట్టి యా
పరుల సేవలే యొసంగు భవ్య యోగముల్ సుధీ!
రిప్లయితొలగించండివరమునీంద్ర సిద్ధసాధ్య వందితామరేశుడౌ
పరమపావనాంఘ్రిజన్య భవ్య వాహినీ శుభం
కరుడు శ్రీధరుండు వాని కంజనేత్రు , ధ్యానతత్
పరులసేవ లే యొసంగు భవ్యయోగముల్ ,సుధీ.
శ్రీపండితుల వారికి నమస్కరించుచూ రామజోగి మందుగొని వారి అడుగుజాడలలో చిన్న ప్రయత్నము.
రిప్లయితొలగించండిపరమ భక్త పారిజాత ఫల్య నారదాదులన్
నిరత భక్త రామ నామ నిత్య కీర్త పావనిన్
హరిహ రాది సేవ్య కావ్య యజ్ఞ కర్త భక్తి త
త్పరుల సేవలే యొసంగు భవ్యయోగముల్ సుధీ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅయ్యా! శ్రీ సుబ్బా రావు గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులుమీరు ప్రాసను మరొక్క మారు చూడండి. "ర" ప్రాసాక్షరము. "వ" కాదు. అన్ని పాదములూ లఘువుతోనే ప్రారంబించ బడవలెను కదా. స్వస్తి.
శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు వినమ్ర వందనములు
రిప్లయితొలగించండిభవ్యను ప్రేమించు యవకుడు సుధీ । భవ్య వరమును పొంద స్వామిని వేడుకొనగ
===========*=======
వరము బొందు మార్గములను వైరి తతికి జెప్పకన్
కరుణ జూపి దెలుపు స్వామి కానుకిచ్చెదను హరీ ।
పరులసేవ లే యొసంగు భవ్య యోగముల్,సుధీ,
పరుగు బెట్టు భక్త। భవ్య వరము నొంద ముందుగా ।
పరుల సేవలే యొసంగు భవ్య యోగముల్ సు ధీ
రిప్లయితొలగించండియరయ నిజము పరుల సేవ యవస రంబ యాద్య ! యే
యరమరికలు లేని సేవ హత్తు కొనెను గుండె లో
మరువ కుండ నాకు పరమ పదము నిపుడ యీ యవా ?
విరివిగ పరుగులు సలుపుచు వేడ్కఁ జేసి, సిక్సరల్
రిప్లయితొలగించండికురియునట్లు బ్యాటు తోడ కొట్టి విందుఁ జేయుచున్
పరులు బ్యాటు పట్ట, వెనుక బంతి పట్ట నిల్చు కీ
పరుల సేవలే యొసంగు భవ్య యోగముల్ సుధీ!
శిరము వంచి శరణు కోరి శివుని మ్రోల నిల్చి నే
రిప్లయితొలగించండివిరులు దెచ్చి పూజ చేసి వేడు కొంటి మనము నన్
సురలు పొగడి కరుణ జూపి శోభ గూర్చ జగతి కిన్
పరుల సేవ లేయొ సంగు భవ్య యోగ ముల్ సుధీ !
వరగుణాఢ్యులున్ నితాంత భక్తితత్వ మూర్తులున్
రిప్లయితొలగించండిపరమదేవతాంఘ్రిపాదపంకజాశ్రితుల్, సుసం
స్థిరమనంబు గల్గినట్టి సిద్ధులన్ వివేక త
త్పరుల సేవలే యొసంగు భవ్యయోగముల్ సుధీ.
సిరుల పైన నాశ పెర్గి చిత్త మందు శ్రిహరిన్
రిప్లయితొలగించండిమరచి పోకు స్వామి భక్తి మాన వాళి సేవయున్
పరుల సేవలే యొసంగు భవ్యయోగముల్ ,సుధీ.
పరమ ధర్మ మార్గ మౌను పంచు సేవ లంతటన్
జిగురు వారి పూరణ చాలా బాగుంది.
రిప్లయితొలగించండికవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిడా. ఆచార్య ఫణీంద్ర గారన్నట్టు ఈనాటిది సమస్యాభాసమే. దీనికి మంచి మంచి పూరణలు చెప్పిన....
పండిత నేమాని వారికి,
డా. ఆచార్య ఫణీంద్ర గారికి,
కమనీయం గారికి,
తోపెల్ల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
వరప్రసాద్ గారికి,
సుబ్బారావు గారికి,
జిగురు సత్యనారాయణ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
అభినందలు, ధన్యవాదాలు.
*
పండిత నేమాని వారూ,
’శంకరాభరణం’ చేసుకున్న పుణ్యం ఏపాటిదో గాని క్రొత్త క్రొత్త ఛందస్సులకు వేదిక అవుతున్నది. ధన్యవాదాలు.
*
కమనీయం గారూ,
మూడవ పాదంలో ’వాని’ శబ్దం అన్వయానికి కుదరడం లేదు. అక్కడ ’శౌరి’ అన్న శబ్దాన్ని చేర్చుదాం.
*
జిగురు వారూ,
’సిక్సరుల్’ టైపాట్లు వల్ల ’సిక్సరల్’ అయిందనుకుంటున్నాను.
*
గండూరి వారూ,
’ఆశ పెర్గి’ అన్నదానిని ’ఆశ హెచ్చి’ అంటే బాగుంటుదేమో!
నరుడు ప్యకృతి సిద్ధ మైన నడత నడచి యుండగన్
రిప్లయితొలగించండితరులు భువిన పరుల కొరకె ధన్య మగుచు నుండెడున్
పరుల కొరకె నాక సంబు వర్షమిచ్చు చుండెడున్
గిరుల పాఱి నదుల నీరు కృషిని పెంపు చేసెడున్
పరుల సేవలే యొసంగు భవ్య యోగముల్ సుధీ!
రిప్లయితొలగించండిధరణి నేలు రాజు నాకు దాసు డగుట దోషమౌ
కరమ టన్న కౌశికు డనె కాదు వీర బాహు! నీ
వరయు మయ్య నీదు సేవ హరుని సేవ! కాటి కా-
పరుల సేవలే యొసంగు భవ్యయోగముల్ సుధీ!
జిగురు వారూ "కీపరుల " పూరణ బాగుంది.. మీ పూరణ చూచి నేను స్వీపరుల వైపు వెళ్ళాను...మిస్సన్న గారూ ! కాటి కాపరుల పూరణ బాగుంది..
రిప్లయితొలగించండిమురికి జేయు వీధులన్ని ముందు బాట "సారులే "
తిరుగ గాను కుంచె బట్టి తీర్చి దిద్ద " రోడ్డులే "
సరిగ జేయు వెన్క వచ్చి "శహరు" నందు చూడ "స్వీ
పరుల " సేవలే యొసంగు భవ్య యోగముల్ సుధీ!
చిన్న సవరణ తో...
రిప్లయితొలగించండిమురికి జేయు వీధులన్ని ముందు బాట "సారులే "
తిరుగు తాము కుంచె బట్టి తీర్చి దిద్ద " రోడ్డులే "
సరిగ జేయ వెన్క వచ్చి "శహరు" నందు చూడ "స్వీ
పరుల " సేవలే యొసంగు భవ్య యోగముల్ సుధీ!
శ్రీ పండిత నామాని కవి శ్రేష్టులకు
రిప్లయితొలగించండినమస్కారములు
మీ సూచన విధంగ మార్చుతాను.
ధన్యవాదములు
గండూరి లక్ష్మీనారాయణ
శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగనున్నది. దాని గురించి నేను ఏ సూచనయును చేయలేదు. శ్రీ శంకరయ్య గారు సూచించేరు - 1వ పాదములో ఆశ పెర్గికి బదులుగా ఆశహెచ్చి అనాలి అని. స్వస్తి.
వరుడు రాగ పరువులిడుచు వారిజాక్షి పొందుకై
రిప్లయితొలగించండిపరువు కాచి లైటులాపి భాగ్యనగర మందునన్
కరుణ తోడ తలుపు తెరచి కంబళిచ్చు గేటు కీ
పరుల సేవలే యొసంగు భవ్య యోగముల్ సుధీ!
రిప్లయితొలగించండిమురిసె వారణాసి యేను మోది కాలుమొక్కి స్వీ
పరుల సేవలే యొసంగు భవ్య యోగముల్ సుధీ
తరుణ మిద్ది యంచు చాటి ధర్మమేది యంచు తె
ల్ప! రతనంబు దేశ మందు వారిజాక్షి! మోదియే!
జాల్రా
జిలేబి :)