సిగబంతిగా చేయబడిన బాల చంద్ర రేఖ తలపై మేలివన్నెలు కురిపించుచుండగా , తన శరీరంలో సగ భాగమైన శైలరాజ కన్య అయిన పార్వతి లావణ్యమును చూపుచుండగా , శంభుని ఆ శీర్షముపై జటాజూటమునందు సుడులు తిరుగు గంగా నది హొయలు మైమరపు కల్గించుచుండగా , తన వైభవము జాటు ఆ ఫాలనేత్రుడైన పరమ శివుని ఎల్లప్పుడు సద్భక్తితో ప్రార్థించెదను .
లింగము రూపునున్న శివ లీలలనెన్నగ నా తరమ్మొకో! గంగనుఁ బంపి, పంటలను కాలువ జేసి, జనాళి బొజ్జ నిం పంగ క్షుధార్తిఁ దీర్చుమను పావనమూర్తిని నే భజింతు; నీ భంగిని ముక్తిఁ బొందగల భావన తో, పరి పూర్ణ భక్తితో.
అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులుమీ 2వ పద్యమునకు కొన్ని సవరణలను సూచించు చున్నాను: 1. మొదటి పాదములో "చంచలమైన మానస మశాశ్వత దేహము" అనండి. 2. పన్నగేశ్వరా! అనే సంబోధన కంటే "పార్వతీశ్వరా" అంటే బాగుంటుందేమో. స్వస్తి.
సాహిత్యాభిమాని గారికి శుభాశీస్సులు. మీ ప్రశంసలకి కృతజ్ఞతలు. సంతోషము.
మీరు శివమానస పూజలోని 5వ శ్లోకమును వ్రాసేరు. అది మాలిని వృత్తము. సంస్కృతము కాబట్టి పాదము చివరి అక్షరమును గురువునకు బదులుగా లఘువును కూడా వేయవచ్చును. అందుచేత "క్షమస్వ" అని చదువుకొనుటే సాధువు.
నమస్తే నమస్తే నమస్తే నమః అనునది ఆ శ్లోకమునకు సంబంధము లేనిది. అందుచేత దానిని వేరుగా చూపించవలెను. స్వస్తి.
శ్రీ శివ స్తుతి (దండకము)
రిప్లయితొలగించండిశంభో మహాదేవ! శంభో మహాదేవ! శంభో మహాదేవ! దేవా! దయాపూర్ణభావా! నగేంద్రాత్మజా హృన్నివాసా! మహా దివ్య కైలాసవాసా! సదానంద! విశ్వేశ్వరా! సర్వలోకేశ్వరా! సర్వయోగేశ్వరా! సర్వభూతేశ్వరా! నందివాహా! భుజంగేశభూషా! త్రిశూలాయుధా! చంద్రచూడాన్వితా! పంచవక్త్రా! జటాజూట సంస్థాభ్రగంగాపగా! దేవదేవా! మహా భక్తి భావంబుతో నీదు తత్త్వంబు ధ్యానించెదన్.
సహస్రార్కకోటి ప్రభా భాసురంబై యనాద్యంత వైశిష్ట్యమున్ బొల్చు లింగాకృతిన్ దాల్చి లోకంబులన్నింట వ్యాపించి యున్నట్టి నీ దివ్య తత్త్వంబు లోకైక రక్షాకరంబై మహానందధామంబునై జ్ఞానసారంబునై సర్వదా శాంతమై వేదసంస్తుత్యమై యోగి సంసేవ్యమై యొప్పు నో దేవ!దేవా! అచింత్యప్రభావా!
సురల్ రాక్షసుల్ గూడి క్షీరాంబుధిన్ ద్రచ్చుచుండంగ నందుండి ఘోరాగ్ని కీలాన్వితంబైన హాలాహలాభీల మొక్కుమ్మడిన్ బుట్టి లోకంబులన్నింట వ్యాపించుచున్ ఘోర నాశంబు గావించుచుండంగ నా యాపదన్ బాపి లోకంబులన్నింటికిన్ రక్షవై నీవె యా ఘోర కాకోల హాలాహలంబంతయున్ నీదు కంఠంబునన్ నిల్పుకొన్నాడవో దేవదేవా! త్రిలోకైక రక్షాకరా! దుఃఖనాశంకరా! శంకరా!
ఆదిదేవుండవై, జ్ఞానసారంబవై, భద్రరూపుండవై, కాలకాలుండవై, త్రాతవై, నేతవై, దేశికస్వామివై, దక్షిణామూర్తివై, యొప్పు సర్వజ్ఞ! సర్వేశ! సత్యప్రకాశా! చిదాకార! నీ తత్త్వ వైశిష్ట్యమున్ నేను ధ్యానించెదన్ నీదు పాదమ్ములన్ గొల్చెదన్, నిన్ను కీర్తించుచున్ నీదు సేవానురక్తుండనై జన్మవారాశినిం దాటి యానంద సాంద్రాకృతిన్ గాంతు నో దేవదేవా! మహాదేవ శంభో! మహాదేవ శంభో! మహాదేవ శంభో! నమస్తే నమస్తే నమః
ఓం నమశ్శివాయ...అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండినగకన్య సగము దేహము
నగమే నీ యిల్లు, మోయు నందియె ఘన ప
న్నగములు భూషణములు చిరు
నగవుల శివ నిన్ను గొల్తు నమకము తోడన్.
ఓం నమశ్శివాయ....."శంకరాభరణం"బ్లాగు విక్షకులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి==========*=========
అవనిభరమ్మును ద్రుంచగ
నవతారము లెత్తి నట్టి నాత్మ విభుల పె
క్కు విమల మతిగన శివకే
శవ రూపము మోదమగును సకల జనులకున్
ఓం నమశ్శివాయ.."శంకరాభరణం"బ్లాగు విక్షకులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిసాహిత్య కృషీ వలురు శ్రీ శంకరయ్య గారికి, శ్రీ పండిత నేమాని వారికి పాదాభివందనములతో చిరు కానుక
=======*==========
శంక రార్యులు గను సకల సమ్మేళనముల సమస్య
కంకణములుగల గవులు గడువు నీయకనె పూరించు
వంకర దీయు వడి వడిగ వజ్రములను బోసి, నేడు
"శంకరాభరణం" న కిచ్చు శైలధన్వుడు చిరాయువును।
==========*==========
పండిత నేమాని వారి పద్య రాశినిగన వినయ
మండిత ప్రణతులు జేయ మణి బంధములడిగె, నేడు
కండిక లగు చుండె క్రొత్త గవులకు, కొంగ్రొత్త వృత్త
మండము దొరకు సాహిత్య మధు మక్షికల ముదమలర
( మండము= మీగడ )
మహా శివ రాత్రి శుభా కాం క్షలతో......
రిప్లయితొలగించండిశివ రాత్రి పర్వ దినమున
శివ శివ యని బలికి నంత శివ సాయుజ్యం
భవ ! యని బలుకును శివు డ ట
శివ శివ యని బలుక రండి శివునిం గుడికిన్ .
అవతంసీకృత చంద్రరేఖ రుచిరంబై కాంతులీనంగ శై
రిప్లయితొలగించండిల వధూరత్నము దేహమందు సగమై లావణ్యముం జూప శాం
భవ జూటాగ్ర నటత్తరంగిణి హొయల్ వైవశ్యమున్ గొల్ప వై
భవమున్ జాటెడి ఫాలనేత్రుని సదా ప్రార్థింతు సద్భక్తిమై !!!
సిగబంతిగా చేయబడిన బాల చంద్ర రేఖ తలపై మేలివన్నెలు కురిపించుచుండగా , తన శరీరంలో సగ భాగమైన శైలరాజ కన్య అయిన పార్వతి లావణ్యమును చూపుచుండగా , శంభుని ఆ శీర్షముపై జటాజూటమునందు సుడులు తిరుగు గంగా నది హొయలు మైమరపు కల్గించుచుండగా , తన వైభవము జాటు ఆ ఫాలనేత్రుడైన పరమ శివుని ఎల్లప్పుడు సద్భక్తితో ప్రార్థించెదను .
లింగము రూపునున్న శివ లీలలనెన్నగ నా తరమ్మొకో!
రిప్లయితొలగించండిగంగనుఁ బంపి, పంటలను కాలువ జేసి, జనాళి బొజ్జ నిం
పంగ క్షుధార్తిఁ దీర్చుమను పావనమూర్తిని నే భజింతు; నీ
భంగిని ముక్తిఁ బొందగల భావన తో, పరి పూర్ణ భక్తితో.
చంచల మౌ మనమ్మును, యశాశ్వత దేహము నొక్కదానినిన్,
సంచిత పాపభారమును, సత్తువ జచ్చిన, బుద్ధికౌశలం
బించుక లేని మస్తకముఁ, బెద్దల దారిని పోని యోచనన్
పంచితి నాదు భాగమున, భారము నీదిక పన్నగేశ్వరా!
అమ్మా! లక్ష్మీ దేవి గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులుమీ 2వ పద్యమునకు కొన్ని సవరణలను సూచించు చున్నాను:
1. మొదటి పాదములో "చంచలమైన మానస మశాశ్వత దేహము" అనండి.
2. పన్నగేశ్వరా! అనే సంబోధన కంటే "పార్వతీశ్వరా" అంటే బాగుంటుందేమో.
స్వస్తి.
శ్రీ కందుల వరప్రసాద్ గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండివారి మధ్యాక్కరలు చాల బాగుగ నున్నవి.
స్వస్తి.
తలపైని గంగ చల్లగ
రిప్లయితొలగించండినిలువెల్ల సగము నపర్ణ నీతనువుండన్
కొలువైన భక్త పాలక
యలరించగ మ్రొక్కులిడుదునాలన నీవే!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅర్థనారీశ్వరా! వ్యర్థమ్ముగాకుండ
రిప్లయితొలగించండి........జీవమ్ముధన్యమ్ము చేయవయ్య,
గరళకంఠుడ! నీదు గానమ్ము చేసిన
..... ..గాత్రమ్ము సఫలత గాంచుకాదె,
పరమేశ్వరా! నీదు పాదమ్ములంటిన
........పాశముల్ పట్టును బాసిపోవె,
గంగాధరా! నిన్ను గాంచినతోడనే
........కోరికలన్నియు కూరుగాదె
ఇట్టినీయందు నాబుద్ధిఏకమవ్వ
చింత చేయుచునుంటినీ చెంతజేరి
కోరుచుంటిని నిన్నునే, కోక నదుడ!
నాదు కోరిక తీర్చుమా నందివాహ
శివరాత్రి నాడు ఘనముగ
రిప్లయితొలగించండిశివపూజలు జరుగుచుండు శ్రీశైలమునన్
శివ భక్తులు వేల కొలది
శివ దర్శన భాగ్య మొంద చేరుదు రచటన్
సాహిత్యాభిమాని గారికి శుభాశీస్సులు. మీ ప్రశంసలకి కృతజ్ఞతలు. సంతోషము.
రిప్లయితొలగించండిమీరు శివమానస పూజలోని 5వ శ్లోకమును వ్రాసేరు. అది మాలిని వృత్తము. సంస్కృతము కాబట్టి పాదము చివరి అక్షరమును గురువునకు బదులుగా లఘువును కూడా వేయవచ్చును. అందుచేత "క్షమస్వ" అని చదువుకొనుటే సాధువు.
నమస్తే నమస్తే నమస్తే నమః అనునది ఆ శ్లోకమునకు సంబంధము లేనిది. అందుచేత దానిని వేరుగా చూపించవలెను. స్వస్తి.
అమ్మా! రామలక్ష్మి గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు. ఒక చక్కని సీసపద్యమును వ్రాసేరు. మీ పద్యము బాగుగనున్నది. దాని క్రింది తేటగీతిలో కొన్ని సవరణలు అవసరము.
ఇట్టి నీయందు నా బుద్ధి ఏకమవ్వ అనే ప్రయోగము బాగులేదు. నా సలహా:
ఇట్టి నీయందు నా బుద్ధి ఏకమగుట
కొరకు చింతించు చుండి యాదరము మెరయ
.........
........
స్వస్తి.
సగ మేనన్ ముదమార నీ ప్రియ సతిన్ శైలేంద్రజన్ దాల్చి! ప
రిప్లయితొలగించండిన్నగముల్ మేనను క్రీడ లాడ! తలపై నాట్యమ్ము జేయన్ సురా-
పగ! జాబిల్లి వెలుంగు లా జలములన్ భాసింప తళ్కొత్తుచున్!
జగముల్ పాలన జేయుచుందువుగదా! సర్వజ్ఞ! శంభో! శివా!
అర్థ భాగమ్మున నమ్మను దాల్చిన
..........సాంబ సదాశివా! శరణు! శరణు!
తలపైన గంగమ్మ తైతక్క లాడెడు
..........గంగాధరా! నీకు కై మొగిడ్తు!
కాటిని వసియించి కడతేరు వారికి
..........తోడుండు రుద్ర! నతుల నొనర్తు!
పాములాడగ మేన బాముల హరియించు
..........పరమ దయాళు! నీ పదము గొల్తు!
భక్తి భిక్షను గోరుచు ముక్తి నిచ్చు
శంకరా! నన్ను గావగ శంక వలదు
నీవె తల్లివి తండ్రివి నీవె గురువు
ఏడుగడ నాకు నీవె యే జన్మ నైన!
అమ్మను దూర ముంచిన భవాబ్ధిని మున్కలు వేయుచుండి ని-
త్యమ్మును వేదనల్ బడుచు తల్లి యొడిన్ శ్రమ దీర గోరు భా-
గ్యమ్మును గోలుపోదురను కారుణితో తన మేన దాల్చె మా-
యమ్మను ధాత్రికిన్ జనకు డాతని కెంతటి మాల్మి బిడ్డలన్!
ఎపుడే యాపద వచ్చునో కుపితుడై యే బిడ్డలం జూచునో
యపరాధం బొనరించె నంచు పితరుండా నిప్పు కంటన్, కటా!
అపుడీ తల్లి యెడంద తల్లడిలగా నెట్లోర్చునో యంచు తా-
నెపుడున్ వీడక యుండె మేన సగమై యీ జీవులన్ గాచుచున్.
సగము సగము కలసి సర్వలోకములకు
తల్లి దండ్రు లగుచు తరుగనట్టి
పరమ దయను జూపు పార్వతీ శివులకు
చేతును శివ రాత్రి ప్రీతి నతులు.
అన్నా! మిస్సన్నా! అద్భుత భావనాగరిమతో మీ పద్యములలరారుచున్నవి. అభినందనలు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిప్రళయకాలమున బ్రపంచమ్ములెల్లను
హరియించినీకుక్షి భరముదాల్చి
సర్వమంగళను బార్శ్వమునందు ధరియించి
విశ్వకళ్యాణమ్ము వెలయజేసి,
నటరాజరూపాన నర్తించు నీ లీల
సర్వలోకమ్మ్ములు సంతసింప
అర్ధనారీశ్వర మను తత్త్వమున సృష్టి
మూలరహస్యమ్ము మొరయజూపి
దక్షిణామూర్తిగా జ్ఞాన భిక్షనొసగి
వరములిచ్చు సురాసుర వందితాబ్జ
చరణుడవు,సర్పభూషణ,చంద్ర చూడ,
నీదుమహిమల నెన్నంగ నేరితరము?
భవాని యర్థభాగమందు భాసిలన్, శిరంబునన్
రిప్లయితొలగించండిభవామనీ శశాంకమొప్ప, పన్నగాలు భూషలై,
భవాత్మజాసమేత నందివాహనంబు చూడగన్
భవాబ్ది దాట బ్రోవరా!శుభంకరా!సదాశివా!
ఈనాటి శీర్షికకు మనోహరమైన పద్యాలను రచించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
వరప్రసాద్ గారికి,
సుబ్బారావు గారికి,
డా. విష్ణునందన్ గారికి,
లక్ష్మీదేవి గారికి,
సహదేవుడు గారికి,
డా. ప్రభల రామలక్ష్మి గారికి,
నాగారాజు రవీందర్ గారికి,
మిస్సన్న గారికి,
కమనీయం గారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
శ్రీ మిస్సన్న గారు వెలువరించినవి పద్య రత్నములే. వారికి మా అభినందనలు. స్వస్తి.
రిప్లయితొలగించండిచక్కని సవరణలు సూచించిన పండితుల వారికి కృతజ్ఞురాలను.
రిప్లయితొలగించండిమిస్సన్నగారు,
మాతృవాత్సల్యపు గొప్పదనాన్ని వర్ణించిన మీ నాలుగవ పద్యం కంట తడి పెట్టించినది.
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినేమాని పండితార్యా! నా కింత కన్నా ఆనంద మేముంటుంది?
ధన్యవాదాలు.
శర్మ గారూ! ధన్యవాదాలు.
అమ్మా! లక్ష్మీ దేవిగారూ! మాతృ వాత్సల్యపు సిరులు పంచు మీ బోటి తల్లులకు జగజ్జనని మాతృ వాత్సల్యం హృదయాన్ని కదలించడంలో ఆశ్చర్యం ఏముంది?
పండితార్యా! ధన్యవాదాలు.తమ సూచననుసరించి సవరణ చేసినానంతరం....
రిప్లయితొలగించండిఅర్థనారీశ్వరా! వ్యర్థమ్ముగాకుండ
........జీవమ్ముధన్యమ్ము చేయవయ్య,
గరళకంఠుడ! నీదు గానమ్ము చేసిన
..... ..గాత్రమ్ము సఫలత గాంచుకాదె,
పరమేశ్వరా! నీదు పాదమ్ములంటిన
........పాశముల్ పట్టును బాసిపోవె,
గంగాధరా! నిన్ను గాంచినతోడనే
........కోరికలన్నియు కూరుగాదె
ఇట్టి నీయందు నా బుద్ధి ఏకమగుట
కొరకు చింతించు చుండి యాదరము మెరయ
కోరుచుంటిని నిన్నునే, కోక నదుడ!
నాదు కోరిక తీర్చుమా నందివాహ.