గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు. * పండిత నేమాని వారూ, ఈ సమస్యకు క్రమాలంకారం తప్ప పూరణకు గత్యంతరం లేదని భావించాను. నా ఆలోచనను తలక్రిందులు చేస్తూ అద్భుతమైన పూరణ చెప్పి అభ్యాస కవులకు మార్గదర్శకులయ్యారు. ధన్యవాదాలు. * తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ, మీరూ నేమాని వారి బాటలోనే చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ఐనా అనిరుద్ధుడు తనకు తానుగా ఉష దగ్గరికి రాలేదు కదా. ఆమె చెలికత్తె చిత్రరేఖ తీసుకువచ్చింది. "మాయ కప్పిన కథ" అన్నారుగదా... అటువంటి కథలో ఏదైనా సాధ్యమే. * సుబ్బారావు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. మూడవ పాదంలో ’బ్ర’ గురువై గణదోషం కలుగుతున్నది. "తేజోయుతుడు" అనాలనుకుంటాను. నా సవరణ.... అనిరుద్ధు డంబికాసుతు డనుపమ తేజోయుతుండు నా స్కంధుడెగా. * నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. "కృష్ణునకున్ అనిరుద్ధుడు" అని విసంధిగా వ్రాయరాదు కదా. "శ్రీకృష్ణున/ కనిరుద్ధుడు..." అందాం. * సహదేవుడు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. రెండవ పాదం ప్రారంభంలో యడాగమం రాదు. "తారకాసురు/ ననుపమ తేజమున" అందాం. అలాగే "స్కంధుం/ డనిరుద్ధుడు..." అంటే బాగుంటుంది.
విన కృష్ణుని మనుమడెవడు ?
రిప్లయితొలగించండికన నెయ్యది యెక్కి తిరుగు గంగా సుతుడే ?
ఘన మారుతేమి దాటెను ?
అనిరుద్ధుఁడు, నెమలి నెక్కి, యంబుధి దాఁటెన్.
(అనిరుద్ధుడు = నిరోధములు లేనివాడు)
రిప్లయితొలగించండి(నెమిలి అనే ప్రయోగము శబ్దరత్నాకరములో కలదు - అందుచేత నెమిలి అని వాడితిని)
మనమున బూనుచు యత్న
మ్మును ముల్లోకముల దిరుగ బోవుచు గౌరీ
తనయుడు స్కందుండగు న
య్యనిరుద్ధుడు నెమిలినెక్కి యంబుధి దాటెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితన జన్మకారణ మెరిగి
రిప్లయితొలగించండిచనె తారకుని వధియింప శస్త్రాస్త్రములన్
గొని పార్వతీసుతుడు గుహు
డనిరుద్ధుఁడు నెమలి నెక్కి యంబుధి దాఁటెన్.
( అనిరుద్ధుడు= అడ్డగింపబడనివాడు)
తననే వలచిన నెచ్చెలి
రిప్లయితొలగించండిగన నిదురించు తఱి మాయ కప్పగ నేతెం
చిన కథ లో ద్వారక విడి
యనిరుద్ధుఁడు నెమలి నెక్కి యంబుధి దాఁటెన్.
వినుమిది చక్కని పాదము
రిప్లయితొలగించండిఅనిరుద్ధుడు నెమలి నెక్కి యంబుధి దాటెన్
అనిరుద్ధ సుబ్రహ్మణ్యు డు ,
అనుపమ తేజ యుతుడు మ ఱి యా స్కంధు డె గా .
మనుమ డగును కృష్ణునకున్
రిప్లయితొలగించండిఅనిరుద్దుడు ; నెమలి నెక్కి యంబుధి దాటెన్
మినుసిగ దేవర తనయుడు
ఘనుడగు స్కందు డలనాడు ఖచరులు మెచ్చన్
దునుమంగ తారకాసురుఁ
రిప్లయితొలగించండియనుపమ తేజమున సురల యాశీర్వచనం
బున నింగి లోన స్కంధుడ
ననిరుద్ధుండు నెమలి నెక్కి యంబుధి దాటెన్!(అడ్డగింపబడని వాడను భావంతో)
అనిరుధ్ 'పీకాక్ ఏర్ లై
రిప్లయితొలగించండిన్స'నెడు విమానమ్ము నెక్కి చైనా వెడలెన్
జను లనుకొన హాస్యమునకు
“అనిరుద్ధుడు నెమలి నెక్కి యంబుధి దాటెన్"
వరంగల్ శతావధానంలో కోట వేంకటలక్ష్మీనరసింహం గారి పూరణ.....
రిప్లయితొలగించండివిన కృష్ణుని మనుమఁ డెవఁడు?
చను స్కంధుఁడు దేనిపైని? సామీరి కుజన్
గనఁబోవ నేమి దాటెను?
అనిరుద్ధుఁడు; నెమలి నెక్కి; యంబుధి దాఁటెన్.
ఒక అజ్ఞాత కవి పూరణ (వావిళ్ళవారి ’తెలుగు సమస్యలు’ గ్రంథం నుండి).....
రిప్లయితొలగించండిమనసిజ నందనుఁ డెవ్వం?
డని షణ్మఖుఁ డెద్ది యెక్కి యరుల జయించెన్?
హనుమంతుఁ డేమి చేసెను?
అనిరుద్ధుఁడు; నెమలి నెక్కి; యంబుధి దాఁటెన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఘనముగ తానే గెలువగ
రిప్లయితొలగించండిగణ నాయక పదవి నొంది గణుతింపంగా !
అనుపమ భక్తిని షణ్ముఖు డ
య్యని రుద్ధుఁడు నెమలి నెక్కి యంబుధి దాఁటెన్
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిక్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
ఈ సమస్యకు క్రమాలంకారం తప్ప పూరణకు గత్యంతరం లేదని భావించాను. నా ఆలోచనను తలక్రిందులు చేస్తూ అద్భుతమైన పూరణ చెప్పి అభ్యాస కవులకు మార్గదర్శకులయ్యారు. ధన్యవాదాలు.
*
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీరూ నేమాని వారి బాటలోనే చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
ఐనా అనిరుద్ధుడు తనకు తానుగా ఉష దగ్గరికి రాలేదు కదా. ఆమె చెలికత్తె చిత్రరేఖ తీసుకువచ్చింది.
"మాయ కప్పిన కథ" అన్నారుగదా... అటువంటి కథలో ఏదైనా సాధ్యమే.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
మూడవ పాదంలో ’బ్ర’ గురువై గణదోషం కలుగుతున్నది. "తేజోయుతుడు" అనాలనుకుంటాను. నా సవరణ....
అనిరుద్ధు డంబికాసుతు
డనుపమ తేజోయుతుండు నా స్కంధుడెగా.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
"కృష్ణునకున్ అనిరుద్ధుడు" అని విసంధిగా వ్రాయరాదు కదా. "శ్రీకృష్ణున/ కనిరుద్ధుడు..." అందాం.
*
సహదేవుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
రెండవ పాదం ప్రారంభంలో యడాగమం రాదు. "తారకాసురు/ ననుపమ తేజమున" అందాం. అలాగే "స్కంధుం/ డనిరుద్ధుడు..." అంటే బాగుంటుంది.
రాజేశ్వరి అక్కయ్య గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "షణ్ముఖు/ డనిరుద్ధుడు..." అనండి.
రిప్లయితొలగించండిజనకుని యానతి మేరకు
వెనువెంటనె బయలుదేరె విశ్వము జుట్టన్
ఘనుడా స్కందుడు,షణ్ముఖు
డనిరుద్ధుడు నెమలినెక్కి యంబుధి దాటెన్.
రిప్లయితొలగించండిజనకుని యానతి మేరకు
వెనువెంటనె బయలుదేరె విశ్వము జుట్టన్
ఘనుడా స్కందుడు,షణ్ముఖు
డనిరుద్ధుడు నెమలినెక్కి యంబుధి దాటెన్.