24, మార్చి 2013, ఆదివారం

పద్య రచన – 290 (చిలుక పలుకులు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“చిలుక పలుకులు”

18 కామెంట్‌లు:

 1. భారతీదేవికి పాణిపద్మమ్ముపై
  ....నలరారు నందాల పలుకు జిలుక
  పావన దాంపత్య జీవితమ్మనునెడ
  ....చిలుక జంటల గూర్చి చెప్పదగును
  ఎవ్వారు చిల్కల కేరీతి నేర్పిన
  ....నా రీతిగా బల్కు నా ద్విజమ్ము
  జోస్యమ్ము చెప్పుమంచు నడుగ ఫలితాల
  ....దెల్పు పత్రమ్ము నందించి మురియు
  నేర్చు కొనినట్టి పలుకులు నేర్చినట్లె
  యొప్ప జెప్పుటల్ చిల్కల కొప్పు బళిర!
  అటులనే కాక బుద్ధి పెంపార తగిన
  రీతి నభివృద్ధి జేసిన శ్రేయమొదవు

  రిప్లయితొలగించండి
 2. గోరు ముద్దలనమ్మయే కోరి పెట్టి
  మొదటి పలుకులు పలికించు మురిపె మలర
  ముద్దు బిడ్డలు మూతినే ముడుచు కొనుచు
  చిలుకు పలుకులు మరపించు చిలుక పలుకు

  రిప్లయితొలగించండి
 3. Collected By: Sahityabhimani.
  బమ్మెర పోతన:
  చిలుక పలుకులు పలికితి నాకేమి తెలియు దత్త్వ రహస్యము?
  వలదు నను నేరమెంచ సాధులకు నలినాక్ష నారాయణా

  నారాయణా! నేను అల్పజ్ఞుడును. ఎవరో చెప్పిన మాటలను చిలుక పలుకులవలె నేను తిరిగి చెప్పినాను. అంతే కాని వేదాంత రహస్యములు నాకేమి తెలియును? దీనిలో తప్పులున్నచో పెద్దవారు నన్ను నేరమెంచక మన్నింతురు గాక.

  రిప్లయితొలగించండి
 4. చిలుక పలుకులు బలుకుదు చెలువు మీ ర
  కవివ రులపద్య రచనము గాంచి నేను
  కూర్పు జేయుదు బద్యము గురువు లార !
  తప్పు సరిజేసి దెలుపుడ , యొప్పు నదియ .

  రిప్లయితొలగించండి
 5. వలచిన యలివేణి పలుకు
  తొలి వయసున ముద్దు బిడ్డ తుంటరి పలుకుల్
  పులకలు రేపుచు మదిలో
  చిలుక పలుకులంటి రీతి చెవికిన్ దోచున్!

  రిప్లయితొలగించండి
 6. చెఱకు తీపి వంటి పలుకు చిలుక పలుకు
  పలుకును చిలుక - పలుకులు పలుక నేర్చి
  చిన్న పిల్ల డనుకరించి చిలుక వలెనె
  మాటలాడును ముద్దులు మూటగట్టి

  రిప్లయితొలగించండి
 7. @సహదేవుడు గారూ చిలక పలుకుల మీద పులకలు రేపే మీ అన్వయం బాగుంది.

  వలచిన యలివేణి పలుకు
  తొలి వయసున ముద్దు బిడ్డ తుంటరి పలుకుల్
  పులకలు రేపుచు మదిలో
  చిలుక పలుకులంటి రీతి చెవికిన్ దోచున్!"

  రిప్లయితొలగించండి
 8. చిలుకల పలుకుల మించుచు
  కిలకిల నగవుల నొలుకుచు కేరింతలతో
  కలకల లాడెడు పిల్లలె
  యలరింతురుగా మనముల నాహ్లాదమునన్.

  రిప్లయితొలగించండి
 9. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  ఉలుకు పలుకు లేక యలుక పలక మెక్క
  చిలుకలకొలికి యలుకను తొలగ జేయ
  బుడిబుడి నడకల బుడుత నొడిని బెట్ట
  పలుక చిలుక పల్కుల నామె కిలకిలమనె.

  రిప్లయితొలగించండి
 10. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  శంకరభగవత్పాదు లావంక జూచి
  చిలుకలు పలుకు చుండగ చిత్రముగను
  వేద మంత్రముల్ వినినంత వేడుకయ్యె
  నదియె మండనమిశ్ర గృహంబ గునని.

  రిప్లయితొలగించండి
 11. వలపుల వలవేసి భామలు
  కలకలమును రేపి మదిని కాపుర ముండన్ !
  తెలుపగ ప్రియమగు ప్రేమను
  చిలుక పలుకులను రువ్వి చెంపను గొట్టన్ !
  -------------------------------------------
  శుక రవమును విని నంతనె
  ప్రకటిత మగు ప్రేమ యంచు ప్రాణ ప్రదమౌ !
  శుక మహఋషి ఉదయించగ
  పికముల చిలు కంగ పలికె పీయూష మనన్ !

  రిప్లయితొలగించండి
 12. చిలుక పలుకులపై ముచ్చటైన పద్యాలను రచించిన కవిమిత్రులు.....
  పండిత నేమాని వారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  సుబ్బారావు గారికి,
  సహదేవుడు గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  సాహిత్యాభిమాని గారూ,
  లక్కరాజు వారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 13. ప్రశ్న చెప్పు చిలుక ప్రతిఫలంలేకుండ
  పాడిచూపు నెట్టి పాటనైన
  పలుకులాలకించి పలుకునుచక్కగా
  పలుకులన్న చిలుక పలుకులేగా.

  రిప్లయితొలగించండి