13, మార్చి 2013, బుధవారం

సమస్యాపూరణం – 993 (బుద్ధి గలుఁగు జనుల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
బుద్ధి గలుఁగు జనుల రోయఁదగును.
(యతిమైత్రిని గమనించండి)

19 కామెంట్‌లు:

  1. ధర్మమూర్తులకు సదా కష్టముల గూర్చి
    మచ్చరంబు పెరుగ విచ్చలవిడి
    నలరు కౌరవాదులగు నట్టి యమిత దుర్
    బుద్ధి గలుగు జనుల రోయ దగును

    రిప్లయితొలగించండి
  2. అర్థకామములకు నాశ పడెడివాని
    జగము నందు మిగుల జనుల దోచు
    వావి వరుస లేక వర్తనములు చేయు
    బుద్ధి గలుఁగు జనుల రోయఁదగును.

    రిప్లయితొలగించండి
  3. పరుల యెదుగు దలను పరికింగా పొంది
    కడుపు మంట మరియు కళ్ళ మంట
    నాశనమ్ము గోరు నాలిముచ్చులును దు
    ర్బుద్ధి గలుఁగు జనుల రోయఁదగును.

    రిప్లయితొలగించండి
  4. శర్మ గారూ బాగుంది.."వావివరుస లేక వర్తించు నట్టి దుర్బుద్ధి.." అంటే యతి సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  5. శాస్త్రిగారూ నమస్తే! ౩ వరుసలకు అన్వయిస్తుందని ఉంచాను. మీరు చెప్పినట్లు మారుస్తూ ధన్యవాదములతో
    అర్థకామములకు నాశ పడెడివాని
    జగము నందు మిగుల జనుల దోచు
    వావివరుస లేక వర్తించు నట్టి దు
    ర్బుద్ధి గలుఁగు జనుల రోయఁదగును

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
    కాని యతిమైత్రి విషయంలో నా సూచనను గమనించినట్టు లేదు. చివరిపాదంలో యతిదోషం ఉంది.
    గోలివారి సవరణను గమనించండి.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    తోపెల్ల వారి పూరణను పరిశీలించి సవరణ సూచించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. తలపు తలపు లోన తనస్వార్థమే తప్ప
    యెదుటి వాని బాగు నెంచ లేని
    పశు స్వభావ యుక్త వర్తనమ్ము గల దు
    ర్బుద్ధి గలుఁగు జనుల రోయఁ దగును

    రిప్లయితొలగించండి
  8. శాస్త్రిగారికి, గురువుగారికి నమస్సులు. యతి లిటిగేషను గమనించలేదు. శాస్త్రిగారి సూచనానంతరం సరిపడినదనుకొనుచున్నాను.

    రిప్లయితొలగించండి
  9. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో "పశు స్వభావ" అన్నప్పుడు ’శు’ గురువై గణదోషం... "పశు ప్రవృత్తి" అందాం... ‘ప్ర’ వలన ‘శు’ను లఘువుగాను, గురువుగానూ స్వీకరించవచ్చు... ఐచ్ఛికం.

    రిప్లయితొలగించండి
  10. వావి వరుస లేక వలపు లొం దునతడు
    బ్రతికి యున్న, లేక, వమ్ము సుమ్ము
    పశువు వలెను దుష్ట వర్తనము గల దు ర్
    బుద్ధి కలుగు జనుల రోయ దగున్

    రిప్లయితొలగించండి
  11. శ్రీ శంకరయ్య గారికి, శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు
    ద్రుపద రాజుతో వారి ఆస్థానకవి ఈ రీతిగా జెప్పుచుండె
    =======*=======
    మధువును ముద మలర ద్రాగు మనుజులెల్ల పుడమిపై
    బుధుల మధ్య దిరుగ,దుష్ట బుద్ది గలుగు జనుల రో
    యదగును కడు కష్టములకు ననవరతము,కాన రా
    దు దయ వారి వదన మందు ద్రుపద రాజ నిజముగన్

    రిప్లయితొలగించండి
  12. నీతి హీను లైన నేతలు తన దేశ
    సంపదలను దోసి సౌఖ్య పడుచు
    ప్రజల మేలు మరచి పాలించుచున్న దు
    ర్భుద్ది గలుగు జనుల రోయదగును

    రిప్లయితొలగించండి






  13. అంతరంగమందు నమితమౌ యీర్ష్యతో
    కల్లమాటలాడు కపటజనుల
    దులువపనుల జేయు తుంటరి తుచ్చ దుర్
    బుద్ధి గలుగు జనుల రోయదగును.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ వరప్రసాదు గారికి శుభాశీస్సులు.
    ఉత్సాహ వృత్తమును ఉత్సాహముతో నడిపించేరు. అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. మంచి చెడులు మఱచి మానవత్వము వీడి
    హింస పెట్టు టనగ హితము గాను
    యెదుటి వాని పైన నెటులైన పగను దుర్
    బుద్ధి గలుఁ గు జనుల రోయఁ దగును !

    రిప్లయితొలగించండి
  16. గురువుగారికి ధన్యవాదములు. తమ సూచన మేరకు సవరించిన పద్యం:

    తలపు తలపు లోన తన స్వార్థమే తప్ప
    యెదుటి వాని బాగు నెంచ లేని
    పశు ప్రవృత్తి తోటి వర్తించఁ జూచు దు
    ర్బుద్ధి గలుఁగు జనుల రోయఁ దగును

    రిప్లయితొలగించండి
  17. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    ‘దుర్బద్ధి’ని ఆశ్రయించకుండా కొత్త ప్రయోగాన్ని ’ఉత్సాహం’గా చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేతలు అన్నారు కనుక ’తమ దేశ.. లేదా... మన దేశ’ అనండి.
    "దోచి సౌఖ్యమంది" అందాం.
    *
    కమనీయం గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదం ప్రారంభంలో యడాగమం రాకూడదు. "హిత మటంచు/ నెదుటి..." అనండి.

    రిప్లయితొలగించండి
  18. బుద్దులెన్నొ చెప్పి భూరి విద్యలుచెప్పు
    పాఠశాల కట్టె పదిలముగను
    పాఠశాల జేసె పానశాలగను దు
    ర్బుద్ధి గలుఁగు జనుల రోయఁదగును

    రిప్లయితొలగించండి
  19. డా. ప్రభల రామలక్ష్మి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి