3, మార్చి 2013, ఆదివారం

పద్య రచన – 269 (సౌందర్యము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"సౌందర్యము"

13 కామెంట్‌లు:

  1. సౌందర్యంబన్నది కను
    విందౌ ప్రకృతి సహజంపు వేడుక చూడన్!
    ఇందు గలదందు లేదని
    సందేహమువలదు నిర్వచనమే లేకన్!

    రిప్లయితొలగించండి
  2. సుందర దేవుని ప్రకృతిని
    సౌందర్యము లేనిదేది సరిగా చూడన్
    విందగు కనులకొ చెవులకొ
    స్పందన గలుగుచు కన మనసారా జగతిన్.

    రిప్లయితొలగించండి
  3. ఆనందమును గూర్చు నట్టి విశేషమే
    ....సౌందర్యమగును దృశ్యముల లోన
    భూమ్యాదులగు పంచభూతమ్ము లన్నియు
    ....సౌందర్య రాశులే జగతినెల్ల
    మనసు విశుద్ధమై తనరెడు వేళలో
    ....సౌందర్య నిధులె దృశ్యమ్ము లహహ
    సకల జగత్తులో సౌందర్యమును గను
    ....నట్టివాడే నిక్కమైన యోగి
    అఖిల జీవులలోనుండు నాత్మ యొకటె
    ఆత్మయే సుందరమ్ము ప్రియమ్ము నదియె
    ఆత్మనే నేను నేనంచు ననవరతము
    నెరుక గల్గుటయే భవ్య మెల్లరకును

    రిప్లయితొలగించండి
  4. సుందర భావము పుడమిని
    సౌందర్యము బిలువ బడును సురుచిర ముం గా
    సుందర మె ప్రకృతి యంతయు
    సుందరమా ! నీ కు జెపుదు సు స్వాగత మున్

    రిప్లయితొలగించండి
  5. ఆత్మ సుందరతయె లేని యందగాని
    కన్న యంద వికారంపు కపియె మేలు
    ఆత్మశోభ చెడిన సుందరాంగి కన్న
    కుటిల మించుక లేనట్టి కుబ్జ మేలు

    రిప్లయితొలగించండి
  6. కనువిందు రంగవల్లిక,
    మనసెరిగినవారిమాట, మల్లెల మాలల్,
    కని పెంచిన సంతానము
    జనులకు సౌందర్యమనగ; సరికాదనుటే?

    రిప్లయితొలగించండి
  7. గురువు గారు,
    సమస్యల పట్ల నా స్పందనను ఆక్షేపణ గానో, అభ్యంతరం గానో కాక కేవలం నా మనసులో మాటగా తీసుకోవలసినదని మనవి.

    రిప్లయితొలగించండి
  8. ఈనాటి అంశం సౌందర్యముపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
    సహదేవుడు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సాహిత్యాభిమాని గారూ,
    ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ ఆక్షేపణలు, అభ్యంతరాలు ఏమైనా ఉంటే మొగమోటం లేకుండా నిరభ్యంతరంగా వెలిబుచ్చవచ్చు. నాకు సంతోషమే.

    రిప్లయితొలగించండి
  9. ప్రకృతి సుందర మయమని
    వికృతమే లేదు జగతి వింతలు మెండౌ !
    సుకృతము చూడ గలుగుట
    చక్రియె కనులిచ్చె మనకు సోద్దెము లనగా !
    --------------------------------------------
    చంద్రుని మించిన యందము
    సుందరు డగు రామునిగని సొంపుగ సీతే!
    పొందగ పతిగా నాతని
    డెందము నందెంతొ మురిసి నెమ్మిని తానే !!

    రిప్లయితొలగించండి
  10. తల్లడిలంగ బిడ్డ నెద దాచుక నాకలి బాపు తల్లిలో
    పిల్లకు నోట కూడు నిడి ప్రేమను గూటిని పెంచు పక్షిలో
    మెల్లగ పూవు బాల దన మేలిమి రెమ్మల నూచు తీవలో
    చల్లగ బ్రోచుచున్ మనల సాకెడి దైవపు టంద మొప్పెడిన్.

    రిప్లయితొలగించండి
  11. రాజేశ్వరి అక్కయ్య గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ తాజా పద్యం తాజా అందాలను ఆవిష్కరించి అలరించింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి