తమన్నా - కాజల్ - సమంతా - త్రిష
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.
ఈ దత్తపదిని సూచించిన నా బాల్య మిత్రుడు తాటికొండ ఓంకార్‌కు ధన్యవాదాలు.
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.
ఈ దత్తపదిని సూచించిన నా బాల్య మిత్రుడు తాటికొండ ఓంకార్‌కు ధన్యవాదాలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభీష్ముడు అంపశయ్యపై నున్నప్పుడు కృష్ణుడు అర్జునునితో...
రిప్లయితొలగించండితాతమన్నన బొందిన ధన్యుడీవు
దోసమంతగ నెంచడు కాశి రాజ
పుత్రి షండునిగా మారి పుట్టిముంచె
గంగ తెప్పించు త్రాగేందు కాజలమ్ము
శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
రిప్లయితొలగించండిప్రణామములు!
శరతల్పగతుడైన భీష్ముడు ధర్మరాజుకు విష్ణుసహస్రనామ మహిమతోపాటు ముక్తికాంతను గుర్తుపట్టడానికి తప్పక తెలుసుకోవలసిన నాయికల నామాలను బోధించిన తీరు:
నరకోన్మూలనవిష్ణుసచ్చరితమన్ నావం బ్రయాణించి, త
త్పరమేశాభయనామమంత్రజపవిద్య న్నల్పకాజల్పని
ష్ఠురసంసారభయంబు మాని యమృతాస్తోభాసమంతాత్పరా
త్పరగోవిందపదద్వయీ త్రిషవణాధ్యానంబుఁ గావింపుమా!
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
శ్రీ కృష్ణుడు అర్జునుని తో
రిప్లయితొలగించండితాసమం తానే నీ తాత త్యాగ మందు
కా జలంబుల మునుగవే కాక మూ క
త్రి ష డా యామ కాలాల తిరుగ రెవరు
పీ త మన్నన గంగయే తాత కిపుడు .
శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండిద్రౌపదీ పరిహాసానంతర రారాజు స్థితిని ధృతరాష్టృనితో దుశ్శాసనుడు చెప్పుచున్నట్లుగా
నవ్వెనంచ విశ్రాం “తమన్నా” తి దలచి
ముట్టడు జన “కాజల్” పాన ముల్ మరియు
మాన్య రారాజు రాజ “సమంత” పోయె
ననుచు “త్రిష” వణములనట నలమ టించె.
క్ష్మా తమన్నాయు త్రిషయు కాజల్ సమంత
రిప్లయితొలగించండిలన బళా! మహా నట వర్గమందు వెలుగు
వెలిగెదరటంచు వారిని గొలువుమయ్య!
అర్జునా! ముక్తి బడసెద వనెను చక్రి
వలదు ద్యూతమన్నా! యన నిలువ లేదు
రిప్లయితొలగించండిమునిగి శంకాజలమ్మున గొణిగితివని
యిపుడు మానసమంతా దహించు, ద్రుపద
పుత్రి! షరతుకు లోబడి పోర లేము!!
స్వాగతమన్నా కృష్ణా !
రిప్లయితొలగించండిభాగవ తోత్తమ సమంతభద్రుని తేజ
మ్మా ! గోపాలుడ శౌరీ !
యీ గృహమే పావనమ్ము యిప్పుడు నయ్యెన్
అనుచు -
కీర్తనమ్మును జేయుచు కృష్ణు నెదుట
గనుచు వాపికా జలముల కాళ్ళు కడిగి
ద్రుపద పుత్రి షరతు నిడె “ తోడు నీడ
వగుచు నుండవలెను మాకు పగలు రేయి "
రిప్లయితొలగించండిశ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
ప్రణామములు!
శరతల్పగతుడైన భీష్ముడు ధర్మరాజుకు విష్ణుసహస్రనామ మహిమ(తోపాటు ముక్తి-కాంతను గుర్తుపట్టడానికి తప్పక తెలుసుకోవలసిన నాయికల నామాల)ను బోధించిన తీరు:
నరకోన్మూలనవిష్ణుసచ్చరితమన్ నావం బ్రయాణించి, త
త్పరమేశాభయనామమంత్రజపవిద్య న్నల్పకాజల్పని
ష్ఠురసంసారభయంబు మాని యమృతాస్తోభాసమంతాత్పరా
త్పరగోవిందపదద్వయీ త్రిషవణాధ్యానంబుఁ గావింపుమా!
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపావనమ్ము + యిప్పుడు - ఇక్కడ విసంధి జరిగింది కాబట్టి యీ పాదాన్ని పూర్తిగా మార్చుతున్నాను :
రిప్లయితొలగించండిస్వాగతమన్నా కృష్ణా !
భాగవ తోత్తమ సమంతభద్రుని తేజ
మ్మా ! గోపాలుడ శౌరీ !
ఏగు దెంచుము మాయింటి కిప్పుడైన
అనుచు -
కీర్తనమ్మును జేయుచు కృష్ణు నెదుట
గనుచు వాపికా జలముల కాళ్ళు కడిగి
ద్రుపద పుత్రి షరతు నిడె “ తోడు నీడ
వగుచు నుండవలెను మాకు పగలు రేయి "
లక్క ఇంటి దగ్గర భీమునికి జాగ్రత్తలు చెప్పెడు కృష్ణుని మాటలు :-
రిప్లయితొలగించండిఊతమన్నారు నను మీరు వాత పుత్ర
లక్క గృహమును మీకా జాలకులిడంగ
వీడు తామసమంతయు కీడుఁ దలచి
ధాత్రి షష్ఠాష్ట మంబున్న దాడు లుండు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిలక్క ఇంటి దగ్గర భీమునికి జాగ్రత్తలు చెప్పెడు కృష్ణుని మాటలు :-
తొలగించండిఊతమన్నారు నను మీరు వాత పుత్ర
లక్క గృహమును మీకా జాలకులిడంగ
వీడు తామసమంతయు కీడుఁ దలచి
ధాత్రి షష్ఠాష్టకంబున్న దాడు లుండు
శ్రీ సహదేవుడు గారు, పద్యం బాగుంది. అయితే మహాభారతం ప్రకారం - లాక్షాగృహం దగ్గర భీమునికి జాగ్రత్తలు చెప్పినది ధర్మరాజు గానీ కృష్ణుడు కాదు. అసలా ఊరు వెళ్ళేటప్పుడే ధర్మరాజుకు జాగ్రత్తలు చెప్పింది విదురుడు.
తొలగించండిధన్యవాదములు సర్.శ్రీకృష్ణపాండవీయము సినిమా ఆధారంగా అలాభావన చేశాను.మన్నించండి.
తొలగించండికుండ లంబులు గురుపత్ని కోర్కె మీర
రిప్లయితొలగించండికాజ లంబులు త్రిషవణ కార్య మునకు
అర్ఘ్యమిడి ధ్యానిం తమన్న నరుగు దెంచి
తామస మంత తక్షకుడు తస్క రించె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిజపతపములకు,బూజకా జలము దెమ్ము,
త్రిషవణము చేతమన్న
సమంత్రితముగాను,
మనకు సరిపోవు నోయి సమంతనాఖ్య ,
యనియె నుద్యుక్తుడై గురుండతని తోడ.
ఈ దత్తపదికి స్పందన ఎలా ఉంటుందో అని అనుమానించాను. కాని మిత్రులు సమధికోత్సాహులై చక్కని పూరణల నందించారు. నాకన్నా ఈ దత్తపదిని సూచించిన నా మిత్రుడు అత్యధికానందాన్ని పొందాడు. కవిమిత్రులకు తన అభినందనలను, ధన్యవాదాలను తెలుపమన్నాడు.
రిప్లయితొలగించండి*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘త్రాగేందు కా జలమ్ము’ను ‘త్రాగుట కా జలమ్ము’ అనండి.
*
ఏల్చూరి మురళీధర రావు గారూ,
అత్యద్భుతమైన పూరణ. మీ నైపుణ్యానికి అభినందనలు, ధన్యవాదాలు.
*
సుబ్బారావు గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
‘సమం’ అని వ్యావహారిక మౌతున్నది.
*
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘జల పానముల్’ అనవచ్చు.
*
పండిత నేమాని వారి,
పరిహాస పూర్వకమైన మీ పద్యం చదివి నవ్వుకున్నాను. ధన్యవాదాలు.
*
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
పూరణకు రెండు పద్యాలను ఆశ్రయించారు. ఈ సంప్రదాయం లేదనుకుంటాను. అయినా మంచి పూరణనిచ్చారు. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం ఉంది.
*
రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
చివరి రెండు పాదాల్లో గణదోషం...
*
కమనీయం గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
Kindly educate me in how I can improve according to the yati praasa and ganaalu. Please forgive me for presenting the following,
రిప్లయితొలగించండిAlthough, there are no ganamulu or yati or praasa:
జీవితముచాలా చిన్నదని
జీతమన్నా పెంచమనీ శార్దూలమెక్కిన
తల్లికాజలమంతా మంత్రి షణ్ముఖు
డొనరించెనభిషేక సేవల మానసమంతా తానై
Kindly educate me in how I can improve according to the yati praasa and ganaalu. Please forgive me for presenting the following,
రిప్లయితొలగించండిAlthough, there are no ganamulu or yati or praasa:
జీవితముచాలా చిన్నదని
జీతమన్నా పెంచమనీ శార్దూలమెక్కిన
తల్లికాజలమంతా మంత్రి షణ్ముఖు
డొనరించెనభిషేక సేవల మానసమంతా తానై
తొలగించండిమీకీ బ్లాగులోని టపాలు ఉపయోగ పడతాయేమో చూడండి
telugupadyam.blogspot.com
జిలేబి
It is complicated!
తొలగించండిIt is complicated!
తొలగించండిఆ. చేతమన్న రాదు చిత్తంబు నీపైన
రిప్లయితొలగించండిదోసమంత నాదె తోయ జాక్ష
త్రిషవణముల రోజు తెలుపుజేతును మేను
ఆనదే! మనసున కాజలమ్ము!!
- వింజమూర్ విజయ కుమార్
(ఎన్ని మార్లు స్నానమాచరించి శరీరాన్ని శుద్ధి చేసినా మనసును మాత్రం శుద్ధం చేయలేకపోతున్నా దేవా! చిత్తం మాత్రం నీపైన కుదరడం లేదు)