17, మార్చి 2013, ఆదివారం

పద్య రచన – 283 (విద్యాధనము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"విద్యాధనము"

26 కామెంట్‌లు:

  1. దోచ వచ్చును ధనమును దొరికి నంత
    కోటి కోటలు గనులను కొల్ల గొట్టి
    మంచి మనసును దోచగ నెంచ లేము
    విద్యా ధనము లభియింప వేల్పు వరము

    రిప్లయితొలగించండి
  2. ధనము లన్నిటి మించు ధన విశేషమ్మయి
    ....విద్యాధనంబన వెలుగు చుండు
    నదియె నిత్యంబు సత్యంబునై యలరారు
    ....నదియ సుజ్ఞాన సంపదలనిచ్చు
    నెంతెంత దానమ్ము లిచ్చుచుండిన విద్య
    ....లంతంత వర్ధిల్లు ననవరతము
    దొంగల కెట్లేని దొరకదా సంపద
    ....భూషణంబై యొప్పు భూజనులకు
    విద్య లారీతి నెంతయు పృథ్వి నలరు
    విద్య లన్నిటిలో నాత్మ విద్య మిగుల
    నొప్పు మకుటాయమానమై యోగదమయి
    యా మహాయోగ మలవడు వారు ఘనులు

    రిప్లయితొలగించండి
  3. దోచు కొనలేరు విద్యను దొంగ లెవరు
    పంచు కొనలేరు దానిని భ్రా త లెవరు
    ఎవరి విద్యయే వారిని నిలను సాకు
    విద్య మేలైన ధనము ర ,విశ్వ మందు

    రిప్లయితొలగించండి
  4. గురువు మనకు నీయ గౌరవంబుగ నెంచు
    తరుగు నంచు మదిని తలచ బోడు
    మందసమ్ములు దాచ వందలక్కర లేదు
    మందహాసము నిండు నొంద వృద్ధి
    పట్టి చోరులుజేరి కొట్టి పట్టుక పోరు
    ప్రభుత బాధ నిడదు పన్ను లడిగి
    పరుల దేశమునైన ప్రక్క గ్రామమునైన
    నొక్క రీతిగ మెప్పు నొంద గలము

    ధనము తానె వచ్చు తలను తానున్నచో
    విద్య మించు ధనము విశ్వమందు
    లేదు సుజను లార లేత బాలలనెప్డు
    పనిని చేర్చకండి బడియె మేలు.

    రిప్లయితొలగించండి
  5. బుధ్ధి పత్రముపై శ్రధ్ధ ముద్ర వేయ
    చెరుగ కుండగ మరి మరి చెల్లుచుండు
    దేశ కాలము లన్నిటఁ దిరము విద్య
    సకల జనులకు భూషణ స్వర్ణ మిదియు

    రిప్లయితొలగించండి
  6. విద్యాధన ప్రాశస్త్యాన్ని తెల్పుచూ వేదప్రామాణిక మైన విద్ శబ్దపు అసలు అర్థము భగవత్తత్వాన్ని తెలుపునది అన్న విషయమును (ఆత్మవిద్య) చాల అందముగ చెప్పిన మాన్యశ్రీ పండితులవారికి నమస్సులు.
    విద్యాధనము భగవద్దత్తమని చెప్పిన అక్కయ్య గారికి
    సామాజిక స్పృహతో బాల కార్మిక వ్యవస్తను కూలద్రోలి విద్యావ్యవస్త లోకి బాలలను తీసికుని రావాలన్న శ్రీగోలి హనుమచ్చాస్త్రిగారికి
    బుద్ధి ఎంత యున్ననూ దానిపై శ్రద్ధ పెట్టకపోయిన నిరుపయోగము. బంగారమునకు తావి అబ్బినట్లుగా బుద్ధికి శ్రద్ధ తోడైన అదే నిజమైన భూషణమని చెప్పిన డా.గన్నవరపు నరసింహమూర్తి గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. శర్మగారూ ! ధన్యవాదములు. మీ కవితా శక్తి అద్భుతము. మీఱంతా శంకరాభరణమునకు వన్నె తెచ్చే పద్యాలను సృజిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  8. విద్య యనెడి ధనముండిన
    ఖద్యోతము భంగి మెరయు ఖలుడే యైనన్
    విద్యను దోచరు దొంగలు
    విద్యయె నరునికి ఘటించు విత్తము నెపుడున్

    రిప్లయితొలగించండి
  9. హనుమచ్ఛాస్త్రి గారి పద్యం చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము చాలా బాగుగ నున్నది. అభినందనలు. మొదటి పాదములో మీరు ప్రాస యతి వేయబోయేరు - కాని సమముగా రాలేదు. గురువు శబ్దములో 1వ అక్షరము లఘువు, గౌరవ శబ్దములో కూడా 1వ అక్షరము లఘువే ఉండాలి. మీరు గురువును వేసేరు కదా. సరిచేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న గారూ ! ధన్యవాదములు.
    శ్రీ నేమాని వారికి నమస్సులు. నిజమే ....... .....త్వ (పొ) రపాటును సవరించుచున్నాను.

    పంచు గాదె గురువు మించ సంతసమందు
    తరుగు నంచు మదిని తలచ బోడు
    మందసమ్ములు దాచ వందలక్కర లేదు
    మందహాసము నిండు నొంద వృద్ధి
    పట్టి చోరులుజేరి కొట్టి పట్టుక పోరు
    ప్రభుత బాధ నిడదు పన్ను లడిగి
    పరుల దేశమునైన ప్రక్క గ్రామమునైన
    నొక్క రీతిగ మెప్పు నొంద గలము

    ధనము తానె వచ్చు తలను తానున్నచో
    విద్య మించు ధనము విశ్వమందు
    లేదు సుజను లార లేత బాలలనెప్డు
    పనిని చేర్చవలదు బడియె మేలు.

    రిప్లయితొలగించండి
  12. విద్యాధనమును గురించిన చక్కని పద్యాలను చెప్పిన కవిమిత్రులు......
    రాజేశ్వరి అక్కయ్యకు,
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    గన్నవరపు నరసింహమూర్తి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మిత్రుల పూరణలను, పద్యాలను సమీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం చివరి పాదంలో ‘విద్యా’ అన్నచోట గణదోషం.
    "విద్య యను ధనము లభింప వేల్పు వరము" అందాం.

    రిప్లయితొలగించండి
  13. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    విద్యమానపు పరవిద్యలు దైహికం
    ………. బపర మాముష్మిక మరయగాను
    అవ్యయంబగు ధనమాద్యత్వ సద్యము
    ………. విధ్యాధనంబని విబుధు లనగ
    ఉద్యోదితంబగు నుపచితిన్ పాత్రతా
    ………. పాత్రత లెన్నుచు వ్యయముచేయ
    సిరి విద్యలెన్నైన శ్రీవిద్య సాటియె?
    ………. అదియె సత్యక ధన మనుచు మెలగ
    మానవ సమాజమెందున మనగ గలదు
    తరతరాల సంపద వన్నె తరగ దెందు
    వేద విహిత విద్యాధన మాద రింప
    శుభము లిచ్చును జగతికి సుజను లార!
    (విద్యమానము=వర్తమానము; ఆద్యత్వము=ఇప్పుడు; సద్యము=అప్పుడు;ఉద్యోదితము=ప్రకాశము; ఉపచితి=అభివృద్ధి,పెంపు)


    రిప్లయితొలగించండి
  14. శ్రీవిద్యా సంపన్నుతి
    గావించితి విమల హృదయ! కమనీయముగా
    ధీవైభవ! తోపెల్ల క
    వీ! వేడుకయయ్యె నీ కివే యాశిషముల్

    రిప్లయితొలగించండి
  15. శ్రీ పండిత గురువుల ఆశీఃప్రభావము పెద్దల ఆసీస్సులు ఈ కవితా సేద్యము చేయ నేర్చుకొనుచున్నాను. మీ ఆదరాభిమానములకు శతథా కృతజ్ఞుడను. ప్రణామములతో
    ..... మీశిష్యపరమాణువు శర్మ.

    రిప్లయితొలగించండి





  16. అన్నికాలాల విద్యకత్యంత గౌర
    వంబు పెంపారు విద్యచే వచ్చు ధనము
    అట్టి విద్యాధనము గొప్ప యాస్తి;దాని
    దానమిచ్చినన్ దరగని ద్రవ్యమౌను

    రిప్లయితొలగించండి
  17. అన్నయ్య గారు మెచ్చుకొన్న శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారి పద్యమద్భుతము. చాలా బాగుంది.వారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    వేద విహిత విద్యాధన మాదరించాలంటూ మీరు చెప్పిన పద్యం నేమాని వారి ప్రశంసకు పాత్రమైనందుకు ఆనందంగా ఉంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారు శ్రీ కందిశంకరయ్యగార్కి, పెద్దలు భ్రాతృసమానులు డా.గన్నవరపు నరసింహమూర్తిగారికి నామస్సులు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ తోపెల్ల శర్మ గారి నమస్కారములలో కూడా తొట్రుబాటులు (టైపు పొరపాటులు) కనిపించుచుంటే వారికి పెద్దలయెడ కల వినయ గుణము ప్రస్ఫుటమగుచున్నది. అది కూడా ఒక ఆభరణమే కదా. శుభం భూయాత్. స్వస్తి.

    రిప్లయితొలగించండి

  21. విద్య ధనమని విద్యాధికులు అందురు
    ధనం విద్య అని ధనాధికులనరు
    అదియేమి మోహమో ఈ ధనము మీద
    విద్యాధికులకు ధనాపేక్షరహితులకున్!

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  22. జిలేబీ వారు మంచి ప్రశ్నే వేసారు, సమాధానము వారికి తెలియదా !

    విద్య నేర్చిన విత్తమ్ము వెనుక వచ్చు
    విద్య తోడనె సమకూడు విమల యశము
    విత్త మొసగుట సులభము బిడ్డలకును
    విద్య ధనమౌను ; విత్తము విద్య గాదు.

    రిప్లయితొలగించండి
  23. జిలేబి గారికి, డా. గన్నవరపు వరాహ నరసింహమూర్తి అన్నగారికి నమస్సులు.
    మీ ఇరువురి పద్యముల ప్రేరణతో

    విద్య యీయగ వచ్చును విత్త మెంతొ
    విత్త మీయజాలదుగద విద్యలెందు
    విత్తమందుకొనగవచ్చు విద్య లెన్నొ
    అధ్యయనపూర్వకము విద్య అరయగాను.

    రిప్లయితొలగించండి
  24. గన్నవరపు నరసింహ మూర్తి అన్నారు...
    జిలేబీ వారు మంచి ప్రశ్నే వేసారు, సమాధానము వారికి తెలియదా !

    గన్నవరపు నరసింహ మూర్తి & TBS Sarma gaaru,

    'కౌంటరు' వేసి రెండు మరో రెండు కవితార్ణవాలను 'ఆనందమయః అభ్యాసాత్ !' గావిద్డా మని !

    ధన్య వాదాలండీ ఆ రెండు అద్భుత పద్యములకు !

    జిలేబి.

    రిప్లయితొలగించండి