3, మార్చి 2013, ఆదివారం

సమస్యాపూరణం – 983 (చూచెడి చూపు వెన్కఁ గల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
చూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యుఁడౌ!
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

29 కామెంట్‌లు:

  1. చూచెడు వాడు చూపులకు చూపయి చొక్కెడు వాడు నొక్కడే
    లోచన మొక్క గోళకము లోపలి చేతన మున్న వేళలో
    గోచరమౌను దృశ్యములు గోళక మొక్క నిమిత్త మాత్రమే
    చూచెడు ద్రష్ట నెద్దియును చూడగజాలదు, జ్ఞానదృష్టితో
    చూచెడు వారి కెంతయు విశుద్ధ మనమ్మున గోచరించు, నే
    జూచితినంచు బల్కుటయె చోద్యము, నేనన నాత్మయే కదా!
    చూచునె తన్ను తాననక చూడ్కుల లోనికి ద్రిప్పి యొప్పుగా
    చూచెడు చూపు వెన్కగల చూపును జూచెడువాడు ధన్యుడౌ

    రిప్లయితొలగించండి
  2. లోచనమిచ్చినాడిచట లోతగుభావననెంచుచున్ సదా
    చూచుచు నుండ నీప్రకృతి సుందర రూపమునంతమంచి యా
    లోచన చేయుచున్ జగతిలోగల యాపరమాత్మ రూపమున్
    చూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యుఁడౌ!

    రిప్లయితొలగించండి
  3. (క్రమాలంకారం)

    దాచెడు జ్ఞానమా? కనుల ధాత్రిని జూడగ దైవమీయగన్!
    దోచెడు వారలెవ్వరని తూచరె నారులు దాని జూడగన్!
    గాచెడు దేవునిన్ సకల కారకునందరి యందు లీలగా
    చూచెడు చూపు , వెన్కఁగల చూపును , జూచెడు వాడు ధన్యుఁడౌ!

    రిప్లయితొలగించండి
  4. ఆధ్యాత్మిక తత్త్వాన్ని, బాహ్య దృష్టివెనుక గల అంతర్దృష్టిని అధ్బుతమాలికగా చెప్పిన పండిత శ్రీనేమాని గురువర్యులకు వందన శతములు.

    రిప్లయితొలగించండి
  5. యద్భావం తద్భవతి . చాలా గొప్పగా చెప్పిన నేమాని గురువర్యులకు శతకోటి వందనములు.

    రిప్లయితొలగించండి
  6. కాచిన వెన్నెలన్, మిగుల కమ్మని పండ్లను, తేనె జున్నులన్,
    వీచిన గాలిలో బహుళ వెక్కసమయ్యెడు నీచ గంధముల్,
    శౌచమశౌచముల్ పరగ సాజమ టంచు, వికారమెన్నకన్
    చూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యుఁడౌ!

    రిప్లయితొలగించండి
  7. సహృదయముగా స్పందించిన మిత్రులకు శుభాశీస్సులు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. వీచెడు గాలిలో, గగన వీధిని తారల, భూధరమ్ములన్,
    పూచెడు పూలలో, జలధి పొంగుల, రమ్య వనాంతరమ్ములన్
    దాచెడు నంద చందముల దైవము! చూడగ కన్నులిచ్చె నా
    చూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యుఁడౌ!

    రిప్లయితొలగించండి
  9. భూచర ఖేచరంబులను భూజ, జలంబుల దిర్గు జీవులన్
    వీచెడు గాలి యాకసము వీలుగ నగ్నిని నీట భూమిలో
    కూచుని యన్ని చోటులను కోరక జీవము నిల్చునట్లుగా
    చూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యుఁడౌ !

    రిప్లయితొలగించండి
  10. చూచెడి వారలే జనులు స్థూలపు దృష్టిని నాశ్రయించుచున్
    చూచును పండితుండు కవి సూక్ష్మపు దృక్కుల నెల్ల వేళలన్
    చూచెడి దంతయున్ నిజము జూపదు కావున భ్రాంతి యంతయున్
    చూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యుఁడౌ!

    రిప్లయితొలగించండి
  11. Tbs శర్మ గారికి ధన్యవాదములు. వ్యసనముల గురించిన సమగ్ర సమాచారానికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ గురువులకు, మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
    ప్రణామములు!

    ఇది రావిపాటి త్రిపురాంతకుని “అంబికా శతకము”లోని పద్యం:

    లాఁచి పరాంగనల్ వరవిలాసమనోహరవిభ్రమంబులన్
    జూచినఁ జూడఁ డుత్తముఁడు; చూచినఁ జూచును మధ్యముండు; దాఁ
    జూచినఁ జూడకుండినను జూచుఁ గనిష్ఠుఁడు; నన్ను వీరిలోఁ
    జూచినఁ జూడకుండు ఘనుఁ జూచిన చూపునఁ జూడు మంబికా!

    “ఓ అంబికా! శీలవంతు డైన ఉత్తమపురుషుడు పరకాంతలు తనపై మఱులుగొని ఎంతటి విలాసవిభ్రమాలను వెలయించే చూపులతో తనను చూచినా, తాను మాత్రం వారిని చూడడు. మధ్యముడు తానై చూడకపోయినా, వారు తనను చూచినపుడు మాత్రం ఆ చూపులలో చూపు కలిపి తాను కూడా వారిని చూడకుండా ఉండలేడు. అధముడు వారు తనను చూచినా, చూడకపోయినా; తాను వారిని చూస్తున్న సంగతిని వారు చూచినా, చూడకపోయినా వారిని చూడకుండా ఉండడు.

    ఇటువంటి చూపులు గలిగిన చూపఱ యందు - తనను చూచినా చూడకుండా ఉండే దృఢచిత్తుని నీవు ఏ చూపుతో చూస్తావో - ఆ చూపుతో నన్ను దయచూడు!”

    అని భావం.

    (ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమీ వారు ప్రచురించిన నా “మహాకవి రావిపాటి త్రిపురాంతకుడు” గ్రంథం నుంచి)

    రిప్లయితొలగించండి
  13. చూచునుండు పాపుపలను జూచునుండును సద్గుణాఖ్యులన్
    చూచునుండు మంచి చెడు జూచును విశ్వపు వింతలన్నియున్
    చూచెడి వాడొకండు కను చూపుకు నందక నుండె నా
    చూచెడి చూపు వెన్కగల చూపుడు బోలెడు వాడు ధన్యుడౌ.

    రిప్లయితొలగించండి
  14. పద్యము ఉత్తమంగా ఉన్నది. భావము ఉత్తమోత్తముగా నున్నది. ఈ పద్యమును మాకు పరిచయం చేసిన ఉత్తములైన ఏల్చూరి మురళీధరరావుగారికి కృతజ్ఞతలు.
    రాస్తే ఇట్లాంటి ఉత్తమ పద్యాలు గదా వ్రాయాలనిపించేటట్లు వ్రాసిన రావిపాటి వారు ధన్యులు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
    గురువు గారు క్షమించగలరు పద్యము టైప్ చేయుటలో మీ మెసేజ్ చూడలేదు సార్

    పెద్దలుక్షమించగలరు పిచ్చి ప్రయత్నం జేయుచుంటిని
    ఎవ్వరినీ అతిగా నమ్మకూడదని
    ========*===========
    సాచిన జేతినందుగల చారలు,త్రాచుల కున్న కోరలన్,
    వీచెడి గాలి వెన్క గల వేగము,నీచుల నిద్ర మార్గమున్,
    దోచిన సొత్తు వెన్క గల దోర్లను,నేర్చిన విద్యతోడుగా
    జూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యుఁడౌ!

    రిప్లయితొలగించండి
  16. లక్ష్మీ నారాయణ గారూ మీ పద్యములో ప్రధమ,ద్వితియ పాదములలో గణ దోషములున్నవి సార్

    రిప్లయితొలగించండి
  17. పూచిన పూవు లన్నియును పూజకు నోచక నేలవ్రా లగా
    కాచిన వెన్నెలం దునను కాంతుని సోయగ మెన్న నేర్తుమే
    లోచన మందమైన దగు లోపలి గారడి దుష్ట మైన చో
    చూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యు డౌ !

    రిప్లయితొలగించండి
  18. అద్భుతమైన పూరణలు వ్రాయడానికి ప్రేరణ నిచ్చిన ఈనాటి సమస్యను పంపిన కవిమిత్రునకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
    *
    పండిత నేమాని వారూ,
    తోపెల్ల వారు చెప్పినట్లు ఆధ్యాత్మిక తత్త్వాన్ని, బాహ్య దృష్టి వెనుక గల అంతర్దృష్టిని అధ్బుతమాలికగా చేసిన పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    "బహుళ వెక్కసము" అనడమే పానకంలో పుడకలా ఉంది. "గాలిలోన కడు వెక్కసమయ్యెడు" అందామా?
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    "కూచుని" అని గ్రామ్యశబ్దాన్ని ప్రయోగించారు. అక్కడి "భూమి దృ/ గ్గోచరమైన చోటులను..." అంటే ఎలా ఉంటుంది?
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    మిత్రులు ఈ సమస్యను పంపినప్పుడే ఇది ఎక్కడో విన్నదే అనిపించింది. గుర్తుకు రాలేదు. మీ వ్యాఖ్యతో సందేహం తీరింది.
    మీ వివరణ అద్భుతంగా ఉంది. "అత్యపూర్వమైన వాక్యనిర్మితి చేత, కవిప్రౌఢోక్తిసిద్ధమైన అర్థశక్తిమూలవస్తుకృతవస్తుధ్వని వశాన, వివిధలకారాలలో సందర్భించిన క్రియారూపభేదప్రయోగమూలాన తెలుగు భాషలో సాటిలేని పరమాద్భుతమైన పద్యం. భక్తుని భక్తిసాంద్రత కంటె అతని చమత్కారచంద్రికావిలాసానికి ముచ్చటపడి భగవతి వరమీయక తప్పని వింత సన్నివేశం" మీ పరిశోధన వ్యాసంలో వ్రాసినవి అక్షరసత్యాలు.
    ధన్యవాదాలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    వరప్రసాద్ గారి వ్యాఖ్యను గమనించారి కదా..
    చూచుచునుండు పాపులను, చూచుచునుండు... ఇవి కచ్చితంగా టైపాటులే. "సద్గుణాఖ్యులన్" అన్నదానిని "సద్గుణాఢ్యులన్" అందాం.
    *
    లక్ష్మీదేవి గారూ,
    14వ శతాబ్దికి చెందిన రావిపాటి త్రిపురాంతకుడు క్రీడాభిరామమునకు మూలమైన ప్రేమాభిరామమును, త్రిపురాంతకోదాహరణము, అంబికా శతకము మొదలైన రచనలు చేసిన ప్రసిద్ధకవి. ఏల్చూరి మురళీధర రావు గారి పరిశోధన వ్యాసం "రావిపాటి త్రిపురాంతకుని కృతులు - కొన్ని కొత్త వెలుగులు" అన్నది "సుజనరంజని" జాలపత్రికలో "వాఙ్మయ చరిత్రలో వ్యాసఘట్టాలు" శీర్షికన ధారావాహికంగా ప్రచురింపబడింది. చూడండి.
    www.siliconandhra.org/nextgen/.../june12/vanmayacharitralo.html
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    "చాచిన జేతియందుగల" అనండి. "దోర్లను"?
    *
    రాజేశ్వరి అక్కయ్య గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *

    రిప్లయితొలగించండి
  19. నేమాని! పండితార్యా!యెంత మనోహరమైన దృక్కుల నావిష్కరించారండీ!

    రిప్లయితొలగించండి
  20. డా. ఏల్చూరి మురళీ ధర రావు గారూ! ధన్యవాదాలండీ.
    చాలా అపురూపమైన పద్యాన్ని దయచేశారు.

    గురువుగారూ ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి
  21. చూచు పరాయి విత్తమును జోర మతిన్ కనుగప్పి దోచగా
    జూచు పరాంగనా మణుల సోయగమున్ కుటిలంపు బుద్ధితో
    జూచెడు వారు లేరను సుషుప్తిని మున్గిన! యట్లు గాక తా
    జూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యు డౌ !

    రిప్లయితొలగించండి

  22. వరప్రసాద్ గారు గణదోషం జరిగింది గమనించలేదు
    సూచించిన మీకు కృతజ్ఞతలు

    ఈ పద్యము చూడండి

    చూచును బాపులన్ కలయ జూచును దుర్గుణ సద్గుణాధ్యులన్
    చూచును మంచి చెడ్డలను జూచును వింతలు వంత లన్నియున్
    చూచెడి వాడొకండు కను చూపుకు నందక నుండె నా
    చూచెడి చూపు వెన్కగల చూపుడు బోలెడు వాడు ధన్యుడౌ.

    the word sadgunadhyulan is not transformed into proper form.

    రిప్లయితొలగించండి
  23. మిస్సన్న గారూ,
    మీ తాజా పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. గురువుగారు,
    అనేక ధన్యవాదములు.
    సవరించిన పద్యము

    కాచిన వెన్నెలన్, మిగుల కమ్మని పండ్లను, తేనె జున్నులన్,
    వీచిన గాలిలోన కడు వెక్కసమయ్యెడు నీచ గంధముల్,
    శౌచమశౌచముల్ పరగ సాజమ టంచు, వికారశూన్యమై
    చూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యుఁడౌ!

    మీరు ఇచ్చిన లంకెలోకి వెళ్ళి ఇప్పుడే చూసినాను. ఆ లంకె సరిగ్గా తెరచుకోవడం లేదు. సరైన లంకె ఇక్కడ ఇస్తున్నాను. లంకె ఇచ్చినందుకు మీకు అనేకానేక ధన్యవాదములు.
    http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/june12/vanmayacharitralo.html

    రిప్లయితొలగించండి
  25. మాస్టారు గారూ ! అద్భుతమైన సవరణ...ధన్యవాదములు.

    భూచర ఖేచరంబులను భూజ, జలంబుల దిర్గు జీవులన్
    వీచెడు గాలి యాకసము వీలుగ నగ్నిని నీట భూమి దృ
    గ్గోచరమైన చోటులను కోరక జీవము నిల్చునట్లుగా
    చూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యుఁడౌ !

    రిప్లయితొలగించండి
  26. సౌజన్యమూర్తి మాన్యులు శ్రీ శంకరయ్య గారి ప్రోత్సాహనకు,

    కవయిత్రీతిలక లక్ష్మీదేవి గారికి,
    సుకవిమిత్రులు శ్రీ మిస్సన్న గారికి

    హృదయపూర్వక ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  27. దాచుచు బుర్కనందునను దండుగ మాలిన హైద్రబాదునన్
    వేచుచు బస్సు కోసమట వెన్నెల రేయిని పుల్కరించుచున్
    పూచిన రోజ పూవు వలె ముద్దగు మోమున రెండు కంతలన్
    చూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యుఁడౌ!

    😊

    రిప్లయితొలగించండి