2, మార్చి 2013, శనివారం

పద్య రచన – 268 (వ్యసనములు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"వ్యసనములు"

25 కామెంట్‌లు:

 1. వ్యసనములు సుఖదములని భ్రమను పెంచి
  వ్యథలు గూర్చును మార్చును బానిసలుగ
  భ్రష్ఠుల నొనర్చు చుండును ప్రభుల నేని
  వ్యసనములకు దూరమ్ముగ మసలుటొప్పు

  రిప్లయితొలగించండి
 2. పూర్వ శ్లోకము:
  ద్యూత మాంస సురా వేశ్యా ఖేట చౌర్య పరాంగనాః
  మహాపాపాని సప్తైవ వ్యసనాని త్యజేత్బుధః

  రిప్లయితొలగించండి
 3. వ్యసనముల జోలి బోకుము
  వ్యసనంబులు మార్చు మనుజు బానిస లుం గాన్
  వ్యసనము లనబడు నన్నియు
  యసమును మఱి బాడు జేసి యసువుల దీ యున్

  రిప్లయితొలగించండి
 4. అభిరుచియె యలవాటుగ నయ్యె; పిదప
  నదియె వ్యసనంబుగనుమారె , ననుదినమును
  పద్యరచన చేయుచు నున్న వారికెల్ల
  నేమి చదువరులకునైన నేమి కనగ.

  రిప్లయితొలగించండి
 5. ముందు నుద్యోగ బాధ్యత ముఖ్య మయ్య!
  అలసి రోజంత, రాత్రికి సొలసి కూడ
  పద్య మన్నది వ్రాయగ పట్టు యేల?
  వ్యసనమయ్యె ననుచు వదరు నాలి!
  పద్య మును వ్రాయ జూచుట వ్యసన మెట్లు?

  రిప్లయితొలగించండి
 6. లక్ష్మీదేవిగారు! నమస్తే! పద్యరచనమనే సద్వ్యసనానికి బానిసలయ్యామన్నవాస్తవాన్ని బాగాసెలవిచ్చారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. సహదేవ మహాశయా! నమస్తే! వదరు కన్న "అలుగు(నలుగు) " అంటే బాగుంటుంది. సతిసహకారములో కారము పాలు కూడ ఉందికదా! అది అలుక అనే అలంకారమే గాని సహకార వ్యతిరేకము గాదు. ఇంచుమించు శంకరాభరణ బ్లాగు మిత్రుల అందరి పరిస్థితిని (ఉద్యోగుల)చక్కగా సెలవిచ్చారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. మిత్రులారా!
  శుభాశీస్సులు.
  ఈనాటి విషయము -- "వ్యసనము" - నకు అనేకములగు అర్థములున్నవి. ప్రసిద్ధముగా చెడు అలవాటు అనే అర్థము వాడుకలోనున్నది. నిత్యము మనము శంకరాభరణము బ్లాగును చూచుచూ పద్యరచనము చేయుట ఒక విధమైన వ్యసనమే అయినా మనము కొంచెము దానిని ఒక సంస్కరించిన విధములో చెప్పవలసి యుంటుంది. నిజమునకు అది సాహిత్య ప్రక్రియ - శారదా దేవికి ఒక రకమైన సేవ. దాని వలన మనకు వస్తే మంచి ప్రయోజనమే వచ్చును కాని చెడు ఏమీ ఉండదు. దాని వలన భార్య/భర్త లనుండి ఎట్టి సణుగుడు రాకూడదు. అనగ అనగ రాగ మతిశ యిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనగును అని వేమన మహాకవి సెలవిచ్చేరు కదా.
  నా ఉద్దేశము:
  సరసిజ సంభవ ప్రియను సన్మతి గొల్చుటయౌను శంకరా
  భరణ ముఖమ్ములౌ క్రియలు వాస్తవమున్ దలపోయ నిత్యమున్
  సరస కవిత్వ మన్న వ్యసనమ్మగునా కవిచంద్రులార! స
  త్వరమది సభ్యకోటికిడు భవ్య ప్రసాద వరమ్ము లెన్నియో

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
  =========*==========
  వ్యసనములు గావు భాషణ,పద్య రచన,
  బాధ్యతలు మరచి దిరుగ వ్యసనమౌను|
  సుఖము గలదని మనుజులు సురను ద్రాగి
  క్రొత్త వ్యసనములు నేర్వ రోత పుట్టు ।

  రిప్లయితొలగించండి
 10. శ్రీ శర్మగారుదహరించిన సంస్కృతశ్లోకము ప్రేరణగా.........

  ధర్మంబునకురూపు ధర్మజుండొకనాడు
  జూదమందునఁ జిక్కి ఖేదమందె
  శాస్త్రపాఠంబుల చదివియు పండితుల్
  మాంసభక్షణమందు హింసగనిరి
  మద్యంబుసేవించి మైమఱచివైరులై
  యాదవకులముతానంతమొందె
  వేశ్యానురక్తిసద్విద్వాంసుతతులనే
  నాశమొందించె సన్మతివినుమిదె

  వేటనెపమున కురురాజు భీతినందె
  నహముగోల్పోయెనింద్రుడహల్యవలన
  రావణుడునాశమొందెశ్రీరాముచేత
  వ్యసనమన్నది విడనాడ వలెను గాదె.  రిప్లయితొలగించండి
 11. వ్యసనము పైకెక్కినచో
  వసనంబులు మిగులవయ్య వసుధను నరుడా !
  వ్యసనము వీడగ నిలు మ
  భ్యసనము తో బాగు పడును బ్రతుకులు కనుమా !

  రిప్లయితొలగించండి
 12. రుస రుసలు మాను పద్యము
  వ్యసనంబది కాదు వ్రాయ భామా రోజూ
  పస శంకరాభరణ మ
  భ్యసనము మాకిచ్చుగురుల వాత్సల్యముతో !

  రిప్లయితొలగించండి
 13. శ్రీ Tbs శర్మ గారికి ధన్యవాదములు. సతి అలిగిన వదిరిన నలిగిన పతి ఆరోగ్యము కోసమనే విషయము నేనెరుగుదు.ఆ భావము నా పద్యములో స్ఫురించలేదా!

  వదరిన నలిగిన యలిగిన
  కుదురగు నారోగ్య మెంచి కుములును సతియే
  పృధివిన సతి లేకుండిన
  కదిలే పుల్లిస్తరాకు కాడే మగడే?
  (చివరి రెండు పాదాల భావ తస్కరణ వేమనగారి పద్యాలనుంచి)

  రిప్లయితొలగించండి
 14. శ్రీ శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు
  నవవ్యసనములు (కళలు )కలవాడు కవి యన్నది వినియుంటీని, అది శ్రీ నేమాని వారి "వ్యసనము" నకు బాసటగా నిలుచు వాక్యమని బావించి
  ======*=======
  కవులకు పద్య మన్న మమకారము బిడ్డల వోలె, నేర్పుతో
  నవరస మందు వింతలను నాల్గురి మన్ననకై రచించు గా
  భువిని భయమ్ము వీడి కడ మూలములన్ పరికించు కర్ముడై
  నవ వ్యసనమ్ముతో సకల నష్టములన్ గను నాగరీకుడై।

  రిప్లయితొలగించండి
 15. నసపెట్టుట వ్యసనమ్మే
  వ్యసనములుగ మారిపోవు పనులే కొన్నీ !
  బిసరుహ గర్భుని కైనన్
  వ్యసనము సృజియించు టగును వాస్తవికముగా !

  ( వ్యావహారిక పదాలు కొన్ని తప్పలేదు )

  రిప్లయితొలగించండి
 16. శ్రీ నాగరాజు గారి పద్యమే కొన్ని చిన్న మార్పులతో:

  నసపెట్టుటయును వ్యసనమె
  వ్యసనములుగ మారు కొన్ని పనులు కదా యా
  బిసరుహసూతికి నైనను
  వ్యసనమ్మగు సృష్టి కార్య మనెదరు కాదే?

  రిప్లయితొలగించండి
 17. ఆలుమగలమధ్య నడ్డుగోడగనుండు
  కూడబెట్టుసొమ్ము కూసిపోవు
  ఇరుగుపొరుగువారు యీసడింతురుగదా
  వ్యసనపరుని బ్రతుకు వెతలు గాదె!

  రిప్లయితొలగించండి
 18. వ్యావహారిక పదాలను మార్చుతూ గురువర్యులు చేసిన సవరణ చాలా బాగుంది. ధన్యవాదములు గురువు గారూ !

  రిప్లయితొలగించండి
 19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 20. మాయ పొరలను గ్రమ్మిన మనుజు డపుడు
  బుద్ధి వక్రించి కర్మల బద్ధు డగుచు
  వ్యసన మందున దేలుచు వ్యధను పొంది
  బుధులు వచియించ వినకున్న చెదరు యశము !!

  రిప్లయితొలగించండి
 21. ఈనాటి పద్యరచనాంశం కొంత చర్చకు కారణమై మిత్రుల సంస్కారనంతమైన వ్యాఖ్యలతో అలరించింది. అందరికీ ధన్యవాదాలు.
  చక్కని పద్యాలను చెప్పిన కవిమిత్రులు....
  పండిత నేమాని వారికి,
  సుబ్బారావు గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  సహదేవుడు గారికి,
  వరప్రసాద్ గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  ప్రభల రామలక్ష్మి గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి,
  మరియు
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 22. వ్యత్యయమేర్పడు వ్యవహారమందున
  …… వ్యతిరేక భావాలు వ్యంజితమగు
  వ్యధ్వవ్యసనమున వ్యాసక్త వ్యగ్రుడై
  …… వ్యావర్తనము జెందు వ్యంసకుడవ
  వ్యర్థమగు ధనము వ్యాప్యము వ్యాపించు
  …… వ్యయితము సకలము వ్యధమిగులు
  వ్యవధాపితమగు నీ వ్యామోహ పాశము
  ….. వ్యక్తులందునాజ వంజమందు
  వ్యసన పరుల బ్రతుకు వసుధయందునజూడ
  చిల్లి గవ్వ లేక చిక్కి పోవ
  ధనము ప్రాణ మాన ధనము లుడిగి పోవ
  మాన లేడు వ్యసన మార్గ మెపుడు.

  రిప్లయితొలగించండి
 23. నాల్గవ పాదం చివర చిన్న సవరణతో....

  ఆలుమగలమధ్య నడ్డుగోడగనుండు
  కూడబెట్టుసొమ్ము కూసిపోవు
  ఇరుగుపొరుగువారు యీసడింతురుగదా
  వ్యసనపరుని బ్రతుకు యాతనేగ

  రిప్లయితొలగించండి