15, మార్చి 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 995 (సుతవాహనుఁ డాజిఁ గూల్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సుతవాహనుఁ డాజిఁ గూల్చె సురవైరితతిన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

14 కామెంట్‌లు:

  1. దితి సంతతి వరమహిమ
    న్నతి వైరముఁ దాల్చి సురలనాటాడించెన్
    వెతలనుఁ దీర్పగ వినతా
    సుతవాహనుఁ డాజిఁ గూల్చె సురవైరితతిన్.

    రిప్లయితొలగించండి



  2. హితుడై యమరుల పాలిట
    శతమఖునకు దోడు నిలచి చక్రపు హతులన్
    దితి శోకింపగ వినతా
    సుతవాహనుఁ డాజిఁ గూల్చె సురవైరితతిన్.

    రిప్లయితొలగించండి
  3. అతిభీకరమగు యుద్ధ
    క్షితి రాముడు హనుమ భుజము జేరి తనరుచున్
    దితిజ భయంకరుడు పవన
    సుతవాహను డాజి గూల్చె సురవైరి తతిన్

    రిప్లయితొలగించండి
  4. క్షితి నతి వెతలను వెట్టెడు
    దితిసుతులను హుతము జేయ దేవతలడుగన్
    కతలను విని తా వినతా
    సుతవాహనుఁ డాజిఁ గూల్చె సురవైరితతిన్.

    రిప్లయితొలగించండి
  5. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పద్యము చిన్న చిన్న సవరణలతో:

    క్షితి పలు వెతలను బెట్టెడు
    దితిసుతులను గూల్చుమనుచు దేవతలడుగన్
    ధృతి నిడి వారికి వినతా
    సుత వాహను డాజి గూల్చె సురవైరి తతిన్

    రిప్లయితొలగించండి
  6. నా పూరణకు చక్కని సవరణలు చేసిన శ్రీ నేమాని వారికి ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  7. ధృతమతియై శ్రీరాముడు
    సతిసీతారక్షణమను సంకల్పముచే
    హతమొందించగననిలా
    సుతవాహనుఁ డాజిఁ గూల్చె సురవైరితతిన్.

    రిప్లయితొలగించండి
  8. దితి సూనులు విచ్చల విడి
    పతి దేవుల సంహ రించ భామలు వేడన్
    అతులిత మహితుడు , నంజలి
    సుత వాహను డాజి గూల్చె సుర వైరి తతిన్

    రిప్లయితొలగించండి
  9. శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ!
    శుభాశీస్సులుమీ పద్యము 3వ పాదములో అనిలా సుతుడు అనే ప్రయోగమునకు బదులుగా మారుత సుతుడు అని సవరించితే బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. గతి దప్పిన దితి పుత్రులు
    సతతము దేవతలతోడ సమర మొనర్చన్
    అతి క్రోధనుడై వినతా
    సుత వాహను డాజి గూల్చె సురవైరి తతిన్

    రిప్లయితొలగించండి
  11. క్షితిజాపహరణఁజేసియు
    మితి మీరిన రావణుండు మృత్యువు గోరన్
    అతిభీకర పోరుననిల
    సుతవాహనుఁడాజిఁ గూల్చె సురవైరితతిన్

    రిప్లయితొలగించండి
  12. దితి పుత్రుం డమరావతి
    నతి బలిమిని యాక్రమించి యారడి వెట్టన్ !
    బ్రతి మాలగ నదితి వినతా
    సుత వాహనుఁ డాజిఁ గూల్చె సుర వైరితతిన్ !

    రిప్లయితొలగించండి
  13. ఈనాటి సమస్యకు చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు....
    లక్ష్మీదేవి గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    సహదేవుడు గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ మూడవ పాదంలో గణదోషం. "బ్రతిమాలగ"లో ’గ’ తొలగిస్తే సరి.

    రిప్లయితొలగించండి




  14. సతి సత్యభామదొడ్కొని
    యతి,సాధుజనులను బ్రోవ నా నరకునిపై
    ధృతితో వెడలెను ,వినతా
    సుతవాహనుడాజి గూల్చె సురవైరితతిన్ .

    రిప్లయితొలగించండి