ఉంటాయి కవిత రూపేణ డు ము వు లు మాత్రమే పంచ దశ లోక ఈ-కామెంటు లో ఏదో మాకు తెలిసిన నాలుగు మాటల కూర్పు ఇది,స్వీకరించు డీ ఉడుతా భక్తీ మీ ప్రయత్నానికి మాదిన్నూ ఇది !
అయ్యా! శ్రీ నాగరాజు గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. 1వ పాదములో యడాగమము చేసేరు. (యుపకార) 3వ పాదములో నుగాగమము చేసేరు (నైనను) ఈ రెండిటిని మార్చి మీ పద్యమును ఇలాగ దిద్దేను:
శ్రీ శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని వారికి పాదాభివందనము జేయుచు ========*=========== శంకరాభరణము నేడు సత్కవులకు నిలయమై పొంకముగను పద్య రాశి పొర్లు చుండ నుడుతనై శంకరయ్య గురువుగారి చరణములకు మ్రొక్కుచున్ సంకు బట్టి సేవ జేతు సరగున కడు ముదమునన్। (సంకు = కలము)
ఉడుత రామ భక్తితో తాశక్యముగాని పని అయినా ఎంతో ఉత్సాహంతో ఆ పరమ పవిత్ర వారధి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనినదన్న వృత్తాంతమును నాబోటి బుడుతల కు “ఉత్సాహ” వృత్తంలో ఉత్సాహాన్ని నింపిన శ్రీ నేమాని గురువర్యులకు నమస్సులతో సుగంధగర్భోత్సాహము గొప్ప వారు చేయు గొప్ప గొప్ప కార్య మందునన్ చెప్ప కుండ చేయు చుంద్రు చేరి వారి తోడుగన్ చెప్ప రాదె బుడుత యుడుత చేరె వార్ధి కట్టగన్ అప్పు డంత రామ చంద్రు డామె నిమిరె ప్రేమతో.
వాన రమ్ము లన్ని గలసి వార్ధి దాట గోరు చున్ మాన సంబు నందు నెంచి మంచి మడవ వేయ గా తాను గూడ సేవ జేయ దలచి నుడుత భక్తి తోన్ పూను కొనుచు నిసుక దెచ్చి పుణ్య ఫలము నొందె గా !
శ్రీ వర ప్రసాద్ గారికి ధన్య వాదములు క్షమిం చాలి . గణ దోషములు వివరించ గలరు.
రాజేశ్వరి అక్కయ్యగారూ! నమస్తే. మీకంద పద్యంలో 1,2 పాదాల్లో 2,3 రగణం, నగణం వేశారు. అందుకే వరప్రసాద్ గారు గణభంగాలను సవరించమన్నారు. ఇక మీరు శ్రీనేమాని పండితులిచ్చిన ఉత్సాహానికి ఉత్సహించి 'ఉత్సాహం' లో చెప్పిన పద్యం చాల బాగున్నది. అభినందనలు.
సోదరులు శ్రీ తోపెల్ల వారికి , వర ప్రసాదు గారికి ధన్య వాదములు . మన్నించాలి మరి " నల నగ సల బరతలు " అన్నీ ఇంద్ర గణము లే కదా ? అలా వ్రాయ కూడదా ? దయ చేసి తెలుప గలరు
మంచి పద్యాలను రచించిన కవిమిత్రులు.... గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, పండిత నేమాని వారికి, నాగరాజు రవీందర్ గారికి, సుబ్బారావు గారికి, సహదేవుడు గారికి, రాజేశ్వరి అక్కయ్య గారికి, డా. ప్రభల రామలక్ష్మి గారికి, వరప్రసాద్ గారికి, తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారికి, శ్యామల రావు గారికి, అభినందనలు, ధన్యవాదాలు. * సాహిత్యాభిమాని గారూ, మీ హిందీ శార్దూల ప్రయోగం చాలా బాగుంది. అభినందనలు. మొదటి పాదంలో గణదోషం ఉంది. "ఆరాము సే బాత్ కరో... లేదా... ఆరామ్ సె బాతేఁ కరో" అనవచ్చు. తుమ్హార... గణంకోసం .. తుమార అయింది. భర్‌పూర్.. భరపూర్ అయింది... అక్కడ ఉత్వవిశిష్టంగా... భరుపూర్ అందాం. "వాఁకీ రహనా" అర్థం కాలేదు.
రిప్లయితొలగించండిఉంటాయి కవిత రూపేణ డు ము వు లు మాత్రమే
పంచ దశ లోక ఈ-కామెంటు లో ఏదో మాకు తెలిసిన
నాలుగు మాటల కూర్పు ఇది,స్వీకరించు డీ
ఉడుతా భక్తీ మీ ప్రయత్నానికి మాదిన్నూ ఇది !
జిలేబి.
జిలేబి.
భక్తి గలుగు పనుల భగవంతుడే మెచ్చు
రిప్లయితొలగించండిభగవదర్పణమని వదలి వేయ
విసుచెందకుండ నిసుక వేయ నుడుత
వీపు నిమర లేద విశ్వ విభుడు.
ఉడుత రామభక్తిలోన నొప్పుచుండు నెప్పుడున్
రిప్లయితొలగించండికడలిపైని రామదండు కట్టుచుండ సేతువున్
వడిగ వడిగ తాను కూడ వచ్చి గూర్చె సాయమా
బుడుత యుడుత రాము చేతి ముద్రలొందె ప్రేమతో
ఉడుత చేసె నాడు యుపకార మొక్కటి
రిప్లయితొలగించండిసేతు బంధనమ్ము చేయు నపుడు
చేసెడు పని యెంత చిన్నదే నైనను
చిత్తశుద్ది తోడ చేయవలెను
అయ్యా! శ్రీ నాగరాజు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది.
1వ పాదములో యడాగమము చేసేరు. (యుపకార)
3వ పాదములో నుగాగమము చేసేరు (నైనను)
ఈ రెండిటిని మార్చి మీ పద్యమును ఇలాగ దిద్దేను:
ఉడుత చేసె దొలుత నుపకారమొక్కటి
సేతుబంధనమ్ము జేయునపుడు
చేసెడు పని యెంత చిన్నదే యైనను
చిత్త శుద్ధితోడ చేయవలెను
స్వస్తి
సాహిత్యాభిమాని గారూ వినూత్న ప్రయోగాన్ని పరిచయం చేశారు. అందులో ఆరాము, బాత్ చీత్ బందు , అని సరి చేస్తే సరి.
రిప్లయితొలగించండిగురువు గారికి నమస్కారములు. యడాగ నుగాగమములను సరిదిద్ది నందులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఉడతా భక్తని బిలుతురు
రిప్లయితొలగించండిఅడకువ తో జేయు బనిని, నల్పము నైనన్
కడలికి వారధి యప్పుడు
ఉడుత యునుం వేసె యిసుక నుత్సా హము తోన్ .
చేత నైనంత సాయమ్ము చేయ శుభము
రిప్లయితొలగించండియుడుత వారధిఁగట్ట చేయూత నిచ్చి
వాసికెక్కెను లోకాన ప్రభువు మెచ్చ
చారలే సాక్ష్యముగ నిల్చె శాశ్యతముగ
కడలిని సేతు బంధనము
రిప్లయితొలగించండినుడుతయె భక్తి మీరగను నుత్సాహాము గన్ !
వెడలుచు తోకతొ నిసుకను
వడి వడిగా ముంచి తెచ్చె వానరు చెంతన్ !
అడుగక చేసిన హితముకు
రిప్లయితొలగించండికడు సంతసుడయ్యె గాదె కపిరథుడెంతో
విడువక చేసిన సాయము
ఉడుతలవంశానికెంతొ ఉన్నతి తెచ్చెన్.
శ్రీ శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని వారికి పాదాభివందనము జేయుచు
రిప్లయితొలగించండి========*===========
శంకరాభరణము నేడు సత్కవులకు నిలయమై
పొంకముగను పద్య రాశి పొర్లు చుండ నుడుతనై
శంకరయ్య గురువుగారి చరణములకు మ్రొక్కుచున్
సంకు బట్టి సేవ జేతు సరగున కడు ముదమునన్।
(సంకు = కలము)
శ్రీ రాజేశ్వరి గారు మీ పద్యములో గణ భంగములు జరిగినవి సరిజేయగలరు
రిప్లయితొలగించండిఉడుత రామ భక్తితో తాశక్యముగాని పని అయినా ఎంతో ఉత్సాహంతో ఆ పరమ పవిత్ర వారధి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనినదన్న వృత్తాంతమును నాబోటి బుడుతల కు “ఉత్సాహ” వృత్తంలో ఉత్సాహాన్ని నింపిన శ్రీ నేమాని గురువర్యులకు నమస్సులతో
రిప్లయితొలగించండిసుగంధగర్భోత్సాహము
గొప్ప వారు చేయు గొప్ప గొప్ప కార్య మందునన్
చెప్ప కుండ చేయు చుంద్రు చేరి వారి తోడుగన్
చెప్ప రాదె బుడుత యుడుత చేరె వార్ధి కట్టగన్
అప్పు డంత రామ చంద్రు డామె నిమిరె ప్రేమతో.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగోన బుధ్ధారెడ్డి తాను చేసిన రామ
రిప్లయితొలగించండికథను కొన్ని చిత్ర కథల గూర్చె
సేతుబంధనంబు సేయ వేళ నుడుత
సాయపడుట గూర్చి చాటి చెప్పె
వాన రమ్ము లన్ని గలసి వార్ధి దాట గోరు చున్
రిప్లయితొలగించండిమాన సంబు నందు నెంచి మంచి మడవ వేయ గా
తాను గూడ సేవ జేయ దలచి నుడుత భక్తి తోన్
పూను కొనుచు నిసుక దెచ్చి పుణ్య ఫలము నొందె గా !
శ్రీ వర ప్రసాద్ గారికి ధన్య వాదములు క్షమిం చాలి . గణ దోషములు వివరించ గలరు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాజేశ్వరి అక్కయ్యగారూ! నమస్తే. మీకంద పద్యంలో 1,2 పాదాల్లో 2,3 రగణం, నగణం వేశారు. అందుకే వరప్రసాద్ గారు గణభంగాలను సవరించమన్నారు. ఇక మీరు శ్రీనేమాని పండితులిచ్చిన ఉత్సాహానికి ఉత్సహించి 'ఉత్సాహం' లో చెప్పిన పద్యం చాల బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిసోదరులు శ్రీ తోపెల్ల వారికి , వర ప్రసాదు గారికి ధన్య వాదములు . మన్నించాలి మరి " నల నగ సల బరతలు " అన్నీ ఇంద్ర గణము లే కదా ? అలా వ్రాయ కూడదా ? దయ చేసి తెలుప గలరు
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికడలిని దాటుట కొరకని
రిప్లయితొలగించండివడి వడిగా తోక ముంచి వానరు వెంటన్ !
నడయాడి నిసుక చేకొనె
నుడుతయె కడు భక్తి మీర నుత్సాహము గన్ !
సోదరులకు మనవి. బహుశ ఇప్పుడు సరి పోతుం దను కుంటాను
శ్రీమతి రాజేశ్వరి గారి ఉత్సాహ వృత్తము చాల బాగుగా వచ్చినది. సంతోషము. అభినందనలు.
రిప్లయితొలగించండిపూజ్య గురువులకు ధన్య వాదములు
రిప్లయితొలగించండిమంచి పద్యాలను రచించిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
నాగరాజు రవీందర్ గారికి,
సుబ్బారావు గారికి,
సహదేవుడు గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
డా. ప్రభల రామలక్ష్మి గారికి,
వరప్రసాద్ గారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారికి,
శ్యామల రావు గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
*
సాహిత్యాభిమాని గారూ,
మీ హిందీ శార్దూల ప్రయోగం చాలా బాగుంది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం ఉంది. "ఆరాము సే బాత్ కరో... లేదా... ఆరామ్ సె బాతేఁ కరో" అనవచ్చు.
తుమ్హార... గణంకోసం .. తుమార అయింది.
భర్‌పూర్.. భరపూర్ అయింది... అక్కడ ఉత్వవిశిష్టంగా... భరుపూర్ అందాం.
"వాఁకీ రహనా" అర్థం కాలేదు.
రాజేశ్వరి నేదునూరి గారూ -- చివరికి మీ "ఉడుతభక్తి" ఉడుతాభక్తుల సహాయంతో బ్రహ్మాండంగా వచ్చింది.
రిప్లయితొలగించండికడలిని దాటుట కొరకని
వడి వడిగా తోక ముంచి వానరు వెంటన్ !
నడయాడి నిసుక చేకొనె
నుడుతయె కడు భక్తి మీర నుత్సాహము గన్ !
శ్రీ లక్క రాజుగారికి ధన్య వాదములు
రిప్లయితొలగించండి