25, మార్చి 2013, సోమవారం

పద్య రచన – 291 (హస్తి మశకాంతరము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“హస్తి మశకాంతరము”

18 కామెంట్‌లు:

 1. ఇరు పక్షంబులు కల్గి యాకసములో నెంతో ప్రమోదమ్ముతో
  దిరుగున్ దోమ గజమ్మెగురునే? తేడాలు చూడన్ బళా!
  కరినే మించును దోమ మున్నెరుగవే కంజాక్షుడే దోమయై
  సురభిత్ గుండియలోన దాగెను కదా చోద్యంబుగా భీతితో

  రిప్లయితొలగించండి
 2. హస్తిని జూచుచు మశకము
  నాస్తియె తేడాలనియెను నాకూ కరికిన్
  చూస్తే యంగము లొకటే
  జాస్తియె మరి రెక్కలేమొ సైసై నాకే.

  రిప్లయితొలగించండి
 3. మస్తుగ వెదకితి రచనకు
  వస్తువు కానంగ లేను వ్రాయగ కవితల్ !
  మస్తకము మట్టి నిండగ
  హస్తికి మశకము నకెటుల సారూప్య మగున్ ?

  వస్తువు = కధా వస్తువు

  రిప్లయితొలగించండి
 4. హస్తి మశ కాం తరము నర య దె లి సె మ ఱి
  బహుళ కాయంబు హస్తిది , మశక మౌర !
  సూ క్ష్మ దేహంబు రె క్కలు జూడ జాస్తి
  హస్తి మశకంబున కిదియ యంత రంబు

  రిప్లయితొలగించండి
 5. నా పద్యములో "సురభిత్ గుండియ లోన" అని సమాసము పొరపాటు. దానిని ఇలాగ సవరించుదాము: "సురభిన్మానస మందు" అని: స్వస్తి

  రిప్లయితొలగించండి
 6. రచనః డా .యస్వీ రాఘవేంద్ర రావు.( సుమశ్రీ యస్వీఆర్ )

  నాటి గురుశిష్యులకును నీనాటివారి
  కమరియున్నట్టి సంబంధ మరసిచూడ
  హస్తి మశకాంతర మన గాదతిశయోక్తి
  యట్లు దిగనాడుటకు హేతు వరయవయ్య !

  రాజకీయములకు సుదూరముగనుండి
  బోధనము నెంచి నీ లక్ష్య సాధనముగ
  పౌరులు, ప్రభుత్వమును, సురవరులు మెచ్చ
  నందఱికి తలలోనాల్కవగుచు మనుము.

  సేకరణ : సాహిత్యాభిమాని

  రిప్లయితొలగించండి
 7. నక్కకును నాగ లోకమునకును వలెనె
  సామ్య మెక్కడ దోమకు సామజమున
  కు ?! గన దోమ రేణువు హస్తి కొండ పగిది
  హస్తి మశకాంతర మనగ నర్థ మిదియె

  రిప్లయితొలగించండి
 8. రవీందర్ గారూ! బాగున్నది మీ పూరణ . నాగ లోకము కాకుండగ నాక లోకము ( స్వర్గలోకము)అని పెద్దలు చెప్పిన గుర్తు. పరిశీలింప మనవి.

  రిప్లయితొలగించండి
 9. ధన్యవాదాలు శర్మ గారూ ! మీరన్నట్లు నాకలోకమే యై ఉంటుంది. నాకు సరిగా గుర్తు లేదు.

  రిప్లయితొలగించండి
 10. ఏ మూలకు సరిపోనని
  నేమని, మురళీ, గురువుల నేర్పును జూడన్
  నా మతికిఁ దోచె, పటిమన
  మా మధ్యన పోల్చఁ హస్తి మశకాంతరమౌ!
  (గురువుల = శంకరార్యుల)

  రిప్లయితొలగించండి
 11. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  హస్తి మశకాంతరమనగ
  వ్యస్తమనంబున విరాట వల్లభ కొలువున్
  హస్తిన వీడుచు చేరిరి
  ప్రస్తుత కాలము గడువగ పాండవ వీరుల్.

  రిప్లయితొలగించండి
 12. హస్తి మశకముల నడుమ నంతరమ్ము
  జూచు చుందుము; శంభునిఁ జూడుమయ్య;
  హస్తికిని లూతకునయిననంతరమ్ము
  గానలేదయ్య ; మోక్షపు కాంక్షఁ దీర్చె.

  రిప్లయితొలగించండి
 13. నాటి విద్యలిచ్చె నయమగు జ్ఞానంబు
  నేడు కొదువయయ్యెనేమి చెపుదు?
  అక్షరములకూడ యెరుగంటె నంటిరి
  అంతరమ్ము పెరిగె హస్తి..నుసుమ||
  ( నుసుమ = దోమ ).

  రిప్లయితొలగించండి
 14. నాటి పాలకులందించెనమిత సుఖము
  నేటి పాలకులకులేదు నీతి ఏమి
  హస్తిమశకాంతరమనగాదతిశయోక్తి
  నీతిమాలిన చోటుల శాంతి యేల?

  రిప్లయితొలగించండి
 15. అమ్మా! శ్రీమతి రామలక్ష్మి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. ఈ పాదములో ప్రాసయతి నియమము పాటింపబడలేదు:
  "నీతి మాలిన చోటుల శాంతి లేదు"
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. నేటి అంశంపై మంచి మంచి పద్యాలను వ్రాసిన కవిమిత్రులు....
  పండిత నేమాని వారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  సుబ్బారావు గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  సహదేవుడు గారికి,
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  డా. ప్రభల రామలక్ష్మి గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 17. శ్రీపండిత నేమాని గురువులకు ధన్యవాదాలు.

  నాటి పాలకులందించెనమిత సుఖము
  నేటి పాలకులకులేదు నీతి ఏమి
  హస్తిమశకాంతరమనగాదతిశయోక్తి
  నీతి మాలిన చోటుల శాంతి లేదు

  రిప్లయితొలగించండి