జ్ఞాన విజ్ఞాన తేజోనిధానులైనప్రముఖు లెందరో యుండగ భరత భూమిపాలన మనర్హులగువారి పాల బడుటఅడవి గాచిన వెన్నెల యయ్యె ప్రతిభ
ప్రభుత ఖర్చు చేయు నిధులు పథకములని ప్రజల సొమ్ము సద్వినియోగ పఱుచ వలెనుఅడవి గాచిన వెన్నెల యయ్యె నన్ని పేదవాడికి యందవు పెట్టుబడులు
అడవిని గాచిన వెన్నెలకడలిని వైచిన ధనమును, కలలో గాంచంబడిన పదోన్నతి, నేలన్బడిన ఘృతంబును వృథయగు; భద్రము సుమ్మా!
నేటి కాలములో ఫట్టణాలలో కాచిన వెన్నెలే "అడవిని గాచిన వెన్నెల"... నిజానికి పట్టణాలలో కంటే అడవిలో కాచిన వెన్నెలే యెక్కువ ఉపయోగమని నా అభిప్రాయం. ఆడవిని గాచిన వెన్నెల అడగకనే మూలికలకు నతి శక్తిచ్చున్ ఆడుగిడ వెన్నెల పురినె వ్వడు పట్టించు కొనడు "బల్బుల " ద్యుతి లో.
తట్టు కోలేక బాధలు మెట్టి నింటతోడ బుట్టిన వారును దోడు లేకనీ దు జీ విత మునకట నీ ల వేణి !అడవి గాచిన వెన్నెల యయ్యె నేడు .
శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతోకోట్లు వెచ్చించి త్రవ్విరి గోతు లెన్నొవచ్చు నదెయె పోలవరపు పథక మనుచునెప్పు డగునన్న తెలియగ చెప్పలేముఅడవి గాచిన వెన్నెల యగుచు నేడు.
శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతోమంచి సూక్తులనెన్ని మారులు మచ్చికన్………. మూర్ఖుని ముందర ముచ్చటింపదురభిమాన దురిత నిరతాగ్ర హుని కెంత………. ధర్మ నీతులు జెప్ప ధరణి యందుమాధుర్యధుర్యమౌ మహిమాన్విత రాగ ………. ములు పాడగ ననేడ మూకుని యెడ లతికాంత తనువున లావణ్య మొప్పెడు………. సతివిలాసము దివ్య చక్షువు నెడబురద గుంటను పన్నీరు పోయగానుమనసు లేని చట్టములన్ని మగువ కొరకునీతి లేని మాటలుచెప్పు నేత లంత అడవి గాచిన వెన్నెల యందురిలను.
’అడవి గాచిన వెన్నెల’పై మంచి పద్యాలను రచించిన కవిమిత్రులు...పండిత నేమాని వారికి, నాగరాజు రవీందర్ గారికి, లక్ష్మీదేవి గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, సుబ్బారావు గారికి, తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికిఅభినందనలు, ధన్యవాదములు.*గోలి వారూ, ’శక్తి నిచ్చున్’ అనవలసి ఉంటుంది. అక్కడ "శక్తి నిడున్" అందాం.*సుబ్బారావు గారూ, ’జీవితము నకట’ కంటె "జీవిత మ్మక్కటా" అంటే (పద్యం నడక) బాగుంటుందని నా సూచన.
ఉల్ల మలరించు వెన్నెల జల్లు కురియ చల్ల నగు చంద్ర కాంతుల సౌరు గనరు పిల్ల తెమ్మెర తనువుకు నొల్ల దనిన యడవి గాచిన వెన్నెల కడలి పాలు !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్రీ తోపెల్ల శర్మ గారు 2 చక్కని పద్యములను వెలువరించిరి. అభినందనలు. సీస పద్యములో "మాధుర్య ధుర్యమౌ మహిమాన్విత రాగ" అనుటలో 4వ ఇంద్రగణములో ఒక మాత్ర వెలితిగ నున్నది. స్వస్తి.
శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతోతమరి సూచనానంతర సవరణతోమంచి సూక్తులనెన్ని మారులు మచ్చికన్………. మూర్ఖుని ముందర ముచ్చటింపదురభిమాన దురిత నిరతాగ్ర హుని కెంత………. ధర్మ నీతులు జెప్ప ధరణి యందుమాధుర్యధుర్యమౌ మహిమాన్విత సరాగ ………. ములు పాడగ ననేడ మూకుని యెడ లతికాంత తనువున లావణ్య మొప్పెడు………. సతివిలాసము దివ్య చక్షువు నెడబురద గుంటను పన్నీరు పోయగానుమనసు లేని చట్టములన్ని మగువ కొరకునీతి లేని మాటలుచెప్పు నేత లంత అడవి గాచిన వెన్నెల యందురిలను.
మగడు మెచ్చని యందమ్ము,మరులులేని కాపురము,వర్షపాతమ్ము కడలి యందు, దానగుణమింత లేనట్టి ధనపు రాశి, అడవి గాచిన వెన్నెల యగును గాదె.
బ్లాగారణ్యం లో పుష్పించిన ఈ పద్మాలు కామెంటు ల తో భాషించిన ఈ కమలాలు కాలగతి లో గూగుల్ వాడు గుటకాయ స్వాహా అంటే మరి అడవి గాచిన వెన్నెల గాక మునుపే - అయ్యలారా జర జాగ్రత్త పడి వేరే మాధ్యమం లో వీటిని జాగ్రత్త పరచడానికి కూడా చూడండి !జిలేబి .
జ్ఞాన విజ్ఞాన తేజోనిధానులైన
రిప్లయితొలగించండిప్రముఖు లెందరో యుండగ భరత భూమి
పాలన మనర్హులగువారి పాల బడుట
అడవి గాచిన వెన్నెల యయ్యె ప్రతిభ
ప్రభుత ఖర్చు చేయు నిధులు పథకములని
రిప్లయితొలగించండిప్రజల సొమ్ము సద్వినియోగ పఱుచ వలెను
అడవి గాచిన వెన్నెల యయ్యె నన్ని
పేదవాడికి యందవు పెట్టుబడులు
అడవిని గాచిన వెన్నెల
రిప్లయితొలగించండికడలిని వైచిన ధనమును, కలలో గాంచం
బడిన పదోన్నతి, నేలన్
బడిన ఘృతంబును వృథయగు; భద్రము సుమ్మా!
నేటి కాలములో ఫట్టణాలలో కాచిన వెన్నెలే "అడవిని గాచిన వెన్నెల"... నిజానికి పట్టణాలలో కంటే అడవిలో కాచిన వెన్నెలే యెక్కువ ఉపయోగమని నా అభిప్రాయం.
రిప్లయితొలగించండిఆడవిని గాచిన వెన్నెల
అడగకనే మూలికలకు నతి శక్తిచ్చున్
ఆడుగిడ వెన్నెల పురినె
వ్వడు పట్టించు కొనడు "బల్బుల " ద్యుతి లో.
తట్టు కోలేక బాధలు మెట్టి నింట
రిప్లయితొలగించండితోడ బుట్టిన వారును దోడు లేక
నీ దు జీ విత మునకట నీ ల వేణి !
అడవి గాచిన వెన్నెల యయ్యె నేడు .
శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండికోట్లు వెచ్చించి త్రవ్విరి గోతు లెన్నొ
వచ్చు నదెయె పోలవరపు పథక మనుచు
నెప్పు డగునన్న తెలియగ చెప్పలేము
అడవి గాచిన వెన్నెల యగుచు నేడు.
శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండిమంచి సూక్తులనెన్ని మారులు మచ్చికన్
………. మూర్ఖుని ముందర ముచ్చటింప
దురభిమాన దురిత నిరతాగ్ర హుని కెంత
………. ధర్మ నీతులు జెప్ప ధరణి యందు
మాధుర్యధుర్యమౌ మహిమాన్విత రాగ
………. ములు పాడగ ననేడ మూకుని యెడ
లతికాంత తనువున లావణ్య మొప్పెడు
………. సతివిలాసము దివ్య చక్షువు నెడ
బురద గుంటను పన్నీరు పోయగాను
మనసు లేని చట్టములన్ని మగువ కొరకు
నీతి లేని మాటలుచెప్పు నేత లంత
అడవి గాచిన వెన్నెల యందురిలను.
’అడవి గాచిన వెన్నెల’పై మంచి పద్యాలను రచించిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
నాగరాజు రవీందర్ గారికి,
లక్ష్మీదేవి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి
అభినందనలు, ధన్యవాదములు.
*
గోలి వారూ,
’శక్తి నిచ్చున్’ అనవలసి ఉంటుంది. అక్కడ "శక్తి నిడున్" అందాం.
*
సుబ్బారావు గారూ,
’జీవితము నకట’ కంటె "జీవిత మ్మక్కటా" అంటే (పద్యం నడక) బాగుంటుందని నా సూచన.
ఉల్ల మలరించు వెన్నెల జల్లు కురియ
రిప్లయితొలగించండిచల్ల నగు చంద్ర కాంతుల సౌరు గనరు
పిల్ల తెమ్మెర తనువుకు నొల్ల దనిన
యడవి గాచిన వెన్నెల కడలి పాలు !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ తోపెల్ల శర్మ గారు 2 చక్కని పద్యములను వెలువరించిరి. అభినందనలు. సీస పద్యములో "మాధుర్య ధుర్యమౌ మహిమాన్విత రాగ" అనుటలో 4వ ఇంద్రగణములో ఒక మాత్ర వెలితిగ నున్నది. స్వస్తి.
రిప్లయితొలగించండిశ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండితమరి సూచనానంతర సవరణతో
మంచి సూక్తులనెన్ని మారులు మచ్చికన్
………. మూర్ఖుని ముందర ముచ్చటింప
దురభిమాన దురిత నిరతాగ్ర హుని కెంత
………. ధర్మ నీతులు జెప్ప ధరణి యందు
మాధుర్యధుర్యమౌ మహిమాన్విత సరాగ
………. ములు పాడగ ననేడ మూకుని యెడ
లతికాంత తనువున లావణ్య మొప్పెడు
………. సతివిలాసము దివ్య చక్షువు నెడ
బురద గుంటను పన్నీరు పోయగాను
మనసు లేని చట్టములన్ని మగువ కొరకు
నీతి లేని మాటలుచెప్పు నేత లంత
అడవి గాచిన వెన్నెల యందురిలను.
రిప్లయితొలగించండిమగడు మెచ్చని యందమ్ము,మరులులేని
కాపురము,వర్షపాతమ్ము కడలి యందు,
దానగుణమింత లేనట్టి ధనపు రాశి,
అడవి గాచిన వెన్నెల యగును గాదె.
రిప్లయితొలగించండిమగడు మెచ్చని యందమ్ము,మరులులేని
కాపురము,వర్షపాతమ్ము కడలి యందు,
దానగుణమింత లేనట్టి ధనపు రాశి,
అడవి గాచిన వెన్నెల యగును గాదె.
రిప్లయితొలగించండిబ్లాగారణ్యం లో పుష్పించిన ఈ పద్మాలు
కామెంటు ల తో భాషించిన ఈ కమలాలు
కాలగతి లో గూగుల్ వాడు గుటకాయ స్వాహా
అంటే మరి అడవి గాచిన వెన్నెల గాక మునుపే -
అయ్యలారా జర జాగ్రత్త పడి వేరే మాధ్యమం లో వీటిని జాగ్రత్త పరచడానికి కూడా చూడండి !
జిలేబి .