అయ్యా! శ్రీ శ్యామల రావు గారూ! శుభాశీస్సులు. మీకు పు - ము ల యతి మైత్రి గురించి సందేహము నివృత్తి కొరకు "పోలిక యతి" లక్షణములను ఒకమారు తిరగ వెయ్యండి. స్వస్తి.
"శంకరాభరణం" ముఖతః మీరు పరిచయం చేసిన మీ "శ్యామలీయం" బ్లాగులోని షట్పదులను గూర్చిన వ్యాసం బాగున్నది.దానిని ఇంకా సమగ్రీకరింపవలసి ఉన్నదని మీరే అన్నారు.
షట్పదికి కావ్యగౌరవం లేకేమి? శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి "జనప్రియ రామాయణం" ఉన్నదిగా! ఇంకా ఇతరుల రచనలనేకం ఉన్నాయి. దయచేసి తత్తత్ప్రయోగాలను మీ విమర్శనార్థం తప్పక పరిశీలించండి.
యతి అంటే పద్యమును చదువు చున్నప్పుడు గుక్క త్రిప్పుకొనుటకు తీసుకొను విరామము. సంస్కృతములో యతి స్థానము వద్ద ముందరి పదము పూర్తయి యతి తరువాత వేరొక పదముతో మొదలిడును. మన తెలుగు భాషలో యతి స్థానములో యతిమైత్రి కల అక్షరమును వేసినచో చాలును. సంస్కృతములో 10 అక్షరములకు తక్కువ యున్న పాదములో యతి అవసరములేదు. తెలుగులో ముత్యాలసరాలు ఛందస్సులో యతిలేదు. అలాగే కంద పద్యము 1, 3 పాదములలో యతి లేదు. అందుచేత యతి నియమము చెప్పబడని చోటులలో మనము సంస్కృతము ప్రకారము 10 అక్షరములు దాటిన పాదములలో మాత్రమే యతి తప్పని సరిగా వేసుకొనుచు, చిన్న పాదములలో ఐఛ్ఛికముగా వేయవచ్చును/లేక/విడిచిపెట్ట వచ్చును. స్వస్తి.
మిత్రులారా! శుభాశీస్సులు. శ్రీ శంకర భగవత్పాదులు రచించిన శివానందలహరి స్తోత్రములో శివ ధ్యానమనే వసంత ఋతువు భక్తుని మనస్సనే పూలదోటను చేరిన ప్రకారము వర్ణింపబడినది. ఆ శ్లోకమును, దానికి అనువాదరూపమగు నా పద్యమును ఈ క్రింద వ్రాసితిని. తిలకించండి:
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు & శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు. అనుప్రాసలకు శబ్దాలంకారములకు పెద్దపీట వేయుట బుధుల ప్రశంసల నందుకొనదు. అర్థాలంకారములకే ఎక్కువ విలువ ఈయబడును. మీరు గమనించి ఆచరించండి.
శ్రీనేమానివారు యతిని గురించి ప్రస్తావించినారు. సంస్కృతములో (కన్నడములో కూడ) విరామయతి. తెలుగులో మాత్రము అక్షరసామ్యయతి కావటమూ, తెలుగుపద్యాలలోను ప్రవాహగుణం కారణంగానూ మన పద్యాలలో (ముఖ్యంగా వృత్తాలలో) విరామం అనేది అనియతం - ఒక్కోసారి మృగ్యం. అలాగే సంస్కృతంలోని 10అక్షరాల నియమమూ అనుమానాస్పదమే. అది వృత్తాలవరకే నని నా అభిప్రాయ< మాటవరసకు ఆటవెలది సరిపాదాలలో 7వ అక్షరం కూదా యతిస్థానం కావచ్చును కదా?
పండిత నేమాని వారూ, సమస్యాపాదాన్ని ప్రాసయతికి లక్ష్యంగా చూపించిన మీ పూరణ చాలా బాగుంది. సరస బృందావనాంతర స్థలాన్ని దర్శింపజేసిన మీ రెండవ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు. యతిమైత్రిని గురించి మీ సంక్షిప్త పరిచయం ఔత్సాహికులకు మార్గ దర్శనం చేస్తుంది. మీ శివానందలహరి శ్లోకానువాదం అద్భుతంగా ఉంది, ధన్యవాదాలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘ఉత్సవమ్ము అనగ’ అని విసంధిగా వ్రాయరాదు కదా... ‘అందరూను’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. నా సవరణ.. కుత్సితులె చేయుదురు వసంతో త్సవమ్ము లనగ నేటికి? చేయుదు రంద రెపుడు.... * నాగరాజు రవీందర్ గారూ, విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. * కమనీయం గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. * సహదేవుడు గారూ, మీ పూరణ ఉదాత్తంగా ఉంది. అభినందనలు. భూమిన... అని కాక.... భూమిని... అనండి. * ఏల్చూరి మురళీధర రావు గారూ, శ్యామలరావు గారూ, పియెస్సార్ మూర్తి గారూ, ధన్యవాదాలు.
గురువు గారికి ధన్యవాదములు. తమరి సూచన మేరకు సవరించిన పద్యం : భూమిని పరోపకారమ్ము పుణ్య ప్రదము తనువు నిచ్చెను దేవుడు ధన్యులమవ పరులు బాధల పాలైన పరవశించి కుత్సితులె చేయుదురు వసంతోత్సవమ్ము!
ప్రాస యతి గూర్చి వివరించి పలికె గురుడు
రిప్లయితొలగించండిచూడుడీ యుదాహరణమ్ము సుజనులార!
"కుత్సితులె చేయుదురు వసంతోత్సవమ్ము"
యత్నమొనరించుడీ మీరు నవ్విధమున
అయ్యా! శ్రీ శ్యామల రావు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీకు పు - ము ల యతి మైత్రి గురించి సందేహము నివృత్తి కొరకు "పోలిక యతి" లక్షణములను ఒకమారు తిరగ వెయ్యండి. స్వస్తి.
శ్రీ నేమాని వారూ !
రిప్లయితొలగించండిమీ పూరణ విలక్షణముగా నున్నది బాగుంది.
ఎవరు గుణవంతు చెరచునో యెరుక గలదె?
రిప్లయితొలగించండిఅచ్చ తెనుగేది యొనరింతు రనగ చెపుమ ?
హోలి పండుగ కొక పేరు నొప్పు నేది ?
కుత్సితులె- చేయుదురు- వసంతోత్సవమ్ము.
మరొక ప్రయత్నము:
రిప్లయితొలగించండివలదు పండువు లనెదరే? వారలేమి
కుత్సితులె? చేయుదురు వసంతోత్సవమ్ము
సరస బృందావనాంతర స్థలిని మించి
రాధికా గోపవిభుల కర్చన మొనర్చి
Sree gOli hanumaCCaastri gaariki Subhaaseessulu. mee kramaalamkaara poorana baaguganunnadi. swasti
రిప్లయితొలగించండిఆర్యా ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండికుత్సితులె చేయుదురు వసంతో త్సవమ్ము
రిప్లయితొలగించండిఅనగ నేటికి ?చేయుదు రం ద రూ ను
వారి వారల దైవము బరము గాను
భ క్తి యుతముగ బ్రతి యేట పండు గ వలె .
పుట్టుచుందురు పుడమిని పుణ్యమతులు
రిప్లయితొలగించండికుత్సితులె ; చేయుదురు వసంతోత్సవమ్ము
నుత్సహించుచు ప్రజలెల్ల నుర్వి యందు
మంచి చెడులకు రంగులె మచ్చు లనగ
రిప్లయితొలగించండిఒరుల యానందమును గాంచి యోర్వలేక,
ప్రల్లదమ్ముల నాడుచు ,బహువిమర్శ
కుత్సితులె చేయుదురు ;వసంతోత్సవమ్ము
సంతసమ్మున సామాన్య జనులు జరుప.
శ్రీ శ్యామలరావు గారికి,
రిప్లయితొలగించండినమస్కృతులతో!
"శంకరాభరణం" ముఖతః మీరు పరిచయం చేసిన మీ "శ్యామలీయం" బ్లాగులోని షట్పదులను గూర్చిన వ్యాసం బాగున్నది.దానిని ఇంకా సమగ్రీకరింపవలసి ఉన్నదని మీరే అన్నారు.
షట్పదికి కావ్యగౌరవం లేకేమి? శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి "జనప్రియ రామాయణం" ఉన్నదిగా! ఇంకా ఇతరుల రచనలనేకం ఉన్నాయి. దయచేసి తత్తత్ప్రయోగాలను మీ విమర్శనార్థం తప్పక పరిశీలించండి.
ధన్యవాదాలతో,
ఏల్చూరి మురళీధరరావు
విషయము: యతి నియమము
రిప్లయితొలగించండిమిత్రులారా!
శుభాశీస్సులు.
యతి అంటే పద్యమును చదువు చున్నప్పుడు గుక్క త్రిప్పుకొనుటకు తీసుకొను విరామము. సంస్కృతములో యతి స్థానము వద్ద ముందరి పదము పూర్తయి యతి తరువాత వేరొక పదముతో మొదలిడును. మన తెలుగు భాషలో యతి స్థానములో యతిమైత్రి కల అక్షరమును వేసినచో చాలును. సంస్కృతములో 10 అక్షరములకు తక్కువ యున్న పాదములో యతి అవసరములేదు. తెలుగులో ముత్యాలసరాలు ఛందస్సులో యతిలేదు. అలాగే కంద పద్యము 1, 3 పాదములలో యతి లేదు. అందుచేత యతి నియమము చెప్పబడని చోటులలో మనము సంస్కృతము ప్రకారము 10 అక్షరములు దాటిన పాదములలో మాత్రమే యతి తప్పని సరిగా వేసుకొనుచు, చిన్న పాదములలో ఐఛ్ఛికముగా వేయవచ్చును/లేక/విడిచిపెట్ట వచ్చును. స్వస్తి.
శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండిగుత్సములవోలె యౌవను లుత్సహించి
మత్సరములేక జ్యోత్స్నలై మందగొని
తనువులు తడపుచు నట రాధారమణుల
కుత్సితులె చేయుదురు వసంతోత్సవమ్ము.
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిశ్రీ శంకర భగవత్పాదులు రచించిన శివానందలహరి స్తోత్రములో శివ ధ్యానమనే వసంత ఋతువు భక్తుని మనస్సనే పూలదోటను చేరిన ప్రకారము వర్ణింపబడినది. ఆ శ్లోకమును, దానికి అనువాదరూపమగు నా పద్యమును ఈ క్రింద వ్రాసితిని. తిలకించండి:
శంభు ధ్యాన వసంతసంగిని హృదారామే2ఘ జీర్ణఛ్ఛదాః
స్రస్తా భక్తి లతాఛ్ఛటా విలసితా పుణ్య ప్రవాళాశ్రితాః
దీప్యంతే గుణ కోరకాః జపవచః పుష్పాశ్చ సద్వాసనాః
జ్ఞానానంద సుధా మరంద లహరీ సంవిత్ ఫలాభ్యున్నతిః
అనువాదపద్యము:
హరుని ధ్యానంబనునట్టి వసంతమ్ము
....నా హృదారామంబునన్ జెలంగ
దివ్య దీధితులతో దీపించు నా యెద
....భక్తి లతలు చాల పరిఢవిల్లు
పాప సంఘములను పండుటాకులు రాలు
....పుణ్య ప్రవాళముల్ పొలుపు గాంచు
సద్గుణ కోరక జాలమ్ము వెలుగొందు
....జప వాక్కులనెడి పుష్పములనుండి
బాగుగా మంచి వాసనల్ వ్యాప్తి జెందు
ప్రాప్తమగును జ్ఞానానంద రసమయమగు
సత్ఫలములా ప్రకారము సక్రమముగ
నొదవు శ్రీ పరమేశ సాయుజ్యపదము
స్వస్తి
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు & శ్రీ తోపెల్ల శర్మ గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
అనుప్రాసలకు శబ్దాలంకారములకు పెద్దపీట వేయుట బుధుల ప్రశంసల నందుకొనదు. అర్థాలంకారములకే ఎక్కువ విలువ ఈయబడును. మీరు గమనించి ఆచరించండి.
శ్రీనేమానివారు యతిని గురించి ప్రస్తావించినారు.
రిప్లయితొలగించండిసంస్కృతములో (కన్నడములో కూడ) విరామయతి. తెలుగులో మాత్రము అక్షరసామ్యయతి కావటమూ, తెలుగుపద్యాలలోను ప్రవాహగుణం కారణంగానూ మన పద్యాలలో (ముఖ్యంగా వృత్తాలలో) విరామం అనేది అనియతం - ఒక్కోసారి మృగ్యం. అలాగే సంస్కృతంలోని 10అక్షరాల నియమమూ అనుమానాస్పదమే. అది వృత్తాలవరకే నని నా అభిప్రాయ< మాటవరసకు ఆటవెలది సరిపాదాలలో 7వ అక్షరం కూదా యతిస్థానం కావచ్చును కదా?
భూమిన పరోపకారమ్ము పుణ్య ప్రదము
రిప్లయితొలగించండితనువునిచ్చెనుదేవుడుధన్యులమవ
పరులు బాధల పాలైన పరవశించి
కుత్సితులె చేయుదురు వసంతోత్సవమ్ము!
శంకర భగవత్పాదుల శివానందలహరి శ్లోకముయొక్క అనువాదము చాలా బాగున్నది.
రిప్లయితొలగించండిశ్రీ శంకర భగవత్పాదుల శ్లోకముయొక్క అనువాదము చాలా బాగుంది.
రిప్లయితొలగించండిశ్రీ పి.ఎస్.ఆర్.మూర్తి గారికి శుభాశీస్సులు. మీరు శివానందలహరి శ్లోక అనువాదమును ప్రశంసించినందులకు గాను శుభాభినందనలు. స్వస్తి.
రిప్లయితొలగించండిపండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిసమస్యాపాదాన్ని ప్రాసయతికి లక్ష్యంగా చూపించిన మీ పూరణ చాలా బాగుంది.
సరస బృందావనాంతర స్థలాన్ని దర్శింపజేసిన మీ రెండవ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
యతిమైత్రిని గురించి మీ సంక్షిప్త పరిచయం ఔత్సాహికులకు మార్గ దర్శనం చేస్తుంది.
మీ శివానందలహరి శ్లోకానువాదం అద్భుతంగా ఉంది, ధన్యవాదాలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘ఉత్సవమ్ము అనగ’ అని విసంధిగా వ్రాయరాదు కదా... ‘అందరూను’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. నా సవరణ..
కుత్సితులె చేయుదురు వసంతో త్సవమ్ము
లనగ నేటికి? చేయుదు రంద రెపుడు....
*
నాగరాజు రవీందర్ గారూ,
విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
కమనీయం గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ ఉదాత్తంగా ఉంది. అభినందనలు.
భూమిన... అని కాక.... భూమిని... అనండి.
*
ఏల్చూరి మురళీధర రావు గారూ,
శ్యామలరావు గారూ,
పియెస్సార్ మూర్తి గారూ,
ధన్యవాదాలు.
కుత్సితులె చేయుదురు వసంతోత్సవమ్ము
రిప్లయితొలగించండినెన్నిమారులో సమయమునెన్నజాల
రిల గుణవరిష్టులగు వారలిలచేయు
నుత్సవము వత్సరమ్మునందొక్కసారె.
డా. ప్రభల రామలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
గురువు గారికి ధన్యవాదములు. తమరి సూచన మేరకు సవరించిన పద్యం :
రిప్లయితొలగించండిభూమిని పరోపకారమ్ము పుణ్య ప్రదము
తనువు నిచ్చెను దేవుడు ధన్యులమవ
పరులు బాధల పాలైన పరవశించి
కుత్సితులె చేయుదురు వసంతోత్సవమ్ము!