9, మార్చి 2013, శనివారం

పద్య రచన – 275 (వైద్యో నారాయణః)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"వైద్యో నారాయణో హరిః"

20 కామెంట్‌లు:

 1. హరి నారాయణుడే భిషగ్వరుడు భవ్యారోగ్య సంధాత, శ్రీ
  హరి నామంబె మహౌషధంబనుచు నత్యంతాదృతిన్ గైకొనన్
  దురితంబుల్ బహురోగముల్ తొలగు సంతోషంబు పెంపొందు శ్రీ
  హరినే గొల్వ భవామయమ్ము తొలగున్ ప్రాప్తించు సద్యోగముల్

  రిప్లయితొలగించండి
 2. విడువక పలికిన నామము
  నిడుముల దీర్పదె? పలుకుము నిత్యము జిహ్వన్
  కడు తీపిని గూర్చునదే
  గుడిలోకొలువైన యట్టి గోవిందునిదే.

  ఇలలో నెల్లరు రోగులు
  తలపరె వైద్యుని హరియని; తమలో తామే
  పలుమారులు వందనముల
  సలుపుచునుందురు, చికిత్స జబ్బుల మాన్పన్.

  రిప్లయితొలగించండి
 3. వైద్యము వ్యాపారము లయె
  వైద్యుల కాపేక్ష హెచ్చె పైకము మీదన్
  విద్యార్థగు వైద్యునిగను
  విద్యను కొని విత్తమునకు విపరీతముగన్

  రిప్లయితొలగించండి
 4. వైద్యుడు మందుల నిడ నై
  వేద్యము ' నారాయణ ' యని వెన్నుని కిడుచున్
  ఖాద్య ప్రసాదమని తినగ
  నాద్యంతము రోగ మపుడు ' హరి హరి ' యనుగా !

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  నేటి వైద్యుడు నారాయణుడా ? నరకాధినాథుడా ?

  01)
  _______________________________

  "వైద్యుడు నారాయణుడట "
  సాధ్యమె? యా నాటి మాట - సరిగా దిలలో !
  వైద్యము విత్తము కొఱకే !
  వైద్యుడు నరకమును జూపు- ప్రభువే గనగాన్ !
  _______________________________

  రిప్లయితొలగించండి
 6. పండిత నేమాని వారూ,
  భవరోగ తిమిర సంహా
  ర విశేషజ్యోతి యనఁగ రాజిల్లు హరిన్
  స్తవ మొనరించిన పద్యము
  నవలీలగఁ జెప్పినాఁడ వభివందనముల్.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యంలోని చమత్కారం బాగుంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  వైద్యుల నందరినీ ఒకే గాట కట్టేస్తున్నారు మీరు... కొందరు స్వార్థపరుల నైజాన్ని సార్వజనీనం చేస్తే ఎలా? మన గన్నవరపు వారికి కోపం రాదూ?

  రిప్లయితొలగించండి
 7. వైద్యుడు నారాయణుడే
  వైద్యుడు నిల మందు నిచ్చి ప్రాణము నిల్పున్
  వైద్యుని యునికియు ముఖ్యము
  వైద్యుని గుర్తించి బొగడె బద్దెన కవియున్ .

  రిప్లయితొలగించండి
 8. దేహమనిత్యము దేహముకేర్పడు
  ………. రోగములెప్పుడు రువ్వుచుండ
  మందులు మేదిని పొందుచు తగ్గించు
  ………. వైద్యశిఖామణుల్ ప్రతిభతోడ
  రాకపోకలెరుక బ్రహ్మకెరుకగాన
  ………. వైద్యుడేమిటజేయ పాలు పోదు
  నారాయణుని దివ్యనామంబె చింతామ
  ………. ణిగ చెప్పనార్యులు నిజముగాదె?

  భువిని భవరోగ తిమిరాల బంధనముల
  అంత్యమందునైన పలుక అందజేయు
  ముక్తి నారాయణాహ్వయము మదినేంచి
  వైద్య నారాయణుడు హరి వాదమేల?

  రిప్లయితొలగించండి
 9. జీవ రక్షణ వైద్యుండు జేయు చుండ
  నతడె స్థితి కార కుండగు హరి యనఁదగు
  రోగి పైకమ్ము నమితమ్ము లాగఁ జూడ
  వడ్డి కాసులు గుంజెడు వాని యంశ!

  రిప్లయితొలగించండి
 10. గురువుగారు సరదా సేకరణ ఇది, మన్నించగలరు.

  కలి విడంబన శతకం :

  శ్లో:-
  వైద్య రాజ నమస్తుభ్యమ్. యమ రాజ సహోదరా!
  యమస్తు హరతి ప్రాణాన్. వైద్యః ప్రాణాన్ ధనానిచ!!
  భావము:-
  యముని సోదరుడవైన ఓ వైద్య రాజా! నీకు నమస్కారము. ఎందుకన - యముడు ప్రాణాలనే తోడును. వైద్యుడవైన నీవు మా ప్రాణాలనీ, ధనాన్నీ కూడా హరిస్తావు కదా! కాన మా జోలికి నీవు రాకుండా ఉండడానికి నీకు నమస్కరిస్తున్నాను సుమా!

  రిప్లయితొలగించండి
 11. అయ్యా! శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు.
  మీ సీసములో "దేహముకేర్పడు" అనే ప్రయోగము కంటె "దేహమున కేర్పడు" అంటే చాలా బాగుంటుంది. అలాగే ఆ క్రింది తేటగీతిలో మీ మనసులోని భావమును చక్కగా వివరింపలేక పోయేరేమో అనిపించుచున్నది. అన్వయము ఇంకా సులభముగా ఉండే విధముగా మార్చండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
  నేమాని వారి వ్యాఖ్య ననుసరించి తగు సవరణ చేయండి.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సాహిత్యాభిమాని గారూ,
  ధన్యవాదాలు.
  కలివిడంబవ శతకంలోని ఆ శ్లోకం చాలా ప్రసిద్ధమైనదే. దానికి నా అనువాదం......
  వైద్యరాజ! నీకు వందన మిదె; నీవు
  యముని సోదరుండ వనుట నిజము;
  యముఁడు ప్రాణ మొకటె హరియించుఁ; బ్రాణము
  ధనములను హరించు ఘనుఁడ వీవు.
  (గన్నవరపు వారిని, విష్ణునందనుల వారిని క్షమించమని ప్రార్థిస్తూ.......)

  రిప్లయితొలగించండి
 13. శ్రీనేమాని పండితులకు వందనములతో సవరించినతరువాత

  దేహమ నిత్యము దేహంబు కేర్పడు
  ………. రోగములెప్పుడు రువ్వుచుండ
  మందులు మేదిని పొందుచు తగ్గించు
  ………. వైద్యశిఖామణుల్ ప్రతిభతోడ
  రాకపోకలెరుక బ్రహ్మకెరుకగాన
  ………. వైద్యుడేమిటజేయ పాలు పోదు
  నారాయణుని దివ్యనామంబె చింతామ
  ………. ణిగ చెప్పనార్యులు నిజముగాదె?

  యితర రోగాల సంగతి కేమి గాని
  భవ మహామయమును బాపు వైద్యుడొకడె
  యతని నారాయణుండని యాత్మదలచి
  ప్రోవవే స్వామి రని వేడ ముక్తి నొసగు.

  రిప్లయితొలగించండి
 14. గురువర్యులకు చక్కని పూరణలు సల్పిన అన్నయ్యగారికి మిత్రులకు, ప్రత్యేకముగా వసంత కిశోర్ గారికి అభివందనములు

  తాప మొసగెడు రుజలను బాపుటందు
  తృప్తి నొందెడు వైద్యులె ధీరవరులు
  వైద్య విద్యలు వ్యాపార వశము లగుట
  చోద్య విషయమె ! హరి ! మాకు శుభము లిడుమ !

  రిప్లయితొలగించండి
 15. శంకరార్యా ! మీరు చెప్పింది నిజమే !
  అందరినీ ఒకేగాట కట్టరాదు గదా !

  ఒక్క గన్నవరపు వారికే గాదు
  వైద్యం కోసం వైద్యం చేసే వైద్యులందరికీ క్షమాపణలతో :

  02)
  _______________________________

  వైద్యుడు నారాయణుడే !
  వైద్యుడు ప్రాణములు పోయు - పరమేశ్వరుడే !
  వైద్యుడె ధర్ముడు యిలలో !
  వైద్యుడె మరుజన్మ మిచ్చు - బ్రహ్మే భువిలో !
  _______________________________

  రిప్లయితొలగించండి
 16. ఒకరిద్దర్ని మినహాయిస్తే , వైద్యుడు నిజంగా భూమ్మీద నడయాడే నారాయణుడే !

  03)
  __________________________

  బాధలెన్నియొ గల్గి - బాధింప జనులను
  బాధ నివారణ - బరపు వాడు !

  బాలింత కడుపున - పాప డడ్డు పడిన
  బాలింత, బిడ్డ, గా - పాడు వాడు !

  బవరాన , మనవారు - పగవారు యనకుండ
  ప్రాణాల రక్షించు - ప్రథము డతడు

  పవలు రాత్రని లేదు - పదుగురి కోసమై
  పరుగు వెట్టుచు పాటు - పడెడు వాడు

  పదునైన కత్తినీ - బరువైన సుత్తినీ
  ప్రాణి త్రాణమునకే - వాడు వాడు !

  పలుక లేకున్నట్టి - పశువుల , పక్షుల
  బాధా నివారణా - బ్రహ్మ యతడు !

  బంధువుల్ దరిజేర - భయపడు చున్నట్టి
  బహు యంటు రోగముల్ - బాపు వాడు !

  పలు ప్రమాదంబుల - పగిలిన యెముకల
  పట్టుతో నతికించు - భటుడు వాడు !

  పసి బాల, వృద్ధుల - బాలెంత , బాధల
  పసతోడ దీసెడి - ప్రాఙ్ఞు డతడు

  ప్రజలెల్ల చల్లంగ - బాధలు లేకుండ
  బ్రతుకగా జేసెడి - ప్రథితు డతడు !

  ఒకటి రెండని చెప్పగా - నురగు వశమె ?
  విద్య లన్నిట మేలైన - వైద్య విద్య
  విధుల నిర్వహించెడి వాడు - విధికి సాటి !
  వైద్య నారాయణా, నీకు - వందనములు !
  __________________________


  రిప్లయితొలగించండి
 17. వసంత కిశోర్ జీ మీ కవితాస్రవంతి అద్భుతము . వైద్యు లందఱి తరఫున మీకు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 18. ప్రాణముల గాచు వాడె శ్రీపతి యనంగ
  వైద్యుడే రుగ్మతల బాపి వంతదీర్చి
  కాచునెడల నారాయణు గాదలంప
  సత్యమేయగు నాపదసమయములను.

  రిప్లయితొలగించండి