14, మార్చి 2013, గురువారం

పద్య రచన – 280 (అంతర్జాలము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"అంతర్జాలము"
ఈ అంశమును సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

15 కామెంట్‌లు:

  1. చాలముదంబు నిడును విడ
    జాలము వీడిన నిముసము జరుగదు యంత
    ర్జాలము గన నిది ఇంద్రుని
    జాలము వలె దోచు, దోచు జనుల మనములన్.

    రిప్లయితొలగించండి
  2. వేరుగ నుండక ఘన సాఫ్ట్
    వేరును ' వేరు ' గను హార్డు వేరుయు కలవన్
    వైరులుగా వైరస్సులు
    వైరులు వైర్లెస్సు వలల వర్తిలు ' నెట్టే.'

    రిప్లయితొలగించండి
  3. అంతర్జాలము జూచితె ?
    అంతర్జాలంబు మనకు నన్ని విషయముల్
    వింతగ , దెలుపును వెంటనె
    అంతా యా శివుని లీ ల , యబ్బుర మదియే .

    రిప్లయితొలగించండి
  4. అంతర్జాల మదేమి యద్భుతమొ మాయాజాలమున్ మించు న
    శ్రాంతంబున్ జనసేవలో నలరు విజ్ఞానమ్ము నందించు న
    త్యంతానందము గూర్చు నాశ్రితుల కాహా చిత్రమౌ సోదరా!
    వింతల్ గాంచుము విశ్వరంజక మహావేదిన్ వినోదించుమా

    రిప్లయితొలగించండి
  5. అంతర్జాలంబందున
    వింతలు బహుభంగుల కనువిందులు చేయన్
    వింతగ కొందర కదె ని
    స్సంతానపు కారణంబు సతతము జూడన్.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గారికి,శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు
    =======*=======
    లోక వింత లెల్ల లోకులకును జూపు
    పండితులను గలుపు పామరులకు
    నన్ని వేళ లందు నన్న దమ్ముల మధ్య
    వారధి వలె నిలచు వధువరులకు

    రిప్లయితొలగించండి
  7. హయముల మించు వేగమున హర్షమునింపు జనాళి వ్రాతలన్,
    రయమునఁ దెచ్చి యిచ్చుచు, కలంతలఁ దీర్చగ నాప్తుఁగల్పుచున్,
    మయసభఁ బోలు జాలమిది , మాయల జాలము; మేలు కార్యముల్
    ప్రియముగ సల్పుమా! పరుల భీతిల జేయకు కీడొనర్చుచున్.

    రిప్లయితొలగించండి
  8. బుడుత నుండి మొదలు ప్రోఫెసరుల దాక
    తరచి చూడ నెంచు తళుకు లమ
    బాగు పడగ వచ్చు పాడైన గావచ్చు
    గాలమేసి లాగు లీల లమ్మ

    రిప్లయితొలగించండి
  9. అంతర్జాల వైశిష్ట్యాన్ని వివరిస్తూ చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    పండిత నేమాని వారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    వరప్రసాద్ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సహదేవుడు గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. అన్నిపనులకన్న అంతరజాలము
    ముఖ్యమయ్యె మాకు ముదము నీయ
    లోకమంత వచ్చి లోగిలందుండగ
    రాతిరంత నిదుర రాదు దరికి

    రిప్లయితొలగించండి
  11. అంతర మందు నుండు నొక యద్భుత జాలము మానవాళినిన్
    వంతులు వేసుకొంచు వల పన్నుచు నుందురు శత్రు లార్వురున్
    కంతల లోన జిక్క తన కాయము నీటను చేప వోలె తా
    గెంతులు వేయుచుండు మది కీడును గానక నిత్య మయ్యయో!

    రిప్లయితొలగించండి
  12. అంతర్జాలము ముంగిట
    మంత్రించి నటుల జనులు మాయను మునుగన్ !
    వింతగు కన్నుల విందులు
    సంతసమున గాంచి మిగుల సాకత మొందన్ !

    రిప్లయితొలగించండి





  13. అంతర్జాలము నేటి యద్భుతము మాయాజాలమై యొప్పెగా
    వింతల్,వార్తవిశేషముల్ తెలుపు నీవిశ్వమ్ము నందెల్లనే
    ప్రాంతమ్మైన సమస్తమానవుల నాప్యాయమ్ముగా నొక్కెడన్
    జెంతంజేర్చు నిమేషమాత్రమున నీ చిత్రమ్మదేమో కదా !



    రిప్లయితొలగించండి