25, మార్చి 2013, సోమవారం

సమస్యాపూరణం – 1005 (అఆలను మరచిపోయిరి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా!
ఈ సమస్యను పంపిన వామన్ కుమార్ గారికి ధన్యవాదములు.

42 కామెంట్‌లు:

 1. మిత్రులారా!
  ప్రాస స్థానములో అచ్చును వేసిన యీ సమస్యను నింపుట కష్టమే. అయినను పూరణ చేయునప్పుడు పద్య ప్రాస స్థానములో ఏ అచ్చునైనా వేసుకొనవచ్చును. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 2. అ ఆలు నేర్వమనుచో
  అ ఆ వద్దనుచు పిదప ఆంగ్లంబనుచో
  ఉ ఊ అని దిద్దెదరిల
  అ ఆలను మరచిపోయి రాంధ్రులె యౌరా!

  రిప్లయితొలగించండి
 3. అ ఆ లు నేర్చి నంతనె
  అ ఆ లకు కొలువు దొరక దాకలి దీరన్ !
  అ ఆ లు పనికి రావని
  అ ఆ లను మరచి పోయి రాంధ్రులె యౌరా !

  రిప్లయితొలగించండి
 4. అఆ ఇఈల పిదప
  ఆ ఏబీసీలు నేర్తు రెల్లరు బడిలో
  ఈ ఆంగ్లభాషలో పడి
  అ ఆలను మరచిపోయి రాంధ్రులె యౌరా!

  రిప్లయితొలగించండి
 5. ఓ అమ్మ! అరటి ఆవులు
  మీ ఇండ్లను బలుకరంట మేలగు నెట్లౌ
  ఈ ఆంగ్లపు చదువులలో
  అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా!

  రిప్లయితొలగించండి
 6. ఆ ఆంగ్ల మనిన మోహము
  ఈ ఆంధ్రములో పలికిన నెబ్బెట్టగునో !
  హౌ ఆరు యూ యనుచు మన
  అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా!

  రిప్లయితొలగించండి
 7. ఆ అల్లసాని యెఱుగునొ
  ఆ ఆంధ్రభోజు డరసిన నాత్మంగలయున్
  ఓ ! అమరజీవి గనుమా !
  అ ఆలను మరచిపోయి రాంధ్రులె యౌరా!

  రిప్లయితొలగించండి
 8. SAVARAnA To...


  అ ఆ ల బడికి పోరా ?
  అ ఆ లను నేర్వ బోర అ ఆ 'బోరా ' ?
  అ ఆ ల తోనె పోరా ?
  అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా!

  రిప్లయితొలగించండి
 9. ఏ ఈ ఐ ఓ యూలకు
  ఈ అందపు నడక లేవి ఇటలీ భాషన్
  మీ ఆంధ్రము మించు ననగ
  అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా!

  రిప్లయితొలగించండి
 10. అ ఆ లనునవి తెలుగున
  అ ఆ లకు బదులు నిపుడు నాంగ్లము వచ్చెన్
  అ ఆ ల యునికి శూ న్యము
  అ ఆ లను మ ఱఛి పోయి రాం ధ్రు లె యౌ రా !

  రిప్లయితొలగించండి
 11. శ్రీ గురువులకు, మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
  ప్రణామములు!

  దుష్కరప్రాసతో క్లిష్టమైన సమస్యను ఇచ్చిన వామన కుమార్ గారికి అభినందనలు!

  భో అజ్ఞానాంధ్యహరే!
  తే ఆర్త్విజ్య మవ శారదే! భక్తా స్స
  ర్వే ఏతే యను తొలినుడి
  యఆలను మఱచిపోయి, రాంధ్రులె? యౌరా!

  “అంధకారం (చీకటిని) రాతి (పోద్రోచేవాడు) ఇతి ఆంధ్రః” అని సంస్కృతంలో ఆంధ్ర శబ్దవ్యుత్పత్తి. ఆంధ్యాన్ని రూపుమాపే సంస్కృతభాష అఆలను మఱచినవారు ఆంధ్రులెలా అవుతారు? అని పూరణ.

  విధేయుడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 12. చి. డా. ఏల్చూరి మాకు ప్రతిదినము బ్లాగులోకి వచ్చుచుంటే బాగుండును. వారు మంచి మంచి విషయములను అందించుచు ఉంటారు. వారు లేని అప్పుడల్లా లోటు కన్పట్టుతుంది. మన కోసము ప్రతిదినము సాయంత్రము కొంత సమయము కేటా ఇస్తే బాగుంటుంది. ఈనాటి పద్యము చాల బాగుగ నున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి 13. అ ఆ ఇ ఈ యందము
  A E I O U లోన నెచ్చట గలదున్
  మా ఓ న మ లే భారమ
  అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా!

  రిప్లయితొలగించండి
 14. అఆలను మరచెననుట
  ఇఈబ్లాగున కనుచును ఇచ్చకమేనా?
  ఆహా ఎంతటి మాటిది
  అఆలను మరచిపోయిరాంధ్రులె? యౌరా!

  రిప్లయితొలగించండి
 15. అ ఆ లను పరిహ సించి
  అ ఆ లకు మదిని జంపె నాంగ్లము తానై !
  అ ఆ లు మమ్మి లవగను
  అ ఆ లను మరచి పోయి రాంధ్రులె యౌరా !

  రిప్లయితొలగించండి
 16. సరదాగా మరొక పూరణ:

  అఆలను మరచెనన్నచొ
  ఉఊలను కోట్టుకొంటు యూరకొనెదమా?
  ఇ ఈవలకును వచ్చియు
  ఎఏకారణము మాకు నెరిగింపవలెన్.

  రిప్లయితొలగించండి
 17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 18. అన్నయ్య గారు చెప్పినట్లు శ్రీ ఏల్చూరి వారు చక్కని విషయాలు చెబుతారు. అలాంటి విద్వాంసులకు కొదువ లేదీ కాలములో కూడా నని చక్కని సంతృప్తి !

  భుక్తి కోసము ఆంగ్లము నేర్చుకోవచ్చును , కాని తెలుగుని అధికార భాష చేసినందులకు కార్యాలయాలలోను, న్యాయస్థానముల లోను, కోశాగారములలోను తెలుగు భాషనే తప్పని సరిగా వాడుతే తెలుగు భుక్తి పెట్టదని అనలేరుగా ? ఆంగ్లేయులకు పూర్వము తెలుగు రాజులు తెలుగులో పాలన ,శాసనాలు చేయ లేదా ?

  రిప్లయితొలగించండి
 19. ఆఆలనేర్చు ప్రాయము
  ఆ ఏబీసీడిదిద్దియాంగ్లము నేర్వన్
  ఆఆలమాధురి నెరుగక
  ఆఆలను మరచి పోయిరాంధ్రులె యౌరా!

  రిప్లయితొలగించండి
 20. డా. ప్రభల రామలక్ష్మి గారి సరదా పూరణలు రాజేశ్వరి అక్కయ్య గారి పూరణలు బాగున్నాయి.

  రిప్లయితొలగించండి

 21. అఆలను మరచిపోయిరాంధ్రులె, యౌరా!
  గూగల్ వాడి చలవ ఎ బీ సీ డీ లతో e-
  తెలుగు యూనికోడ్ రాతల్ e-లోకమున
  భళారే చక్కగా'ఇంకి' పోయెన్!


  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించండి
 22. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  అ ఆ యనగ నమరమౌ
  ఆ ఈ శ్వర సూత్రములుగ అవనిని జెల్లన్
  ఉ ఊ యన నుదమార్థము
  అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా!

  రిప్లయితొలగించండి
 23. శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారికి ధన్యవాదాలు!

  రిప్లయితొలగించండి
 24. అ ఆ ఇ ఈ ఉ ఊ
  ఎ ఏ ఐ యనుచు చదివి యిప్పటి బాలల్
  ఆ ఆంగ్లమే పలుకుదురు
  అ ఆ లను మరచిపోయి రాంధ్రులె యౌరా !

  రిప్లయితొలగించండి
 25. అ ఆ ల బడికి పోరా ? ( తెలుగు మీడియం బడి)
  అ ఆ లను నేర్వ బోర అ ఆ ' బోరా ' ? (ఇంగ్లీషు బోర్)
  అ ఆ ల తోనె పోరా ? ( పోరు = యుద్ధము)
  అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా!

  రిప్లయితొలగించండి
 26. చిన్న సందేహము.

  చాలా మంది పద్యమును 'అ ఆ' తో పద్యం ప్రారంభించారు. అది గణభంగముకాదా??
  మొదటి గణము జగణమౌతోందికదా?

  రిప్లయితొలగించండి
 27. శ్రీ పుష్యం గారికి నమస్సులు. అ కారము తరువాత వచ్చిన ఆ పలుకడములో వచ్చిన ఊనిక ద్వారా తత్పూర్వాక్షరం గురువగుచు గగమైనది గాని జగణముకాబోదు. బహుశః ఇది కేవల స్వరమునకు మాత్రమే వర్తించును అనుకొనుచున్నాను. మీ సందేహమునే శ్రీ శంకరార్యులతో పంచుకోగా చెప్పినారు. నేనర్థముచేసికున్నది తెల్పుచున్నాను. అవధానధురీణ, మధురకవి, పండిత శ్రీనేమాని, మహావిద్వాంసులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు మున్నగు వారలకు దోషమైనచో తప్పక చెప్పుదురని అనుకొనుచున్నాను.

  రిప్లయితొలగించండి


 28. శ్రీ పుష్య గారికి
  నమస్కారం!

  అ - ఆ అని ఉచ్చరిస్తున్నపుడు మొదటి అక్షరమైన "అ" తర్వాత కొంత ఊనికతో ఆపి, రెండవ అక్షరమైన "ఆ"ను ఒత్తి పలుకుతాము. "అ" - "ఆ" ల నడుమ ఉండే ఆ వ్యవధానాన్ని Glottal Stop అంటారు. పెక్కు అరబిక్ భాషలలోనూ ఈ ఊనిక ఉన్నది. ఈ ఊనిక వల్ల మొదటి అక్షరమైన "అ" గురువు అవుతుంది. అందువల్ల గణభంగం కాదు.

  ఒక్క ప్రాకృతంలో మాత్రం ఈ Glottal Stop వల్ల పూర్వాక్షరం గురువు కాదు. "భద్దం భోఉ సరస్సఈఅ కఇణో" అని శార్దూల వృత్త ప్రారంభం రాజశేఖరుని "కర్పూరమంజరి" సట్టకంలో చూడండి.

  అయితే, ప్రాసాక్షరం అచ్చు కాబట్టి - పద్యంలో "ఆ ఇంద్రుడు" మొదలైనవి ప్రాస అచ్చులుగా చెల్లవు. అక్కడ "ఆ యింద్రుడు" అని సంధి వస్తుంది కనుక.

  పూజ్యులు శ్రీ గురుదేవుల వాత్సల్యపూర్ణ వాక్యావళికి, ఆశీర్వచోనీచయానికి నేను కృతజ్ఞుడిని. శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి, శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మ గారికి ధన్యవాదాలు.

  శుభాకాంక్షలతో,
  ఏల్చూరి

  రిప్లయితొలగించండి
 29. అంతే కాదు, అచ్చులలో లఘువు తర్వాత గుర్వక్షరం వచ్చినపుడే (అ తర్వాత ఆ వచ్చినట్లు) ఈ Glottal Stop వల్ల పూర్వాక్షరమైన లఘువు గురువు అవుతుంది. అఆ – ఇఈ – ఉఊ లు ఇందుకు ఉదాహరణలు. అచ్చులలో రెండూ లఘువులే వచ్చినపుడు ఈ Glottal Stop కు ప్రమేయం ఉండదు. అందువల్ల “అఇఉణ్” అన్నది సగణం అవుతుందే కాని, రగణం కాదు. కనుకనే రాజశేఖరుని శ్లోకంలో “కఇణో” సగణం అయింది.

  రిప్లయితొలగించండి
 30. ' అయితే, ప్రాసాక్షరం అచ్చు కాబట్టి - పద్యంలో "ఆ ఇంద్రుడు" మొదలైనవి ప్రాస అచ్చులుగా చెల్లవు. అక్కడ "ఆ యింద్రుడు" అని సంధి వస్తుంది కనుక. '

  ఆ అనుమానము వచ్చే మరీ సున్నా మార్కులు రాకుండా ఆఖరు పూరణ చేసాను.

  అ ఆ ఇ ఈ యందము
  A E I O u లోన నెచ్చట గలదున్
  మా ' ఓ న మ ' లే భారమ
  అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా!

  రిప్లయితొలగించండి
 31. మాన్యశ్రీ నరసింహమూర్తి గారికి,

  మా 'యో న మ' లే భారమ

  అవుతుంది కాబట్టి,

  అఆ ఇఈ యందము
  A E I O U లోన నెట్టులఁ గలుగున్?
  శ్రీ 'ఓం న మ' లే భారమ?
  అఆలను మఱచిపోయి, రాంధ్రులె? యౌరా!

  అని చదువుకొందాము. "శ్రీ యోం న మ లే" అని సంధి రాదు. ఎందుకంటే విసర్గ తోడి శ్రీః "శ్రీః + ఓ" శ్రీ ఓ అవుతుంది. "న మ లే" అని ఆచ్ఛికంతో ఉన్నందువల్ల "శ్రీ రోం న మ లే" అని కాదు.

  భవదీయుడు,
  ఏల్చూరి

  రిప్లయితొలగించండి


 32. గోలీ వారి ఇవ్వాళ్టి పద కూర్పు రుచికరమైన పోళీలే! !


  జిలేబి.

  రిప్లయితొలగించండి
 33. శ్రీ ఏల్చూరి మురళీధర్ గారికి ధన్యవాదాలతో సవరించిన పూరణ ;

  అఆ ఇఈ లందము
  A E I O U లోన నెట్టులఁ గలుగున్?
  శ్రీ 'ఓం న మ' లే భారమ?
  అఆలను మఱచిపోయి, రాంధ్రులె? యౌరా!

  రిప్లయితొలగించండి
 34. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈనాటి సమస్య ఆసక్తికరమైన చర్చకు కారణమై ఏల్చూరి మురళీధర రావు గారి వివరణాత్మక వ్యాఖ్యల వలన కొందరి సందేహాలు తొలగినందుకు ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు.
  “గఓఘమును దెచ్చి మీకుఁ గానుక సేతున్” అని మిత్రులు పంపిన ఒక సమస్యను ఔత్సాహిక కవులు ప్రయత్నిస్తారో లేదో అనే సందేహంతో ఇంతకాలం ప్రకటించలేదు.
  ఈ సందర్భంగా క్రింది పద్యాన్ని ఉదాహరించటం యుక్తమే అని భావిస్తున్నాను.
  అ ఆ ఐ ఔ లకు మఱి
  ఇ ఈ లు ఋకారసహిత మె ఏ లకు నౌ
  ఉ ఊ ల్దమలో నొడఁబడి
  ఒ ఓ లకు వళ్లగు న్నయోన్నత చరితా! (కవిజనాశ్రయము, ౧-౬౩)
  ఒకరిని మించి ఒకరుగా చక్కని పూరణలు చెప్పిన ....
  పండిత నేమాని వారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  నాగరాజు రవీందర్ గారికి,
  గన్నవరపు నరసింహమూర్తి గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  సుబ్బారావు గారికి,
  ఏల్చూరి మురళీధర రావు గారికి,
  డా. ప్రభల రామలక్ష్మి గారికి,
  సహదేవుడు గారికి,
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  జ్ఞానదాయకమైన చర్చకు కారకులైన పుష్యం గారికి, సహృదయంతో వివరణాత్మక సమాధానాలిచ్చిన ఏల్చూరి మురళీధర రావు గారికి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 35. ఈ నాటి అచ్చు ప్రాసాక్షర సమస్యకు యెంత రమ్యమైన పూరణలు వచ్చినాయండీ! నేను ఒక్కటంటే ఒక్క పూరణ కూడా చేయాలేక పోయానంటే నమ్మండి.

  వామనకుమార్ గారి చలువ వల్లనూ, పుష్యంగారి చొరవ వల్లనూ, డా. ఏల్చూరి వారి వ్యాకరణ పాఠం వల్లనూ నేను ఇంతకూ ముందెప్పుడూ వినని క్రొత్త విషయాలు తెలిశాయి.

  అందరికీ అభినందనలు.

  రిప్లయితొలగించండి
 36. ఈ బ్లాగులో నున్న వారు ఒక్కొక్కరూ ఒక విజ్ఞాన సముద్రం. ఏదో అధాటుగా అనిపించిన వాక్యామది. నాకు ఏమాత్రం అందని పద్యం. గఓఘము అనే పదం గతంలో ఒక అష్టావధానంలో మా గురువు గారు శ్రీ ఏల్చూరి వారు అష్టావధాని శ్రీ గరికపాటి వారికి ఇచ్చిన సమస్యలో వాడారు.అయితే అప్పుడు నాకు పద్యాలలో అ ఆలు కూడా రావు కనుక, కేవలం విని వదిలేసాను.ఆ పదం మాత్రం అప్పుడప్పుడూ గుర్తుకు వస్తూ ఉంటుంది.
  చాలా చక్కని పూరణలనందించిన కవి పుంగవులందరికీ కోటి కోటి ప్రణామములు.ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి

 37. నా సందేహనివృత్తికై చక్కని వివరణనిచ్చిన శ్రీ ఏల్చూరి వారికి ధన్యవాదములు.

  క్రమాలంకారములో నా చిన్న ప్రయత్నము.

  ఇఈల ముందుఁయనవలె,
  హా! ఌౡలనుఁగనమిక అదియెందులకో?
  శ్రీ ఆదిభట్ల నెరుగవె?
  అఆలను-మరచిపోయిరాంధ్రులె - యౌరా?

  రిప్లయితొలగించండి