16, మార్చి 2013, శనివారం

పద్య రచన – 282 (సింహాద్రి అప్పన్న)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"సింహాద్రి అప్పన్న"

15 కామెంట్‌లు:

  1. ధరణీదేవిని బ్రోచితీవు భువనత్రాతా! వరాహంబవై
    నరసింహాకృతితో హిరణ్యకశిపున్ గర్వాంధునిన్ జీల్చితీ
    విరురూపంబులతోడ సింహగిరిపై హృద్యంబుగా నొప్పెదో
    హరి! శ్రీచందనచర్చితాంగ! కరుణాపాంగా! నినున్ గొల్చెదన్

    రిప్లయితొలగించండి
  2. అన్నయ్యగారి పూరణ అప్పన్నకు రాసే గంధపు పూతలా యుంది. అభివందనములు !

    రిప్లయితొలగించండి
  3. తమ్ముడు డా. నరసింహమూర్తికి శుభాశీస్సులు.
    సింహాద్రి అప్పన్న నిత్యదర్శనములో చందనపు పూతతో శివలింగాకారములో నుంటాడు కదా ఆ భావమును కూడా పద్యములో చేర్చితే ఇంకా బాగుండును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. పూర్వ వారిధి తీరమున విశాఖాఖ్య మ
    ....హానగర సమీప ప్రాంతమందు
    ప్రకృతి శోభా వైభవములతో నలరారు
    ....సహజ సుందర ప్రదేశమ్మునందు
    మృగరాజరూపమున్ మించు చందమ్మును
    ....గాంభీర్యము జెలంగు క్ష్మాధరమ్ము
    సింహాచలమ్ము ప్రసిద్ధి చెందెను మహా
    ....క్షేత్రమ్ముగా నట శ్రీవిభుండు
    శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ మూర్తి
    చందనావృత గాత్రుడౌ శాంతమూర్తి
    యలరు శ్రీమహాలక్ష్మితో ననవరతము
    స్వామి నాత్మలో ధ్యానించి ప్రస్తుతింతు

    రిప్లయితొలగించండి
  5. సింహగిరి పైన వెలసిన శ్రీ శ ! యీ శ !
    చందనంబుల శోభిత శం భు లింగ !
    నన్ను గావుము నిరతము నార సింహ !
    ఆశ లన్నియు నీ పైన హత్తు కొంటి .

    రిప్లయితొలగించండి



  6. వార్ధితీరమ్మున వరవిశాఖాపురీ
    సామీప్యమందున జక్కనైన
    ఫలపుష్పభరసాను పర్వతశిఖరాన
    కనులకు బండువై ఘనత నొంది
    క్షితిభారమువహించు కిటిరూపమొకవంక,
    సింహరూపమ్మొక్క చెంపనుండ
    సర్వదా చందనచర్చితాంగుండవై
    కొంగుబంగారమై కోర్కె దీర్చు

    సింహగిరివాస, స్వీకృతచిత్రరూప
    అతిమనోజ్ఞ బహుళ శిల్పాలయాన
    పద్మహస్తతో గొలువైన పంకజాక్ష
    అప్పలస్వామిగా బూజ లందు దేవ!

    రిప్లయితొలగించండి
  7. సింహగిరి పైన కొలువుండు శ్రీధరుండు
    నమ్మి కొలచిన భక్తుల నాదు కొనెడు
    శ్రీవరాహ లక్ష్మీనర సింహ స్వామి
    రంగడైనట్టి చందన లింగడతడె!

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగనున్నది. 3వ పాదములో నరసింహ + స్వామి అని సంధి జరిగి దానివలన హ గురువు అగును అందుచేత గణభంగము. అందుచేత స్వామికి బదులుగా మూర్తి అనండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. శ్రీనేమని గురువర్యులకు ప్రణామములు మరియు ధన్యవాదములు. తమరి సూచిత సవరణతో పద్యం:

    సింహగిరిపైన కొలువుండు శ్రీధరుండు
    నమ్మి కొలచెడు భక్తుల నాదు కొనెడు
    శ్రీవరాహ లక్ష్మీనరసింహ రూప
    రంగడైనట్టి చందన లింగడతడు

    రిప్లయితొలగించండి
  10. సిం హా చలమున కేగి నృ
    సిం హుని దర్శించ బోతి శ్రీ చందన లేపనుడై !
    సిం హాద్రి ని నుగ్ర వరాహ
    సిం హుడు గా నవతరించె శ్రేయ స్కరమై !

    రిప్లయితొలగించండి
  11. సింహాచలంపై వెలసిన వరాహ లక్ష్మీ నృసింహస్వామిపై అద్భుతమైన పద్యాలు వ్రాసిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    సుబ్బారావు గారికి,
    కమనీయం గారికి,
    సహదేవుడు గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    ముఖ్యంగా మనోహరమైన పద్యాలను రచించిన పండిత నేమాని వారికి, కమనీయం గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    రెండవ, మూడవ పాదాలలో గణదోషాలున్నాయి. సవరణకు లొంగనంటున్నవి.

    రిప్లయితొలగించండి
  12. వైశాఖి నగరపు ప్రత్యుపస్థానాన
    ………. విమల నగంబున వెలసి యున్న
    ఫలరస భరితమై పాదపములు చేయు
    ………. నీపాదసేవయె నిత్య మచట
    నవవర్ణ సారంగ నగవుల నాట్యాల
    ………. సుగంధ వీచికల్ శోభలీన
    దివ్యమంగళరూప! దేదీప్యమానమౌ
    …….. సింహాద్రి యప్పన్న సిరుల నిచ్చు

    సంతు నిచ్చు నిస్సంతుకు సంతసింప
    నాయు రారోగ్యములనిచ్చు హాయి గొలుప
    విమలమనమున మనుజులు వేడు కొనగ
    గంద గర్భిత నృహరిని కనుము నేడు.
    బ్లాగు నందలి పద్యంపు పదము లందు.

    రిప్లయితొలగించండి
  13. సింహాద్రి నున్న శ్రీ నర
    సింహా ! అప్పన్న సామి ! చిద్రూపా ! లే !
    సింహాసనమ్ము, గ్రామపు
    సింహాలను బోలు దుష్ట చేదన జేయన్.

    రిప్లయితొలగించండి
  14. సిం హా చలమున గాంచె నృ
    సిం హుని చందన మలదిన శ్రీ కంఠుని గా !
    సిం హాద్రి సాగర తీరము
    సిం హుడుగా నవత రించె శ్రేయ స్కర మై !

    ప్చ్ ! ఇప్పుడెలా ఉందో ? తమ్ముడూ ! మళ్ళీ కుస్తీ పట్టాను

    అవునూ ," అక్కయ్య ....గారూ " ఏమిటీ ? .....అబ్బే !గార్లు ఆవళ్ళు తినడానికే బాగుంటాయ్ .... ఇంచక్కా అక్కయ్యా ! అంటే ఎంత బాగుంటుందో ! సోదరు లందరికీ ఇదే మనవి .

    రిప్లయితొలగించండి