కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రామా రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే.
ఈ సమస్యను పంపిన కామరాజు సుధాకర్ గారికి ధన్యవాదములు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
రామా రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే.
ఈ సమస్యను పంపిన కామరాజు సుధాకర్ గారికి ధన్యవాదములు.
శ్రీమన్మోహనమూర్తి! మామక మనశ్శ్రీ పంకజావాస! లీ
రిప్లయితొలగించండిలా మాధుర్య విశేష తత్పర హృదారామా! ఘనశ్యామ! మత్
ప్రేమానంద విలాస భాసుర! ప్రియా! శ్రీకృష్ణ! మన్మానసా
రామా! రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే
స్వామీ! మోమున మోహనంబొదవు నా స్వాభావ్య హాసంబులే
రిప్లయితొలగించండివీ? మాయమ్ముగ దాచనేల? సఖి నీవే ప్రాణమంచున్ మదిన్
ప్రేమావేశముతోడ రాగ నకటా! ప్రీతిన్ కరమ్మంద మా
రామా? రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే.
ధామంబియ్యడనో మురారి! రుచిరాధారప్రఫుల్లాంచి తా
రిప్లయితొలగించండిరామంబై మధురాధరామృతరసప్రాసాదమై చెల్లు నీ
రామాంతర్గత మానసంబునను ధారాళంబుగన్ మోహనా
రామా రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే.
గురు తుల్యులందరికీ వందనములు. ఈరోజు కవిత్వం సెలయేరులై పారుతోంది. "రామా" ని మారామా? అంటూ గోముగా పలికించిన లక్శ్మిదేవి గారికి అభినందనలు. నమస్కారములతో...
రిప్లయితొలగించండిఅవును. లక్ష్మీ దేవిగారు అభినంద నీయురాలు.
రిప్లయితొలగించండిఒక్క రాముణ్ణి రాధ దగ్గరకు తీసుకు రావడమే కష్టంగా ఉంటే తోపెల్ల వారు ఏకంగా ముగ్గుర్ని తీసుకు వచ్చి మంచి మార్కులు కొట్టేసారు.
రిప్లయితొలగించండిశ్రీమాధుర్యశుభేక్షణాకలితుడా! శృంగారరూపాంగుడా!
రిప్లయితొలగించండిప్రేమావేశము మిన్నుతాకినది సంప్రీతిన్ విలోకింపుమీ
మామాప్రాణములీవెగాదె ఋతధామా! మోక్షసామ్రాజ్య సు
త్రామా రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే.
పింగళి శశిధర్ గారికి , మిస్సన్న గారికి అనేక ధన్యవాదములు.
రిప్లయితొలగించండి"మారామా" అనే ప్రయోగం సరిఐనది కాదేమో నని సందేహం వచ్చినది. అందుకే మరొక పూరణ వ్రాసినాను. కానీ పండితుల మెప్పు పొందినందుకు సంతోషము.
మరొక పూరణ కూడా ఇక్కడ ఉంచుతున్నాను.
ఏమా కోపమదేమి యల్క? చెలినే యిప్పట్టు సాధించుటే?
శ్యామా! నెమ్మొగమిట్లు చూపగదె? నీ సౌందర్యమేమందు? నే
మోమాటమ్మును వీడి వచ్చితినిరా, ముద్దారగా! చాలు రా
రా, "మారమ్మ"ని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే.
“ఏమా కోపము కృష్ణ ! గోపికలనన్ ? నీ( దిక్కు రాకుంటివే !
రిప్లయితొలగించండిఏమా మాయలు ? మమ్ము వీడి సఖుడా ! ఎందుంటివో దాగుచున్
స్వామీ ! నీ విరహమ్ము నోర్వ తరమా !? పారాడి నీ చెంతకున్
రామా ? " రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిమానసారాముణ్ణి పిలుస్తూ రమ్యమైన పదాలతో మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు, ధన్యవాదాలు.
*
లక్ష్మీదేవి గారూ,
మారామా అని ప్రశ్నిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
రెండవ పూరణ కూడా బాగుంది. కానీ... మారమ్ము?
*
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
రమ్యమైన సమాసాలతో మంచి ధారతో పసందైన పూరణ చెప్పారు. అభినందనలు.
*
పింగళి శశిధర్ గారూ,
ధన్యవాదాలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మోక్షసామ్రాజ్యానికి ఇంద్రుడైన వానిని సంబోధించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
కలితుడా, రూపాంగుడా అని సంబోధించడంలో తప్పేమీ లేదు కానీ ఆ పాదాన్ని ఇలా చెప్తే కర్ణపేయంగా ఉంటుందని నా సూచన...
శ్రీమాధుర్యశుభేక్షణాకలిత! సచ్ఛృంగారరూపాంగ! మా....
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
గోపికలు + అనన్ + ఈదిక్కు... అనికదా. అక్కడ "గోపకాంత లన నీదిక్కు" అందామా?
రా మాలీ కన్య కా సుమమ్ము నిలిచెన్ రంజిల్ల నీ చేతిలో
రిప్లయితొలగించండిరా మాయింటికి రార కృష్ణ వినవా రాధా ప్రియా సుందరా
రా! మా మానసమందు నిల్వమనినారా గోపికల్ మాను, మా
రామా! రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే.
ఏమీ మాధవ! యింత కాలహరణ మ్మేరీతి మేమోపుటల్?
రిప్లయితొలగించండినీ మోమాటలు చాలులే! పిలచినన్ నీ చెంతకున్ మేముగా
రామా ? రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే
ప్రేమల్ పొంగగ యామునీ తటమునన్ బృందావనీ సీమలో.
హనుమచ్చాస్త్రి గారు ఇంకో ఆకు ఎక్కువ చదివేరు.
రిప్లయితొలగించండివారి రాములు నలుగురు. (మొదటి పాదం కొంచెం చూడాలి.)
గురువుగారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. మారం = మారాము అని ఆంధ్ర భారతి నిఘంటువులో ఇచ్చినారు.
నీమోమున్ గనినంత చాలును మదిన్ నెత్తమ్మి తావుల్ గనన్
రిప్లయితొలగించండియేమా భాగ్యము నాకొసంగిన నినున్ నెవ్వేళలన్ గొల్చెదన్ !
ప్రేమే లేదని కిన్క బూనక ననున్ ప్రీతిన్ ముదం బొంద గా
రామా రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ము గా రాధ యే !
గురువుగారూ, అద్భుతమైన సవరణచేసినందులకు ధన్యవాదాలు. మీ సవరణ సర్వదా ఆమోదయోగ్యము.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిరామా రమ్మని నీవు పిల్వగ లసద్రమ్యాటవీ శోభితా
రామమ్ములకున్,నికుంజములకున్ న్నానంద సంభ్రమ్మునన్
రామామానసచోర,శ్యామలశరీరా, సుందరా, శ్రీరమా
రామా,రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
మొదటి పాదంలో 'కన్యకా' అన్నచోట గణభంగం. అక్కడ 'వనితా' అందామా.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్య గారూ,
మీ వృత్త రచన, పూరణ బాగున్నవి. అభినందనలు.
రెండవ పాదం ప్రారంభంలో ఉన్న యడాగమం దోషం.
*
కమనీయం గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం సవరించండి.
మాస్టారు గారూ ! చక్కనిసవరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ ! ధన్యవాదములు.
రా ! మాలీ! వనితా సుమమ్ము నిలిచెన్ రంజిల్ల నీ చేతిలో
రా ! మాయింటికి రార కృష్ణ! వినవా రాధా ప్రియా సుందరా!
రా! మా మానసమందు నిల్వమనినారా గోపికల్ - మాను, మా
రామా! రమ్మని కేలుసాచి పిలిచెన్ రమ్యమ్ముగా రాధయే.
నీ మాయా వలయంబుఁజిక్కి విడలేనే నీదు ధ్యాసన్నదే!
రిప్లయితొలగించండిభామా సేవలె ముఖ్యమా! విడుతునే ప్రాణంబు రావే! యశో
దా మాతే నినుపెంచినట్టి విధమా? యోదార్చ జూపించు గా
రామా? రమ్మని కేలు సాచి పిలిచెన్ రమ్యమ్ము గా రాధయే!
రిప్లయితొలగించండిఆర్యా,రెండవపాదాన్ని.''రామచ్చాయలకున్ '' అని సవరిస్తున్నాను.--కమనీయం అభివాదములతో.
భామల్ బూటకమాడు వారలనుచున్ వ్యంగ్యమ్ముగా నవ్వకే
రిప్లయితొలగించండినామాటల్ విని చూడు జింకననుచున్ నందమ్ముతో సీతయే
రామా! రమ్మని కేలుసాచి పిలిచెన్;... రమ్యమ్ముగా రాధయే
కామావేశము లేక కృష్ణుని మదిన్ గాఢమ్ముగా వల్చెనే
😊