కవిమిత్రులకు నమస్కృతులు. నిన్న మిత్రులతో కలిసి గట్టు మల్లికార్జున స్వామి క్షేత్రం, కొత్తకొండ వీరభద్రేశ్వర క్షేత్రం దర్శించుకొనడం, జాగరణంతో బ్లాగును చూసే అవకాశం దొరకలేదు. ఈ ఉదయమే ఇల్లు చేరాను. అవకాశాన్ని బట్టి సాయంత్రం వరకు పూరణపై, పద్యాలపై వ్యాఖ్యానిస్తాను. పూరణలు పంపిన మిత్రులు.... గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, పండిత నేమాని వారికి, వరప్రసాద్ గారికి, నాగరాజు రవీందర్ గారికి, సుబ్బారావు గారికి, మంద పీతాంబర్ గారికి, గండూరి లక్ష్మినారాయణ గారికి, సహదేవుడు గారికి, తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి, మిస్సన్న గారికి, అభివందనలు, ధన్యవాదాలు.
శివరాత్రి జాగరణ మున
రిప్లయితొలగించండిశివమే లేనట్టి చెత్త సినిమాల్జూస్తూ
" చివరకు మాకేమి యనిన
శివ శంకర" - యనినఁ బాపచింతన లెసఁగున్.
శివునే దలపని మనసున
రిప్లయితొలగించండిశివమే లేనట్టి చెత్త చిత్తములోనన్
" చివరకు మాకేమి యనిన
శివ శంకర" - యనినఁ బాపచింతన లెసఁగున్.
శివ చింతనలను మానుము
రిప్లయితొలగించండిశివ శంకర యనిన బాప చింతన లెసగున్
భువి నను భ్రష్టులు తథ్యము
వివిధములగు శిక్షలనుభవింతురు భువిలో
రిప్లయితొలగించండిఓం నమశ్శివాయ.."శంకరాభరణం"బ్లాగు విక్షకులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
======*=======
నవ విధ పాపము జేయగ
నవినికి దెలియని విధమున నధికారమునన్
శివ రాత్రి బర్వ దినమున
శివ శంకర యనిన,బాప చింతన లెసగున్
శివములు గలుగును ‘శంభో
రిప్లయితొలగించండిశివ శంకర ' యనిన ; బాప చింతన లెసగున్
శివ నామమ్మును మరచిన
‘శివ శివ ' యని శివుని నెపుడు చింతించ వలెన్
కవనము బాగుగ వచ్చును
రిప్లయితొలగించండిశివ ! శంకర ! యనిన, బాప చింతన లెసగున్
దుర్వ్యసనము బారి బడిన
అవగుణముల వారి కెపుడు నాశ్ర య మొద్దూ .
(మహాశివ రాత్రి శుభాకాం క్షలతో ... )
"శివరాతిరి దినమంతయు
రిప్లయితొలగించండిశివనామముభక్తిమీర చింతనజేతున్
అవినీతి మకిలి తుడువుము
శివశంకర"యనిన బాప చింతన లెసగున్!!!
భువిలో నాస్తికు డొక్కడు
రిప్లయితొలగించండిచెవికెక్కక దైవ మహిమ చెడు భావనతో
భవు గూర్చి పలికె నిట్టుల
శివ శంకర యనిన పాప చింతన లెసగున్.
గురువర్యులకు,కవి మిత్రులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిశివ రాత్రి జాగరణకై
శివ నామము మాని పేక చీటీలాడే
యవగుణమున కొండ కరిగి
శివ శంకర యనిన పాప చింతన లెసగున్!
శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండి=======*=======
లవ కుశ లేలిన భూమి రాక్షసుల నిలయమయ్యె ,
నవవిదులు జలుపు వారు నగుబాటు నొందగ, మావ
టివని మూర్ఖుల జెంత నెంతటి బిడియమ్మును లేక దిరుగి
శివ శంకర యనిన,బాప చింతన లెసగును నేడు
భవనాశమొనర్చు “భవా!
రిప్లయితొలగించండిశివశంకర” యనిన; పాప చింతనలెసగున్
శివమేమాత్రము తల్పక
భువినిన్ సల్పెడు పనులకు బుధజనులారా!
ఇవి యవి యన నేలా నే
రిప్లయితొలగించండినవినీతికి బానిసుండ నయ్యా! నీకున్
వివిధమగు కాన్క లిత్తును
శివ శంకర! యనినఁ బాపచింతన లెసఁగున్.
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినిన్న మిత్రులతో కలిసి గట్టు మల్లికార్జున స్వామి క్షేత్రం, కొత్తకొండ వీరభద్రేశ్వర క్షేత్రం దర్శించుకొనడం, జాగరణంతో బ్లాగును చూసే అవకాశం దొరకలేదు. ఈ ఉదయమే ఇల్లు చేరాను. అవకాశాన్ని బట్టి సాయంత్రం వరకు పూరణపై, పద్యాలపై వ్యాఖ్యానిస్తాను.
పూరణలు పంపిన మిత్రులు....
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
వరప్రసాద్ గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
సుబ్బారావు గారికి,
మంద పీతాంబర్ గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
సహదేవుడు గారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
మిస్సన్న గారికి,
అభివందనలు, ధన్యవాదాలు.
అవకతవక లెక్కలతో
రిప్లయితొలగించండిజవురుకొని ముడుపు లటునిటు; జపతపములతో
ప్రవచనలు జేసి, శంభో!
శివ శంకర! యనినఁ బాపచింతన లెసఁగున్