27, మార్చి 2013, బుధవారం

ఆహ్వానము


9 కామెంట్‌లు:

 1. ఆంధ్ర పద్య కవితా సదస్సు దిగ్విజయముగా జరుగు గాక.


  తెలుగు వాడా వదలెదవు తెలుగునేల? (తెలుగును ఎందుకు)
  తెలుగు వాడగ జేయక తెలుగు నేల (వాడి పోనీక)
  తెలుగు వాడగ జేయుచు తెలుగునేల (తెలుగును యేల)
  తెలుగు పద్యమ్ము నిత్యమై తేజరిల్లు

  రిప్లయితొలగించు
 2. తెలుగు వాడా వదలెదవు తెలుగునేల? (తెలుగును ఎందుకు)
  తెలుగు వాడగ జేయక తెలుగు నేల (వాడి పోనీక తెలుగు నేలపై )
  తెలుగు వాడగ జేయుచు తెలుగునేల (వాడుక జేయుచు తెలుగును యేలగా )
  తెలుగు పద్యమ్ము నిత్యమై తేజరిల్లు

  రిప్లయితొలగించు


 3. Hai! Sree GOli .... Saastri gaaru!
  your poem is very very nice. CONGRATULATIONS & BEST WISHES.

  Sanyasi Rao

  రిప్లయితొలగించు
 4. రెండవ పాదం లో ' జేయక ' బదులు ' జేయకు ' అంటే ఇంకా అర్థవంతంగా ఉంటుందని నా భావన....

  రిప్లయితొలగించు
 5. రామ జోగయ్య గురువులు రాణ యొప్ప
  ఆంద్ర పద్యాల సొబగును నాం ధ్రు లకును
  విశ ద ప ఱచగ నాతని వివరణ మున
  తెలుగు పద్యమ్ము నిత్యమై తేజరిల్లు .

  రిప్లయితొలగించు
 6. మా అమలాపురపట్టణమున జరుగబోవు శ్రీ పండిత నేమాని వారి ఆధ్యాత్మిక ప్రసంగాహ్వానపత్రికాముఖమునకు స్పందించిన శ్రీగోలి హనుమచ్ఛాస్త్రి గారికి ఇప్పుడే తెలిసిన విషయము మానాన్నగారికి మిత్రులు అయిన శ్రీ పోచిరాజు సుబ్బారావు గారికి నమస్సులు అభినందనలు.

  రిప్లయితొలగించు 7. అల కైలాసము నందు నీశ్వరుడు నాహ్లాదంబుతో గౌరికిన్
  దెలియం జెప్పగ దివ్యగాధ - " భువిలో ధీమంతుడై రాముడై
  వెలసెన్ విష్ణువు దైత్యనాశముకు " నావిర్భూతమై రమ్యమై
  తెలుగున్ రామకధామృతంబు వఱలెన్ ధీవర్య నేమానియున్  అలతి యలతి పదముల నలసత్వమున్
  లేక కవిత లల్ల -మూక గానె
  అచల గాంభీర్యమ్ము నమరత్వమున్ గల్గు
  గైత లన్నియుఁ జూచి కైపు బడనె
  విమల పాండిత్యమ్ము విభవమ్ము నే గాంచి
  విభ్రాంతి నొందనే వినతు లిడుచు
  సకల శోభల వెల్గు సరసంపు గవిత్వమ్ము
  చెలువమ్ము మీఱగఁ జెవులు నిడనె

  కవులు నెందఱొ గల్గరే యవని లోన
  కవిత లెన్నియొ పుట్టు నీ భువిని యందు
  మధుర కవి యౌట మీ జిహ్వ సుధలుఁ గురియ
  మాన్య పండిత ! నతుడై నమస్కరింతు !!!

  అన్న గారికి ప్రణామములు.

  రిప్లయితొలగించు