అయ్యా! శ్రీ తోపెల్ల శర్మ గరూ! శుభాశీస్సులు. మీరు మంచి ఉత్సాహముతో ఎత్తుకొన్నారు ఒక పంచచామరమును. మా ప్రశంసలు. ఆ పద్యములో ఎన్నెన్నో సంధులు చేయవలసి వస్తుందని మీరు గమనించలేదు. ఓం నమశ్శివాయ + ఓం నమశ్శివాయ + ఓం + ఓం...... -- య + ఓ = యౌ అగును కదా. స్వస్తి.
అయ్యా! శ్రీ తోపెల్ల వారూ! శుభాశీస్సులు. మీ ప్రయత్నములు ప్రణవము గురించి చాలా భక్తి నిధానములై విరాజిల్లుచున్నవి. సంతోషము. ఓం నకు యతి మైత్రి ఉ ఊ ఒ ఓ లతో వేయుటయే సమంజసము. ఇతరములయిన ఆలోచనలు వద్దు. స్వస్తి.
గరళము మ్రింగిన దేవుని
రిప్లయితొలగించండిస్మరణము శివరాత్రి సలిపి సన్మతి తో జా
గరణము జేసిన వారిని
కరుణను తా బ్రోచు గాదె గంగా ధరుడే.
జ్ఞానతేజమ్ముతో జగములెల్లను మహా
రిప్లయితొలగించండి....కాంతిమంతంబులై క్రాలునట్లు
నిండి పాతాళమ్ము నుండి యత్యున్నత
....లోక పర్యంతమ్ము నేక దివ్య
లింగాకృతిన్ దాల్చి శ్రీకంఠ! యావిర్భ
....వించె దీవనుచు నిన్ గాంచి వేడ్క
సకలోపచారముల్ సద్భక్తితో జేసి
....యభిషేక మొనరింతు మనుచు దలచి
ఉపవసించుచు గావించి జపతపములు
రాత్రి నెంతయు నీ సేవలను బొనర్చి
జాగరణము నొనర్తుము స్వామి! మమ్ము
కరుణ గని ప్రోవరావె? శంకర! గిరీశ!
హరహర! పురహర!భవహర!
రిప్లయితొలగించండికరుణాకర! చంద్రచూడ! ఖట్వాంగ ధరా!
పరమేశ! యంచు వినిజా
గరణము చేయంగముక్తి కలుగును ధరలో!
జాగరణము సేసి రాగ మొప్పమిగుల
రిప్లయితొలగించండిపెద్ద వారు కూడ పిన్న లయ్యి
శివుని నామ శతము శివ రాత్రి దినమున
పఠన జేయుదు రట పావ నముగ
ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంనమః
రిప్లయితొలగించండిఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంనమః
ఓంనమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓంనమః
ఓంనమోయనంగ జాగరమ్ము ముక్తి నిచ్చుతన్.
విషయ సుఖమ్ములందున వివేకము వీడి మునుంగు చిత్తమున్
రిప్లయితొలగించండివిషధరు పాదపద్మమను పెన్నిధి యందున నిల్ప గోరుచున్
శషభిష లెంచనేల మనసా! శివరాతిరి నేడె, యీ మహా
విషవలయమ్మునుండి యొక పెట్టున జాగరణమ్మె లాగదే!
లక్శ్మీదేవి గారూ! మానవ చింతన విషయవాంచలకు లోను కాకుండా ఎలా ఉంటే మంచిది అన్న విషయం బాగా సెలవిచ్చినారు. అభినందనలు.
రిప్లయితొలగించండిఅయ్యా! శ్రీ తోపెల్ల శర్మ గరూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
మీరు మంచి ఉత్సాహముతో ఎత్తుకొన్నారు ఒక పంచచామరమును. మా ప్రశంసలు. ఆ పద్యములో ఎన్నెన్నో సంధులు చేయవలసి వస్తుందని మీరు గమనించలేదు. ఓం నమశ్శివాయ + ఓం నమశ్శివాయ + ఓం + ఓం...... -- య + ఓ = యౌ అగును కదా. స్వస్తి.
Tbs Sarma gaaroo!
రిప్లయితొలగించండిsugamdhi vRttamunaku pamcacaamaramu annaanu. tappu diddukomdaamu. swasti.
చలన చిత్రమన్న జాగరణము జేతు
రిప్లయితొలగించండిజూదమన్న రాత్రి జోగ బోను
శివుని స్మరణ మన్న చెంగున నేతెంచు
పాడు నిద్ర ముందె పండుకొందు.
జాగరణము రాత్రంతయు
రిప్లయితొలగించండిమూగుచు వ్యసనములఁదేలుముచ్చట కాదే!
యే గుణ సవరణ యుచితమొ
బాగుపడగ, దానిఁగూర్చి భావించుటయే!
శ్రీనేమాని పండితార్యులకు శతాధిక నమస్సులు. పంచాక్షరీ పారాయణను మించినదేమియున్నది అన్నభావనా జగత్తున పడి వృద్ధిసంధిని విస్మరించినాను. ఈ సుగంధి ఈశ్వరార్చనకు పనికిరాదేమో మొగలి పూవువలె. సంస్కరించు శబ్దశక్తి,
రిప్లయితొలగించండిఅర్థశుద్ధి నాకు లేమిటంజేసి సుగంధిని ఉత్సాహగా మార్చుకొనుచు దానికి గీతము కలిపి
“ఉత్సాహ వేదండ సీసము” గా మార్చుటకు ప్రయత్నము చేసినాను. “ఓం” కు యతి అక్షరము శ్రీపండితులవారి ప్రయోగమునే గ్రహించినాను. అన్యత్ర వేరే అక్షరము దొరుకలేదు. వారికి కృతజ్ఞ్జుడను. అ+ఉ+మ=ఓం అందురు గనుక ఆమూడింట ఏదో ఒకదానికి యతిగా తీసికొనవచ్చునా? నాయీప్రయత్నమునందలి దోషములను పెద్దలు తెలుప మనవి.
“ ఉత్సాహ వేదండ విషమసీసము”
ఓంనమశ్శివాయ సకల యోగ కారకంబగున్
ఓంనమశ్శివాయ దివ్య యోచనప్రదాయినీ
ఓంనమశ్శివాయ ముక్తి యోగ మంత్ర రాజమే
ఓంనమశ్శివాయ పరమ యోగి ప్రణవ నాదమే
అనుచు మదినంత భావించి యనుపమాన
పుణ్య దంపతుల భజించి పూజసేయు
జాగరణ తరుణమె భవసాగర తరు
ణమని భావన చేయుచు నతులొనర్తు.
రిప్లయితొలగించండిదేశసరిహద్దులనుగాచి,దేశ శత్రు
చర్యలను ద్రిప్పి కొట్టెడి సైనికులకు,
సావధానులై వ్యూహ రచనల జేయు
నధిపతులకు జాగరణమ్మె యన్నివేళ.
నేటి అంశంపై మనోహరమైన పద్యాలను రచించిన కవి మిత్రులు...
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
సుబ్బారావు గారికి,
లక్ష్మీదేవి గారికి,
మిస్సన్న గారికి,
సహదేవుడు గారికి,
కమనీయం గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
గురువు గారు, శర్మ గారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలండి.
అయ్యా! శ్రీ తోపెల్ల వారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ ప్రయత్నములు ప్రణవము గురించి చాలా భక్తి నిధానములై విరాజిల్లుచున్నవి. సంతోషము. ఓం నకు యతి మైత్రి ఉ ఊ ఒ ఓ లతో వేయుటయే సమంజసము. ఇతరములయిన ఆలోచనలు వద్దు. స్వస్తి.
శ్రీ పండితార్యులకు ప్రణామములు. ధన్యుడను.
రిప్లయితొలగించండిఉత్సాహముగా మత్త వేదండము నెక్కిన శర్మగార్కి
రిప్లయితొలగించండిఅభినందనలు.
అన్నా! మిస్సన్నా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండి