4, మార్చి 2013, సోమవారం

సమస్యాపూరణం – 984 (తన బాణము కలత వెట్టె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తన బాణము కలత వెట్టె త్ర్యంబకు మదిలో.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

20 కామెంట్‌లు:

  1. విన మన్మథు మసి జేసెను
    కనె పార్వతి కనులముందు కామేశ్వరియే
    కను చూపుల విడ తూపులు
    తన బాణము కలత వెట్టె త్ర్యంబకు మదిలో.

    రిప్లయితొలగించండి
  2. మనమును మోహింపదగిన
    చినదానిని మోహినియను శ్రీహరి రూప
    మ్మునుఁ జూడగనే ప్రియపా
    తన బాణము కలత వెట్టె త్ర్యంబకు మదిలో.

    ప్రేమపాతనము =కన్ను అని నిఘంటువులో ఉన్నది. (ప్రియపాతనము నా ప్రయోగము.తప్పైన తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  3. అనువున మార్కండేయుడు
    తన బాణము బొడుచు కొనగ దన బాణము తోన్
    కనినా దృశ్యము , భవునకు
    తన బాణము కలత వెట్టె త్య్రం బకు మదిలో .

    రిప్లయితొలగించండి
  4. మనసిజుడు వేయ బాణ
    మ్మును శంకరుపైని చెంత భూభృత్సుత యుం
    డిన వేళనంత ఝషకే
    తన బాణము కలత వెట్టె త్ర్యంబకు మదిలో

    రిప్లయితొలగించండి
  5. తనది వరాహమని హరుడు
    తనదే కిరమని విజయుడు తగవులు పడగన్
    తనపై వేసిన కపికే
    తన బాణము కలత వెట్టె త్ర్యంబకు మదిలో

    రిప్లయితొలగించండి
  6. అనలాక్షు తపోభంగ
    మ్మెనరింపగ మన్మథుండు పూనికతో వే
    సెను సమ్మో హము బెంచెడి
    తన బాణము, కలత వెట్టె త్ర్యంబకు మదిలో.

    రిప్లయితొలగించండి

  7. శ్రీ శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని వారికి పాదాభివందనము జేయుచు
    =======*===========
    తన సుతుడని దెలియక వే
    సిన శిక్షకు వగచి వేగ సేవక జనులన్
    మును దెమ్ము శిరము నొకటని
    తన బాణము కలత వెట్టె త్ర్యంబకు మదిలో

    రిప్లయితొలగించండి
  8. గండూరి వారి పూరణ చాలా బాగుంది మంచి విరుపుతో.

    రిప్లయితొలగించండి
  9. విను, ధనువు నెక్కు వెట్టిన
    మనసిజు డొక పూవు గోల మత్తుగ నాటం-
    గను కనె గిరిజను తన చెం-
    తన, బాణము కలత వెట్టె త్ర్యంబకు మదిలో!

    రిప్లయితొలగించండి
  10. వినుము సతీ! యజ్ఞమునకు
    జనుటయు సత్ఫలమునీయజాలదనుచుఁ జె
    ప్పిన వినక జనియెడు ప్రవ
    ర్తన బాణమె కలతఁ వెట్టె త్ర్యంబకు మదిలో

    ప్రవర్తన బాణము = భర్త యొక్క ఆలోచనాతిరస్కారమనెడు మాట

    రిప్లయితొలగించండి
  11. తన తపమున మునిగి శివుడు
    తన నెంతయొ పూజ సేయు తరుణిని జూచెన్
    ననవిలుతు డేయగ నచే
    తన బాణము , కలత వెట్టె త్ర్యంబకు మదిలో

    ( మన్మథుని పంచబాణములు - మోహనము, ఉన్మాదనము, సంతాపనము, శోషణము, నిశ్చేష్టాకరణము )

    రిప్లయితొలగించండి
  12. వనమున దిరుగు నిషాదుడు
    మనమున దిలకించి నెంచె మాయగ దోచున్ !
    కనినంత కాంచన మృగమది
    తన బాణము కలత వెట్టు త్ర్యంబకు మదిలో !

    రిప్లయితొలగించండి




  13. ఘనమగు తపమును గిరినం
    దన శంకరుగూర్చి చేయ దపము ఫలింపన్
    జను నింద్రు నాజ్ఞ ,ఝషకే
    తన బాణము కలతవెట్టె త్ర్యంబకు మదిలో .

    రిప్లయితొలగించండి
  14. అనుమానింపక మారుడు
    చనవున్ గలుగగ కుమార సంభవ మెంచన్
    మనమున నలుగుగ వేయన్
    తన బాణము కలత వెట్టె త్ర్యంబకు మదిలో.

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న గ్రామాంతరం వెళ్ళడం వల్ల పూరణలను, పద్యాలను చూసి వ్యాఖ్యానించే అవకాశం లభించలేదు. మన్నించండి.
    పూరణలను పంపిన మితులు....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారకి,
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్బారావు గారికి,
    పండిత నేమాని వారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    వరప్రసాద్ గారికి,
    మిస్సన్న గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    కమనీయం గారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. తన నాథుని బ్రతికింపగ
    వినుతించుచు రోదనమున వేగెడు రతిఁ జూ
    చిన, భృకుటి నేత్ర సంధిత
    తన బాణము కలతఁ బెట్టె త్ర్యంబకు మదిలో
    (మూడవ కంటి బాణాగ్నిలో దహించి నాడను భావంతో)

    రిప్లయితొలగించండి
  17. తన యెన్నికలో జేసిన
    కనివిని యెరుగని ప్రతినల కలతలు మీరన్
    వినువీధిని వేసిన "వే
    తన బాణము" కలత వెట్టె త్ర్యంబకు మదిలో

    త్ర్యంబకుడు = చంద్రశేఖర రావు (KCR)

    దుష్ట సమాసమును మన్నించ వలెను!

    రిప్లయితొలగించండి
  18. రణమున నెన్నిక లందున
    కినుకను సంధించి విల్లు కేకల తోడన్
    పనిపిన మోడిని పైనన్
    తన బాణము కలత వెట్టె త్ర్యంబకు మదిలో

    త్ర్యంబకుడు = చంద్రశేఖరుడు

    రిప్లయితొలగించండి