5, మార్చి 2013, మంగళవారం

సమస్యాపూరణం – 985 (శ్రీకృష్ణుని మేనమామ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శ్రీకృష్ణుని మేనమామ సీతాపతియే.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

29 కామెంట్‌లు:

  1. గోకులమును బాధించెను
    శ్రీకృష్ణుని మేనమామ, సీతాపతియే
    లోకములను బ్రోచెను ఘో
    రాకారుని గూల్చి రావణాసురు ననిలో

    రిప్లయితొలగించండి
  2. శ్రీకృష్ణ మాకు చుట్టము
    మా కృప పిన్నమ్మ కొడుకు మా యూరేలే
    తా కృతి నిచ్చెను వాడికి
    శ్రీకృష్ణుని మేనమామ సీతాపతియే

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. శ్రీకరుడిని దా మెచ్చడు
    శ్రీకృష్ణుని మేనమామ, సీతాపతియే
    గోకులమున జన్మించుట
    చీకాకులు దెచ్చి పెట్టు జెల్లికి దనకున్

    రిప్లయితొలగించండి
  5. అయ్యా! శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. మొదటి పాదములో "క్ష" ప్రాస అక్షరముగా వేసేరు కదా. అందు వలన ప్రాస భంగము కలిగినది. కొంచెము మార్చితే బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. ఏ కృతి చెప్పిన వచనము
    "శ్రీకృష్ణుని మేనమామ సీతాపతియే!"
    శ్రీకృష్ణుడె సీతాపతి!
    యాకృతులవి వేరు గాని హరిదాల్చినవే!

    రిప్లయితొలగించండి
  7. రక్కసుల రే డు కంసుడు
    శ్రీ కృష్ణుని మేనమామ, సీ తా పతియే
    గోకుల నాధుని రూ పము
    శ్రీ కృష్ణుడు రాము డనగ శ్రీ కర మూర్తుల్

    రిప్లయితొలగించండి
  8. నికముగ నికృష్టుడాతడు,
    శ్రీకృష్ణుని మేనమామ; సీతాపతియే
    దా కృష్ణునిగా నిలలో
    నా కంసు వధింప వచ్చెనందురు గాదే!

    నికము= నిక్కము

    రిప్లయితొలగించండి
  9. సుబ్బా రావు గారూ నమస్తే! ప్రథమ ప్రాసాక్షరం “ క్క” వేసారు. ప్రాస భంగము పరిశీలింప మనవి.
    లక్ష్మీదేవిగారూ! నమస్తే!ప్రథమ పాదాద్యక్షరం దీర్ఘము కాలేదు. నిక్కము చూచిన గణభంగము. పరిశీలింప మనవి.

    రిప్లయితొలగించండి
  10. చీకాకు పెట్టు నరకుడు
    శ్రీకృష్ణుని మేనమామ, సీతాపతియే
    గోకుల వాసుల గాచిన
    శ్రీకృ ష్ణుని శర ణు వేడె చింతితు డగుచున్.

    (సీత= ఇంద్రుని భార్య)

    రిప్లయితొలగించండి
  11. నికృష్టుడు కఠినాత్ముడు
    శ్రీకృష్ణుని మేనమామ ; సీతాపతియే
    లోకముల గాచు, నాతని
    యాకృతి దాల్చినది ధర్మ మటులన్ మహిలో !

    రిప్లయితొలగించండి
  12. అయ్యా! శ్రీ నాగరాజు రవీందర్ గారూ! శుభాశీస్సులు.

    మీ పద్యము "నికృష్టుడు కఠినాత్ముడు" అని మొదలు పెట్టేరు. 2, 3, 4 పాదములలో మొదటి అక్షరము దీర్ఘము కాబట్టి మొదటి పాదములో కూడా మొదటి అక్షరము దీర్ఘము అయి యుండవలెను. ఆలాగుననే నికృష్టుడు అంటే లఘువు గురువు లఘువు లఘువు అవుతోంది. ని గురువు కాబోదు. దాని తరువాత నున్న అక్షరము కృ అనేది సంయుక్తాక్షరము కాదు. కొంచెము గమనించి గణభంగమును సరిజేసికొనండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. భీ కర నేత్రుడు కంసుడు
    శ్రీ కృష్ణుని మేనమామ, సీ తా పతియే
    గోకుల నాధుని రూ పము
    శ్రీ కృష్ణుడు రాము డనగ శ్రీ కర మూర్తుల్

    రిప్లయితొలగించండి
  14. నిజమే గురువర్యా ! నేను గమనించనే లేదు. ‘ భీకరుడును ' అని మార్చుతున్నాను. ధన్యవాదములు.


    భీకరుడును కఠినాత్ముడు
    శ్రీకృష్ణుని మేనమామ ; సీతాపతియే
    లోకముల గాచు, నాతని
    యాకృతి దాల్చినది ధర్మ మటులన్ మహిలో !

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని వారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరిస్తున్నది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహమూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసింపదగినదే...
    మొదట సంయుక్తాక్షరం వేసి ద్విత్వంగా సవరించారు. ప్రాసదోషం.
    "సోకులకు రేడు కంసుడు" అందాం. సోకుడు = రాక్షసుడు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మంచి భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
    మొదటి పాదం ఆద్యక్షరం లఘువై గణదోషం.
    "ఏకముగ నికృష్టు డతడు" అందామా?
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పూరణ సందిగ్ధంగా ఉంది.
    నరకుడు శ్రీకృష్ణుని మేనమామ ఎలా అయ్యాడు? అలాగే ఇంద్రునకు సీత అనే మరో భార్య ఉందా లేక అది శచికి పర్యాయపదమా?
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మంచి భానంతో పూరణ చెప్పారు. అభినందనలు.
    నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా.
    అక్కడ "ప్రాకటముగ కఠినాత్ముడు" అందామా?

    రిప్లయితొలగించండి
  16. సుబ్బారావు గారూ,
    రవీందర్ గారూ,
    ఇద్దరూ భీకర శబ్దాన్నే ఆశ్రయించి సవరణ చేసారు. నేను సూచించిన సవరణలకంటే ఇదే బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. గురువుగారు, శర్మ గారు, తప్పును సూచించినందుకు, సవరణకు ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  18. కుబ్జ ప్రకటన:

    తాకన్దాకక మార్చెం
    బో కుబ్జాకృతిఁ దయఁగని , "భూప" యన ప్రజా
    నీకమ! యితండె! నిక్కము!
    శ్రీకృష్ణుని మేనమామ? సీ! తా పతియే??

    రిప్లయితొలగించండి
  19. ఏకృపగ నవత రించెను
    శ్రీ కృష్ణుని మేనమామ సీతా పతియే !
    ఆకృతిని మార్చు చుండిన
    ఈ కృతకపు జగతి యందు వింతలు కొదవే ? !

    రిప్లయితొలగించండి
  20. శ్రీ శంకరార్యులకు నమస్సులు. ప్రమాదవశమున కంసుడు బదులు నరకుడు ప్రాసితిని. మీరుచెప్పువరకు గుర్తించలేదు. ధన్యవాదములు. ఆంధ్ర నిఘంటువునందు “సీత” శబ్దమునకు ఇంద్రుని భార్య అని యున్నది. అంతర్జాల నిఘంటువుల శాస్త్రీయత నాకు తెలియదు. అందు పూర్వకవి ప్రమాణమును చూప లేదు. పెద్దలు తెలియజేయగలందులకు మనవి.

    సవరించుచూ

    చీకాకు పెట్టు కంసుడు
    శ్రీకృష్ణుని మేనమామ, సీతాపతియే
    గోకుల వాసుల గాచిన
    శ్రీకృ ష్ణుని శర ణు వేడె చింతితు డగుచున్.

    (సీత= ఇంద్రుని భార్య)

    రిప్లయితొలగించండి
  21. భీకర కంశుడెవండొకొ?
    కాకాసురునణచె నెవఁడు? గణియింపుడిటన్
    ప్రాకటమగు క్రమముగ నవి
    శ్రీకృష్ణుని మేనమామ. సీతాపతియే.

    రిప్లయితొలగించండి
  22. చీకాకుపరిచెలోకుల
    శ్రీకృష్ణునిమేనమామ;సీతాపతియే
    గోకులపతియై భీకర
    రాకాసులగూల్చె ధర్మరక్షణకొఱకై !!!





    రిప్లయితొలగించండి
  23. మీ కెవ్వరికిని తెలియదు
    గా కౌరవనాధు డనగ కనిపించిన వా
    డా కాంట్రాక్టరు రెండవ
    శ్రీకృష్ణుని మేనమామ సీతాపతియే.

    రిప్లయితొలగించండి
  24. నాకు పురాణము తెలియదు -

    శ్రీకృష్ణుని మేనమామ సీతాపతి యే
    లోకములోనుండునొ - ము
    ల్లోకములు యశోద జూచె లోకేశునిలో

    రిప్లయితొలగించండి
  25. ఆ కంసుడే గద భడవ!
    శ్రీకృష్ణుని మేనమామ;..సీతాపతియే
    కాకుత్స వంశ గర్వము
    కైకేయికి వెల్లడించి కదలెను కానన్

    రిప్లయితొలగించండి