19, మార్చి 2013, మంగళవారం

సమస్యాపూరణం – 999 (అపకార మ్మొనరించు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
అపకార మ్మొనరించు దుష్టులకు సాహాయ్యంబు సేయం దగున్.

14 కామెంట్‌లు:

  1. విపరీతంబని పల్కరాదు వినుడీ విజ్ఞాన సద్బోధచే
    రిపు వర్గంబును ద్రొక్కి సద్గుణ తతుల్ పెంపొందజేయందగున్
    కృపతో దుష్టుల రీతి మార్చనగు సంప్రీతిన్ వివేకుల్ బళా!
    అపకారమ్మొనరించు దుష్టులకు సాహాయ్యంబు సేయందగున్

    రిప్లయితొలగించండి
  2. జపముల్ సేయుట వోలెనే పరులకున్ సాయమ్ముఁ జేయంగదే
    కుపితుండై మనుజుండు నేర్చుకొనడే, కొంతైన యోచింపడే?
    యుపకారమ్మొనరించు వారికిని యే యున్మాదమందుండియో
    యపకార మ్మొనరించు దుష్టులకు సాహాయ్యంబు సేయం దగున్.

    రిప్లయితొలగించండి
  3. ఉపకారంబొనరించు వారలకు నీ యుర్విన్ సదా నేడు ప్ర
    త్యుపకారం బొనరించువారు గలరేముందోయి గోప్పందులో
    నపకారంబొనరించు దుష్టులకు సాహాయ్యంబు సేయందగున్
    అఫుడే మానవ జన్మ సార్థకమగున్ హర్షించు ముల్లోకముల్ .

    రిప్లయితొలగించండి
  4. వేమన పద్యం "ఉపకారికి నుపకారము"... పద్యాన్ని మత్తేభం లో చెప్పాలనుకున్నాను.అదే విషయం లక్ష్మీనారాయణ గారు చక్కగా చెప్పారు. వారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
    కపటమ్మొప్పుచు సల్పుచుండెనిట దుష్కార్యంబు లెన్నాళ్ళుగా
    క్షపణాంతర్గత భావజాల యుతులుగ్రాకృత్యముల్ సేయగా
    నపకారమ్మొనరించు దుష్టులకు సాహాయ్యంబు సేయందగున్
    నృప పాకీయులు మౌఢ్యులై తలచె తన్వీభారతంబున్ గదా.

    రిప్లయితొలగించండి
  6. ఈరోజు ఎందుకో తక్కువ పూరణలు వచ్చాయి. మత్తేభం అయినందుకా? చక్కని పూరణలు చెప్పిన...
    పండిత నేమాని వారికి,
    లక్ష్మీదేవి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    తోపెల్ల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  7. అపకారమ్ములు జేయబూన కుజనుల్ యాయత్నముల్ గూర్చుగా
    నుపకారమ్ములె సజ్జనావళికి సద్యుద్యుక్త ధీమంతులు
    న్నపకారమ్ములు జేయ నోపుదురె యాహ్ల్లదంబు వాటిల్లగా
    నపకార మ్మొనరించు దుష్టులకు సాహాయ్యంబు సేయం దగున్.

    రిప్లయితొలగించండి
  8. ఉపకారం బొనరించ కున్నను మదిన్ను ద్విగ్నతన్ బొందకన్
    తపముల్ జేసిన మౌని పుంగవు లనన్ తాల్మిన్ ప్రశాంతం బుగా
    శపియించన్ సురజాతి వైర తతికిన్ శాపంబులన్ మార్తురే
    అపకా రమ్మొన రించు దుష్టులకు సాహాయ్యంబు సేయం దగున్ !

    రిప్లయితొలగించండి


  9. అపుడే చెప్పెనుగాదె యా శతకమందా నీతిసూక్తిన్ దగన్
    విపులంబయ్యెనుగాని నేటి దినముల్ విధ్వంసకార్యంబులన్
    దపవాదంబది,యేమొ యాచరించవలెగా యత్యంత జాగ్రత్తతో
    ' అపకారమ్మొనరించు దుష్టులకు సాహాయ్యంబు సేయందగున్. '

    రిప్లయితొలగించండి
  10. తపమున్ జేయుచు మోడి వర్యుడచటన్ దండింపగన్ పాకులన్
    కుపితుండౌచును రాహులుండిచటనున్ క్రూరమ్ముగా దెప్పగా
    నెపముల్ జెప్పక కాంగ్రెసాధములకున్ నీచమ్మునౌ తీరున
    న్నపకార మ్మొనరించు దుష్టులకు సాహాయ్యంబు సేయం దగున్

    రిప్లయితొలగించండి