18, మార్చి 2013, సోమవారం

సమస్యాపూరణం – 998 (వెఱ్ఱివారలు....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వెఱ్ఱివారలు సదసద్వివేక నిధులు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

17 కామెంట్‌లు:

  1. దంభ మాత్సర్య ఘనులౌచు తామె పెద్ద
    లటుల తిరుగాడు కుహనా మహాత్ముల పలు
    కారు కూతల సారమ్ము గాంచి తేని
    వెఱ్ఱివారలు సదసద్వివేక నిధులు

    రిప్లయితొలగించండి
  2. ధూర్తు లైనట్టి వారలు తూలనాడ
    నోర్పు తోడను సైచి తామూరుకుంద్రు
    చేతగానట్టి వారని చేరియనుట
    వెఱ్ఱి, వారలు సదసద్వివేక నిధులు.

    రిప్లయితొలగించండి
  3. ఎంచి చూడగ తొణకరు మంచి వారు
    వంచ ననుమాట తెలియదు కించ పరచ
    అట్టి వారల నారడి బెట్టు వారు
    వెఱ్రి వారలు సరసద్వి వేక నిధులు

    రిప్లయితొలగించండి
  4. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    సంప్రదాయపు విద్యల స్థానముల వి
    దేశ పద్ధతు లందు ప్ర వేశ పెట్ట
    వెఱ్ఱి, వారలు సదసద్వివేక నిధులు,
    మునుపటి మహానుభావులు ముందు తెలియ.

    రిప్లయితొలగించండి
  5. వెఱ్రి వాడనిరి జనులు వేవిధముల
    రామకృష్ణ పరమహంస రమణు గనుచు
    తెలిసి కొనలేరు మూర్ఖులు తేఱి చూచి
    వెఱ్ఱివారలు సదసద్వివేక నిధులు

    రిప్లయితొలగించండి
  6. భోగ భాగ్యము లందుట మునపు లేక
    ప్రభుల వెంబడి భక్తితో పాఱకుండ
    యాత్మఁ దమలోన నితరుల నరయు టగునె
    వెఱ్ఱి ? వారలు సదసద్వివేక నిధులు.

    మునపు = కోరిక

    రిప్లయితొలగించండి
  7. కోటి విద్యలు చేఁజిక్క కూటి కొఱకు
    పరుగు లెత్తుచు జొత్తురు పరుల భూమి
    తిరిగి వ్రాతురు పద్యముల్ తెనుగు నందు
    వెఱ్రి వారలు ! సదసద్వివేక నిధులు !

    రిప్లయితొలగించండి
  8. పరులు బొగడంగ నువ్వెత్తు బరగు వారు
    వెఱ్ఱి వారలు, సద సద్వివేక నిధులు
    మంచి కార్యంబు లొరులకు మాన కుండ
    చేయు చుందురు నిరతము జిష్ణు దలచి

    రిప్లయితొలగించండి
  9. ఈనాటి సమస్యకు చక్కని పూరణ లందించిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    గోలి హనుచమచ్ఛాస్త్రి గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    సుబ్బారావు గారికి
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  10. ఆత్మగూర్చిన జ్ఞానము నందుకొనియు
    తనదు వారలు పరులను ధ్యాసమరచి
    మెలగ పిచ్చివారని మదిఁదలచు టన్న
    వెఱ్ఱి , వారలు సదసద్వివేక నిధులు

    రిప్లయితొలగించండి
  11. తప్పు లెన్నుచు జ్ఞానుల దెప్పువారు
    వెఱ్ఱివారలు, సదసద్వివేక నిధులు
    పంచుదురు జ్ఞాన సంపద పామరులకు
    కుక్కలరుపులని వారలలెక్కగొనక.

    రిప్లయితొలగించండి
  12. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    "కుక్కల + అరుపులు" అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "కుక్కల యరుపు లని వారు లెక్క గొనక" అందాం.
    "కుక్కలు + అరుచు" అంటే ఉత్త్వసంధి జరుగుతుంది. అప్పుడు "కుక్క లరుచు ననుచు వారు లెక్కగొనక" అనవచ్చు.

    రిప్లయితొలగించండి




  13. వెఱ్రి వారలు సదసద్వివేకధనులు
    అనుచు ధనాశాపరుల ,దుష్టాత్ము లైన
    వారి,లౌకికవాదుల వాదమిదియె
    చేతగానివారు సదాచార చిత్తులెల్ల.

    రిప్లయితొలగించండి
  14. కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ధనులు + అనుచు’ అన్నప్పుడు సంధి జరుగుతుంది కదా. ‘ధనాశా’ అన్నప్పుడు గణదోషం. నా సవరణ....
    వెఱ్ఱి వారలు సదసద్వివేకధనుల
    టంచు ధనలుబ్ధులైన ,దుష్టాత్ము లైన....

    రిప్లయితొలగించండి
  15. కట్టు బట్టలను విడిచి కట్టి గోచి
    వెండి బంగారుల విసిరి వీధిలోన
    శంకరుని చరణమ్ముల శరణు వేడు
    వెఱ్ఱివారలు సదసద్వివేక నిధులు

    రిప్లయితొలగించండి