8, మార్చి 2013, శుక్రవారం

పద్య రచన – 274 (మానవత్వపు విలువలు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"మానవత్వపు విలువలు"
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

22 కామెంట్‌లు:

  1. ఇదొక క్రొత్త వృత్తము. నవకోకిలా వృత్తము అందామా?

    మానవత్వపు విలువలన్నియు మంచి సంపదలౌచు వి
    జ్ఞాన సంపదలను సమృద్ధిగ సాకి గూర్చు సుఖమ్ములన్
    దానవేశులు మదబలాంధులు ధాత్రి నాయకు లౌటచే
    మానవత్వపు విలువలియ్యెడ మండి బూడిద యయ్యెగా

    రిప్లయితొలగించండి
  2. మానవత్వపు విలువలు మంట గలిపి
    మనుజ జాతికి జెందిన మహితు డొకడు
    దొంగ లెక్కలు సృష్టించి దొరగ నుండి
    జైలు బాలయ్యె పాపము జనము విడిచి .

    రిప్లయితొలగించండి
  3. కరుణ యలరఁగ సదయుండు నరులఁ జేయు
    సేవ లన్నియు హరి ప్రీతి స్వీకరించు ;
    మానవత్వము త్యజియించి మతము పేర
    హత్య లొనరింప నది దైత్య కృత్యమగును !

    రిప్లయితొలగించండి
  4. అన్నయ్య గారికి అభినందనలు . మీ వృత్తానికి నా పేరు ' రామ కోకిల '

    రిప్లయితొలగించండి
  5. రామకోకిల వృత్త లక్షణములు ;

    రామకోకిల రమణకోకిల రామకోకిల కోకిలా

    ర,న, స, స, జ, జ, గ గణాలు ,12 వ అక్షరము యతి, ప్రాస లక్షణ కలితము, రసభరితము యీ వృత్త లక్షణములు.

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    మనోహరమైన వృత్త సృష్టి. ధన్యవాదాలు.
    మత్తకోకిల వృత్తానికి గల నడక, అన్నే మాత్రలు... గన్నవరపు వారి సూచన స్వీకరింపదగింది.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    'దొరగ నుండి' అర్థం కాలేదు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. శ్రీగురుభ్యోనమః
    నవ కోకిళ వృత్త కర్తలైన శ్రీ నేమని గురువర్యులకు హృదయ పూర్వక అభినంధనలు.
    నీతి లేని నడత జాతిని పీడించె
    మాన ప్రాణ రక్ష మంట గలిసె
    తోటి వారిఁ గొట్టు కోటీశ్వరులుయేలఁ
    మానవత్వ మన్న మాట బరువు!

    రిప్లయితొలగించండి
  8. వసంతాగమనంబు సమస్త జివరాశికి మోదముగూర్చుగావున శ్రీనేమాని పండితార్యుల “నవకోకిల “ “రామకోకిలై” తెలుగు చూతపద్య వనాంతర నవ పల్లవఖాదియై కూతపెట్ట వలెనని గోరుచూ నూతన వృత్తమున చిన్న ప్రయత్నము.

    మానసంబు ననవరతంబుగ మానవాకృతి నున్నయా
    జానకీ పతిని పరమాత్మగ సత్యరూపుగ గొల్చుచున్
    మానవాళికి శుభము గోరుచు మాన్యరామ కథన్” నే
    మానిపండితులు” రచయించిరి మౌని రూపున తత్కృతిన్.
    …….. శ్రీ నేమాని పండితార్యులకు ప్రణామములతో.

    రిప్లయితొలగించండి
  9. (రామ కోకిల అంటె వాల్మీకి మహర్షి అని ఆర్యోక్తి)

    రామకోకిల! తిరుగుచుందువు రామ భక్తి వనమ్ములో
    రామ నామము నమిత భక్తి చెలంగ కీర్తన జేయుచున్
    రామ భక్తుల నలర జేయుచు రామ రక్షణనొందుచున్
    నీ మనమ్మతి విమలమైనది నీవు ధన్యుడ వోహితా!

    రిప్లయితొలగించండి


  10. శ్రీ తోపెల్ల శర్మ గారికి శుభాశీస్సులు.
    మీ రామకోకిల బాగుగనున్నది. దానికి చిన్న సవరణలు:
    - 3వ పాదములో మాన్య రామ కథన్ కి బదులుగా మాన్య రామచరిత్ర అనాలి.
    - 4వ పాదములోని టైపు పొరపాటుని రచియించిరి అని దిద్దుదాము.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. శ్రీ నేమాని పండితార్యులకు ప్రణామములతో. మీ ఆశీస్సులతో ధన్యుడను. సవరణనంతరము

    మానసంబు ననవరతంబుగ మానవాకృతి నున్నయా
    జానకీ పతిని పరమాత్మగ సత్యరూపుగ గొల్చుచున్
    మానవాళికి శుభము గోరుచు మాన్యరామ చరిత్ర” నే
    మానిపండితులు” రచియించిరి మౌని రూపున తత్కృతిన్.

    రిప్లయితొలగించండి
  12. మానవా! ధనమదము నిండగ మానముల్ హరియించుటల్
    మానవా! మతమనుచు మానవమారణాగ్ని సృజించుటల్
    మానవా! పదవె పరమార్థము మాకనంగను భావనల్
    మానవా! మమతల సుమాలిక మానవత్వము ధారుణిన్.

    రిప్లయితొలగించండి
  13. పెద్దలకు నమస్సులు. మానవా! మొదటి మూడు పాదాలలో వ్యావహారికమైనచో “మానుమా” గా చూడ మనవి.

    రిప్లయితొలగించండి
  14. సుబ్బారావు గారూ,
    మీరు నన్ను మన్నించాలి. "దొరగ నుండి" సరియైనదే. నేనే సరిగా అర్థం చేసికొనలేదు. దానికి సవరణ అవసరం లేదు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    "కోటీశ్వరులు + ఏల" అన్నప్పుడు సంధి జరుగుతుంది. యడాగమం రాదు.
    "కోటీశ్వరులె యేల" అంటే సరి.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ నవ/రామ కోకిల మధురంగా ఉంది. అభినందనలు.
    ఓకటి రెండు లోపాలను నేను సూచించేలోగా నేమాని వారి సవరణలు వచ్చాయి.
    *
    నేమాని వారూ,
    గన్నవరపు వారి నామకరణాన్నే ఖాయం చేసారుకదా. సంతోషం.

    రిప్లయితొలగించండి
  15. శ్రీగురుభ్యోనమః
    "రామ కోకిల " నవకోకిల వృత్తపు సృష్టి కర్తలైన శ్రీ నేమాని గురువర్యులకు హృదయ పూర్వక అభినంధనలు. తప్పక మరిన్ని కొంగ్రొత్త వృత్తములను శంకరాభరణము నందు జూచి తరింతుము
    =====*======
    తక్కెడ తో గొల్చు జనులు
    ప్రక్కకు జేర తలిదండ్రులను,నీ ధరలో
    మిక్కిలి భారమనుచు పలు
    ముక్కలు జేయ విధము ఘనముగ నేర్చిరి గా

    రిప్లయితొలగించండి
  16. వంచన చేయుట ముఖ్యము
    మంచికి నెలవేది కలిని మాయా జగతిన్
    పంచుకు తినగను పదుగురు
    కంచెయె మేయగను పొలము కాలుడు తానై !
    -------------------------------
    మనుజ జన్మ మనగ మహోన్నత మైన
    విలువ లెంచి చూడ కలుగు వింత
    పాప పుణ్య ఫలము భాగించి పొందిన
    ముక్తి నొసగు నదియె భక్తి కనగ

    రిప్లయితొలగించండి
  17. నమస్కారములు
    క్రొత్త వృత్తములను నేర్పు తున్న పూజ్య గురువులకు ప్రణామములు

    రిప్లయితొలగించండి
  18. రాజేశ్వరి అక్కయ్య గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పద్యం మూడవ పాదంలో గణదోషం ఉంది.

    రిప్లయితొలగించండి
  19. గురువులకు ధన్య వాదములు సవరించిన పద్యము.

    మనుజ జన్మ మనగ మహోన్నత మైన
    విలువ లెంచి చూడ కలుగు వింత
    పాప పుణ్య ములను పరిహార మొనరించి
    ముక్తి నొసగు నదియె భక్తి కనగ !

    రిప్లయితొలగించండి
  20. చిన్నతనములో మా నాన్నగారు నేర్పించిన బాల రామాయణము శ్లోకము ( వాల్మీకిరామాయణములో ప్రధమ స్వర్గ )

    కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
    ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకీలం

    వాల్మ్మీకి అనే కోకిల కవిత్వమనే కొమ్మపైకెక్కి ' రామ !,రామ ! 'అనే మధురమైన పలుకులను కూస్తుందిట. మానాన్నగారు అప్పుడు చెప్పారు, వాల్మీకి ' రామకోకిల ' అని. ఆధ్యాత్మ రామాయణమును వ్రాసిన శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి క్రొత్త వృత్తానికి అందువలనే ' రామకోకిల ' అని నామకరణము చేసాను.

    మిత్రులు సహదేవుల వారి వృత్తమునకు ఆ కోకిల వాసము ' సహకార ' వృక్షమును ( మామిడి )ఎంచుకొన్నాము గదా !

    రిప్లయితొలగించండి
  21. వలువల వంటివి వొంటికి
    విలువలు మరి వాని వదలి వీధుల దిరిగే
    పలు మానవ మృగములకే
    పలు రాలగ గొట్ట మనకు పాపము గలదా !

    రిప్లయితొలగించండి