5, మార్చి 2013, మంగళవారం

పద్య రచన – 271 (కర్మఫలము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"కర్మఫలము"

20 కామెంట్‌లు:

 1. చర్య యొక్కటి జనియించ సరిగ దాని
  ప్రతిగ చర్యలు యొనగూడు పరగ దెలియ
  తప్పనట్టిది హరుడు మాధవునకైన
  కర్మ ఫలమది జగతిని గాంచ నరుడ.

  రిప్లయితొలగించండి
 2. జీవుడెల్లప్పుడు చేయుచుండును కర్మ
  ....ములు వాని వలననే ఫలము లొదవు
  మంచి కర్మములకు మంచి ఫలమ్ములు
  ....చెడు కర్మములయిన చెడు ఫలములు
  కలుగు చుండును జన్మములు కల్గుచుండును
  ....ఫలముల కనువుగా ప్రాణితతికి
  స్వార్థ బుద్ధిని వీడి పరమేశ్వరార్పణ
  ....ముగనె కర్మములను పూనవలెను
  జ్ఞానవహ్ని తోడ దహించి కర్మములను
  కర్మశేషము లేనట్టి గతిని గలుగు
  నట్టి వాడిక భూమిపై పుట్ట బోడు
  పరమమగు శాశ్వతనంద పదము నొందు

  రిప్లయితొలగించండి

 3. వాలిఁ జంపిన రాముని పాప ఫలము!
  వెదకి కృష్ణావ తారాన వెంబడించె!
  కర్మ ఫలము తప్పుకొన శ్రీ కాంతు తరమె!
  జన్మలెన్నైన వెంటాడి శాక జూపు!

  రిప్లయితొలగించండి
 4. అహరహమును నిషిద్ధముల నాచరించుచునుండు గాని
  విహితమౌ కర్మలఁ జేయ వేగిరపడ దోచదెపుడు
  సహజాతమయి కర్మ ఫలము చరియింప - భరియింపనేడ్చు
  మహిలోన జనియించు నట్టి మనుజుపై కలిదేను గెలుపు.

  రిప్లయితొలగించండి
 5. నా పద్యము ఆఖరి పాదములో ఒక చిన్న టైపు పొరపాటు దొరలినది. ఆ పాదమును ఇలాగ చదువుకొనవలెను:

  "పరమమగు శాశ్వతానంద పదము నొందు"
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. కర్మ లు సేయును బ్రాణులు
  కర్మలు నవి మంచి వైన గలుగును సుఖముల్
  కర్మలు మర్మము గలిగిన
  కర్మలు నిక బంపు మనల గాటికి నరుడా !

  రిప్లయితొలగించండి
 7. “అంబురుహ” వృత్తము నందు చిన్న ప్రయత్నము.
  (భభభభరసవ గణములు – 13 వఅక్షరం యతి).

  సంచిత కర్మఫలాశ్రయ జన్మము సంభవింపగ ధాత్రిలో
  నంచిత కర్మలు చేయగ జన్మపు యాతనాత్మక చక్రమున్
  దృంచన హంబును వీడుచు నాత్మయె తేజరిల్లవి జ్ఞాన ప్రా
  పంచిక మార్గవి దగ్ధము గావదె పారమా ర్థిక చింతనన్.

  రిప్లయితొలగించండి
 8. Sri T.B.S.Sarma garu!
  ఆయ్యా! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగున్నది. 3వ పాదములో "తేజరిల్లవి" అనుచోట మాకు అర్థము అగుట లేదు. వివరించ గలరా? స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. పూజ్యశ్రీ నేమాని పండితులవారికి ప్రణామములతో ధన్యవాదములు తెల్పుచూ సవరణానంతరము.

  సంచిత కర్మఫలాశ్రయ జన్మము సంభవింపగ ధాత్రిపై
  నంచిత కర్మము లంతమొనర్చి భవాబ్ది దాటెడు పూ న్కి భా
  సించగ నాత్మ మహంబును వీడుచు చిన్మయాకృతి తోడ ప్రా
  పంచిక భావము చెల్లగ వెల్గదె పారమార్థిక సీమలో.

  రిప్లయితొలగించండి

 10. ఇరవై ఒకటవ శతాబ్దం లో
  కవుల కర్మ ఫలము చూడుడు
  బిట్స్ అండ్ బైట్స్ లో దోబూచు
  లాడుచున్నది కవితా కన్యాకుమారి!


  జిలేబి.

  రిప్లయితొలగించండి

 11. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన......

  కర్మలు సుకర్మము లనగ
  కర్మ ఫలమ్ములను మరచి కష్టించ వలెన్
  కర్మలు యజ్ఞమని తలచి
  కర్మ ఫలమ్ము పరమాత్మ కర్పింప వలెన్

  రిప్లయితొలగించండి
 12. సుకృతపు పాప కర్మలు
  నికృష్టపు బ్రతుకు లందు నెగడుచు నుండన్ !
  వికృత మగు విధి వంచన
  నిష్కృతి కానంగ లేము నీరజ నేత్రా !

  రిప్లయితొలగించండి
 13. అంబురుహాననా! సుబ్రహ్మణ్య శర్మా! అభినందనలు.

  రిప్లయితొలగించండి

 14. కర్మ సిద్ధాంత మందలి మర్మ మెరిగి
  మానవుడు జేయ వలయును మంచి పనులు
  మంచి కర్మమ్ము లిడు గాన మంచి జన్మ
  భార తీయుల తత్త్వంపు వైభవ మిది.

  రిప్లయితొలగించండి
 15. కర్మఫల మన్న అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు......
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  పండిత నేమాని వారికి,
  గన్నవరపు నరసింహమూర్తి గారికి, (ఎందుకో గాని తొలగించారు)
  సహదేవుడు గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  సుబ్బారావు గారికి,
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  రాజేశ్వరి అక్కయ్య గారికి.
  మిస్సన్న గారికి,
  మరియు... జిలేబీ గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. సేకరణ :-

  మనుపుత్రుడైన భృగుమహర్షి సమస్త కర్మల యొక్క ఫలితాన్ని ఇట్లు చెప్పసాగెను.

  “శుభాశుభఫలం కర్మ మనోవాగ్దేహ సంభవమ్,
  కర్మజా గతయో నౄణాముత్తమాధమ మధ్యమాః
  “తస్యేహ త్రివిధస్యాపి త్ర్యధిష్ఠానస్య దేహినః,
  దశ లక్షణ యుక్తస్య మనో విద్యాత్ర్పవర్తకమ్.” (మనుస్మృతి, 12-3,4)

  మనస్సు, వాక్కు దేహం ఇవి చేసే కర్మ శుభాశుభ ఫలములను కలిగిస్తున్నది. ఈ కర్మవల్లనే జీవులకు ఉత్తమ, మధ్యమ అధమగతులేర్పడుతున్నాయి. ఈ విధంగా జీవికి మనోవక్కాయములచే ఉత్తమాది త్రివిధగతులేర్పడుతున్నా దశవిధ లక్షణాలుగల కర్మకు కారణమని చెప్పాల్సి ఉంది. అని మనుస్మృతి కర్మలను అనుసరించి జన్మ ఏర్పడుతుందనే వివరణను ఇస్తుంది. (చూడు: మనుస్మృతి, తెలుగు తాత్పర్య సహితం, డా॥ యన్. యల్. నరసింహాచార్య 2000: 334)

  రిప్లయితొలగించండి
 17. కర్మలు చేయక తప్పదు
  కర్మఫలము నా మురారి కర్పింపవలెన్
  మర్మమును దెలిసి చేసిన
  కర్మవిముక్తుండవౌదు కదరా నరుడా.

  రిప్లయితొలగించండి