9, మార్చి 2013, శనివారం

సమస్యాపూరణం – 989 (సోదరిఁ బెండ్లాడెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సోదరిఁ బెండ్లాడెను మధుసూదనుఁ డెలమిన్.

26 కామెంట్‌లు:



  1. యాదవు డయ్యెను శ్రీహరి
    యాదోనాథాత్మజాత యగు రుక్మిణి నా
    మోదించె బళిర! రుక్మికి
    సోదరి బెండ్లాడెను మధుసూదను డెలమిన్

    రిప్లయితొలగించండి
  2. ఖేదము మానిన మానిని
    రాదారిని రమ్మన; బలరాముని తమ్ముం
    డే, దునిమెను రుక్మి,నతని
    సోదరిఁ బెండ్లాడెను మధుసూదనుఁ డెలమిన్.

    రిప్లయితొలగించండి
  3. ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవనంలో శ్రీ గరికపాటి నరసింహారావుగారి అష్టావధానం జరగబోతున్నది. ఔత్సాహికులు, ఢిల్లీ లో ఉన్నవారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆనందించవచ్చు.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    క్షీరసముద్ర మథనమున బుట్టిన చంద్రుని :

    01)
    _______________________________

    సోదన జరిపెడి సమయము
    సోదరుడై లక్ష్మితోడ - సోముడు బుట్టెన్ !
    యా దోషాచరు, సుందరు
    సోదరిఁ బెండ్లాడెను మధు - సూదనుఁ డెలమిన్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  5. మీదట జిలుకగ సంద్రము
    గాదా చంద్రుండు కలిమి కాంతయు బుట్టెన్
    వాదంబు లేక జాబిలి
    సోదరిఁ బెండ్లాడెను మధుసూదనుఁ డెలమిన్.

    రిప్లయితొలగించండి
  6. మీదట జిలుకగ సంద్రము
    గాదా చంద్రుండు కలిమి కాంతయు బుట్టెన్
    మోదంబు తోడ జాబిలి
    సోదరిఁ బెండ్లాడెను మధుసూదనుఁ డెలమిన్.

    రిప్లయితొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  8. యాదగిరి యను నతడు మధు
    సూదనునకు చిన్ననాటి సుహృదుం డగుటన్
    ఆదరముగ నా( మిత్రుడి
    సోదరిఁ బెండ్లాడెను మధుసూదనుఁ డెలమిన్.

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని వారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది.అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రుక్మిని కృష్ణుడు చంపలేదు.
    రుక్మిణిని తీసుకొని వస్తుండగా రుక్మి అడ్డుపడ్డాడు. అప్పుడు జరిగన యుద్ధంలో ఓడిన రుక్మిని కృష్ణుడు చంపబోగా రుక్మిణి వద్దని వేడుకుంది. బలరాముని సూచనతో కృష్ణుడతని జుట్టు, మీసాలు కొరిగి విడిచిపెట్టాడు. దానితో రుక్మి బలరామునిపై పగ పెంచుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పాండవు లిద్దరూ ఇతని సహాయాన్ని నిరాకరించారు.
    రుక్మి తన కుమార్తె శుభాంగిని ప్రద్యుమ్నున కిచ్చి వివాహం చేసాడు. వివాహ సమయంలో వేడుకగా జరిగిన జూదంలో రుక్మి బలరాముని అవమానించాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో బలరాముడు రుక్మిని సంహరించాడు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభివందనలు.
    మూడవ పాదం ప్రారంభంలో యడాగమం దోషం.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. అవధానము లన్నిట నీ
    యవధానమె గొప్ప దందు రార్యా రాధ్యా !
    అవధానం బొన రింపుము
    నవ పోకడ లుద్భ వించ నర సిం హా జీ !
    (sri garikapati vari avadhanamu,sandarbhamugaa)

    రిప్లయితొలగించండి
  11. వేద మయుండగు నాహరి
    యాదరమున సాకు చుండి యా పాండవులన్
    జోదగు పార్ధుని ,వరుసకు
    సోదరి బెండ్లాడెను మధు సూ దను డెలమిన్

    రిప్లయితొలగించండి
  12. వేదిత ప్రియ ప్రేయసి యా
    వేదన విని మాధవుండు వెంటనె కడు సం
    వేదనతో జని రుక్మిని
    సోదరిఁ బెండ్లాడెను మధుసూదనుఁ డెలమిన్.

    రిప్లయితొలగించండి
  13. ఆదరువట జీవులనెడ యదుకుల తిలకుడటంచు
    ఆదటగాదె నాకనుచు నా రుక్మిణి పతిగనెంచ
    యాదవాగ్రణి! రుక్మి మించి హృదయరాణిగ వాని
    సోదరిఁ బెండ్లాడెను మధుసూదనుఁ డెలమినత్తరిని.

    రిప్లయితొలగించండి
  14. మేదిని సతియైన హరికిఁ
    సోదరిఁ బెండ్లాడె శివుఁడు! శూలికి తలపై
    మోదమున మెరయు జాబిలి
    సోదరిఁ బెండ్లాడెను మధుసూదనుడెలమిన్!

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్య గురువుగారికి, శ్రీ నేమాని వారికి వినమ్ర వందనములతో

    చిన్న నాటి స్నేహితులు ప్రేమ విషయములో తగవులు పడి విడిపోయి,మరలా మిత్రులగుదురు
    =======*========
    తన బాల్య మిత్రుని సభను
    గని వాదము వీడి బిల్వ,కలికి తనమునన్
    ఘనముగ సోదరి బెండ్లా
    డెను మధుసూదను డెలిమిని డిండిమములతో
    (డిండిమములతో= వాద్యములతో )
    =======*========
    వాదములన్నియు వీడగ
    మోదముతో మిత్రునింట ముందు మరల తా
    పాదము మోపగ మిత్రుని
    సోదరి బెండ్లాడెను మధుసూదను డెలిమిన్

    రిప్లయితొలగించండి
  16. అయ్యా! శ్రి తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము (మధ్యాక్కర) లో 3వ పాదములో యతి స్థానమును చూడండి, తదుపరి గణభంగము లేకుండ సవరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగింది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగింది మీ పూరణ. అభినందనలు.
    మూడవ పాదం చివర ‘రుక్మికి’ అనబోయి టైపాటు వల్ల ‘రుక్మిని’ అన్నారా?
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ మధ్యాక్కర బాగుంది. అభినందనలు.
    నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా!
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. శ్రీనేమాని పండితులకు వందనములతో సవరించినతరువాత

    ఆదరువట జీవులనెడ యదుకుల తిలకుడటంచు
    ఆదటగాదె నాకనుచు నా రుక్మిణి పతిగనెంచ
    యాదవాగ్రణి! రుక్మి నటని యంత్రించి రాణిగ వాని
    సోదరిఁ బెండ్లాడెను మధుసూదనుఁ డెలమినత్తరిని.

    రిప్లయితొలగించండి
  19. వైదర్భి తిండి మానెను
    వేదాంత నిలయుని చక్రిఁ బెండ్లాడగ, తాఁ
    కాదనక వచ్చి యుపవా
    సోదరిఁ బెండ్లాడెను మధుసూదనుఁ డెలమిన్!!

    రిప్లయితొలగించండి
  20. జిగురు సత్యనారాయణ గారూ,
    ఉపవాసోదరియా? అద్భుతమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. శంకరార్యా ! ధన్యవాదములు !

    క్షీరసముద్ర మథనమునబుట్టిన చంద్రుని :

    01అ)
    _______________________________

    సోదన జరిపెడి సమయము
    సోదరుడై లక్ష్మితోడ - సోముడు బుట్ట
    న్నా,దోషాచరు, సుందరు
    సోదరిఁ బెండ్లాడెను మధు - సూదనుఁ డెలమిన్ !
    _______________________________

    రిప్లయితొలగించండి




  22. ఆదరమున వరియించిన
    శ్రీదేవిని,జననమొంద క్షీరసముద్రం
    బే దరచంగ శశాంకుని
    సోదరి బెండ్లాడెను మధుసూదనుడెలమిన్.

    రిప్లయితొలగించండి
  23. మోదమ్ముగ రాముండై
    ఖేదమ్మై రాక్షసులకు క్రీడలలోనన్
    సాదరముగనా యూర్మిళ
    సోదరిఁ బెండ్లాడెను మధుసూదనుఁ డెలమిన్

    రిప్లయితొలగించండి
  24. వాదన నీవిక మానుము!
    లేదే వైషమ్యమిచట లీలగ సీతా!
    సాదరముగ రుక్మిణినిన్...
    సోదరి! బెండ్లాడెను మధుసూదనుఁ డెలమిన్ 😊

    రిప్లయితొలగించండి