28, మార్చి 2013, గురువారం

పద్య రచన – 294 (గగన కసుమము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“గగన కుసుమము”

19 కామెంట్‌లు:


  1. అయ్యవారి టపాకి యతి ప్రాసల తో
    పద్యము రాయుట అయ్యె జిలేబీ కి
    గగన కుసుమము ! కామెంటు హారమే
    సులభము ఈ జిలేబీ కి ఇప్పటికిన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. జిలేబీ గారూ,
    శుభోదయం.....

    అయ్యవారు కోరినట్లు యతిప్రాస
    లున్నయట్టి పద్య మొక్కటైన
    కూర్చు పనియె గగన కుసుమమగు జిలేబి
    కిపుడు వ్యాఖ్య వ్రాయుటే సులభము.

    రిప్లయితొలగించండి
  3. గగన కుసుమ వర్షంబును కనుల విందు
    గా నొనర్చిరి దేవతల్ మౌని వరులు
    వేద మంత్రాల తోడ దీవెనల నిడిరి
    అవనిజా దాశరథుల కళ్యాణ వేళ

    రిప్లయితొలగించండి
  4. గగన కుసుమ మటంచు శ్రీకంఠు పలుకు
    పరిహసించి నత్కీరుడు పాపఫలము
    ననుభవించి పశ్చాత్తాపమున తదుపరి
    తత్కృపన్ గని మోక్షపదమ్ము బడసె

    రిప్లయితొలగించండి
  5. గగన కుసుమంబు విష్ణువే కనగ నరులు
    గగన వర్ణంపు కృష్ణునే కనగ నాడు
    దేవకీ దేవి, మెచ్చెగా దేవతలును
    గగన కుసుమమ్ము విష్ణునే కనెను నరులు.

    రిప్లయితొలగించండి
  6. పేద విద్యార్థి చదువంగ పెద్ద చదువు!
    కలిమి లేని సమర్థుండు తలచు పదవి!
    వృద్ధ భారత బడుగుల వృద్ధి యన్న!
    గగన కుసుమమ్మె యను మాట గట్టి నిజము!
    (66 సం॥ నిండిన స్వతంత్ర వృద్ధ భారతమన్న భావంతో)

    రిప్లయితొలగించండి

  7. హరుని పూజ జేసి హారతి నొసగంగ
    వెలుగు కప్పురమని నెలయు దోప
    గగన భాగ మందు కనక కుసుమములై
    తార లతని యంఘ్రి జేరి మెఱెసె !

    రిప్లయితొలగించండి
  8. గగనకుసుమము - సుగంధి

    తల్లిదండ్రితోడు నిల్చి తప్పుచేయకుండగా
    పిల్లవాండ్ర తీర్చి దిద్ద పేర్మి కల్గు; వారలే
    యిల్లు పట్టకుండ నుండ నేమి లాభమున్నదో?
    తొల్లి ప్రేమ నింగి పూల తోరణమ్మె , నేడికన్.

    రిప్లయితొలగించండి
  9. గగన కుసుమాల యునికియు గగన మర య
    గగన మనగను శూ న్యము గద మ ఱి యిల
    గగన మంద లి చంద్రుడు గాను పించు
    సూ ర్య కాంతులు దన మీ ద సోక వలన .

    రిప్లయితొలగించండి
  10. ఆకసమున పూవు యందునా చెయిసాచ ?
    దుర్లభమ్ము నదియె దుస్తరమ్ము
    అగును గగన కుసుమ మటువంటిదే సుమ
    విస్తరించి జూడ విజ్ఞులార !

    రిప్లయితొలగించండి
  11. వరకట్నములు మాసి పురుషుల యండతో
    .............వనితలు పరువుగా మనెడు దినము
    ఏలికలవినీతి పాలన విడనాడి
    .............పరమ ధర్మాత్ములై పరగు దినము
    కుల మత వర్గంపు గోడ బీటలు వారి
    .............ఐకమత్యము నెలవైన దినము
    వైద్యమ్ము విద్యయు వ్యాపార వర్గాల
    ............సంకెలల్ విడివడి సాగు దినము

    నల్ల డబ్బును నిలువునా పాతు దినము
    పౌరు లోటును విజ్ఞులై వాడు దినము
    సగటు మనిషికి మన్నన జరుగు దినము
    గగన కుసుమాలు దేశాన గనగ నిజము.

    రిప్లయితొలగించండి
  12. ఈనాటి అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
    జిలేబీ గారికి,
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్చాస్త్రి గారికి,
    సహదేవుడు గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్బారావు గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    మిస్సన్న గారికి
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
    సరసధరల సగటుమనిషి సరకు కొనదగు దినముల్,
    ధరను ధరలిడని చదువులు, తరుణి తిరుగ నొకరితై,
    ధరణిని సుర గొనని నరులు, తనపదవినొదలు దొరలున్,
    అరయగ గగన కుసుమములు యతనమునయిన వసమే?

    రిప్లయితొలగించండి
  14. ఈ రోజు మిస్సన్న గారి పద్యరాజం అపూర్వమైన వ్యంగ్యవైభవంతో చక్కటి కొసమెఱుపుతో ఏ కవితాసంకలనంలో నైనా చేర్చుకోదగినదిగా అద్భుతంగా ఉన్నది.

    వారికి మనఃపూర్వక నమఃపూర్వక ప్రశంసాపూర్వకాభినందనలు!

    మనవంటి ఔత్సాహికులకు ప్రోత్సాహన దోహదోల్లాసం కల్పిస్తున్న సచేతోమాన్యులు శ్రీ శంకరయ్య గారికి సన్నతిపూర్వక సన్నుతి!

    రిప్లయితొలగించండి






  15. ఆధునికశాస్త్ర మభివృద్ధి నంది నేటి
    యంతరిక్షనౌకలయందు వింతగొల్ప
    ' గగనకుసుమవాటిక ' బెంచ గలదు వీలు
    కాన నది యందని సుమమ్ము కాదు సుమ్ము.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు.
    మీ తరళ వృత్తము బాగుగనున్నది. మా ప్రశంసలు. 3వ పాదములో చివరలో ఒక లఘువు ఎక్కువగా నున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    నేమాని వారు చెప్పినట్లు మూడవ పాదంలో ఒక లఘువు ఎక్కువగా ఉండడమే కాదు. "ఒదిలి" అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. అక్కడ "తమపదవి విడి దొరలున్" అంటే సరి.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ధన్యవాదాలు.
    *
    కమనీయం గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. డా. ఏల్చూరి వారికి ధన్యవాదములు.
    వారి ప్రశంసను పొంద గలగడం చాలా సంతోషం కలిగించింది.
    వారిని వారు ఔత్సాహికులలో ఒకరిగా పేర్కొనడం వారిలోని వినయ సంపదకు తార్కాణం.

    రిప్లయితొలగించండి