23, మార్చి 2013, శనివారం

పద్య రచన – 289 (సమ్మెలు - జనజీవనము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“సమ్మెలు - జనజీవనము”

15 కామెంట్‌లు:

  1. వీధి గూండాలకు పేరు ప్రఖ్యాతులు
    ....హెచ్చుగా సమ్మెలే తెచ్చుచుండు
    రాజకీయములలో ప్రతిపక్షముల యాయు
    ....ధమ్ము లెంతేనియు సమ్మెలగును
    విద్యార్థి బృందమ్ము లుద్యోగ సంఘమ్ము
    ....లెల్ల సమ్మెలనె పాటించుచుండు
    వారు వీరననేల? ప్రజల యసమ్మతి
    ....శస్త్రమ్ము లక్కటా! సమ్మెలగుట
    రాకపోకలకగు నంతరాయ మెపుడు
    భస్మ మగుచుండు నెన్నియో వాహనములు
    సరకులున్ మాయమగు చుండు ధరలు హెచ్చు
    కటకటంబడు ప్రజ సమ్మె కాలమందు

    రిప్లయితొలగించండి
  2. 'అమ్మా' యన ప్రభుత వినదు
    'హమ్మా' యని యడుగ సమ్మె లలవాటాయెన్
    సమ్మెలు కావవి తలపై
    సమ్మెట పోట్లేను సకల జనులకు చూడన్.

    రిప్లయితొలగించండి
  3. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
    హిందీ దోహా.
    విషమ పాదాలలో 13 మాత్రలు, సమ పాదాలలో 11 మాత్రలు, విషమ పాదాంతం దీర్ఘము, సమ పాదాంతం హ్రస్వ సమాక్షరం. చిన్న ప్రయత్నము.

    మాన్ అభిమాన్ ప్రాణ్ భీ / లూట్ గయీరె సబ్ కుఛ్//
    బంద్ దియారె బర్ బాదీ / న మిలా ఫాయదా కుఛ్//

    రిప్లయితొలగించండి
  4. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
    చిన్ని సవరణతో

    సమ్మెలు చిమ్మును రక్త చారిక లెల్లెడ జనుల
    సమ్మెలు సొమ్ముల నిడును సకటపు మూకల కపుడు
    సమ్మెలు తమ్ముల చదువు చట్టబండయగును జూడ
    సమ్మెలు కమ్ము విషమ్ముసంతత నాశమొనర్చు.

    రిప్లయితొలగించండి
  5. జనజీవనమునకిడుముల
    నొనరింపగలిగెడు సమ్మెయుక్తము కాదే!
    వినుడీ, మీ ప్రతి పాదన
    జననాయకులయెడఁ జేర్చి సాధింపదగున్.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. సుబ్బారావు గారు,
    సమ్మెలు లేలేని రోజు ని సరి చూసుకోవాలేమో!

    రిప్లయితొలగించండి
  8. సమ్మెలు సమ్మెలు సమ్మెలు
    సమ్మెలు మఱి లే ని రోజు సాలో కింపన్
    ఇమ్మహిలో గని పించదు
    సమ్మే జన జీ వనంబు జరుగక జేయున్ .

    రిప్లయితొలగించండి
  9. collected by : Sahityaabhimaani

    ఎప్పు డేమి యగునొ చెప్పి జరుగ బోదు
    మోస గాండ్రు గలరు ముందు వెనుక
    క్షణము లోనె నిన్ను కడగండ్ల పాల్జేయు
    కాల నాగు లెన్నొ గలవు చుట్టు

    కసువు మేసి బ్రతుకు పసుల డెందంబులో
    కపట మింత యైన గాన రాదు
    మనిసి కేల గలిగె మారణ హోమంబు ,
    అంతు లేని స్యార్థ చింత నంబు ....?

    రిప్లయితొలగించండి
  10. అతివాదులు మితవాదులు
    ప్రతి పక్షమునున్న వారు ప్రతిదానికి స
    మ్మెతలుపు తట్టగ సర్వులు
    వెతలన్ జిక్కుచు నలుగుచు పీడితు లవరే?

    రిప్లయితొలగించండి
  11. సమ్మెలు జేయగ నేతలు
    వమ్మగు జనజీవ నమ్ము భంగము గలుగన్ !
    చిమ్మగ రుధిరపు ధారలు
    సొమ్ములు సౌఖ్యములు తొలగి సోకింప దగున్ !

    రిప్లయితొలగించండి




  12. భాగ్యనగరమందున సమ్మె బాధలేక
    గడచు జనజీవనపు రోజు కడు విశేష
    మైన నలవాటు మాకయ్యె నందువలన
    సంతసింతుము ,జడవము ,సమ్మె వలన.

    ఇంకొక దృక్పథంతో మరొక పద్యం.

    దినదినపు టార్జనచేత దినము గడచు
    పేదలకు కష్టమని యనిపించదేమొ
    తడవ తడవకు సమ్మెను దలచి పిలుపు
    నిత్తురీ నాయకులు వారి కేమి బాధ ?

    రిప్లయితొలగించండి
  13. కమ్మని భోజనముండదు
    ఇమ్ముగ చదవంగ జూడ యిడుములు పెక్కుల్ |
    కమ్మును చీకటులన్నిట
    సమ్మెలు చూపించు నిలను "సమ్మె"ట పోటుల్ ||

    రిప్లయితొలగించండి
  14. ఈనాటి శీర్షికపై మంచి పద్యాలను రచించిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    సుబ్బారావు గారికి,
    సహదేవుడు గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    కమనీయం గారికి,
    డా. ప్రభల రామలక్ష్మి గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    సాహిత్యాభిమాని గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి