సకల దేవతా మూర్తుల సన్నిథైన గోవుఁ బూజించ శుభములుఁ గూరు మిగుల పరమ పావన గోధూళి పురము నందు మేఘమై కురిసెడు రీతి మృగ్య మయ్యె! (గోవధ కారణంగ మరియు వ్యాపార దృష్టి పెరగటం వల్ల గోవులు తగ్గి పోయాయి. ఇక గోధూళి ఎక్కడ?)
శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు, ఎందుకో యతి మైత్రి నావల్ల కాదని వృత్తమును మార్చితిని. శ్రీ కమనీయం గారి " గోధూళి " "బస్సుధూళి " మరియు " యెండమావి" . అద్భుతం
గురువు గారికి ధన్యవాదములు. తమరి సూచన ప్రకారము సవరించిన పద్యం: సకల దేవతా మూర్తుల సన్నిధియగు గోవుఁ బూజించ శుభముచే కూరు మనకు పరమ పావన గోధూళి పురము నందు మేఘమై కురిసెడు రీతి మృగ్య మయ్యె!
అయ్యా! శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు. మీ సీస పద్యములో వర్ణన బాగున్నది. తేటగీతి 2వ పాదములో నాడు + ఉండెను అనేచోట యడాగమము రాదు కదా. నాడు నెలకొనె అని మార్చండి. స్వస్తి.
అమ్మా రామలక్ష్మి గారూ! ధన్యవాదాలు. మీ పద్యాలు కూడా మంచి పద గుమ్ఫనతో చక్కటి భావాలతో మనసును ఆకట్టుకొంటూ ఉంటున్నాయి.
అయ్యా శర్మగారూ! మీరన్నది నిజం. మా చిన్నతనంలో మా ఊరిలోనూ, కాట్రేనికోన ఉన్నత పాఠశాల నుంచి మా ఊరు వచ్చే దారిలోనూ, ఆ గోధూళి వాతావరణం మనోహరంగా ఉండేది .ఇప్పటి మనకూ, పిల్లలికీ ఇవేవీ కూడా అందని ద్రాక్షలే. చక్కటి పద్యం వ్రాశారు. అభినందనలు.
సాహిత్యాభిమాని గారికి, అన్న మిస్సన్న గారికి ధన్యవాదములు. చిన్ని తనంలో తాపేశ్వరంలో ఉన్నప్పుడు నేనుకూడా ఆవులను తోటి పిల్లవాండ్రతో సరదాగా అదిలించుచూ వచ్చే వాడిని. చిన్నితనపు రోజులు ఎవ్వరికైనా స్వర్ణయుగమనిపిస్తుంది.
గోవుల గాచుచు నుండెడి
రిప్లయితొలగించండిగోవిందుని పాదధూళి, గోధూళిని సద్
భావముతో దలదాల్తురు
దేవతలవె కామితములు దీర్చునటంచున్
గోవుల దేహమునందున
రిప్లయితొలగించండిదేవతలే నిలచియుంద్రు దివ్యములేగా
గోవుల మూత్రము పేడయు
గోవుల క్షీరమ్ము నటులె గోధూళియుగా.
సకల దేవతా మూర్తుల సన్నిథైన
రిప్లయితొలగించండిగోవుఁ బూజించ శుభములుఁ గూరు మిగుల
పరమ పావన గోధూళి పురము నందు
మేఘమై కురిసెడు రీతి మృగ్య మయ్యె!
(గోవధ కారణంగ మరియు వ్యాపార దృష్టి పెరగటం వల్ల గోవులు తగ్గి పోయాయి. ఇక గోధూళి ఎక్కడ?)
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండి"సన్నిధి + ఐన" అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "సన్నిధి యగు" అంటే సరి.
గోవులు నడిచెడి పథమున
రిప్లయితొలగించండిగోవుల మూ త్రంబు లుండు , గో పే డ యు నున్
గోవులు నడవగ ధూ ళియు
బావన ముం జేయు మిగుల పరిసర గృహము న్
కవులు గోధూళి వేళల కవనమందు
రిప్లయితొలగించండివర్ణనలఁ జేయ రమ్యమా వైభవమ్ము;
చదివి నారమే యూహల జగతిలోనఁ
గాంచి, నిల్చె నేడునదియె కన్నులందు.
రిప్లయితొలగించండికోరుకున్న గూడ గోధూళి కనరాదు
పల్లెలందు నిండె బస్సుధూళి
పట్టణాల మాట పరమాత్ముడెరుగును
ఎచట నైన నద్ది యెండమావి.
శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు, ఎందుకో యతి మైత్రి నావల్ల కాదని వృత్తమును మార్చితిని.
రిప్లయితొలగించండిశ్రీ కమనీయం గారి " గోధూళి " "బస్సుధూళి " మరియు " యెండమావి" . అద్భుతం
శ్రీ శంకరయ్య గారికి, శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండి=======*=======
నోరూరగ దినగ కసుపు నూలు పరక లేదు,గడ్డి
సారము దెలియంగను ఘన సారమ్ము వలె దిను చుండె
గౌరవనీయులవనిని,గడ్డి మొలక లేక గోవు
దూరమాయె మనుజుల పెడ దోరణి మారక, గనును
పౌరులు గోధూళి చిత్ర పటములు పత్రిక లందు
( కసుపు=గడ్డి )
కసువు =గడ్డి, గాదం, గాసం [తెలంగాణ మాండలికం]
రిప్లయితొలగించండికమనీయంగారి పద్యం అద్భుతం.
రిప్లయితొలగించండికొండను మేత మేసి తమ గోవుల మందలు పల్లె వైపు బో-
రిప్లయితొలగించండిచుండగ వాని గిట్టలను జోరుగ రేగిన ధూళి మాటునన్
వెండి మొగిళ్ళ దాగు నిశివెల్గన గోవుల వెన్క నల్లదే
కొండను గోట నెత్తు చిన గోప కుమారుడు వెల్గు జూడరే!
గురువు గారికి ధన్యవాదములు. తమరి సూచన ప్రకారము సవరించిన పద్యం:
రిప్లయితొలగించండిసకల దేవతా మూర్తుల సన్నిధియగు
గోవుఁ బూజించ శుభముచే కూరు మనకు
పరమ పావన గోధూళి పురము నందు
మేఘమై కురిసెడు రీతి మృగ్య మయ్యె!
విందు కనులకు గోధూళి వేళ లందు
రిప్లయితొలగించండిగగన మందున సూరీడు సొగసు లలర
గుబురు కొను కొంగ బారులు గూడు చేరు
మలయ మారుత వీచిక మదిని మురియ !
ఈనాటి పద్యరచన అంశంపై చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు.....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సహదేవుడు గారికి,
సుబ్బారావు గారికి,
లక్ష్మీదేవి గారికి,
కమనీయం గారికి,
వరప్రసాద్ గారికి,
మిస్సన్న గారికి
రాజేశ్వరి అక్కయ్య గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
పశ్చిమాద్రినినుడు పవళింప వెడలంగ
రిప్లయితొలగించండి………. నీరజారాతిని నింగి జూడ
చిరుకాంతులుండంగ చిరుతలు గెంతుచు
………. చిరునవ్వులొల్కుచు చిందులెట్ట
యింటి ముఖముపట్టి యిగిలింత లెట్టుచు
………. గోవులనదలించి గోలచేయు
కమ్మని వాసనల్ క్రమ్మగ గోధూళి
………. గొప్పచిత్రమనగ గోచరించు
పల్లె సీమల యందలి వైభవంబు
నాడు యుండెను నేడెందు చూడ తరమె
యాధునిక పద్ధతులనగ యాలమంద
శాల యందున మేపంగ చతురమతులు.
కొండను మేత మేసి తమ గోవుల మందలు పల్లె వైపు బో-
రిప్లయితొలగించండిచుండగ వాని గిట్టలను జోరుగ రేగిన ధూళి మాటునన్
వెండి మొగిళ్ళ దాగు నిశివెల్గన గోవుల వెన్క నల్లదే
కొండను గోట నెత్తు చిన గోప కుమారుడు వెల్గు జూడరే!
గౌరవనీయులైన మిస్సన్న మహోదయ!
మీ పద్యం మనోఫలకం పై వ్రేపల్లె నాథుని గోచరింపచేసింది. ధన్యవాదములు.
నగరమ్మునకు గల్గు నాల్గుదిక్కులలోని
రిప్లయితొలగించండి................................పల్లెలన్నియు జేరె పట్నమందు
ఆకాశహార్మ్యములందమెంతో పెరిగె
................................కాలిడుటకు దారి కానరాదు
ధూళి తెచ్చు మనకు దోషమెంతోయని
.................................కాంక్రీటు చేసిరి కాలిబాట
హాలికులెందరో హలము పట్టగలేక
.................................ఆత్మహత్యల వెంట నడుగులిడిరి
ఇట్టి మారుపులెదురయ్యెనిలను నేడు
అమ్ముచుండిరి గోమూత్రమంగడలను
ఎక్కడగపడు గోధూళి నెంచి చూడ
చిత్రపటముల చూడుడు చిత్రమెరయ.
మనోహరమైన సీసపద్యాలను రచించిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండితోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
డా. ప్రభల రామలక్ష్మి గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
అయ్యా! శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ సీస పద్యములో వర్ణన బాగున్నది. తేటగీతి 2వ పాదములో నాడు + ఉండెను అనేచోట యడాగమము రాదు కదా. నాడు నెలకొనె అని మార్చండి. స్వస్తి.
అమ్మా! శ్రీమతి ప్రభల రామలక్ష్మి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ సీస పద్యము బాగున్నది. టైపు పొరపాట్లు వంటివి చాల దొరలినవి.
1. హార్మ్యము
2. అందమెంతో (అందమెంతొ అంటేనే గణములు సరిపోవును)
3. అంగడలను
4. చిత్రమెరయ (చిత్ర మరయ అని ఉండాలి అనుకొంటాను).
అభినందనలు.
స్వస్తి.
నగరమ్మునకు గల్గు నాల్గుదిక్కులలోని
రిప్లయితొలగించండి................................పల్లెలన్నియు జేరె పట్నమందు
ఆకాశహర్మ్యములందమెంతొ పెరిగె
................................కాలిడుటకు దారి కానరాదు
ధూళి తెచ్చు మనకు దోషమెంతోయని
.................................కాంక్రీటు చేసిరి కాలిబాట
హాలికులెందరో హలము పట్టగలేక
.................................ఆత్మహత్యల వెంట నడుగులిడిరి
ఇట్టి మారుపులెదురయ్యెనిలను నేడు
అమ్ముచుండిరి గోమూత్రమంగడులను
ఎక్కడగపడు గోధూళి నెంచి చూడ
చిత్రపటముల చూడుడు చిత్రమరయ.
పండిత గురువర్యులకు వందనములు. మీ సూచనలకు ధన్యవాదములు.
అమ్మా రామలక్ష్మి గారూ! ధన్యవాదాలు. మీ పద్యాలు కూడా మంచి పద గుమ్ఫనతో చక్కటి భావాలతో మనసును ఆకట్టుకొంటూ ఉంటున్నాయి.
రిప్లయితొలగించండిఅయ్యా శర్మగారూ! మీరన్నది నిజం. మా చిన్నతనంలో మా ఊరిలోనూ, కాట్రేనికోన ఉన్నత పాఠశాల నుంచి మా ఊరు వచ్చే దారిలోనూ, ఆ గోధూళి వాతావరణం మనోహరంగా ఉండేది .ఇప్పటి మనకూ, పిల్లలికీ ఇవేవీ కూడా అందని ద్రాక్షలే. చక్కటి పద్యం వ్రాశారు. అభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీ వరప్రసద్ గారికి ధన్యవాదాలు.మీ పూరణలు కూడా ఫాలో అవుతున్నాను.విలక్షణం గా ఉంటూ అలరిస్తున్నాయి.
.
పూజ్యశ్రీ నేమాని పండితులకు నమస్సులు. మీ సవరణానంతరం
రిప్లయితొలగించండిపశ్చిమాద్రినినుడు పవళింప వెడలంగ
………. నీరజారాతిని నింగి జూడ
చిరుకాంతులుండంగ చిరుతలు గెంతుచు
………. చిరునవ్వులొల్కుచు చిందులెట్ట
యింటి ముఖముపట్టి యిగిలింత లెట్టుచు
………. గోవులనదలించి గోలచేయు
కమ్మని వాసనల్ క్రమ్మగ గోధూళి
………. గొప్పచిత్రమనగ గోచరించు
పల్లె సీమల యందలి వైభవంబు
నాడు నెలకొనె నేడెందు చూడ తరమె
యాధునిక పద్ధతులనగ యాలమంద
శాల యందున మేపంగ చతురమతులు.
సాహిత్యాభిమాని గారికి, అన్న మిస్సన్న గారికి ధన్యవాదములు. చిన్ని తనంలో తాపేశ్వరంలో ఉన్నప్పుడు నేనుకూడా ఆవులను తోటి పిల్లవాండ్రతో సరదాగా అదిలించుచూ వచ్చే వాడిని. చిన్నితనపు రోజులు ఎవ్వరికైనా స్వర్ణయుగమనిపిస్తుంది.