శ్రీలలితాంబికా!
అమ్మా! శ్రీ లలితాంబికా! త్రిణయినీ! అమ్మా! మునీంద్రస్తుతా!
అమ్మా! సద్గుణ శోభితా! అనలజా! అమ్మా! సురేంద్రార్చితా!
అమ్మా! పద్మవనీ విహార నిరతా! అమ్మా! సుధావర్షిణీ!
అమ్మా! తావక తత్త్వ వైభవము నే ధ్యానింతు నత్యాదృతిన్
అమ్మా! సర్వ జగద్విధాయిని! వివేకానంద సంధాయినీ!
అమ్మా! సర్వ హృదంతరాళనిలయా! అజ్ఞాన నిర్మూలినీ!
అమ్మా! శ్రీ శివభామినీ! భగవతీ! అర్ధేందు చూడామణీ!
అమ్మా! తావక తత్త్వ వైభవము నే ధ్యానింతు నత్యాదృతిన్
అమ్మా యంచు దలంచినంత భవబంధాదుల్ పటాపంచలౌ
అమ్మా యంచు దలంచినంత హృదయంబత్యంత శోభాఢ్యమౌ
అమ్మా యంచు దలంచి పొందెదను బ్రహ్మానందమున్ సర్వదా
అమ్మా! తావక తత్త్వ వైభవము నే ధ్యానింతు నత్యాదృతిన్
పండిత రామజోగి సన్యాసి రావు
శ్రీపండితనేమాని గురువులకు ప్రణామములు. అతర్జాలప్రవేశంతోనే అమ్మ ప్రార్థనా పూర్వక చిత్ర దర్శనభాగ్యం కల్గించినందులకు ముక్కిలి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిలలిత రూపము గలయట్టి లలిత మాత !
రిప్లయితొలగించండినిన్ను నమ్మితి ననిశము నిర్మ లాత్మ !
వందనమ్ములు లలితమ్మ ! వంద లాది
కావు మమ్ముల నిక నైన గరుణ తోడ .
శ్రీ లలితాంబ ధ్యానముతో మమ్ములను పునీతులు జేసిన అన్నయ్య గారికి వినతులు.
రిప్లయితొలగించండిస్పందించినట్టి సోదర
రిప్లయితొలగించండిబృందమునకు కూర్చు నంబ ప్రేముడి జ్ఞానా
నంద రసామృత సిద్ధిని
వందనమిదె తల్లి పాద పద్మమ్ములకున్