18, మార్చి 2013, సోమవారం

పద్య రచన – 284 (గతజల సేతుబంధనము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"గతజల సేతుబంధనము"

26 కామెంట్‌లు:

 1. పోయిన జలమునకు గట్టు వేయునట్లు
  ఏమి లాభము గతకాల మెఱుక పఱచ
  తరలి పోయిన జలములు మరలి రావు
  జరిగి పోయిన కాలమ్ము తిరిగి రాదు

  రిప్లయితొలగించండి
 2. గత జల సేతు బంధనముగా మును పేర్కొనుచుండు నట్టి ప
  ద్ధతులిల మారిపోయెను నదిన్ జలమింకిన యట్టి వేళలో
  నతిరయమార కట్టదగు నక్కట సేతువు లంచెరుంగవే
  యతి సుకరమ్మదే యగుట నాచరణీయ మదే విధానమౌ

  రిప్లయితొలగించండి
 3. హితములు చెప్పు పెద్దలను హీనముగా గని సేతు నెప్డు నా
  మతమది నాదె యంచు పలు మారులు తప్పులు జేసి పిమ్మటన్
  హుతమగు వేళ నాకులను యుంచుక చేతుల పట్టుకొంటయున్
  గత జల సేతు బంధనము కాదది మంచిది మానవాళికిన్.

  రిప్లయితొలగించండి
 4. చిన్న సవరణతో..

  హితములు చెప్పు పెద్దలను హీనముగా గని సేతు నెప్డు నా
  మతమది నాదె యంచు పలు మారులు తప్పులు జేసి పిమ్మటన్
  హతవిధి పట్టుకొంటమరి యాకులు చేతను జూడ నిట్టిదే
  గత జల సేతు బంధనము కాదది మంచిది మానవాళికిన్.

  రిప్లయితొలగించండి
 5. జరిగి పోయిన బనులను దిరుగ దోడ
  ఫలిత ముండని చందంబు ,జలము పోయి
  నపిద ప యచట జల బంధ నంబు వమ్ము
  గాదె ? పరికింప దానినో సుదతు లార!

  రిప్లయితొలగించండి
 6. రాయభార ఘట్టములో శ్రీకృష్ణుడు దుర్యోధనునితోఁ బల్కు సందర్భము.......

  హతమొనరింతుమంచు శపథాదులొనర్చినపాండువీరుల
  ప్రతిహతమాన శౌర్యమున ప్రాణముఁబోవుటకన్న నీవు స
  మ్మతముగ సంధిఁజేసికొని మాన్యుడవై వెలుగొందగోరితిన్
  గతజలసేతుబంధనమకార్యము, మేలొనగూర్చదెప్పుడున్.

  రిప్లయితొలగించండి
 7. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  నుతజల పూరిత నూతులు పూడ్చియు
  ………. సౌధనిర్మాణముల్ సల్పు చుండ
  సాగరమ్ములబోలు సజల సరస్సుల
  ………. స్థానాన రొయ్యలు సరస జేర
  భూగర్భ జలధార బోరుమనగ బోరు
  ………. లందు తీయుచు నమ్మ యాశతోడ
  తరుజాతి సతతమ్ము తరగిపోవుచునుండ
  ………. ధరణి తపియించు కతన గనుచు
  చుక్క నీరు లేక ప్రజలు సొమ్మ సిల్ల
  ముందు చూపు లేని ప్రభుత మూయ కనులు
  కనులు తెరచి తరచి జూడ కార్యమెల్ల
  పరగునట “గతజల సేతు బంధన”మన.

  రిప్లయితొలగించండి
 8. అయ్యా! శ్రీ తోపెల్ల శర్మ గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. భావము అధునాతనమై అభినందనీయముగ నున్నది. కొన్ని సవరణలను సూచించు చున్నాను:

  1. నుతజల పూరిత వరకు బాగుగనే యున్నది -- ఆ తరువాత నూతులు అనే తెలుగు పదమును వాడ కూడదు;

  2. 4వ పాదములో 2వ భాగములో ఏదో లోపమున్నది. చూచి సరిచేయండి.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. గతమే మననము జేయుచు
  మతి వోవగ వెతను జెంది మ్రగ్గుట కంటెన్ !
  హితమగు తీరున పయనము
  గత జలమున సేతు వనగ కాపధ మంచున్ !

  రిప్లయితొలగించండి
 10. గత కార్యపు బాగోగులు
  మతియందున మరచి వర్తమానము నందున్
  సతతము మెలగుచు నుండిన
  గత జలమున సేతు బంధ కట్టడమేలన్?

  రిప్లయితొలగించండి
 11. ఈనాటి శీర్షికకు మంచి పద్యాల నందించిన కవిమిత్రులు...
  నాగరాజు రవీందర్ గారికి,
  పండిత నేమాని వారికి,
  గోలి హనుచమచ్ఛాస్త్రి గారికి,
  సుబ్బారావు గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  అభినందనలు, ధన్యవాదములు.
  *
  తోపెల్ల వారూ,
  నాల్గవ పాదం ఉత్తరార్ధాన్ని "ధరణి తపించు విధంబు గనుచు" అందామా?
  *
  సహదేవుడు గారూ,
  "సేతుబంధ కట్టడము" అనరాదు కదా! "సేతుబంధ గతి యగును కదా" అంటే ఎలా ఉంటుంది?

  రిప్లయితొలగించండి
 12. శ్రీపండిత నేమాని గురువులకు, శంకరార్యులకు నమస్సులతో సవరణ చేయుచూ
  నుతజలంబుల నుండు నూతులు పూడ్చియు
  ………. సౌధనిర్మాణముల్ సల్పు చుండ
  సాగరమ్ములబోలు సజల సరస్సుల
  ………. స్థానాన రొయ్యలు సరస జేర
  భూగర్భ జలధార బోరుమనగ బోరు
  ………. లందు తీయుచు నమ్మ యాశతోడ
  తరుజాతి సతతమ్ము తరగిపోవుచునుండ
  ………. ధరణి తపించు విధంబు గనుచు
  చుక్క నీరు లేక ప్రజలు సొమ్మ సిల్ల
  ముందు చూపు లేని ప్రభుత మూయ కనులు
  కనులు తెరచి తరచి జూడ కార్యమెల్ల
  పరగునట “గతజల సేతు బంధన”మన.

  రిప్లయితొలగించండి
 13. ఆదికాలమునాడగపడని జనులెల్ల
  ...........................ప్రియతములయ్యిరి పదవి పోవ,
  పట్టుపరుపులపైని పవ్వళించెడి రాజు
  ...........................పాదచారై నేడు పయనమాయె,
  గడపగడపలోను కాలిడుచు పలికె
  ...........................బువ్వయున్నద నీకు అవ్వయనుచు,
  బాలపాపలు గారె భగవంతులనుచు
  ...........................మునులవోలె పలికి ముడుపులిచ్చి,
  ఎన్ని చేష్టలు చేసిననేమి ఫలము?
  నేతలందరి మాటలు నీటిమూటె !
  హద్దుమీరిన జలముల కడ్డు యేల?
  దీపముండగనిల్లు దిద్దుకొనవలయు !

  రిప్లయితొలగించండి
 14. సతతము కుర్ర చేష్టలను సాగును బాల్యము, యవ్వనమ్ములో
  నతిమద గర్వితుండగును, వ్యాధుల క్రుంగును వార్ధకమ్మునన్
  మతి జెడు నన్ని కాలముల మానవు డెన్నడు దల్ప డీశ్వరున్
  గత జల సేతు బంధనము కాదె తుదన్ వగవంగ నజ్ఞుడై!

  రిప్లయితొలగించండి
 15. మొత్తమ్మీద శర్మగారు జల బంధనానికే కట్టుబడి యున్నారన్న మాట. బాగుబాగు.

  రిప్లయితొలగించండి
 16. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. యౌవనము అనే సంస్కృత పదమునకు వికృతి జవ్వనము అనే తెలుగు పదము. యవ్వనము అని వాడుట సరికాదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. అమ్మా రామలక్ష్మి గారూ!
  శుభాశీస్సులు.
  మీ పద్యములో భావము బాగుగ నున్నది. అక్కడక్కడ కొన్ని సవరణలు కావలెను.

  1. 1వ పాదములో యతి మైత్రిలేదు. ఇలాగ మార్చండి:
  ఆదికాలమ్ము నాడగపడని జనులు
  ........
  2. 3వ పాదములో: బువ్వ నీకున్నదా? యవ్వ యనుచు -- అని మార్చండి.

  3. హద్దు మీరిన జలముల కడ్డులేల? అని మార్చండి

  4. దీప మున్నప్పుడే యిల్లు దిద్దవలెను - అని మార్చండి.

  రిప్లయితొలగించండి
 18. డా. ప్రభల రామలక్ష్మి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  నేమాని వారి సవరణలను గమనించారు కదా.
  సీసం మొదటి పాదం ఉత్తరార్ధంలోనూ యతి తప్పింది. "ప్రియతములై పోయిరి పదవి చన" అందామా?
  *
  మిస్సన్న గారూ,
  చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. తలప,గతజలసేతుబంధనము జేయు
  ఘనులు కాదె ప్రభుత్వాధికారు లెల్ల
  గాలివానలు,వరదలు ,గడచిపోవ
  బ్రజల నాదుకొన రచింత్రు పథకములను

  రిప్లయితొలగించండి
 20. కమనీయం గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. నేమాని పండితార్యా! సూచనకు ధన్యవాదములు.

  సతతము కుర్ర చేష్టలను సాగును బాల్యము, యౌవనమ్ములో
  నతిమద గర్వితుండగును, వ్యాధుల క్రుంగును వార్ధకమ్మునన్
  మతి జెడు నన్ని కాలముల మానవు డెన్నడు దల్ప డీశ్వరున్
  గత జల సేతు బంధనము కాదె తుదన్ వగవంగ నజ్ఞుడై!

  గురువుగారూ ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 22. నేమాని పండితార్యా, శంకరార్యా! మీ సూచనలకు ధన్యవాదములు. నమస్సులతో సవరణ చేయుచూ....

  ఆదికాలమ్ము నాడగపడని జనులెల్ల
  ...........................ప్రియతములై పోయిరి పదవి చన,
  పట్టుపరుపులపైని పవ్వళించెడి రాజు
  ...........................పాదచారై నేడు పయనమాయె,
  గడపగడపలోను కాలిడుచు పలికె
  ........................... బువ్వ నీకున్నదా? యవ్వ యనుచు,
  బాలపాపలు గారె భగవంతులనుచు
  ...........................మునులవోలె పలికి ముడుపులిచ్చి,
  ఎన్ని చేష్టలు చేసిననేమి ఫలము?
  నేతలందరి మాటలు నీటిమూటె !
  హద్దు మీరిన జలముల కడ్డులేల?
  దీప మున్నప్పుడే యిల్లు దిద్దవలెను!

  రిప్లయితొలగించండి
 23. మిస్సన్న గారూ! చాల అద్భుత యధార్థ భావజాలంతో మీపద్యం అలరారుచున్నది. అభినందనలు.

  రామలక్ష్మిగారూ!
  శ్రీపండితులవారి, శంకారార్యులవారు పరిష్కారానంతరం మీ పద్యం చాల హృద్యంగా ఉన్నది.శుభముమీకు.

  రిప్లయితొలగించండి
 24. పతనము కాగ కాంగ్రెసహ భారత దేశపు మారుమూలలన్
  వ్రతములు మాని కోవెలను భగ్గున మండుచు హైందవమ్ముపై
  సతమతమౌచు జందెమును చాకలి కిచ్చుచు కండ్లనీళ్ళతో
  గతజల సేతు బంధనము గ్రక్కున జేసెను రాహులుండహో!

  రిప్లయితొలగించండి