సాహిత్యాభిమాని గారూ, తులసీప్రాభవాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు. * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, బాగుంది మీ పద్యం. అభినందనలు. ‘తీర్థ దరిసెనము’ అనరాదు కదా! నా సవరణ... సకల పునీత సుతీర్థము లకు.... * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ ‘తులసి’ ఖండకృతి ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
మూలంబందున తీర్థము
రిప్లయితొలగించండిలాలోకించంగ నడుమ నఖిలామరులున్
లాలితముగ నగ్రంబున
మేలగు శ్రుతులుండు తులసి మేదిని కెపుడున్.
శుభములు గూర్చుచు నుండును
విభవంబుల నందజేయు విస్తృతరీతిన్
ప్రభవింప జేయు సుఖముల
నభయదమీ తులసికిప్పు డంజలి చేతున్.
ధన్యవాదములు,
హ.వేం.స.నా.మూర్తి.
సకల సుతీర్థదరిసెనము
రిప్లయితొలగించండిలకు నెలవై యిల వెలసిన లక్ష్మీరూప
మ్మొక తులసి యనుచు నిరతము
వికసించిన పువ్వులొసగి వేడుచు నుందున్.
తులదూచ లేము విలువను
రిప్లయితొలగించండితులదూచగ గలిగె హరిని తులసీ దళమే
ఇల తులసియున్న యిల్లే
నిలయము సిరి, హరికి నరుడ నిజమే కాదా !
తులసి మాత ను బూజించ దొరలె యగుదు
రిప్లయితొలగించండిరార్య ! సందియ మిల ని సు మంత లేదు
చెట్టు గల యింట నిరతము సిరులు బండు
పూజ జేయుడు మఱి పుణ్య పురుషు లార !
తులసి యున్న నెలవు తులలేని సంపద
రిప్లయితొలగించండిశాంతి సుఖము లిచ్చు సర్వులకును
ప్రాణ వాయు విడును రాత్రింబవళ్ళు తా
నితర తరుల రీతి కితరముగను.
తులసి లేని యింట జలమైన ముట్ట రా
దండ్రు పెద్ద లవని తరుల లోన
నతి పవిత్ర మిద్ది యాహరి కొలువౌను
తులసి కోట లోన లలన గూడి.
ఏ మొక్కకు మూలంబున
భూమిని గల సర్వతీర్థములు కొలువుండున్
ఆమొక్క తులసి దెలియుము
భామినులకు భారతమున ప్రాణం బదియే.
ఏ మొక్కకు మధ్యంబున
తాముందురొ సర్వ దేవతలు నిత్యంబున్
ఆమొక్క తులసి దెలియుము
భూమీశుల కైన తులసి పూజార్హ మగున్.
ఏ మొక్క కగ్ర మందున
తాముండునొ వేదరాశి తప్పక నెపుడున్
ఆ మొక్క తులసి దెలియుము
నీమముతో మ్రొక్క సతము నీకగు శుభముల్.
సాహిత్యాభిమాని గారూ,
రిప్లయితొలగించండితులసీప్రాభవాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘తీర్థ దరిసెనము’ అనరాదు కదా! నా సవరణ...
సకల పునీత సుతీర్థము
లకు....
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ ‘తులసి’ ఖండకృతి ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
రిప్లయితొలగించండిపెరటియందు మనకు బెన్నిధి యైనట్టి
తులసి మొక్క లేని నెలవు కలదె
పావనమ్మె కాదు ,పరమౌషధము కూడ,
శాస్త్రశోధనమున సమ్మతమ్ము.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండివాత కఫముల బాధలు వరుస గాను
తులసి యాకులు నమలగ తుడిచి పెట్టు
తులసి మాతకు ప్రతిరోజు తోయమిడగ
తులసి తీర్థమ్ము కావలె తుట్ట తుదను.
ప్రాణవాయువునిచ్చును ప్రాణులకును
రిప్లయితొలగించండిసర్వదేవతలిందుండు చక్కగాను
మాధవీ తనయ! తులసి! భూజమాత!
గావు మమ్మెపుడు మహిలో, కల్పవల్లి !
.............................తోపెల్ల శ్రీతేజ.
కమనీయం గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగుంది. అభినందనలు.
*
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
*
చి. తోపెల్ల శ్రీతేజా,
తొలి ప్రయత్నంలోనే నిర్దోషంగా, సలక్షణంగా, మంచి ధారతో పద్యాన్ని వ్రాసే నేర్పు లభించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. పద్యకవిగా ఉజ్జ్వల భవిష్యత్తు నీకున్నది. శుభమస్తు!
తేజా! చాల బాగ వ్రాసావు. ఆశీస్సులు.
రిప్లయితొలగించండిచి. శ్రీతేజ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండితులసి మీద చక్కని పద్యము వ్రాసేవు. అభినందనలు. 3వ పాదములో యతి తప్పినది. ఇలాగ మార్చుదాము:
"మాధవీ తనయ తులసి క్ష్మాజవరము"
స్వస్తి.
తెలుగు వారింట నిత్యము
రిప్లయితొలగించండివెలయంగా శుభము లిచ్చు వేలిపు తానై !
బలిమిని హరినే గెలువగ
తులసిని గాకెవరి నైన తూచగ తరమే ?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ నేమాని గురువులకు నమస్కారములు..మీసూచనప్రకారం సవరించుచూ......
రిప్లయితొలగించండిప్రాణవాయువునిచ్చును ప్రాణులకును
సర్వదేవతలిందుండు చక్కగాను
మాధవీ తనయ! తులసి!క్షాజవరము!
గావు మమ్మెపుడు మహిలో, కల్పవల్లి !
.............................తోపెల్ల శ్రీతేజ.