22, మార్చి 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1002 (పిఱికివాఁడు గెల్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పిఱికివాఁడు గెల్చె వీరతతిని.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

14 కామెంట్‌లు:

  1. వీర "తొట్టిగ్యాంగు" విర్రవీగుచు పొలము
    నాక్రమించ గినిసి నాసరయ్య
    కోర్టునందు వేయ కొన్ని నాళ్ళకు జూడ
    పిఱికివాఁడు గెల్చె వీరతతిని.

    రిప్లయితొలగించండి
  2. భగవతి అనుగ్రహాన తతి తనదైన
    గతి తతి ఎన్ని ఎదురైనా నేమి ?
    మనోగతి ని యతి గావించి ఈ
    పిరికి వాడు గెల్చె వీర తతిని !


    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  3. గోగ్రహణ రణమున కురువీరు లోడగా
    విజయమంది వచ్చె పిరికివాడు
    గెల్చె వీరతతిని క్షితిపాల సుతుడని
    రట విరాట పౌరు లబ్బురమున

    రిప్లయితొలగించండి
  4. యుద్ధ మందుఁ జూడ యోధాను యోధులు
    తనువు మాట వణకి తడబడినను
    వీర విజయు డుండ, వెఱచి యుత్తరుడట
    పిఱికి వాఁడుగెలిచె వీరతతిని

    రిప్లయితొలగించండి
  5. పి ఱి కి వాడు గెల్చె వీ ర తతి ని నిల
    పోరు జేయ జేయ పౌ రు షం బు
    కలిగి బలము గూడ గట్టు కొని గెలిచె
    జయ మప జయ ము లవి శం భు లీ ల .

    రిప్లయితొలగించండి
  6. భీష్ము డాలమునను బిత్తరుడై గనె
    తేరు పైన సారథిగ శిఖండి
    యుండ, పోరు చేయకుండ తిరిగిపోయె
    పిఱికి వాఁడు గెలిచె వీరతతిని

    రిప్లయితొలగించండి
  7. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
    చిత్ర మందు హీరొ చిత్రంబుగా దాగె
    పిఱికి వాని పాత్ర వేసి తుదకు
    విలను బుద్ధి బయట పెట్టి చితుక బాది
    పిఱికివాఁడు గెల్చె వీరతతిని.

    రిప్లయితొలగించండి
  8. యుద్ధ మన్న భీతి నుత్తర కొమ రుండు
    రధము మరలు మంచు రణము వలదు
    గోగ్ర హణము నందు కోరి గెలువ పార్ధు
    పిరికి వాడు గెలిచి వీర తతిని

    రిప్లయితొలగించండి
  9. గోగ్రహణపు వేళ కురువీరులను జూచి
    యుఱికిపోయె నాడు యుత్తరు డను
    పిఱికివాడు ; గెల్చె వీరతతిని జీల్చి
    యాలమందు నిల్చి యర్జునుండు

    రిప్లయితొలగించండి
  10. క్షమించాలి ...
    పిఱికి వాడు గెల్చె వీర తతిని "

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    కోర్టులో గెలవడం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    *
    అమ్మా జిలేబీ,
    తకార అనుప్రాసతో మీరు చెప్పిన విషయం నా ‘మతి’కి అందలేదు.
    *
    పండిత నేమాని వారూ,
    ఉత్తరుని గురించి విరాటనగర పౌరుల మాటలుగా మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీరూ ఉత్తరుని విషయంగానే చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    “ఉద్యమం సాహసం ధైర్యం
    బుద్ధి శ్శక్తి ర్ప్రరాక్రమః
    షడేతే యత్ర వర్తంతే
    తత్ర దేవ స్సహాయకృత్”
    అన్నట్టు ఒకప్పటి పిరికివాడు పైగుణాలు అలవరచుకొని దైవసహాయంతో గెలిచాడన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పూరణ చదివితే మొన్నమొన్ననే చూసిన ‘విశ్వరూపం’ సినిమా గుర్తుకు వచ్చింది. మంచి పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    సమస్యను విరిచి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి




  12. తనను జంప వచ్చు దౌర్జన్య పరుడైన
    రౌడికి భయపడిన వాడు ,కడకు
    సాక్షి చిత్రమందు సాహసించె నెటులొ
    పిరికివాడు గెల్చె వీరతతిని.

    రిప్లయితొలగించండి
  13. కమనీయం గారూ,
    సాక్షి చిత్రం ఆధారంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. కంది వారు,

    భగవతి అనుగ్రహాన సమయం తనదైన
    గతి , సమూహం ఎదురైనా నేమి ?
    మనోగతి ని యతి గావించి ఈ
    పిరికి వాడు గెల్చె వీర సమూహమును !


    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి