22, మార్చి 2013, శుక్రవారం

పద్య రచన – 288 (రెంటికిఁ జెడిన రేవఁడు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“రెంటికిఁ జెడిన రేవఁడు”

26 కామెంట్‌లు:

 1. బలపం బట్టి అ ఆ ఇ ఈ నేర్చు కోవాల్సిన బుజ్జి పండు
  కంప్యూటర్ లో ఎ బీ సీ డీ ఈ ఎఫ్ జీ హెచ్ అంటున్నాడు
  ఇక్కడి తెలుగు బిడ్డ,అమెరికా ఎక్స్పోర్ట్ నవత చూడండీ
  రెంటికి చెడిన రేవడి ఇది కాదంటే మరి ఏమండీ ??


  జిలేబి.

  రిప్లయితొలగించండి
 2. జిలేబి గారి భావంతో...
  నేటి విద్యార్థి...
  మాతృభాషనేమొ మరికొంత నేర్వడు
  పరుల భాష నేర్చు పైన పైన
  లెస్స రాదు నొకటి ' లెస్సేను ' రెంటను
  రేవడాయె జూడ రెంట జెడుచు.

  రిప్లయితొలగించండి
 3. వింటినారి కొఱికి గుంటనక్క యొకడు
  అసువు లట్లు బాసె పిసినిగొట్టు
  నరుని పొలసు వదలి నరమును కోరగా
  రెంటికి జెడినట్టి రేవ డయ్యె

  రిప్లయితొలగించండి
 4. రెంటికి చెడ్డ రేవడు అని సమస్య - రెంటికి చెడ్డ రేవడి అని మా ప్రాంతములోని సామెత. ఆ రెండిటిని సమన్వయ పరచుచు నా పూరణ - రేవడు (చాకలి):

  రేవడొకండు వీడి కుల వృత్తిని సేద్యము సేయ బూనుచున్
  రేవడి భూమి నొండు కొని రెక్కలు ముక్కలుగా శ్రమించె నా
  సేవకు వచ్చు లాభమని జీవితమున్ దలపోయగా కటా!
  హావిధి! పొందె కష్టముల నాతడు రెండిట కల్గ నష్టముల్

  రిప్లయితొలగించండి
 5. స్వధర్మాచరణంబది
  వదలుచు పరధర్మవశుడు పాటించగనన్?
  ముదమందక రెంటికిఁ జెడి
  వెధవై రేవఁడని జనులు పిలువగ వగచున్!

  రిప్లయితొలగించండి
 6. రేవ డొ కనికి బేరాశ నావ హించి
  బట్ట లుతుకుట మానియు పైరు వేయ
  వాన లేమికి జెడిపోగ పంట పొలము
  రెంటికి జెడియు కుమిలెనా రేవడపుడు

  రిప్లయితొలగించండి
 7. అంబ భీష్ముని ప్రార్థించి యరిగి తనదు
  ప్రియుని చేరి యట తిరస్కరింప బడెను
  పిదప చేగొన డయ్యెను భీష్ముడేని
  రెంటికిని చెడ్డ రేవని రీతి నలగె

  రిప్లయితొలగించండి
 8. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  పనిచేయ గల్ఫుకు వడివడి చేరగ
  ………. దొంగవీ సాలంచు దొరకి పోవ
  కులవిద్యలన్నింట కూల్చివేయగ వెలి
  ………. విద్యలేమియు రాక వెతలనొంద
  కులసతిని విడచి వెలకాంత సరసాన
  ………. సొమ్ములన్నియుదోచి చూడకున్న
  పెద్దల సుద్దులు పెడచెవి నుంచుచు
  ………. వక్రమార్గమునందు బందియగుచు
  గీత యందు తెలిపె దేవకీ సుతుండు
  తనదు ధర్మము విడి పరధర్మ మందు
  వెతికి జూడగ బోవుట వెర్రి గాదె
  రెంటికిని జెడిన రేవడి రీతి యగును.

  రిప్లయితొలగించండి
 9. (A bird in hand is better than two in a bush )

  చేతిలోని పిట్ట చెంతనె యుండగా
  చెంచు యొకడు పొదను చేరి వెదకె
  తుఱ్ఱుమనుచు పిట్ట బుఱ్ఱున చేజార
  రెంటికి చెడినట్టి రేవ డయ్యె

  రిప్లయితొలగించండి
 10. నాగరాజు రవీందర గారూ! ఆంగ్ల సామెతకు ఆంధ్ర సామెతను జొప్పించే చెప్పిన మీ పూరణ చాల చాల బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ నాగరాజు రవీందర్ గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగున్నది. చెంచు + ఒకడు అనుచోట యడాగామము రాదు. అందుచేత "చెంచొకండు" అని సవరించుదాము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. మాతృ దేశము వీడుచు మైక మందు
  ఆంగ్ల మనగను భాగ్యము యెంగి లనక
  పరుల పంచన నిమడగ దిరుగు లేక
  రెండు విధముల చెడి నట్టి రేవ డయ్యె
  ---------------------------
  తాళి గట్టిన భార్యను గేలి చేసి
  ప్రియము జెందితి నాకిది ప్రేయ సనగ
  మోస మంచును నిరువురు దోస మెంచి
  మరలి పోయిరి నిరు వైపు మాట లేక
  రెండు విధముల చెడి నట్టి రేవ డయ్యె !

  రిప్లయితొలగించండి
 13. శ్రీ తోపెల్ల శర్మ గారికి శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. గల్ఫుకి వెళ్ళిన రేవడులను గూర్చి బాగుగా వర్ణించేరు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. గురువర్యులకు వందనములు. సవరణకు ధన్యవాదాలు

  రిప్లయితొలగించండి
 15. పూజ్యశ్రీ నేమాని గురువులకు ప్రణామపూర్వక ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 16. జిలేబీ గారూ,
  చక్కని భావాన్ని అందించారు. అభినందనలు.
  గోలి వారు మీ భావానికి సుందరపద్యరూపాన్నిచ్చారు. గమనించారు కదా!
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  జిలేబీ గారి భావానికి మీరిచ్చిన పద్యరూపం బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  పంచతంత్ర కథ, ఆంగ్ల సామెత ఆధారంగా మీరు చెప్పిన రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
  మొదటి పద్యంలో ‘ఒకడు + అసువులు’ అని కాకుండా “యొక్క/ డసువు లట్లు...” అందాం.
  *
  పండిత నేమాని వారూ,
  మీ రెండు పద్యాలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  ‘స్వధర్మో నిధనం శ్రేయః’ అన్నట్టు మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
  ‘స్వధర్మా..’ అన్న చోట గణదోషం.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘పేరాస యావహించి’ అనండి.
  *
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
  కులవృత్తులను వదిలి వెలివృత్తులకోసం గల్ఫులకు వెళ్ళిన వారిని గురించి, కులకాంతను వదలి వెలకాంతలను జేరే వారిని గురించి గీతాబోధ నేపథ్యంతో చాలా మంచిపద్యం చెప్పారు. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యాలు బాగున్నాయి. అభినందనలు.
  మొదటి పద్యం రెండవ పాదంలో ప్రాసయతి తప్పింది.
  రెండవ పద్యం మూడవపాదంలో ‘పోయిరె యిరువైపు’ అనండి.

  రిప్లయితొలగించండి
 17. ధనము చాల యార్జించె వర్తకమునందు
  చలనచిత్ర నిర్మాణమ్ము సలిపి మిగుల
  నష్టమొందె దురాశతో నరుడొకండు
  వాడె రెంటికి జెడ్డ రేవడు కదోయి.

  రిప్లయితొలగించండి
 18. డా.కమనీయం గారూ!
  చిత్ర నిర్మాణ రంగాన వేలు పెట్టి చేతులు కాల్చుకున్న వాళ్ళు చాలమంది యున్నారు.
  ఆట వెలది ఆటకట్టించి తేట తేట మాటలతో మీ తేటగీతి చాల బాగున్నది మీ పూరణ.అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. కమనీయం గారూ,
  మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. గోలీ వారు,

  నమో నమః!

  అద్బుతం !


  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించండి
 21. గురువుగారికి ధన్యవాదములు.
  తమరి సూచిత సవరణతో పద్యం:

  పృధివిన్ స్వధర్మ మన్నది
  వదలుచు పరధర్మ వశుడు పాటించగనన్
  ముదమందక రెంటికిఁజెడి
  వెధవై రేవఁడని జనులు పిలువగ వగచున్!

  రిప్లయితొలగించండి
 22. గురువుగారికి ధన్యవాదములు.
  తమరి సూచిత సవరణతో పద్యం:

  పృధివిన్ స్వధర్మ మన్నది
  వదలుచు పరధర్మ వశుడు పాటించగనన్
  ముదమందక రెంటికిఁజెడి
  వెధవై రేవఁడని జనులు పిలువగ వగచున్!

  రిప్లయితొలగించండి