బాలసుబ్రహ్మణ్య శర్మగారూ ! నమస్కారములు. ధన్యవాదములు. మిస్సన్న గారి చెణకులే వేరు కదా ! ఆయన కాజాలు చేయడం లో నేర్పరి. విశాఖపట్టణము వెళ్తే ఆయనను తప్పక కలవండి !
అన్నా! గన్నవరపు మూర్తి మిత్రమా! ఎంతమాట! మీ పొగడ్త చాలా బాగుంది. ఆ పొగడ్తను పూరణలో సర్దిన మీ నైపుణ్యం ఇంకా బాగుంది. ధన్యవాదాలు.
తోపెల్ల శర్మ గారూ ! ధన్యవాదాలు.మూర్తి మిత్రులు అలాగే అంటారు. వారి మాటలు పట్టించు కోకండి. వట్టిది. నాకు కాజాలు చేయడం రాదు. మనుసేస్తే కొనుక్కోంటాను. వారి విశాఖపట్నం వచ్చాక చెణకులు మరి కొంచెం వంట బడ్తున్నాయి.
లక్ష్మీదేవి గారూ,పీతాంబర్ గారూ, ఘనత మిస్సన్న గారిదే ! అయినా ధన్యవాదాలు. మిస్సన్న మహాశయా మీరు విశాఖ రావడము నాకు సంతోషము కలిగించింది. మీకు సౌకర్యకరముగా ఉంటుందని ఆశిస్తున్నాను.
చిన్నిధియగు హరికథలను
రిప్లయితొలగించండిసన్నుతి జేయుచును భక్తి సామ్రాజ్యములో
మిన్న యయిన బమ్మెర పో
తన్నన్ జూడగనె భక్తి తత్త్వము దెలియున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండిజన్నపు రీతిర చింపగ
వెన్నుని గాధ మధురముగ వేయివిధంబుల్
కన్నుల రాము గనిన పో
తన్నన్ జూడఁగనె భక్తితత్త్వము దెలియున్.
చెన్నుగ సేవించుచు వెత
రిప్లయితొలగించండిలెన్నక తనకర్మ జేసి యిలనే నమ్మే
అన్నము నొరులకు నిడు రై
తన్నన్ జూడఁగనె భక్తితత్త్వము దెలియున్.
అన్నముఁ బెట్టవలెననియు
రిప్లయితొలగించండినెన్నుచు మనమందు, గొప్ప ఋషియై భువినిన్
మిన్నగఁ బోషించెడు రై
తన్నన్ జూడఁగనె భక్తితత్త్వము దెలియున్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసుబ్బారావు గారు,
రిప్లయితొలగించండిమూడవపాదములో ప్రాస మరిచినారు.
వెన్నల మేనెల్ల గలుగు
రిప్లయితొలగించండిపున్నమి చందురునిబోలు పూజ్యుడు గాంధీ
దన్నుగ నిలిచెను నా నే
తన్నన్ జూడగనె భక్తి తత్త్వముదెలియున్
శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ పండిత నేమాని గురువర్యులకు ధన్యవాదములు
రిప్లయితొలగించండిభక్త రామ దాసులో శబరిగా సుజాత బహు చక్కగ నటించెను
=========*========
కన్నడ చిన్నది రాముని
సన్నిధి కోరి దను భక్త శబరిగ నెంతో
వన్నెను దెచ్చె,నటి సుజా
తన్నన్ జూడగనె భక్తి తత్త్వము దెలియున్
వెన్నుని గాథను వ్రాయగ
రిప్లయితొలగించండితన్నుపలుకఁజేయు వాడు ధాశరధిగఁ దాఁ
మిన్నగ నను బమ్మెర పో
తన్నన్ జూడగనె భక్తి తత్వము దెలియున్
అన్నువ భాగ వతంబును
రిప్లయితొలగించండిమిన్నగ మఱి చదువు చుండి మేదిని యందున్
ఉన్నతు డా బమ్మెర పో
తన్న న్ జూడగనె భక్తి తత్వము దెలియున్ .
చెన్నుని మురళీ గానము
రిప్లయితొలగించండివిన్నను వీను లకు విందు వేడుక పుట్టన్ !
తిన్నను భోజ్యమ్ము లన్నదా
తన్నన్ జూడఁ గనె భక్తి తత్వము దెలియున్ !
అన్నమయ భక్తి గీతము
రిప్లయితొలగించండిలన్నియు నానందమొసగు నాత్మకు శ్రీరా
మన్న పరమ భక్తుడు పో
తన్నన్ జూడగనె భక్తి తత్వము తెలియున్ .
సున్నిత మధుర పదమ్ముల
రిప్లయితొలగించండిసన్నుతులను సలిపె దైవ సన్నిధి దోపన్
మన్నన జేయుచు శ్రీ పో
తన్నన్ జూడఁగనె భక్తితత్త్వము దెలియున్.
హన్నా నా భక్తునిపై
రిప్లయితొలగించండికన్ను వడెనె యని శివుండు గని కడు నెరుపౌ
కన్నుల యముని యురమ్మున
తన్నన్ జూడగనె భక్తి తత్త్వము దెలియున్.
పెన్నిధియగు హరిచరితము
రిప్లయితొలగించండిసన్నుతి చేయుచును వ్రాసె సత్కవి నాడే
కన్నుల విభుగాంచిన పో
తన్నన్ జూడగనె భక్తి తత్వము దెలియున్
అన్నా! మిస్సన్నా!నేనేమని మిమ్మెన్నగలవాడను! అద్భుతంగా పూరణ చేసారు. అభినందనలు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఎన్నదగు పూరణమ్ముల
మిన్నయయెర నీదు కవిత మేల్! మిస్సన్నా !
విన్నాణపు సొంపుల దల
దన్నన్, జూడఁగనె భక్తితత్త్వము దెలియున్.
డా.గన్నవరపు వరాహనరసింహమూర్తిగారికి నమస్కారములు.మిస్సన్న గారి అగ్రతాంబూల ప్రశంసా పూర్వక మీ పూరణ ఇంకా సందర్భోచితాద్భుతముగా నున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబాలసుబ్రహ్మణ్య శర్మగారూ ! నమస్కారములు. ధన్యవాదములు. మిస్సన్న గారి చెణకులే వేరు కదా ! ఆయన కాజాలు చేయడం లో నేర్పరి. విశాఖపట్టణము వెళ్తే ఆయనను తప్పక కలవండి !
రిప్లయితొలగించండినేటి సమస్యకు చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
లక్ష్మీదేవి గారికి,
మంద పీతాంబర్ గారికి,
వరప్రసాద్ గారికి,
సహదేవుడు గారికి,
సుబ్బారావు గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి
మిస్సన్న గారికి,
డా. ప్రభల రామలక్ష్మి గారికి
అభినందనలు, ధన్యవాదాలు.
మిస్సన్న గారు, మూర్తిగారు
రిప్లయితొలగించండిభలే గా తన్నించారు మీ పూరణలతో.
మిస్సన్న మరియు మూర్తి గార్ల పూరణలు భేష్.
రిప్లయితొలగించండిఅన్నా! గన్నవరపు మూర్తి మిత్రమా! ఎంతమాట!
రిప్లయితొలగించండిమీ పొగడ్త చాలా బాగుంది. ఆ పొగడ్తను పూరణలో సర్దిన మీ నైపుణ్యం ఇంకా బాగుంది. ధన్యవాదాలు.
తోపెల్ల శర్మ గారూ ! ధన్యవాదాలు.మూర్తి మిత్రులు అలాగే అంటారు. వారి మాటలు పట్టించు కోకండి.
వట్టిది. నాకు కాజాలు చేయడం రాదు. మనుసేస్తే కొనుక్కోంటాను. వారి విశాఖపట్నం వచ్చాక చెణకులు మరి కొంచెం వంట బడ్తున్నాయి.
లక్ష్మీ దేవిగార్కీ, పీతాంబర ధరునకూ ధన్యవాదాలు.
లక్ష్మీదేవి గారూ,పీతాంబర్ గారూ, ఘనత మిస్సన్న గారిదే ! అయినా ధన్యవాదాలు. మిస్సన్న మహాశయా మీరు విశాఖ రావడము నాకు సంతోషము కలిగించింది. మీకు సౌకర్యకరముగా ఉంటుందని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండిఅన్నియు పశువుల కన్నన్
రిప్లయితొలగించండిమిన్నగ రైతుల పొలములు మెరియుచు ప్రీతిన్
దున్నెడి నల్లని యెనుబో
తన్నన్ జూడఁగనె భక్తితత్త్వము దెలియున్
తిన్నగ దేశము దోచుచు
రిప్లయితొలగించండిమిన్నగ లావైన నేత మీదన్ బడుచున్
సన్నగ నుండెడి వోటరు
తన్నన్ జూడఁగనె భక్తితత్త్వము దెలియున్