7, మార్చి 2013, గురువారం

పద్య రచన – 273 (దశమ గ్రహము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"దశమ గ్రహము"

15 కామెంట్‌లు:

  1. మొండి దశమగ్రహమ్మయి
    యుండు ననుచు ననెదరు కద ఓఢ్రులు ధరణిన్
    మొండిని వదలించుకొనిన
    పండువగుచు జీవితమ్ము భాసిల్లు సుధీ!

    రిప్లయితొలగించండి
  2. ఏమని జెప్పగ నిప్పుడు
    నీమముగా పెండ్లి జేయ నెచ్చూలి కనన్ !
    ప్రేమలు కరువై పోవగ
    జామాత దశమ గ్రహమను సామ్యము సరియే !

    రిప్లయితొలగించండి
  3. జపములు లక్షల తోనే
    ఉపశాంతినను గ్రహించ హో మరి గ్రహముల్
    ఉపచారము తో లక్షలు
    తపనతొ గ్రహించి వినడు దశమగ్రహమే !
    (క్షమించాలి..కొందరికి మిన ' హాయింపు '.)

    రిప్లయితొలగించండి
  4. దశమ గ్రహమని యందురు
    విశదంబుగ, గూ తు పతిని , వివరణ యిత్తున్
    అశనము బెట్టక నిరతము
    పిశి తంబులు దినుచు వచ్చి పీ డించు మమున్ .

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని వారూ,
    క్రొత్త విషయాన్ని తెలియజేసారు. మన తెలుగువారు అల్లుణ్ణి దశమగ్రహమంటే ఒరియా వాళ్ళు మొండితనానికి ఆపేరు ఇచ్చారా? బాగుంది. చక్కని పద్యం. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    చివరి పాదంలో గణదోషం. 'తో'ను హ్రస్వంగా ప్రయోగించరాదు.
    తపనను గ్రహియించి వినడు... అందాం.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు...

    రిప్లయితొలగించండి
  6. అనుదిన ప్రదక్షిణముతో
    కనిపించని గ్రహనవములు కరుణించునవే
    కనిపించి సతాయించెడు
    మనఃస్థిమిత చోరుని దశమ గ్రహమనరే?

    రిప్లయితొలగించండి
  7. శ్రీ కందుల వర ప్రసాదు గారికి శుభాశీస్సులు. ఈ మధ్య మీ రచనా శైలి మెరుగు పడినది. వివిధములైన ఆధునిక భావనులతో పూరణలను చేస్తున్నారు. సంతోషము. మా ప్రశంసలు.

    రిప్లయితొలగించండి
  8. పీడించును శని గ్రహమే
    పీడించును దశమ గ్రహము, పెట్టును బాధల్
    వాడే జామాత వినుడు ;
    పీడించుట వాని గుణము, పిప్పిని జేయున్

    రిప్లయితొలగించండి
  9. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. కూతుననుగ్రహించునని కూరిమి పెంచునంచు కడు
    యాతురతన్ పెండ్లి జరుప హాయిగ మూడగు నెలలు
    చాతురితోడ గడుప(వ)గ చరిత తెలిసె తరువాత
    యాతడె “దశమగ్రహమని” యాటలాడు తనతోడనని.

    రిప్లయితొలగించండి
  11. అయ్యా శ్రీ తోపెల్ల శర్మ గారూ!
    మీ మధ్యాక్కర బాగుగనున్నది. ఆతురత అనే పదము శబ్దరత్నాకరములో లేదు. ఆత్రము అత్తరము అనే పదములు ఉన్నవి. కడు + ఆత్రము = కట్టాత్రము అగును లేనిచో కడునాత్రము అగును. మీ పద్యమును సరిచేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. మాన్యశ్రీ నేమాని పండితార్యులకు వందనములతో. ఆతురత = తొందరపాటు, సంభ్రమము అని ఆంధ్రవాచస్పత్యమునందు శ్రీ కొట్ర శ్యామలకామశాస్త్రిగారు వ్రాసినారు. గ్రహించ వచ్చునా? లేదా? అన్నది తెలియక గ్రహించినాను. పెద్దలు తెలియజేయమనవి.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి ధన్యవాదములు
    ఈ పద్యములందు నా కల్పన మేమియు లేదు, సర్వము శ్రీ శంకరయ్య గారిది మరియు శ్రీ పండిత నేమాని వారిది. దోషములున్న యడల అవి నావియే గనుక సవరించమని సవినయముగా ప్రార్థిస్తూ
    ========*===========
    ఇడుములను దశ విధములుగ
    తడవ తడవకును కడివెడు తాంబూలముతో
    పడతికి,మామకు నిచ్చును
    పుడమిని దశమ గ్రహము కడు పుంభావమునన్
    ( పుంభావము = మగతనము )

    రిప్లయితొలగించండి
  14. శ్రీ తోపెల్ల శర్మ గారికి శుభాశీస్సులు. ఆతురత అనే పదమును ఆంధ్ర వాచస్పత్యములో నిచ్చిరి కనుక వాడవచ్చును. అప్పుడు మీ పద్యములో: కడునాతురత అని గాని లేక కట్టాతురత అని గాని వేయవలసి యుండును. యడాగమము రాదు కదా.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి