కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కలహములే సకలసౌఖ్య కారణము లగున్.
ఈ సమస్యకు ఆధారం ‘పరాక్రి పదనిసలు’ బ్లాగులోని సమస్యాపూరణం. వారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కలహములే సకలసౌఖ్య కారణము లగున్.
ఈ సమస్యకు ఆధారం ‘పరాక్రి పదనిసలు’ బ్లాగులోని సమస్యాపూరణం. వారికి ధన్యవాదాలు.
కలహాశను దినకృత్య
రిప్లయితొలగించండిముల విశ్లేషించు నెడల పొలుపగు రీతిన్
దెలియు నతడు పురికొల్పెడు
కలహములే సకల సౌఖ్య కారణములగున్
గురువర్యులకు వందనములు. మొదటి పాదంలో ఒక మాత్ర తక్కువ పడింది. గమనించ గలరు.
రిప్లయితొలగించండిఅలరింపగ ననురక్తియు
రిప్లయితొలగించండినలరుల నంగజుడు నేయ నంబక హతులన్
జెలరేగు సుమధుర ప్రణయ
కలహములే సకలసౌఖ్య కారణము లగున్.
అన్నగారి పూరణ చాలా బాగుంది. ( చిన్న టైపాటు )
రిప్లయితొలగించండికలహాశను దినకృత్య
మ్ముల విశ్లేషించు నెడల పొలుపగు రీతిన్
దెలియు నతడు పురికొల్పెడు
కలహములే సకల సౌఖ్య కారణములగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇల దు:ఖమునకు హేతువు
రిప్లయితొలగించండికలహములే ; సకల సౌఖ్య కారణములగున్
వెలయగ శాంతము మనమున
కలహములే సకల దు:ఖ కారణములగున్
ఇల నీతి లేక ప్రజలను
రిప్లయితొలగించండిపలురీతుల దుఃఖబెట్టి ప్రబలిన మదమున్
దులువలు తమలో నాడెడి
కలహములే సకల సౌఖ్య కారణములగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపలువురు దనుజుల గూల్చగ
రిప్లయితొలగించండినలువకు కొమరుండగు మన నారద మునియే
యిల బాగు కొరకు బెట్టిన
కలహములే సకలసౌఖ్య కారణము లగున్.
నాగరాజు రవీందర్ గారికి, తమ్ముడు డా. నరసింహమూర్తికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండితమ్ముడు డా. మూర్తి చెప్పినట్లు నా పద్యము మొదటి పాదములో దొరలినది టైపు పొరపాటే.
మీ ఇద్దరికీ ప్రశంసలు. స్వస్తి.
ఇల నిడుములకు న్ హేతువు
రిప్లయితొలగించండికలహములే , సకల సౌఖ్య కారణ ములగున్
కలహములు లేక యుండిన
పలువుర తో బంధ ముంచి బ్ర దుకగ వలయున్
చెలి కోపకారణమునన్
రిప్లయితొలగించండిదలిగిన తరుణమునుఁజూచి యరవిందపు పు
వ్వుల సలిపెడునాప్రణయపు
కలహములే సకలసౌఖ్య కారణములగున్.
చిలిపిదనపుమాటలతో
రిప్లయితొలగించండికలికి చిరుయలుకనుఁ జూపి గారాబముగా
చెలికాని మనము గెలిచిన
కలహములే సకలసౌఖ్య కారణము లగున్.
చంపకమాల ఇచ్చినారు కదా గురువుగారు,
కిలకిల నవ్వుమోములవి గేహము నందముఁ బెంచు, నాలికిన్
చెలిమినిఁ బంచు భర్తలకు; సిగ్గరియౌ జవరాలి యల్కతో
వలపులఁ గాంతు మానసము వన్నెల చిందు మరింత ప్రేమతో
కలహమె సర్వ సౌఖ్యముల కారణమౌను వివేకమున్నచో
కలహింతురు నాలుమగలు
రిప్లయితొలగించండికలతలు అలుకలు సహజము కాపురమందున్
బలమగు బంధము నుండిన
కలహములే సకల సౌఖ్య కారణములగున్
పలు దు:ఖములకు మూలము
రిప్లయితొలగించండికలహములే; సకలసౌఖ్య కారణము లగున్
మేలిమి ప్రేమా బంధము,
జాలియు, సదసద్వివేక సంయమ గుణముల్.
విలువలు గలిగిన నాయక
రిప్లయితొలగించండిబలమున్నట్టి ప్రతిపక్ష వర్గము(పార్టీ) జనులన్
దలచుచు సభలో రేపెడు
కలహములే సకల సౌఖ్య కారణములగున్!
శ్రీ లక్ష్మీ నారాయణ గారు మీ పద్యము బాగన్నది. పొరపాటుగ మూడు నాల్గు పాదముల ముందు వేసిన గురువుల బదులు లఘువులతో సవరించండి
రిప్లయితొలగించండిఅలివేణి యలుక దీర్చగ
రిప్లయితొలగించండినలరిం చెను మదిని మురిసి యానం దింపన్ !
చిలిపిగ గెలువగ చెలి
కలహములే సకల సౌఖ్య కారణము లగున్ !
విలయమునకు కతనంబులు
రిప్లయితొలగించండికలహములే ; సకల సౌఖ్య కారణములగున్
తొలగిన నిల నలజడులే
కలహములే లేని చోట కలుగును సుఖముల్
పలు దు:ఖములకు మూలము
రిప్లయితొలగించండికలహములే; సకలసౌఖ్య కారణము లగున్
అలరారు ప్రణయ బంధము
చలియించని సద్వివేక సంయమ గుణముల్.
Shri Sahadevgaaru! Thanks for pointing out mistakes. Rectifying them I rewrite the poem.
రిప్లయితొలగించండికలహించి పత్ని వీడగ
రిప్లయితొలగించండినిల జేరెను శ్రీనివాసు డిరవుగ నీ మ
ర్త్యులదరి నిలవేల్పుల చిరు
కలహములే సకల సౌఖ్య కారణములగున్
శ్రీ శ్యామల రావు గార్! Subhaaseessulu.
రిప్లయితొలగించండిమీ దర్శనము చాల కాలము తరువాత కనుక ఆనందము గూర్చినది. మీ పద్యములు బ్లాగులో ఈ రోజు కనుబడుట లేదే. మాకు ఆ విందును కూడా కలిగించండి. స్వస్తి.
విలసిల్ల నింద్ర చాప
రిప్లయితొలగించండిమ్మిల దానిని జూడ వచ్చె నినుడదె హృదయ-
మ్ముల దోచును గన జలరే-
కలహములే సకల సౌఖ్య కారణములగున్.
(ఒక నిఘంటువులో జలరేకలు అంటే ' పలుచని మబ్బు అడ్డమువచ్చి చారలుగా క్రిందికి దిగు సూర్యుని వెలుతురు ' అని అర్థము చూశాను.
సరదాగా ఈ పూరణ చేశాను.)
జలరేకలు + అహములు(పగళ్ళు) అని నా భావము.
బళా! మిస్సన్న మహాశయా ! జలరేకలు చక్కనైన పదమును తెలియ జేసారు. వసంత కిశోర్ గారు సాధారణంగా క్రొత్త మాటలు చెబుతారు. మీరు కూడా మాకు క్రొత్త పదాలు నేర్పిస్తున్నారు. మీ పూరణ అద్భుతము.
రిప్లయితొలగించండిశ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
రిప్లయితొలగించండివలచిన చినదాని మనము
గెలువగ వడివడి చదువుచు గెలువగ పదవిన్
చిలుకలకొలికి పలికె “మన
కలహములే” సకలసౌఖ్య కారణము లగున్.
సౌఖ్యకారణాలైన కలహాల సమస్యపై చక్కని పూరణ లందించిన కవిమిత్రులు.....
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
లక్ష్మీదేవి గారికి,
పియెస్సార్ మూర్తి గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
సహదేవుడు గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
మిస్సన్న గారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
అభినందనలు, ధన్యవాదములు.
పియెస్సార్ మూర్తి గారూ,
రిప్లయితొలగించండి‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
‘కలహింతురు + ఆలుమగలు’ అన్నప్పుడు సంధి జరుగుతుంది.
నా సవరణలతో మీ పద్యం.....
కలహింతు రాలుమగ లా
కలతలు నలుకలు సహజము కాపురమందున్
బలమగు బంధ మ్ముండిన
కలహములే సకల సౌఖ్య కారణములగున్.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ ‘జలరేకల’ పూరణ వైవిధ్యంగా ప్రత్యేక ప్రశంసార్హంగా ఉంది.
మేలు భళి యంచు మెచ్చగ
జాలిన పూరణము జెప్పి సంతోషము మా
కీలీల గలుగ జేసితి
వౌ లే చాతుర్యశాలి వట మిస్సన్నా!
గురువుగారూ ! జలరేకల పూరణ మీకు అంతగా నచ్చినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమూర్తి మిత్రమా! ధన్యవాదాలు.
అయితే ఆ విషయంలో వసంత మహోదయులకే అగ్ర తాంబూల మివ్వ వలసి ఉంటుంది.
ఫలహారము కావలెనని
రిప్లయితొలగించండికలహించిన సతికి దోసె కమ్మగ నిడినా
కలకంఠి చుంబనములకు
కలహములే సకలసౌఖ్య కారణము లగున్
కలలో కానని రీతిని
రిప్లయితొలగించండికలతలలో నోడిపోవ గలభాలందున్
బలుపుగ రిపువర్గమునన్
కలహములే సకలసౌఖ్య కారణము లగున్