6, మార్చి 2013, బుధవారం

సమస్యాపూరణం – 986 (స్తనములు గల పూరుషుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
స్తనములు గల పూరుషుండు స్తవనీయుఁ డగున్.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. వనజభవు సతికి నలరెడు
    స్తనములు సంగీతమును సుసాహిత్యంబున్
    ఘనముగ నీ సంపదలగు
    స్తనములు గల పూరుషుండు స్తవనీయుడగున్

    రిప్లయితొలగించండి
  2. శ్రీ నేమాని వారికి నమస్కారములు. స్తవనీయమైన పూరణ చేశారు.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. సంగీత మపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం. ఏక మాపాత మధురం. అన్య దాలోచ నామృతం. ఈ శ్లోక భావమును గురువర్యులు చక్కగా తన పూరణలో యిమిడ్చగలిగినారు. వారికి నా వందనములు.

    రిప్లయితొలగించండి

  5. మంచి ప్రశంసలిచ్చిన మిత్రులందరికీ శుభాశీస్సులు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ నేమాని వారి బాట లోనే...

    వనజ భవు రాణి యొడిలో
    చిన పాపగ చేర నమ్మ చేత నిమురుచున్
    తన యాకటి కిచ్చిన ఘన
    స్తనములు గల పూరుషుండు స్తవనీయుడగున్.

    రిప్లయితొలగించండి
  7. కనుముర ! యాతడ పేడియ
    స్తనములు గల పూ రుషుండు, స్తవ నీ యుడగున్
    అనయము శంభుని దలచుచు
    మననము నే జేయు నతని మంత్రము నెపుడున్

    రిప్లయితొలగించండి
  8. అన్నగారి అడుగు జాడల లోనే,

    ఘన పాండితీ ప్రకర్షము
    విన ముచ్చట గొల్పు గీతి విభవమ్ములనన్
    మనములకు మధువు లొసగెడు
    స్తనములు గల పూరుషుండు స్తవనీయుడగున్

    రిప్లయితొలగించండి
  9. ఘనమగు నాటక మందున
    గుణవతి పాత్రను ధరింపఁ గుదిరిన పురుషుం
    డు నటించ కృత్రిమంబగు
    స్తనములు గల పూరుషుండు స్తవనీయుఁడగున్!

    రిప్లయితొలగించండి
  10. కనుగొన దైవధ్యానము,
    మనమున నిశ్చింత, పల్కు మాధుర్యరసం
    బును, దానంబొసగెడు గో
    స్తనములు గల పూరుషుండు స్తవనీయుడగున్

    గోస్తనములు = ముత్యాల హారములు

    రిప్లయితొలగించండి
  11. నేమాని పండితార్యుల పూరణ అనన్య సామాన్యము.
    నాదో ప్రయత్నం:

    విను లోభి యజా కంఠ
    స్తనములు గల పూరుషుండు, స్తవనీయుడగున్
    తన కున్న సంపదాళిని
    వినియోగము జేసి నపుడె పేదల కిలలో.

    (తోపెల్ల వారికి ధన్యవాదములతో)

    రిప్లయితొలగించండి
  12. విను, సృష్టి లోని ప్రాణుల
    తన బిడ్డల వోలె సాక దయయున్, ప్రేమల్
    ఘనముగ నొప్పు నిజ సతీ -
    స్తనములు గల పూరుషుండు, స్తవనీయుడగున్

    రిప్లయితొలగించండి
  13. అనిశము తన ధన సంపద
    విను, దానము ధర్మములకు వితరణ జేసే
    'ఘన వాణీ చనుగవవలె'
    స్తనములు గల పూరుషుండు స్తవ నీయుడగున్

    రిప్లయితొలగించండి
  14. ఒకమంచి శ్లోకము తెలియజెప్పిన రవీంద్రగారికి వారీ శ్లోకము ఉంచుటకు పూర్వమే యపూర్వముగా అదేభావంతో అందంగా కంద పుష్పాన్ని వాణికి సమర్పించిన శ్రీ నేమాని గురువర్యులకు నమస్సులు.

    ఘన సాముద్రిక శాస్త్రం
    బనునిట స్త్రీ పురుష లక్షణాంగములు కనన్
    నునుపుననున్న యున్నత
    స్తనములు గల పూరుషుండు స్తవనీయుఁ డగున్ !

    రిప్లయితొలగించండి
  15. చాల బాగున్నది సాహిత్యాభిమానిగారూ మీసేకరణ. అభినందనలు. అది ఏగ్రంధాతర్గతమో తెల్పిన ఇంకనూ ఆనందము.

    రిప్లయితొలగించండి
  16. మెరుగు పరచిన నా పూరణ:

    విను, సృష్టి లోని ప్రాణుల
    తన బిడ్డల వోలె సాక దయయున్, ప్రేమ
    మ్మను దుగ్ధ పూర్ణ పత్నీ-
    స్తనములు గల పూరుషుండు, స్తవనీయుడగున్

    రిప్లయితొలగించండి
  17. స్తనములు సూర్య చంద్రులుగ
    అనయము శుభముల నిడి యాకలి దీర్చన్ !
    జననిగ ప్రియమగు సతియన
    స్తనములు గల పూరుషుండు స్తవ నీయుఁ డగున్ !

    రిప్లయితొలగించండి
  18. స్తవనీయమైన పూరణలను చెప్పిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    గన్నవరుపు నరసింహమూర్తి గారికి,
    సహదేవుడు గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    మిస్సన్న గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    సాహిత్యాభిమాని గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. వినుమా! సుందర రూపుడు
    మనవాడౌ "సత్యభామ" మహనీయుండే
    ఘనుడా వేదాంతము ఘన
    స్తనములు గల పూరుషుండు, స్తవనీయుఁ డగున్


    వేదాంతము = వేదాంతం సత్యనారాయణ శర్మ (కూచిపూడి "భామాకలాపం" నటుడు)

    రిప్లయితొలగించండి