30, మార్చి 2013, శనివారం

పద్య రచన – 296 (నిఘంటువు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“నిఘంటువు”

38 కామెంట్‌లు:

 1. గురవే నమ:

  గురువులు బోధించు కతన
  స్థిరముగ పద్యములు వ్రాయు ధీమతి గలిగెన్
  కరుణను జూపిన గురువులె
  వరవీణా ధరియు నైన వరముల నొసగున్

  కవిమిత్రులకు ధన్యవాదాలు :

  విద్యార్థిని నే నగుచున్
  పద్యములను వ్రాయుచుంటి పలికితి నెటులో
  ఆద్యంతము పూరణకున్
  విద్యార్థులు మిత్రకవులు పెంచిరి దిటవున్

  రిప్లయితొలగించండి
 2. కోరినంతనె యేదైన చేరి చూపు
  అడిగినంతనె యర్థమ్ము నందజేయు
  ఇంద్రజాలికుడాకాదు నిదియ జూడ
  కర్ణుడస్సలు కాదు నిఘంటు విదియె.

  రిప్లయితొలగించండి
 3. పదము పదము చెప్పు బహువిధార్థమ్ములు
  ....పర్యాయ పదములు వాని వాని
  వివిధ ప్రయోగముల్ వివరించు సముచిత
  ....వ్యాకరణాంశముల్ ప్రస్ఫుటముగ
  తెలియజేయు సమగ్ర దీపిక పండిత
  ....పామరతతులకు బంధువగుచు
  నలరుచుండు నిఘంటు వద్దాని కాంతిలో
  ....భాషా ప్రశస్తియు ప్రకటితమగు
  పుస్తకములకు నయ్యది భూషణంబు
  అఖిల విద్యార్థితతికి సహాయకారి
  సకల శబ్దార్థ నిధిగ ప్రశస్తిగాంచు
  నా నిఘంటువు సద్గురు వందరకును

  రిప్లయితొలగించండి
 4. కవి వరే ణ్యు ల కృషి యి యే కార ణ ముగ
  కఠి న పదముల కర్ధంబు గాని పించు
  సంది యంబున కిచటను సందు లేదు
  కల్ప వృక్షంబు గద యీ ని ఘంటు విలను .

  రిప్లయితొలగించండి
 5. ఓం శ్రీమహాగణాధిపతయే నమః
  బ్లాగుగురువులందరికి నమస్కారములు...
  అర్థమవ్వని పదములకర్థమిచ్చు
  వర్ణముండును చక్కనివరుసలోన
  భాషపై పట్టువచ్చునుబాగుగాను
  పద్యపూరణమందున పనికివచ్చు.
  .....తోపెల్ల శ్రీతేజ.


  రిప్లయితొలగించండి
 6. సూర్యరాయాంధ్ర నిఘంటువు(http://www.telugunighantuvu.com/)ను మేమందరం డిజిటలైజ్ చేసి అంతర్జాలములో లభ్యమగునట్లుగా యూనికోడ్ లోటైపు చేసి ఉంచినామనే సంతోషాన్ని మీతో పంచుకుంటూ......


  అంతర్జాలమునన్ పఠించుతఱి భాషాశ్రద్ధనున్ బెంచగా
  పంతమ్మూనియు వాణి దీవనలకై ప్రార్థించి మేమెల్ల న
  త్యంతాసక్తినిఁ యోర్ నిఘంటువునిటన్ హౌమ్యంబుగా నిల్పుచున్
  సంతోషమ్మునుఁబొందినారమిక నాస్వాదింపుమా మాధురిన్.


  రిప్లయితొలగించండి
 7. చిరంజీవి తేజా! ప్రథమ ప్రయత్నముగా నిఘంటువుపై తేటగీతిలో వ్రాసిన పద్యము చాల బాగున్నది. అశీస్సులు౤. చదువునశ్రద్ధ చేయక వ్యవధానముతిసికొని ప్రతిరోజు శంకరాభరణములో వచ్చుటకు ఆ సరస్వతీ మాత నిన్ను ఆశీర్వదించు గాక. నిఘంటువు గురువులకు గురువు. ప్రతిదినము కొంచం కొంచ చదువుచూ అవగాహన చేసికో.ఈ రోజు నాకు చాల ఆనందముగాయున్నది.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ పండిత నేమాని గురువులకు, శంకరార్యులకు, ఇతర కవిమిత్రులకు వందనములు,

  మా అబ్బాయి తోపెల్ల శ్రీతేజ (16 సం.లు) ఇంటర్మీడియట్ (ప్రథమ ). వాని ఈ తొలి ప్రయత్నాన్ని ఆశీర్వదించి, ప్రోత్సహింతురు గాక. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 9. తొల్లి పదముల కర్ధంబు వెల్లు వగను
  మెరుపు వెలుగుల విజ్ఞాన గురువు యనగ
  త్రవ్వి నంతనె నిధినుండి క్రొవ్వు మనము
  నింగి మ్రాను నికుంజము నిఘం టువట !

  నింగి మ్రాను = కల్ప వృక్షము

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. *శబ్దసాగరమున శబ్దార్థము దొరకు
  రత్నగర్భ యందు రత్న మొదవు
  వెదకిచూచు నేర్పు విద్యార్థులకు నుండ
  దుర్లభములు గావు దొరకు నెన్నొ

  *నిఘంటువు

  రిప్లయితొలగించండి
 12. రామలక్ష్మి గారు,
  మీ అబ్బాయి పద్యము బాగుంది. అతని శ్రద్ధ , పద్యములపై ఇష్టము ఇంకా బాగుంది.
  అతనికి శుభాశీస్సులు తెలియజేయగలరు.

  రిప్లయితొలగించండి
 13. ఆడిగిన వెంటనే యన్ని యమరజేయు
  ****కాని నిజ జనని కాదు తాను
  కోరిన వేళనే కూర్చు సమస్తము
  ****కాని జనకుడును కాదు తాను
  తలగడ రీతిగ మలచుకొనగ వచ్చు
  ****కాని కళత్రము కాదు తాను
  సాయము లేకుండ మ్రోయ భారంబగు
  ****కాని వయసు కూతు కాదు తాను

  చేర పదార్థముఁ గలుగఁ జేయుఁ గాని
  మేలు మేలగు వెండింగు మిషను కాదు
  నిజమిది నిఘంటువద్దియె నిజము నిజము
  దాని ఘనతను తెలుపంగ తరణి తరమె!!

  రిప్లయితొలగించండి
 14. తేజ వ్రాసెను పద్యము తేటగీతి
  పదములను కూర్చి చక్కగా వ్రాయు టందు
  తల్లి వలెనె యా బాలుడు తత్పరుండు
  తేజ ! వ్రాయుము పద్యము తేజ మలర

  రిప్లయితొలగించండి
 15. చిరంజీవి తెజా శుభాశీస్సులు . ఇక్కడ గురువులు మనకు చక్కగా నేర్పు తారు. హాయిగా నేర్చు కోవచ్చును . నువ్వు మరీ చిన్న , నేను చాలా పెద్ద. ఇక్కడ ఆ తేడా లేదుస్మా ! ఇంతకీ మా మనవడి పేరుకుడా తేజానే

  రిప్లయితొలగించండి
 16. చిరంజీవి తోపెల్ల శ్రీతేజకి శుభాశీస్సులు.
  నీవు పద్య విద్యలో శుభారంభము చేసినందులకు మా హృదయపూర్వక ప్రశంసలు. పద్య విద్యలో నీవు వన్నెకెక్క గలవని మా విశ్వాసము - మా ఆశీస్సులు. చదువు పట్ల శ్రద్ధ ముఖ్యము. అందుచేత "అఖండ విద్యా ప్రాప్తిరస్తు" అని మా దీవెన. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
  ప్రణామములు!

  ప్రాంచద్బ్రహ్మవిచారతత్పరులు శబ్దవ్యాప్తితాదర్థ్యముం
  గాంచన్ వైదికవాఙ్నిఘంటుచయ మాఖ్యాతంబు గాఁగన్; బ్రదీ
  పించెన్ లౌకికశబ్దబోధకయి వేవేల్గాఁగఁ గోశంబు లే
  కొంచెమ్మైనను బాస నేర్చుటకు నాకోర్వీజముల్ దత్కృతుల్.

  శబ్దబోధంబు నర్థవిజ్ఞానసిద్ధి
  సుప్రయోగంబు రూపాంతరప్రక్ఌప్తి
  వర్ణమాలాక్రమమున నిర్వర్ణనంబుఁ
  జేయు కోశ-నిఘంటువుల్ సిద్ధనిధులు.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 18. శర్మ గారూ ! ధన్యవాదములు.

  గురువు లఘువుల చక్కని కూర్పు తెలిసి
  లఘువు గురువుల తేడాలు రాని చోట
  గురువు తేడాలు చెప్పగా కరువు దీర
  అల్లి పద్యంబు లిట "తేజ" రిల్ల వలయు.

  రిప్లయితొలగించండి
 19. శ్రీమతి లక్ష్మీదేవి గారికి
  నమస్కృతులతో,

  అంతర్జాలంలో మీరు నిలిపిన నిఘంటువు, అందులోని పద-పదార్థ-బహుళకావ్యప్రయోగోదాహరణ సరణి అత్యద్భుతంగా ఉన్నాయి. విద్యార్థులకు, విద్యాధికులకు, వివిదిషువులకు నిత్యోపయోగకరం కాగల బృహత్కార్యాన్ని చేపట్టి నిష్కామయత్నంగా నిర్విఘ్నపరిసమాప్తం చేసినందుకు తెలుగు జాతి మీకు ఋణపడి ఉంటుంది.

  మీకు అభినందనలని, కృతజ్ఞతలని, ధన్యవాదాలని, నెనరులని ఎన్ని మెప్పుల కుప్పలను గుప్పించినా తక్కువే!

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 20. లఘువూ గురువుల ఛంధము
  బిగువన్నది సడలకుండ భేషుగ నడువన్
  తగిన పదంబుల నీయఁగ
  నిఘంటువు కవులకు తోడు నీడై నిలుచున్

  రిప్లయితొలగించండి
 21. అయ్యా,
  మీ అభినందనలు, ఆశీస్సులు ఈ మహా కార్యక్రమంలోపాల్గొన్న మిగిలిన అందరితో పాటు సవినయంగా అందుకుంటున్నాను.

  రిప్లయితొలగించండి
 22. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
  కామధేనువు కానగ కల్ప వృక్ష
  మగు “నిఘంటువు” భాషకు మానవులకు
  శబ్దమైన నర్థంబైన శక్తి మేర
  భాషయందుండెడి పలు విభాగములను
  విడమరచి చెప్పు గురువుగ విబుధులార!.

  రిప్లయితొలగించండి
 23. కలవు భాషా నిఘంటువుల్ ఘనములవ్వి.
  కాని యాంగ్లాంధ్ర వైద్యనిఘంటు వొకటి
  కలదు,దాని రచించితి గష్టమోర్చి
  సహృదయులగు విబుధులు నన్ సన్నుతింప.

  రిప్లయితొలగించండి
 24. అర్థమిచ్చును కాలమ్ము వ్యర్థమవక
  కూర్చుచుండును జ్ఞానమ్ము కుదురుగాను
  గురునివోలెను బోధించు గుప్తముగను
  శబ్దకోశమ్ము కూర్చును శబ్దపటిమ.

  రిప్లయితొలగించండి
 25. డా. కనీయంగారికి నమస్సులు. నేను the tiny ensyclopedia అని చిన్న పిల్లలకు ఉపయోగపడే పుస్తకమును తయారుచేసి ముద్రించితిని. చాల శ్రమతో కూడిన పని. english telugu medical నిఘంటువును రచించినారంటే మీకు hats off. సదరు పుస్తకము ఇప్పుడు అంగడులందు లభ్యమేనా!

  రిప్లయితొలగించండి
 26. ఛక్కని పద్యము నందించిన శ్రీతేజకు అభినందనలు. ఆంగ్లాంధ్ర వైద్య నిఘంటుvuని వ్రాసిన శ్రీ కమనీయము గారికి అభివందనలు. మీ వద్ద నుంచి ఒక ప్రతిని ఎప్పుడో తీసుకోవాలి.

  సూర్యాంధ్ర నిఘంటువును మిగిలిన నిఘంటువులను అంతర్జాలములో నిలిపిన లక్ష్మీదేవి ప్రభృతులకు కృతజ్ఞతాభివందనములు.

  రిప్లయితొలగించండి
 27. గౌరవ నీయు లైన శ్రీ కమనీయం గారికి హృదయ పూర్వక శతాభి వందనములు

  రిప్లయితొలగించండి
 28. గౌరవ నీయు లైన శ్రీ కమనీయం గారికి హృదయ పూర్వక శతాభి వందనములు

  రిప్లయితొలగించండి
 29. నిఘంటువు అంశంగా స్వీకరించి చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు....
  నాగరాజు రవీందర్ గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  పండిత నేమాని వారికి,
  సుబ్బారావు గారికి,
  చి. తోపెల్ల శ్రీతేజకు,
  లక్ష్మీదేవి గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  జిగురు సత్యనారాయణ గారికి,
  ఏల్చూరి మురళీధర రావు గారికి,
  సహదేవుడు గారికి,
  తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
  కమనీయం గారికి,
  డా. ప్రభల రామలక్ష్మి గారికి,
  అభినందనలు, ధన్యవాదములు.
  *
  చిరంజీవి శ్రీతేజా,
  కవిపండిత వంశమైన తోపెల్ల వంశపు గూటి కోకిలవై మధురమైన పద్య కవిత్వాన్ని అందిస్తూ నీవు ఉజ్జ్వల భవిష్యత్తును పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఇందరు పెద్దల ఆశీస్సులను, ప్రోత్సాహాన్ని పొందిన అదృష్టం నీది. ప్రథమ ప్రయత్నమే ప్రశంసార్హంగా ఉంది. అభినందనలు, ఆశీస్సులు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  నిఘంటువు టైపు చేసే మహత్కార్యంలో నాకూ నా భాగస్వామ్యం ఉందని చెప్పడానికి గర్విస్తున్నాను. సూర్యరాయాంధ్ర నిఘంటువు ఆరవ సంపుటిని పూర్తిగా, మొదటి సంపుటిని సగం వరకు టైప్ చేసాను. ఈలోగా ఎందుకో రామిరెడ్డిగారు నామీద అలిగారు. ఎందుకో నా కిప్పటికీ అర్థం కావడం లేదు. ఆ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ వారికి కృతజ్ఞుడినే.

  రిప్లయితొలగించండి
 30. గురువు గారు,
  http://telugunighantuvu.com/About.aspx

  ఈ లంకెలో మనందరం టైపు చేసిన వివరాలు ఉన్నాయి. కదా. నేను చూసి ఉన్నాను.(దేవి అనే పేరు నాదే.)
  భాషామతల్లి ఋణం తీర్చుకొనేందుకు లేశమైనా అవకాశం దొరికిందని, అది నా భాగ్యమని నేను భావించాను.

  రిప్లయితొలగించండి
 31. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు.

  నిఘంటువు అనే నాలు గక్షరాల అంశం మీద అద్భుతమైన పద్యాలను శ్రీ నేమాని పండితార్యులు, డా. ఏల్చూరి వారూ వ్రాశారు.

  మనలో ఒకరిగా ఉన్న లక్ష్మీ దేవి గారు అంధ్ర జాతి గర్వించే మహత్కార్యం చేశారు.
  గురువుగారు కూడా అందులో పాలు పంచుకొన్నారు.

  ప్రభల రామలక్ష్మి గారు వారి అబ్బాయిని కూడా తెలుగు భాషలో దిట్టగా తయారు చేస్తున్నారు.

  కమనీయం గారు కడుం గడు శ్రమించి ఆంగ్లాంధ్ర వైద్య నిఘంటువు తయారు చేశారు.

  తోపెల్ల సుబ్రహ్మణ్య శర్మ గారు చిన్న నానా విషయ సర్వస్వాన్ని వెలయించారు.

  ఇవన్నీ మన శంకరాభరణ మిత్రులు గర్వించే అంశాలు.

  అందరికీ అభినందనలు.

  చి. తేజకు సరస్వతీ సంపూర్ణ కటాక్ష సిద్ధిరస్తు.

  రిప్లయితొలగించండి 32. శ్రీమతి నేదునూరి రాజేశ్వరిగారికి ,శ్రీ తోపెల్ల సుబ్రహ్మణ్యశర్మగారికి,శ్రీ గన్నవరపు నరసింహమూర్తిగారికి,హార్దికాభినందనలు,ధన్యవాదములు.ఈ గ్రూపులో ఎవరి ప్రత్యేకత వారికున్నా అందరూ ఉద్దండులే.
  నేను రచించిన ఇంగ్లిష్ - తెలుగు సమగ్ర వైద్య నిఘంటువు ప్రతులు నా వద్దలేవు.( నాపర్సనల్ కాపీ తప్ప) .దానిని ప్రచురించిన ప్రచురణకర్తలవద్ద లభించవచ్చును.వారి చిరునామా దిగువ ఇస్తున్నాను.
  for copies of English- Telugu comprehensive Medical dictionary
  address of publishers ;-- PARAS Medical Books Pvt.Ltd.
  5-1-473,Putlibowli,p.o.box no.544,
  HYDERABAD--500095 (A.P.)
  TEL .PH.NO.(040)24600869 ; 66821071; reliance no.32982239

  రిప్లయితొలగించండి