2, సెప్టెంబర్ 2013, సోమవారం

సమస్యాపూరణం – 1162 (హంతకునకు వర మొసంగె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
హంతకునకు వర మొసంగె నలర జగము.

18 కామెంట్‌లు:

  1. ఘోర నేరములకు నైన గురుతెఱింగి
    దండన నొసగ వెఱచెనో ధర్మమిచట?
    చిన్న ప్రాయము వాడను చింతనమున
    హంతకునకు వర మొసంగె నలర జగము.

    రిప్లయితొలగించండి
  2. అంబ పాతాళ భైరవి కాదరమున
    మాయల పకీరునే విక్రమమ్ము మెరయ
    బలిగ జేసె డింభకుడంత బళిర! దుష్ట
    హంతకునకు వరమొసంగె నలర జగము

    రిప్లయితొలగించండి
  3. కం.
    ఎంతయు ముదమున నస్త్రపు
    సంతతి రామునకు నిడఁగఁ జని కౌశికుఁ డా
    కాంతను దాటకిఁ గూల్చిన
    హంతకునకు వరమొసంగె నలర జగములున్!

    రిప్లయితొలగించండి
  4. అంతకాంతకుండు గౌరి యగ్ని జొచ్చినంతనే
    స్వాంతమున్ గలంగ వీరభద్రు ననిపె కూల్చె న
    త్యంత భీకరముగ నతడు దక్షునిన్ మహేశుడా
    హంతకునకు వరమొసంగె నలర జగము లెంతయున్

    రిప్లయితొలగించండి
  5. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో

    శ్రీ నేమాని గురుదేవుల పాతాళ భైరవి కథ,శ్రీ లక్ష్మి దేవి గారి ప్రస్తుత డిల్లి ఘటన,శ్రీ మధుసూదన్ గారి తాటకి పద్యములు బ్లాగునకు ప్రాతః కాలపు వెలుగును నిచ్చు చున్నవి.

    తేట గీతి గర్భిత ఉత్సాహ
    =======*=======
    (పంతమునను పరుగు తోడ పంట చేల) నడువనన్
    చెంత జేరి సిరులు దినగ చింత మీరు(ర)చుండగన్
    శాంతి నొసగ వీరు డొకడు జంప చీడ పురుగులన్
    హంతకునకు వర మొసంగె నలర జగము జూడరా!

    రిప్లయితొలగించండి
  6. శ్రీ నేమాని గురుదేవుల దక్షుని పద్యము నిజమైన ఉత్సాహ వృత్తము.
    శ్రీ పీతాంబర్ గారి దుష్ట హంతకుని పద్యము బాగు బాగు.

    రిప్లయితొలగించండి
  7. లక్ష్మీ దేవి గారి పూరణ ప్రస్తుత న్యాయమూర్తుల తీరుకు అద్దం పడుతుందినేనూ అదే భావనతోప్రయత్నించాను విరమించాను. అభినందనలు. శ్రీ పండిత నేమాని మరియు గుండు మధుసూదన్ గారల పూరణలు ప్రశస్తంగా యున్నాయి అభినందనలు.

    ధర్మ సంస్థాప నార్ధమై ధరను కృష్ణు
    నిగనవతరించితి విజయ, నిజమువినుము
    పాపమంటదు బుణ్యంబు వచ్చుదుష్ట
    హంతకునకు; వరమొసంగె నలరజగము!!!

    రిప్లయితొలగించండి
  8. రాము డ వతార పురుషుడై రావణున్ని
    జంపి హంతకు డయ్యును సకల జనులు
    సంత సంబును బొందుచు సాదరముగ
    హంతకునకు వర మొసంగె నలర జగము

    రిప్లయితొలగించండి
  9. పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారిక్ నమస్కారములు

    జగడ మాయెను సాంబువిజయుల మధ్య
    పంది జచ్చె నెవరి కోల?భవుడు పార్ధు
    తపము నకు మెచ్చి పాశుపతము వరాహ
    హంతకునకు వరమొసంగె నలర జగము.

    రిప్లయితొలగించండి
  10. పరశురాముండు పితృవాక్య పాలకుండు
    చంపె దల్లి నంతట దండ్రి సంతసించి
    హంతకునకు వరమొసంగె నలర జగము
    మరల బ్రతికించె దల్లి నా వరము వలన

    రిప్లయితొలగించండి
  11. కలియుగమున నరాచకములు పెరుగగ
    కల్కి దేవుడు గమనించి కనికరమున
    దుష్కృతముల నొనర్చెడి దుర్గుణ జన
    హంతకునకు వర మొసంగె నలర జగము.

    రిప్లయితొలగించండి
  12. నా రెండవ పూరణము:

    పాశుపతమును గోరి, తపముఁ గిరీటి
    సేయఁ, బరికించి, శివుఁడయ్యి బోయ, కిటిని
    బంపె; నరుఁడుఁ గొట్టె! శివుఁడు పరుగునఁ గిటి
    హంతకునకు వరమొసంగె నలర జగము!!

    రిప్లయితొలగించండి
  13. పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారికి నమస్కారములు.
    నా రెండవ పూరణ.

    ద్రౌపదేయుల జంపిన ద్రౌణి యొకడు
    ఘోర శిశుహంత.,నిదురించు వారి జంపె
    గురువునకు పుత్రుడని చంపకుండ విడిచె
    హంతకునకు వరమొసంగె నలర జగము

    రిప్లయితొలగించండి
  14. చిచ్చు కంటను జూడంగ చచ్చె నతను,
    రతికి పతిభిక్ష వేడె పార్వతి మగనిని,
    మదను పత్నిని గనఁ గల్గె మాల్మి మరుని
    హంతకునకు, వర మొసంగె నలర జగము.

    రిప్లయితొలగించండి
  15. రాజ కీయపు రక్కసి రాజ్య మందు
    ధర్మ నిరతిని పాలించి మర్మ మనక
    దుష్ట సం హార మొనరించి నిష్ట యనెడి
    హంత కునకు వర మొసంగె నలర జగము

    రిప్లయితొలగించండి
  16. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న ఉదయం పోయిన కరెంటు సాయంత్రం వచ్చింది. రాత్రి బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్ళి వచ్చాను. అందువల్ల నిన్న పూరణలు, పద్యాలు, వ్యాఖ్యలు చూసే అవకాశం దొరకలేదు. మన్నించండి.
    చక్కని పూరణలను వ్రాసిన
    లక్ష్మీదేవి గారికి,
    పండిత నేమాని వారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    వరప్రసాద్ గారికి,
    మంద పీతాంబర్ గారికి,
    సుబ్బారావు గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    మిస్సన్న గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి