10, సెప్టెంబర్ 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1170 (కలఁడే విజ్ఞానఖని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
కలఁడే విజ్ఞానఖని శకారుని కంటెన్.

20 కామెంట్‌లు:

  1. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    ఇల నాదిశంకరుని సరి
    కలడే విజ్ఞానఖని? శకారుని కంటెన్
    గలరీ భువి మతిహీనుల్
    పలుతెరగుల ప్రశ్నలంచు పలికెడు వారల్.

    రిప్లయితొలగించండి
  2. అలరింప నెంచు జనులను
    పలు రకముల వ్యంగ్య హాస్య వచనమ్ములతో
    ఖలుల మహాసభలో గన
    కలడే విజ్ఞాన ఖని శకారుని కంటెన్

    రిప్లయితొలగించండి
  3. తలపగ రాయలు మించిన
    కలడే విజ్ఞాన ఖని శకారుని కంటెన్
    పలు దుర్మార్గపు పనులను
    అలవోకగ జేయువాడు నవనిని గలడే !

    రిప్లయితొలగించండి
  4. ఇలను శకారుని యభిమా
    నుల సంఘమ్మొకటి పుట్టె నుద్ధతి బురవీ
    ధుల దిరుగుచు నరచెనిటుల
    ' కలడే విజ్ఞాన ఖని శకారుని కంటెన్ '

    రిప్లయితొలగించండి
  5. వసంతసేనతో నసందర్భ ప్రలాపి శకారుఁడు పలికిన సందర్భము.

    “తులువన్, మూర్ఖుఁడఁ,గాముకు;
    నిలలో లేఁడెవఁడు! నన్ను నింతింతని నే
    దెలుపఁగ లేనే, కుజనుఁడఁ!
    గలఁడే విజ్ఞాన ఖని శకారుని కంటెన్?”

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో....
    ========&=======
    కలడే? కాలుడు భువి పై
    గలడే? మన పాలకులను గని నిదురించన్ !
    కలడే? వారి నడుమ మన
    గలడే? విజ్ఞాన ఖని శకారుని కంటెన్

    (వారు = రాజకీయ నాయకులు, శకారుడు = ప్రదాన మంత్రి )

    రిప్లయితొలగించండి
  7. గురువుగారికి నమస్సుమాంజలులతో...

    కలరే రామకృష్ణునితో
    తలపడు కవులు రసికులును ధారణిలోనన్
    నిలలో నీచగుణమునకు
    కలడే విజ్ఞాన ఖని శకారుని కంటెన్

    రిప్లయితొలగించండి
  8. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    విరుపుతో సర్వజ్ఞుడైన శంకరుని, మూర్ఖుడైన శకారుని వేరు చేస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    వ్యంగ్య వచనంగా మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    శకారుని స్వోత్కర్షగా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    ఏ సమస్యనైనా ప్రస్తుత పరిస్థితులకు అనువర్తించడం మీ ప్రత్యేకత. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. శైలజ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయమే.
    మొదటి పాదంలో గణదోషం.
    ‘లోనన్’ తరువాత ‘నిలలో’ అని ప్రారంభించారు.
    ముఖ్యంగా పూరణ సమర్థంగా ఉన్నట్టు లేదు. మరోప్రయత్నం చేయండి.

    రిప్లయితొలగించండి
  10. కలనైనను తిలకిం చగ
    కలడే విజ్ఞాన ఖని శకారుని కంటెన్
    పలు రకముల జను లందరు
    కలకల మును రేపుచున్న కాకోలమునన్

    రిప్లయితొలగించండి
  11. గలగల నవ్వించెడు చే-
    ష్టలచే మన రక్తపోటు చక్కన జేయున్
    సులువుగ, సొమ్ములు మిగులగ!
    కలడే విజ్ఞాన ఖని శకారుని కంటెన్?

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు
    శ్రీ పండిత నేమాని గారికి వందనములు

    కలిలో ఐన్స్టీన్ కన్నను
    కలడే విజ్ఞాన ఖని ?శకారుని కంటెన్
    కలడే దుష్టుడు ?యనగా
    కలడు కలుగు సందియమ్ము కలుగగనేలా !

    రిప్లయితొలగించండి

  13. తెలియక సంస్కృత నాటికఁ
    దిలకించగబోయి నాదు తెలివిని దెలుపన్
    ఎలుగెత్తి అరచితి నిటుల:
    కలడే విజ్ఞాన ఖని శకారుని కంటెన్

    రిప్లయితొలగించండి
  14. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    రామకృష్ణ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    __________________________

    విలువగు పదముల యర్థము
    దెలిపెడు విఙ్ఞాని , కోశ - కారుని చిలిపిన్
    బిలచిన , " కో "విడ నాడుచు ,
    కలఁడే విజ్ఞానఖని శ - కారుని కంటెన్ !
    __________________________
    కోశకారుడు = నైఘంటికుడు
    చిలిపిన్ = అల్పముగ(క్లుప్తముగ)

    రిప్లయితొలగించండి
  16. యతి సవరణతో :

    01అ)
    __________________________

    విలువగు పదముల యర్థము
    గలిగిన విఙ్ఞాని , కోశ - కారుని చిలిపిన్
    బిలచిన , " కో " విడనాడుచు ,
    కలఁడే విజ్ఞానఖని శ - కారుని కంటెన్ !
    __________________________
    కోశకారుడు = నైఘంటికుడు
    చిలిపిన్ = అల్పముగ(క్లుప్తముగ)

    రిప్లయితొలగించండి
  17. 02)
    __________________________

    కలఁడే సాహస వంతుడు ?
    కలఁడే నిస్వార్థ , ధర్మ - గాముం డిలలో ?
    కలఁడే న్యాయాను గమియు
    కలఁడే విజ్ఞానఖని, శ - కారుని కంటెన్ !
    __________________________
    కలఁడే? = లేడు అని భావం
    విక్రమాదిత్యుడు = విక్రమార్కుడు (ఔనా? కాదా?)
    శకారి = title of king Vikramaditya who is said to have destroyed the power of the Sakas.

    రిప్లయితొలగించండి
  18. కలడే రాహులు కంటె
    న్నిలలో వేదాంతవాది నిశ్చయ ముంగన్
    కలలో నిదురల నైనన్?
    కలఁడే విజ్ఞానఖని శకారుని కంటెన్?

    రిప్లయితొలగించండి