10, సెప్టెంబర్ 2013, మంగళవారం

పద్య రచన – 460 (పునర్జన్మ)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
“పునర్జన్మ”
ఈ అంశాన్ని పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

  1. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

    తనదు గర్భపుం బిడ్డను తలచు కొనుచు
    కష్టనష్టములోర్చుచు కదలు చుండి
    తొమ్మిది నెలలు మ్రోయుచు నది
    జన్మనిచ్చు తల్లికి పునర్జన్మ గాదె?

    రిప్లయితొలగించండి
  2. ఇల సంతు కొఱకు తరుణులు
    కలవర బడి కష్ట మనక కలలే గాంచన్
    తొలి బిడ్డ మురిపె మందున
    పులకించి మరతు రంట పునర్జన్మ బాధన్

    రిప్లయితొలగించండి
  3. మరల జన్మించుట, మరల నీల్గుటయును,
    ....తల్లి గర్భమున బాధలను గనుట
    బహు ప్రకారములైన బంధాలు, వ్యాధుల
    ....వలన దుఃఖమ్ముల పాలగుచును
    సంసార చక్రాన చాల నల్గుట లేల?
    ....మరుజన్మ మొందని వెరవు దెలిసి
    మానవ జన్మలో జ్ఞాన వైభవముతో
    ....మోక్ష సాధనముల బూను టొప్పు
    ఉత్కృష్టమైనది యుర్వి మానవ జన్మ
    ....మదియె దుర్లభమైన దనుచు నెరిగి
    ఎట్టి పునర్జన మేనియు నొందని
    ....మోక్ష పదమ్మును బొంద వలెను
    మోక్ష మొందుటకు నీ పుట్టువు నే ఫల
    ....వంత మొనర్చుట భావ్యము కద
    వ్యర్థము కానీక యవకాశ మిదెయంచు
    ....సఫల మొనర్చుడీ జన్మము నిల
    యనుచు గురువులు పల్కెద రాదరమున
    అందుచే మోక్ష మార్గమ్ము ననవరతము
    నాశ్రయించి తరించుటే యభిలషింప
    దగినదో జీవ! లెమ్ము భద్రముల గనుము

    రిప్లయితొలగించండి

  4. పునర్జన్మ ల నమ్మకం మీద కాలం వెళ్ళ బుచ్చు
    ఆజ్ కా కామ్ కాల్ కర్నే వాలీ జిలేబి
    ఆలోచించు - లేదు లేదు మరో జన్మ !
    ఇదే నీ ఆఖరి చాన్స్ పరంధాముని సన్నిధికి !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. కలడందురు మరుజన్మము
    కలవలెనీ జన్మలుండు కలిగిన భక్తిన్
    గలిగిన జన్మము నడిగెద
    కలుగని మోక్షము నాకిక కలదో లేదో ?

    రిప్లయితొలగించండి
  6. పుట్టి మరణించి మరల ను బు ట్టుట ,యను
    దాని నండ్రు పునర్జన్మ యైన యట్లు
    ప్రాణి జేసిన కర్మల బట్టి మరల
    జన్మ లెత్తును బుడమిని సత్య మిదియ

    రిప్లయితొలగించండి
  7. మిత్రులారా!
    నా సీసమాలికలో చిన్న సవరణలు:

    6వ పాదములో టైపు పొరపాటు: పునర్జనకి బదులుగా పునర్జన్మ అని చదువుకొనవలెను.
    8వ పాదములో: వ్యర్థము కానీకకి బదులుగా వ్యర్థ మొనర్పక అని చదువుకొనవలెను.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. అన్ని జన్మలలోను మానవ జన్మ గొప్పతనాన్ని దాన్ని సఫలమొనర్చుకొనవలసిన అవసరాన్ని సవివరంగా సీసమాలికగా చెప్పిన శ్రీ పండిత నేమాని గురువులకు అభినందన పూర్వక నమస్సులు

    రిప్లయితొలగించండి
  9. గురుదేవుల కు నమస్కారములతో ....
    జన్మలన్నవి ఎన్నియున్నవొ జాడతెల్పిన దెవ్వరూ
    వున్నజన్మలు ఎత్తివచ్చిన నుర్విపుత్రులు లేరుగా
    మిన్ను నిక్కము, మన్నునిక్కము మీదుజన్మలు నిక్కమా
    ఎన్ని జన్మలు ఎత్తెనేమిటి ఎత్తిపోతలు తప్పవే....

    రిప్లయితొలగించండి
  10. తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
    ప్రసవం స్త్రీకి పునర్జన్మ అన్న మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు.
    చివరి పాదంలో ‘పునర్జన్మ’ అన్నచో గణదోషం. ఆ పాదాన్ని ‘నలయక మరచెదరుగద పునర్జన్మ వెతల్’ అందాం.
    *
    పండిత నేమాని వారూ,
    జనన మరణ చక్రభ్రమణాన్నీ, తత్తరుణోపాయాన్నీ వివరించిన మీ సీసమాలిక ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    जिलॆबी जी,
    आज का काम आज ही करना अच्छा है । किसकॊ पता कल तक हम रहॆंगॆ या नहीं ?
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఐన నట్లు’ అనండి.
    *
    శైలజ గారూ,
    చాలా మంచి పద్యం వ్రాసారు. అభినందనలు.
    ‘ఎవ్వరూ’ అని వ్యావహారికాన్ని, ‘వున్న’ అన్న గ్రామ్యాన్నీ ప్రయోగించారు. ఎవ్వరున్, ఉన్న అనండి.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    శకారుని స్వోత్కర్షగా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    ఏ సమస్యనైనా ప్రస్తుత పరిస్థితులకు అనువర్తించడం మీ ప్రత్యేకత. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. ఏ జన్మ పుణ్య ఫలమో
    ఈ జన్మయె వర మటంచు నీశుని కొలువన్
    ఏ జన్మము వలదం దును
    నీ జన్మకు పునర్జన్మ మిక నే కోరన్

    రిప్లయితొలగించండి
  12. గురుదేవులకు పాదాభివందనాలు ..
    .
    ఎ న్ని జన్మములెత్తనేమి ఫలమ్ము?
    యున్న జన్మ సఫలమొందినఁజాలు!
    మరుజన్మ గూరిచి మనకేల చింత?
    పరమాత్మ సన్నిధి పరమపదమ్ము!

    రిప్లయితొలగించండి
  13. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో...
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
    ==========*========
    గలుగు పునర్జన్మ,కలిమి
    బలిమిని బెంచగ బహు విధ పాపపు కలిమిన్,
    వలదు వలదన్న ఖలులకు,
    బలమును జూపి నబలపయి పాపుల కెల్లన్!

    రిప్లయితొలగించండి
  14. శంకరార్యులకు నమస్సులు. చిత్తుప్రతిలో వ్రాసిన దానిని పూర్తిగా టైపు చేయుటలో జరిగిన పొరపాటు. దోషము తెల్పినందులకు ధన్యవాదములు.

    తనదు గర్భపుం బిడ్డను తలచు కొనుచు
    కష్టనష్టములోర్చుచు కదలు చుండి
    తొమ్మిది నెలలు మ్రోయుచు తుదకు నది
    జన్మనిచ్చు తల్లికి పునర్జన్మ గాదె?

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు
    శ్రీ పండిత నేమాని గారికి వందనములు

    బాల్య కౌమార యౌవన వార్ధకములు
    దేహమునకు కలుగు రీతి దేహి కింక
    కలుగు దేహాంతర ప్రాప్తి కలత తగదు
    జనన మరణమ్ములీ రీతి సాగుచుండు

    పాత శిథిలము లైనచో వదలి నూత్న
    వస్త్రమును ధరియింతురో ప్రాణి కూడ
    దేహముల్ శిధిలమైనచో త్రెంచు కొనుచు
    నూత్న దేహమ్ము పొందును నిశ్చయముగ

    మెప్పును పొందగ మనుజులు
    తప్పులు మితి మీరసేయ తప్పవు జన్మల్
    మెప్పించి పుణ్యమందిన
    తప్పదు తగుమంచి జన్మ తథ్యము మహిలో

    రిప్లయితొలగించండి
  16. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ తాజా పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    శ్రీ యెర్రాజి జయసారథి గారూ,
    మీ ద్విపద చాలా బాగుంది. అభినందనలు.
    కొన్ని క్షణాలు అది ఏ ఛందస్సో తెలియక గణదోషం ఉందని వ్యాఖ్య పెట్టబోయాను సుమా! చాలా సంతోషంగా ఉంది.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    తోపెల్ల వారూ,
    సంతోషం.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పద్యం మూడవ పాదంలో గణదోషం. ‘దేహము శిధిలమైనచో త్రెంచు కొనుచు / దేహములు శిధిలమయిన త్రెంచు కొనుచు’ అంటే సరి.

    రిప్లయితొలగించండి
  17. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    జాతస్యహి ధ్రువో మృత్యుః - ధ్రువమ్ జన్మ మృతస్య చ
    తస్మాద పరిహార్యేర్థే - నత్వమ్ శోచితుమర్హసి
    అనిగదా గీతాసారము :

    01)
    ________________________________________

    పుట్టు టన్నది యెట్టు లున్నదొ - భూమిపై నిది తథ్యమూ
    గిట్టు టన్నది తప్ప దన్నది - గీత సారము నేర్చుకో
    పుట్టి గిట్టుట గిట్టి పుట్టుట - పూర్వ జన్మల పుణ్యమే
    చిట్టి కృష్ణుని , పట్టి పాదము - చేరి పొందుము వానినే !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  18. గురువులు శ్రీశంకరయ్య గారికి శ్రీ నేమాని వారికి నమస్కారములు
    కాయ మందున కలిగెడి కలకలములు
    మనసు చేసెడి చిత్రంపు మాయలన్ని
    దేవదేవుని పథమును తెలిసినంత
    నదియె మరుజన్మమగునుగానందరికిని

    రిప్లయితొలగించండి
  19. వసంత కిశోర్ గారూ,
    చక్కని పద్యం వ్రాసారు. అభినందనలు.
    *
    ప్రభల రామలక్ష్మి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి